memon
-
ఆ జర్నలిస్టు కోసం వేట
ముంబై: ఐఎస్ఐఎస్లో చేరాలనుకుంటున్నట్లు వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు జుబర్ అహ్మద్ ఖాన్ కోసం ముంబై పోలీసులు వేట మొదలు పెట్టారు. దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా, రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన అతడిని ఎలాగైనా పట్టుకుని తీరాలని పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జుబర్ అహ్మద్ ఖాన్ కు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ముంబై పేలుళ్ల కేసు దోషి యాకూబ్ మెమన్ ఉరికి సానుభూతిని వ్యక్తం చేస్తూ జుబర్ అహ్మద్ ఖాన్ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు పోస్టు చేశాడు. అంతేకాకుండా తాను ఐఎస్ ఉగ్రవాద సంస్థకు ప్రతినిధిగా వ్యవహరించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశాడు. యాకూబ్ మెమన్ మృత వీరుడుగా అభివర్ణించాడు. దీనిపై ఓ వ్యక్తి పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. దేశంలో ఉగ్రవాదుల దాడులు, పాకిస్తాన్ ఉగ్రవాదుల చొరబాటు వార్తల నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు విచారణ మొదలు పెట్టారు. కాగా ఆ జర్నలిస్టు నవీ ముంబైలో నివసిస్తున్నట్టుగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా తృటిలో తప్పించుకున్నట్టు సమాచారం. -
జీవితానికీ మరణానికీ మధ్య ‘మత’ గీత మెమన్!
తమ మతం కారణంగానే తాము ఈ దేశంలో శిక్షకు గురవుతున్నట్లు ముస్లింలలో పలువురు భావిస్తున్నారన్న భావనను యాకూబ్ మెమన్ ఉరి ఘటన బలపరుస్తోంది. మెమన్ నిజంగా తప్పు చేసినప్పటికీ, తన మతం కారణంగానే అతడిని ఉరితీయడానికి ప్రభుత్వం అంత ఆత్రుతను ప్రదర్శించిందన్న ముస్లింల ఆవేదనను ఇది స్పష్టం చేస్తోంది. మెమన్ ఉరితీత ఘటన కూడా ప్రజలను వేరు పరచేదే. ఇది కూడా పెద్ద స్థాయిలో విషం చిమ్మనుంది. మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాంకు అంత్యక్రియలు జరిగిన రోజే ఉరిశిక్షపాలైన ఉగ్రవాది యాకూబ్ మెమన్‌కి అంత్యక్రియలు నిర్వహించారు. మెమన్ అంత్యక్రియల గురించి నివేదించవద్దని ముంబై పోలీసులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. అదే సమయంలో సైనిక వందనంతో సహా ప్రభుత్వ లాంఛనాలతో కేంద్ర ప్రభుత్వం కలాం అంత్యక్రియలను ఘనంగా నిర్వహించింది. (అణు బాం బుల సృష్టికర్తగా, వాటిని మోసుకుపోయే క్షిపణుల సృష్టికర్తగా కీర్తిపొందిన ఆయ నకు ఇది అసలైన నివాళి). తన భావ వ్యక్తీకరణా హక్కులను కాపాడుకోవడంలో తీవ్రంగా పోరాడే స్వభావమున్నప్పటికీ, మీడియా రెండు కారణాలతో మెమన్ అంత్యక్రియల ప్రసారంపై నిషేధాన్ని అంగీకరించింది. ఉరిశిక్ష విధించిన వ్యక్తి అంత్యక్రియల సందర్భంగా పోటెత్తి వచ్చే ముస్లిం జనసందోహం అతడికి మద్దతు ప్రకటించే వార్తలను ప్రచారం చేసినట్లయితే, ఇప్పటికే మతపర హింసలో తన వంతు వాటా కంటే అధిక భాగం కలిగి ఉన్న ముంబై వంటి నగరంలో ప్రజలు మతాల వారీగా వేరుపడిపోవడం జరుగుతుందనే ఆందోళనతో మీడియా ఏకీభవించింది. ఇది మొదటి కారణం. ఇక రెండో కారణం. అప్రియత్వానికి సంబంధించింది. జనం గౌరవించనప్ప టికీ, ఉరిశిక్షకు గురైన వ్యక్తికి ప్రజల నుంచి సానుభూతి లభించడం అనే నిజాన్ని వెలుగులోకి తీసుకురావడమనేది వినడానికి అప్రియంగా ఉండవచ్చు. ఇలాంటి అప్రియ ఘటనలకు ప్రచారం కల్పించకూడదన్నదే తమ వైఖరి అంటూ కొన్ని చానళ్లు ఆన్-స్క్రీన్ బ్యానర్లను కూడా ప్రకటించాయి. మెమన్ అంత్యక్రియలకు ఎంతమంది హాజరయ్యారనే విషయంలో భారతీ యులు ఆ రోజు పత్రికలలో అచ్చయిన కొన్ని ఫొటోగ్రాఫ్‌ల బట్టే తెలుసుకో గలిగారు. యాకూబ్ మెమన్‌కు నమాజ్ చేయడానికి ముంబైలో దాదాపు 8 వేల మంది ముస్లింలు హాజరయ్యారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక నివేదించింది. మన ప్రశ్న అల్లా ఏమిటంటే... వారెందుకలా చేశారు? అన్నదే. భారతీయ జనతా పార్టీ నేత, త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ దీనిపై తనదైన సూత్రీకరణ చేశారు. ‘యాకూబ్ మెమన్ భౌతికకాయం వద్ద గుమిగూడిన వారం దరిపై (కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులను మినహాయించి) నిఘా శాఖ ఓ కన్నేసి ఉంచాలి. వీరిలో చాలామంది భవిష్యత్తులో ఉగ్రవాదులుగా మారే ప్రమాదముంది’. అయితే మెమన్‌కు చివరి నివాళి అర్పించడానికి దూరప్రాంతాల నుంచి కూడా జనం వచ్చారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. అంత్యక్రియల వేదిక వద్ద నుంచి పంపిన వాట్సాప్ సందేశాలు, చివరి నివాళిని అందించిన సమ యాన్ని చూసినట్లయితే యాకూబ్‌కు నివాళి పలకడానికి అతనితో ఏమాత్రం సం బంధం, పరిచయం లేని పలువురు కొత్తవారు వచ్చారని తెలుస్తోందని ఆ పత్రిక పేర్కొంది. సోషల్ మీడియాలో యాకూబ్ ఉరిపట్ల ఆగ్రహం వెల్లువెత్తిన సమాచారాన్ని సీనియర్ పోలీసు అధికారులు పసిగట్టారని కూడా ఆ పత్రిక నివేదిక తెలిపింది. అయితే పోలీసు కమిషనర్ మాత్రం అక్కడ ఆవేశకావేషాలను రెచ్చగొట్టే ఘట నలు చోటు చేసుకోలేదన్న వాస్తవాన్నీ అంగీకరించినట్లు ఆ వార్త బయటపెట్టింది. శ్మశాన వాటిక వద్ద గుమిగూడిన ప్రజలను ఎలాంటి నినాదాలూ చేయవద్దని కూడా కోరడమైంది. తమ నిరసన తెలుపడానికి అక్కడ అంతమంది గుమిగూడనట్లయితే, మీడి యాలో తీవ్ర వ్యతిరేకత, పోలీసు నిఘా ఉన్నప్పటికీ అంతమంది జనం అక్కడికి ఎలా రాగలిగారు? ఎలాంటి దురభిప్రాయాలకూ, మీడియా వర్ణనలతో ముం దస్తు అభిప్రాయాలకూ లోనుకాకుండా మనం ఘటనలను చూడగలిగితే, దీన్ని అర్థం చేసుకోవడం సులభమే. ఈ అర్థంలో గతంలో జరిగిన వరుస ఘటనలు చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. మెమన్ ఉరితీతకు దారితీసిన ముంబై పేలుళ్లు 1993 మార్చి 12న జరి గాయి. అదే సంవత్సరం జనవరిలో ముంబైలో జరిగిన ఘర్షణల్లో 500 మంది ముస్లింలు (200 మంది హిందువులు) హత్యకు గురయ్యారు. దానికి నెల రోజు లకు ముందు బాబ్రీ మసీదుకు వ్యతిరేకంగా భారతీయ జనతాపార్టీ లేవనెత్తిన ఉద్యమం ఆ మసీదు కూల్చివేతకు కారణమైంది. ఈ అర్థంలో అనేక ఘటనల సమాహార ఫలితమే ముంబై పేలుళ్ల ఘటనకు దారితీసింది. ఇది హింసను ప్రేరే పించి మతపరమైన సామాజిక బృందాలు భారీ స్థాయిలో పాలుపంచుకోవడానికి కారణమైంది. ఈ ఘటనలో హతులైనవారితో పాటు, తమ వ్యాపారాలను కోల్పోయినవారు, గాయపడినవారు, అత్యాచారా లకు గురైనవారు. నిరాశ్రయుల సంఖ్యను కూడా కలపాల్సి ఉంది. వీరందరి సంఖ్య వేల సంఖ్యలో ఉంటుంది. ముంబై పేలుళ్ల నేపథ్యం ఇదే. మెమన్ ఉరితీత కూడా ప్రజలను వేరుపర్చేదే. ఇది కూడా పెద్ద స్థాయిలో విషం చిమ్మనుంది. ఈలోగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వార్త వచ్చింది. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనం ప్రకారం దేశంలో ఉరిశిక్షకు గురైనవారిలో 94 శాతం మంది దళితులు లేదా ముస్లింలేనట. తమ మతం కారణంగానే తాము ఈ దేశంలో శిక్షకు గురవుతున్నట్లు ముస్లిం లలో అనేకమంది భావిస్తున్నారన్న భావనను యాకూబ్ మెమన్ ఉరి ఘటన బలపరుస్తోంది. మెమన్ నిజంగా తప్పు చేసినప్పటికీ, తన మతం కారణంగానే అతడిని ఉరితీయడానికి ప్రభుత్వం అంత ఆత్రుతను ప్రదర్శించిందన్న ముస్లింల ఆవేదనను ఇది స్పష్టం చేస్తోంది. ఈ కేసు విషయంలో సానుభూతి పూర్తిగా లోపించడాన్ని బీజేపీకి చెందిన హంతకులు మాయా కొడ్నాని, బాబూ బజరంగీల కేసుతో పోల్చితే స్పష్టమవుతుంది. వీళ్లిద్దరికి కూడా ఇదే స్థాయి తీవ్రనేరాలకు గాను శిక్ష విధించినప్పటికీ, వారు నిక్షేపంగా బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇప్పుడు భారత్‌లో ముస్లింల మనుగడకు సంబంధించిన పెనువాస్తవం మనకు ఎదురవుతోంది. ఉగ్రవాదానికి సంబంధించిందే కాదు.. ముస్లింల విద్రోహ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలపై వస్తున్న ఏ వ్యాసం కింద అయినా ఇంటర్నెట్లో పాఠకుల వ్యాఖ్యల కేసి చూస్తే మనందరికీ కాస్త జ్ఞాన బోధ కలుగుతుంది. ఆంగ్లీకరణకు గురైన మన మధ్యతరగతి ప్రజల్లో మతద్వేషం, మతపరమైన దురభిమానానికి సంబంధించిన భావనలు ఎంత బలంగా ఉన్నా యంటే ఆ వ్యాఖ్యలను చూస్తుంటే నిజంగానే భయం కలుగుతోంది. దీని ఫలి తంగా కిరాయి ఇళ్ల కోసం, ఉద్యోగాల కోసం మన దేశంలో ముస్లింలు ఎదు ర్కొంటున్న కష్టాలను పరిశీలించడం కూడా కష్టమైపోతోంది. భారత్‌లో ముస్లింగా బతకడంలో ఉన్న వాస్తవం ఇదే. మన కళ్లముందు అనేక ఘటనలు జరుగుతుంటాయి. యాకూబ్ మెమన్ ఉరితీత వాటిలో ఒకటి. అతడి అంత్యక్రియలకు హాజరైనవారి ముఖాల్లో వారికెదురవుతున్న అన్యాయాలు స్ఫుటం దాల్చినట్లు కనిపించాయి. ఆ శ్మశానంలో హాజరైన వారు నిరసన తెలుపడానికి రాలేదు. తామూ బాధితులే కాబట్టి వారు సానుభూతి తెలుపడానికి అక్కడికి వచ్చారు. (ఆకార్ పటేల్ , వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com -
కంచుకోటలా మారిపోయిన నాగ్ పూర్ జైలు
-
కంచుకోటలా మారిపోయిన నాగ్ పూర్ జైలు
నాగ్ పూర్: ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ను ఉరితీసే నాగ్ పూర్ సెంట్రల్ జైలు, అక్కడి వార్ధా రోడ్డు రాత్రికి రాత్రే పూర్తి కంచుకోటల్లా మారిపోయాయి. బుధవారం రాత్రి నుంచే జైలు అధికారులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిషేధ ఉత్తర్వులు అమలుచేశారు. సెక్షన్ 144, సెక్షన్ 137 అమలుచేశారు.గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రాంతంలోకి ఎవ్వరూ ప్రవేశించడానికి వీల్లేదని, ఒకవేళ వస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కమిషనర్ రాజవర్ధన్ సిన్హా హెచ్చరించారు. ఇక ముంబైలో మెమన్ ల నివాసప్రాంతమైన మాహిమ్ కూడా కోటలా మారిపోయింది. క్విక్ రెస్పాన్స్ టీం కమాండోలు, అల్లర్లను నియంత్రించే దళానికి చెందిన పోలీసులు, రాష్ట్ర రిజర్వు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ముంబైలో పరిస్థితులను అదుపు చేయడానికి 35వేల మంది పోలీసులను దించామని, ఈరోజు అందరికీ సెలవులు రద్దుచేశామని, ఇప్పటికే సెలవులో ఉన్నవాళ్లను కూడా వెనక్కి పిలిపించామని ముంబై పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నాగ్ పూర్ జైలు వద్ద కూడా భద్రతా ఏర్పాట్లు మరింత పటిష్ఠంగా మారాయి. జైలు ప్రాంగణం వద్ద పెట్రోలింగ్ కోసం క్విక్ రెస్పాన్స్ టీంను నియమించారు. వాచ్ టవర్ల వద్ద కూడా రోజూ ఉండే సిబ్బందిని తప్పించి ఆ బాధ్యతలను అత్యాధునిక ఆయుధాలతో కూడిన క్విక్ రెస్పాన్స్ టీంకు అప్పగించారు. అదనపు భద్రత కోసం సీఆర్పీఎఫ్ బృందాన్ని కూడా నియమించారు. చివరకు జైలు సిబ్బందిని కూడా ఐడీకార్డులు లేనిదే లోనికి పంపడంలేదు. మెమన్ ను ఉరి తీసిన తర్వాత ఎవరైనా రోడ్డుమీదకు వచ్చి బాణసంచా కాలిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. -
అర్ధరాత్రి తెరుచుకున్న ‘సుప్రీం’ తలుపులు
న్యూఢిల్లీ: దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా సుప్రీంకోర్టు తలుపులు అర్ధరాత్రి తెరుచుకున్నాయి. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు కోర్టు తలుపులు తీశారు. ఉరిశిక్షను వాయిదా వేయాలంటూ యాకూబ్ మెమన్ తరఫు న్యాయవాదులు చిట్టచివరి నిమిషంలో దాఖలు చేసిన పిటషన్ ను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు అంగీకరించడంతో సుప్రీంకోర్టు చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా అర్ధరాత్రి 4వ నెంబరు కోర్టులో వాదనలు కొనసాగాయి. అంతకుముందు బుధవారం సాయంత్రం మెమన్ పిటిషన్ ను కొట్టేసిన త్రిసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులనే ఈ పిటిషన్ విచారణకు కూడా చీఫ్ జస్టిస్ నియమించారు. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం వద్ద రెండు గంటల పాటు వాదనలు కొనసాగాయి. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిన 14 రోజుల వరకు ఉరి తీయకూడదని మరో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మెమన్ తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. మహారాష్ట్ర మాన్యువల్ ప్రకారం చూసినా కూడా క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు, ఉరితీతకు మధ్య 7 రోజుల వ్యవధి ఉండాలని చెప్పారు. అయితే, ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ధర్మాసనం తన తుది తీర్పు వెలువరించింది. షెడ్యూలు ప్రకారమే గురువారం నాడు మెమన్ ను ఉరి తీయాలని స్పష్టం చేసింది. దీంతో యాకుబ్ మెమన్‌కు ఉరికి ఖరారైంది. -
శిక్షల అమలులో ఈ పక్షపాతమెందుకు?
ఉరిశిక్షకు గురైన హంతకుడు లేదా ఉగ్రవాదికి బలమైన రాజకీయ మద్దతు ఉంటే కేంద్రం కానీ, న్యాయస్థానాలు కానీ నిష్పాక్షికంగా తీర్పు విధించే సాహసం చేయలేవు. కానీ అజ్మల్, అఫ్జల్ గురు, యాకుబ్ మెమొన్ వంటి కొందరు హంతకుల విషయానికి వచ్చేసరికి అవి న్యాయాన్ని ఎత్తిపట్టడంలో, శిక్షల్ని అమలు చేయటంలో ఎంతో స్పష్టంగా ఉండటమే విచిత్రం. ముస్లింలకూ లేదా తలారి బారిన పడుతున్న వారి సంబంధీకులకూ రాజకీయ మద్దతు లోపించిందనిపిస్తోంది. ఇబ్రహీం టైగర్ మెమొన్ సోదరుడు యాకుబ్ మెమొన్‌ను ఈ నెల చివర్లో ఉరితీయనున్నారు. రెండు దశాబ్దాలుగా నాకు సుపరిచితుడైన న్యాయమూర్తి పీడీ కొడే, మెమొన్కు ఉరిశిక్ష విధించారు. ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్న ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానంలో నేను రిపోర్టర్‌గా ఉండేవాడిని. కుట్ర ఆరోపణలతో యాకుబ్ మెమొన్కు కొడే ఉరిశిక్ష విధించడం మెమొన్ న్యాయవాది సతీష్ కాన్సేతోపాటు కొంతమందిని ఆశ్చర్యపరిచింది. సతీష్ కొన్నేళ్ల క్రితం రెడిఫ్.కామ్‌కి చెందిన షీలా భట్‌తో ఇలా అన్నారు.‘‘ పాకిస్తాన్లో సైనిక శిక్షణలో యాకుబ్ ఎన్నడూ పాల్గొనలేదు... అతడు బాంబులను లేదా ఆర్డీఎక్స్ని అమర్చలేదు. ఆయుధాలను దేశంలోకి తీసుకురావడంలో కూడా అతడు పాలు పంచుకోలేదు. ఈ కేసులో ఉరిశిక్షకు గురైనవారిలో ఒకరు ఇలాంటి ప్రాణాంతక చర్యల్లో ఒకదాంట్లో పాల్గొన్నారు. యాకుబ్‌పై చేసిన నేరారోపణలో ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు నమోదు కాలేదు.’’ అయినా అతడిని ఏదోరకంగా ఉరి తీయనున్నారు. బలమైన ఆరోపణ లేనప్పటికీ ఉరిశిక్ష విధిస్తున్న కేసులలో ఇదే మొదటిది. యాకుబ్ మెమొన్పై విచారణ సాగించిన న్యాయవాది ఉజ్వల్ నికమ్ (పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ బిర్యానీని డిమాండ్ చేశాడని అబద్ధాలాడి వార్తల్లో నిలిచినవాడు) మెమొన్ గురించి ఇలా అభిప్రాయపడ్డారు. ‘‘న్యాయస్థానానికి తొలిసారి తీసుకువచ్చినప్పుడు అతడు ప్రశాంతంగానూ, మితభాషిగానూ కనిపించాడు. అతడు చార్టర్డ్ అకౌంటెంట్ కాబట్టి సాక్ష్యాలకు సంబంధించి వివరణాత్మకమైన నోట్స్ తీసుకున్నాడు. అతడు ప్రశాంతచిత్తంతో విడిగా ఉండేవాడు. ఇతరులతో అతడు ఎన్నడూ సంబంధం పెట్టుకోలేదు. తన న్యాయవాదితో మాత్రమే మాట్లాడేవాడు. వివేచనాపరుడిగా మొత్తం విచారణను సన్నిహితంగా పరిశీలించేవాడు.’’ న్యాయస్థానంలో నేనున్న సమయాల్లో కూడా నేను దీన్నే గమనించాను. మెమొన్ మౌనంగా ఉండి, విచారణను శ్రద్ధగా వినేవాడు. తను భావోద్వే గాన్ని వ్యక్తపరిచేవాడని నేను గమనించాను. బహుశా అది 1995 లేదా 1996 మొదట్లో కావచ్చు. ఆ సమయంలో ట్రయల్ జడ్జిగా ఉన్న జేఎన్ పటేల్ ముంబై బాంబు పేలుళ్ల ఘటనలో నిందితులైన పలువురికి బెయిల్ ఇచ్చారు. నిందితులు కొంత ఆశాభావంతో ఉండేవారు కానీ మెమొన్ మనుషులకు ఉండేది కాదు. తమకు బెయిల్ ఇవ్వని సమయంలో యాకుబ్ హింసాత్మ కంగా వ్యవహరిస్తూ (ఎవరినీ కొట్టకుండానే) పెద్దగా అరిచినట్లు గుర్తు. అతడన్నాడుః ‘‘టైగర్ చెప్పింది నిజం. మేం వెనక్కు తిరిగి రాకుండా ఉండాల్సింది.’’ తదుపరి సంవత్సరాల్లో అతడిలో ఏమైనా మార్పు వచ్చిందా అనే విషయం నన్ను విస్మయపరుస్తుంటుంది. అతడు నేడు నాగపూర్ జైలులో ఒంటరి నిర్బంధంలో ఉంటూ (సుప్రీంకోర్టు ప్రకారం అది చట్టవిరుద్ధం) తనను ఉరితీసే తలారీ కోసం ఎదురు చూస్తున్నాడు. చివరి ప్రయత్నంగా కోర్టు ముందుకు తీసుకెళ్లడమే మిగిలి ఉంది. యాకుబ్ మెమొన్ని ఎందుకు ఉరితీయకూడదో వాదిస్తూ ఫస్ట్‌పోస్ట్.కామ్‌కు చెందిన నా మిత్రుడు ఆర్. జగన్నాథన్ చక్కటి వ్యాసం రాశాడు. లేదా అతడి మాటల్లో చెప్పాలంటే మెమొన్‌ను ఉరితీయడంలో ఈ తొందరపాటు చర్య న్యాయపరీక్షకు నిలబడేది కాదు. రాజీవ్‌గాంధీ, పంజాబ్ దివంగత సీఎం బియాంత్ సింగ్‌ల హత్య ఘటనలో ఉరిశిక్షకు గురైన నేరస్తులను నేటికీ ఉరితీయలేదని నా మిత్రుడు వాదిస్తుంటాడు. రాజీవ్ హంతకుల్లో ముగ్గురికి (శాంతన్, మురుగన్, పెరారివలన్) క్షమాబిక్ష పెట్టాలని తమిళనాడు శాసనసభ కోరిన తర్వాత వారి శిక్షను తగ్గించారు. బియాంత్ సింగ్ హంతకుడు బల్వంత్ సింగ్ తన అపరాధాన్ని గర్వాతిశయంతో అంగీకరించాడు. పైగా తనను ఉరితీయవలసిందిగా స్వయంగా డిమాండ్ చేశాడు. అయినప్పటికీ అతడిని సజీవుడిగానే ఉంచారు. బహుశా పంజాబ్ శాసనసభ సాగించిన ప్రయత్నాల వల్లే కావచ్చు. జగన్నాథన్ ఇంకా ఇలా రాశారు. ‘‘సాధారణ దృష్టికి స్పష్టమయ్యేది ఏమిటంటే, ఉరిశిక్షకు గురైన హంతకుడు లేదా ఉగ్రవాదికి బలమైన రాజకీయ మద్దతు ఉంటే, కేంద్రం కానీ, న్యాయస్థానాలు కానీ నిష్పాక్షికంగా తీర్పు విధించే సాహసం చేయలేవు. కానీ అజ్మల్, అఫ్జల్ గురు, ఇప్పుడు బహుశా యాకుబ్ మెమొన్ వంటి కొందరు హంతకుల విషయానికి వచ్చేసరికి ఇదే కేంద్రం, రాష్ట్రాలు, న్యాయస్థానాలు న్యాయాన్ని ఎత్తిపట్టడంలో ఎంత స్పష్టంగా ఉంటాయో ఎవరికి వారు పరిశీలించుకోవలసిందే. ముస్లింలకూ లేదా తలారి బారిన పడుతున్న వారి సంబంధీకులకూ రాజకీయ మద్దతు లోపించిన విషయం స్పష్టంగా తెలుస్తోంది.’’ నేను ఒప్పుకుంటాను... హత్యలకు ముందే పేలుళ్లు జరిగాయి కాబట్టి, ఈ కారణంతోనే మెమొన్ని ఉరితీయాలని నేను భావిస్తాను. కానీ, నా అభి ప్రాయం ప్రకారం, పేలుడు ఘటనలపై సుదీర్ఘ న్యాయ ప్రక్రియ ముగిసిన తర్వాత చేపట్టవలసిన చిట్టచివరి చర్య ఉరితీత. ముంబై పేలుళ్ల నేరానికి పాల్పడిన వారిని రిపోర్టరుగా నా తొలిరోజే కలుసుకున్నాను. ఆ సాయంత్రం చాలా లేటుగా ముంబై అర్థర్ జైలులో వారిని నేను కలిశాను. అప్పటికే జైలు గేట్లను మూసివేశారు. కానీ విచారణ ఖైదీలుగా ఉంటూ బెయిల్ పొందని తమ భర్తలకు, కుమారులకు లేదా సోదరులకు ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని అందించడానికి అనుమతి కోరుతూ డజను మంది మహిళలు అక్కడ వేచి చూస్తున్నారు. వీరిలో ఎక్కువమంది బుర్ఖా ధరించి ఉన్నారు. ఆ మహిళలకు ఇంగ్లిష్‌లో రాయడం తెలీదు. వారిలో ఒకరు అనుమతి లేఖ రాసిపెట్టమని నన్ను కోరారు. వాళ్లందరికీ నేను అనుమతి పత్రాలు రాసిచ్చాను. ఆ పని నేను పూర్తి చేయగానే, ఒక గార్డు జైలు గేటు బయటకు వచ్చి జైలులోపల ఉన్నతంగా కనిపిస్తున్న ప్రాంతంలో ఉన్న నల్లటి కిటికీవైపు చేయి చాచి, జైలర్ నన్ను కలవాలనుకుంటున్నట్లు చెప్పాడు. నేను అతడిని అనుసరించి జైలర్ వద్దకు వెళ్లాను. అతడి పేరు హిరేమత్. నేను ఏ పనిచేస్తున్నదీ అడిగాడు. నేను చెప్పాక అతడు నాపట్ల మృదువుగా వ్యవహరిం చాడు. జైలులోపలి భాగాలను చూపించడంలో నాకు సహకరించాడు. ‘మీరు సంజయ్‌దత్‌ను కలవాలనుకుంటున్నారా?’ అని నన్నడిగాడు. అవునన్నాను. ఆ విధంగా నేను ముంబై పేలుళ్ల ఘటనలో నిందితుల గురించి తెలుసు కుంటూ వచ్చాను. న్యాయస్థానాల్లో, జైలులో వారితో భేటీ అవుతూ వచ్చాను. వారిలో కొందరు సంజయ్దత్లాగా తిరిగి జైలుకు వచ్చేవారు. మహమ్మద్ జింద్రాన్ వంటి ప్రశాంతచిత్తుడైన, చక్కగా మాట్లాడే మధ్యతరగతి వ్యక్తులు విచారణ క్రమంలోనే హత్యకు గురయ్యారు. ఈ సుదీర్ఘ విచారణ క్రమంలో యాకుబ్ ఇప్పుడు ఉరికొయ్యపై వేలాడేందుకు సిద్ధంగా ఉన్నాడు. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com) - ఆకార్ పటేల్