సమాధాన పత్రంతో ఇంటర్ విద్యార్థి జంప్
నరసరావుపేట : జూనియర్ ఇంటర్ పరీక్షకు హాజరై సమాధానపత్రం ఇవ్వకుండా వెళ్లిపోయిన విద్యార్థిపై విద్యాశాఖాధికారులు సోమవారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ ఘటన జరిగింది.
సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ప్రైవేటు కళాశాలకు చెందిన మేళా నరేంద్ర అనే జూనియర్ ఇంటర్ విద్యార్థి ఎస్‌కేఆర్‌బీఆర్ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ పరీక్షకు హాజరయ్యాడు. అయితే సమాధాన పత్రం ఇన్విజిలేటర్‌కు ఇవ్వకుండానే పరారయ్యాడని వివరించారు.