members protest
-
ఆందోళనల మధ్య బడ్జెట్ ఆమోదం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళనలు 8వ రోజు కూడా కొనసాగాయి. సభ్యుల నిరసన మధ్యే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్లును, రూ.89.25 లక్షల కోట్ల ద్రవ్యవినియోగ బిల్లును ఎటువంటి చర్చా లేకుండానే లోక్‌సభ ఆమోదించింది. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఆందోళన ప్రారంభించారు. ఈ గొడవ మధ్యనే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక బిల్లును, రూ.89.25 లక్షల కోట్ల ద్రవ్యవినియోగ బిల్లును ప్రవేశపెట్టారు. వీటిని సభ్యులు మూజువాణి ఓటుతో ఆమోదించారు. కేవలం 25 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగిసింది. ఆ వెంటనే సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. దీంతో మోదీ ప్రభుత్వం ఐదోది, ఆఖరు బడ్జెట్ ఆమోదం పొందినట్లయింది. ఈ బిల్లులను రాజ్యసభ ఆమోదించకున్నా ఆమోదం పొందినట్లే పరిగణిస్తారు. రాజ్యసభలో ఉదయం నుంచి విపక్షాలు ఆందోళన చేయటంతో గురువారానికి వాయిదావేశారు. -
మూడో రోజూ నిరసనలే..
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగే సూచనలు కనిపించడం లేదు. వరుసగా మూడోరోజూ ఉభయ సభలు ఎటువంటి కార్యకలాపాలు జరగకుండానే వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాలతో పాటు ఎన్డీఏలోని మిత్రపక్షాలైన శివసేన, టీడీపీ, అన్నాడీఎంకే వివిధ అంశాలపై లోక్‌సభ, రాజ్యసభల్లో ఆందోళనకు దిగాయి. అట్టుడికిన లోక్‌సభ.. బుధవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీడీపీ, శివ సేన, టీఆర్ఎస్, అన్నాడీఎంకే, తృణ మూల్ కాంగ్రెస్ తదితర పార్టీలన్నీ వివిధ అంశాలపై నినాదాలతో హోరెత్తించాయి. విగ్రహాల ధ్వంసం, బ్యాంకింగ్ కుంభకోణం, ఏపీకి ప్రత్యేక హోదా, రిజర్వేషన్లు తదితర అంశాలపై నిరసనకు దిగాయి. రూ. 13 వేల కోట్ల బ్యాంకింగ్ కుంభకోణంపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అన్నాడీఎంకే, ఆప్ పార్టీలు వెల్‌లోకి దూసుకొచ్చి పెరియార్ విగ్రహం ధ్వంసానికి నిరసన తెలిపింది. తెలంగాణలో రిజర్వేషన్ల కోటా పెంచాలనే డిమాండ్‌తో టీఆర్ఎస్ ఎంపీలు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ, టీడీపీ, మరాఠీకి ప్రాచీన భాష హోదా కల్పించాలని శివసేన ఆందోళనకు దిగాయి. ఏపీ విభజన చట్టాలన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో వైఎస్సార్ సీపీ నిరసన తెలిపింది. దీంతో సభ ప్రారంభమైన కొద్దిసేపటికే స్పీకర్ వాయిదా వేశారు. సభా కార్యకలాపాలకు సభ్యులు అంతరాయం కలిగించడంపై స్పీకర్ సుమిత్రా మహాజన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు. రాజ్య సభలోనూ ఇదే అంశాలపై సభ్యులు నిరస నకు దిగారు. ప్రతిపక్షాలు ఆందోళన చేయ డంపై చైర్మన్ వెంకయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సరైన చర్య కాదని, ప్రజాస్వామ్యానికి విఘాతమని హితవు పలి కారు. అయినా సభ్యులు వినిపించు కోకపోవ డంతో సభను వాయిదా వేశారు. అఖిలపక్ష భేటీతోనూ కానరాని పరిష్కారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ బుధవారం సాయంత్రం అఖిలపక్షాల నేతలతో భేటీ అయి, సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. సభకు అంతరాయం కలిగించవద్దని ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లను కోరారు. ఒకట్రెండు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుందనీ, అప్పటి దాకా సంయమనం పాటించాలన్నారు. అయితే, బ్యాంకింగ్ స్కాంపై చర్చ ఏ నిబంధన కింద జరపాలన్న విషయం తేలలేదని కొందరు ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో చర్చతోపాటు ఓటింగ్ కూడా జరపాలన్నారు. -
ఇరానీ నివాసం వద్ద ఎన్ఎస్యూఐ నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీలో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ బుధవారం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ నివాసం ఎదుట ధర్నా చేసింది. ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్‌లో నిరాహార దీక్షకు దిగిన ఎన్ఎస్యూఐ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు మంగళవారం రాత్రి ఖాళీ చేయించారు. దాంతో వారు ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శి మోహిత్ శర్మ నాయకత్వంలో బుధవారం ఉదయం మంత్రి ఇంటి వద్ద నిరసనకు దిగారు. ఉదయం 9.30 గంటలకు అక్కడకు చేరుకున్న కార్యకర్తలు ఓ గంటసేపు నినాదాలు చేశారు. ఓ వైపు విద్యార్థులు, మరోవైపు అధ్యాపక సంస్థలు వరుసగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ నాలుగేళ్ల కోర్సుపై ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోవడం లేదని, దీనిని బట్టి డీయూ వైస్ చాన్సలర్, బీజేపీ కుమ్మక్కైనట్టు తెలుస్తోందని శర్మ ఆరోపించారు. నాలుగేళ్ల కోర్సును రద్దు చేసేంత వరకూ తమ ఆందోళన విరమించబోమని ఎన్ఎస్యూఐ జాతీయ ప్రతినిధి అమ్రిష్ రంజన్ పాండే అన్నారు. నార్త్ క్యాంపస్‌లో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులను మంగళవారం రాత్రి 11 గంటలకు పోలీసులు ఖాళీ చేయించారు. భారీ సంఖ్యలో వచ్చిన పోలీసు అధికారులు విద్యార్థులను బలవంతంగా నిరాహార దీక్షా స్థలి నుంచి తొలగించారని, నాలుగేళ్ల కోర్సు రద్దు చేయాలని ఎన్ఎస్యూఐ పట్టుబట్టడంతో ఢిల్లీ యూనివర్సిటీ యంత్రాంగం పోలీసులను రంగంలోకి దింపిందని ఎన్ఎస్యూఐ పేర్కొంది. ఆరు రోజులుగా నిరశన దీక్షలో ఉన్న ఏడుగురు విద్యార్థులను పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించారని ఆరోపించింది. నాలుగేళ్ల కోర్సును రద్దు చేస్తామని బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిందని, ఆ హామీని నెరవేర్చాలని విద్యార్థి సంఘాలు, ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (డ్యూటా) డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్మృతి ఇరానీ ఏబీవీపీ విద్యార్థుల బృందానికి హామీ ఇచ్చినట్లు తెలిసింది.