memory boost
-
ఏళ్లు గడిచినా గతం గుర్తుండేలా..!
గతేడాది సరిగ్గా ఇదే రోజు ఈ క్షణం ఏం చేశారో చెప్పండంటే దాదాపు చాలామందికి గుర్తుండకపోవచ్చు. అయితే ఇకపై ఈ సమస్య తీరనుంది. మనిషి జీవితంలో జరిగే ప్రతీ నిమిషాన్ని గుర్తుంచుకునేలా కొత్త టెక్నాలజీని రూపొందించారు. ఈమేరకు అద్వైత్పాలీవాల్ అనే యువకుడు ప్రత్యేక గాడ్జెట్‌ను తయారు చేశారు.‘ఐరిస్’ అనే ఈ పరికరానికి చాలా ప్రత్యేకతలున్నట్లు ఆయన తెలిపారు. ‘ఇది మనిషి జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనను నిమిషం వ్యవధిలో ఫొటోలు తీస్తుంది. ఇలా తీసిన ఫొటోలను యూజర్లు వాడుతున్న డివైజ్‌లో లేదా క్లౌడ్‌లో టైమ్‌లైన్ ప్రకారం స్టోర్ చేసుకుంటుంది. ఇది కృత్రిమమేధ సాయంతో పనిచేస్తుంది. గతంలో మాదిరి ప్రస్తుతం ఏదైనా సంఘటన జరిగితే అందుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తుంది. ఈ ‘ఐరిస్’ పరికరం ధరించేందుకు వీలుగా ఉంటుంది’ అని అద్వైత్ పేర్కొన్నారు.ఐరిస్ ఫొటోలు తీస్తున్నప్పుడు వినియోగదారులు డిస్ట్రాక్షన్(పరద్యానం)లో ఉన్నట్లు గమనిస్తే తిరిగి ట్రాక్‌లోకి రావాలని సూచిస్తుంది. గతం గుర్తుపెట్టుకోలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అద్వైత్ తెలిపారు. రోగులు, పని ప్రదేశాల్లో భద్రతకు, వృద్ధుల సంరక్షణకు ఇది ఎంతో తోడ్పడుతుందని చెప్పారు. ఐరిస్‌కు సంబంధించి వ్యక్తుల గోప్యతపై అద్వైత్ స్పందించారు. ‘ప్రతి ఆవిష్కరణకు మంచి, చెడూ ఉంటాయి. జ్ఞాపకశక్తి సరిగా లేనివారికి ఈ ఆవిష్కరణ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఫొటో రికార్డులను ఎలా వాడుతారన్నది మాత్రం కీలకంగా మారనుంది. గోప్యతా, భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ ఈ పరికరాన్ని ఎలా ఉపయోగించాలో అంతిమంగా నిర్ణయించుకునేది మాత్రం వినియోగదారులే’నని అద్వైత్ అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ‘తప్పు జరిగింది..క్షమించండి’ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్(ఏఐ), హార్డ్‌వేర్‌లో కొత్త ఆవిష్కరణల కోసం కేంబ్రిడ్జ్‌లో ‘హ్యాకర్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్’ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఆగ్మెంటేషన్ ల్యాబ్‌లో అద్వైత్ ఈ పరికరాన్ని తయారు చేశారు.I built Iris, a wearable that gives you infinite memory of your life.It takes a picture every minute, captions and organizes them into a timeline, and uses AI to help you remember forgotten details.Iris also has a focus mode. It notices when you get distracted and proactively… pic.twitter.com/fQxzpBRmIA— Advait Paliwal (@advaitpaliwal) September 24, 2024 -
Health Tips: తెలుసా?.. ఈ జ్యూస్ తాగితే గుండె సంబంధిత వ్యాధులు పరార్!
మనం రకరకాల పండ్ల రసాలు తాగుతుంటాం. అయితే వాటికన్నా బీట్రూట్ రసం తీసుకోవడం చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వారి మాటల్లోనే చెప్పాలంటే... ►బీట్రూట్లో మనకి కావాల్సిన అనేక పోషకాలున్నాయి. ఐరన్ తక్కువగా ఉన్నవారు బీట్రూట్ జ్యూస్ రోజూ తాగితే ఐరన్ పెరుగుతుంది. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయులు కూడా పెరుగుతాయి. ►నీరసంతో బాధపడేవారు కొన్ని బీట్ రూట్ ముక్కలు తిన్నా లేదంటే బీట్ రూట్ జ్యూస్ తాగినా తక్షణ శక్తి వస్తుంది. ►బీట్ రూట్లో బి, సి విటమిన్స్ అధికం. రక్తపోటు నియంత్రణలో ఉండేందుకు బీట్రూట్ దోహదం చేస్తుంది. ఇందులో అధికంగా ఉండే కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం అందరికీ అవసరమైనవే. చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !! ►తరచూ బీట్ రూట్ తినేవారికి, రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగేవారికి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ►రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగితే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. అలాగే అధిక కొవ్వు సమస్యతో బాధ పడేవారు ఈ జ్యూస్ తాగితే కొవ్వు కరుగుతుంది. ►మూడీగా ఉండేవారు అప్పుడప్పుడు బీట్ రూట్ జ్యూస్ తాగుతుంటే ఉల్లాసంగా ఉండగలుగుతారు. ►గర్భిణులకు కావాల్సిన ఫోలిక్ యాసిడ్ బీట్ రూట్ ద్వారా అందుతుంది. గర్భంలోని పిండం సక్రమంగా ఎదగాలంటే గర్భిణీలు రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగడం మంచిది. ►కాలేయాన్ని బీట్ రూట్ శుభ్రపరుస్తుంది. ►చర్మ సంబంధిత వ్యాధులు కూడా రావు. ►ఎముకల్ని గట్టిగా ఉంచే శక్తి కూడా బీట్ రూట్ కు ఉంటుంది. ►బీట్ రూట్ జ్యూస్ తాగేవారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడుకు కావాల్సిన రక్త సరఫరా అయ్యేలా బీట్ రూట్ చేయగలదు. ఏకాగ్రతను పెంచగల శక్తి కూడా బీట్ రూట్‌కు ఉంది. అందుకే ఫ్రెష్ బీట్రూట్ జ్యూస్ తాగాలి. చదవండి: Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!! -
బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? ఈ సమస్యలు పొంచి ఉన్నట్లే!!
ఆధునిక జీవన శైలిలో భాగంగా రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం, ఉదయం పొద్దెక్కేదాకా నిద్రలేవక పోవడం మామూలు వ్యవహారమైపోయింది. ఉదయం హడావిడిగా ఆఫీసులకు వెళ్లే క్రమంలో చాలామంది అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా ఖాళీ కడుపుతో ఉండటం వల్ల పనిమీద ఆసక్తి తగ్గిపోవడం, చిరాకు పెరగడం వంటి మానసిక సమస్యలు కూడా వస్తుంటాయి. కారణం.. శరీరానికి అవసరమైన పోషకాలు లోపించడం. ఈ పోషకాలు లోపించడానికి మూలం ఉదయం పూట అల్పాహారం తీసుకోకపోవడమే ప్రధాన కారణమని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అధ్యయనంలో వెల్లడైంది. అందువల్ల ప్రతి రోజూ అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకవేళ ఏవైనా ఇతర కారణాల వల్ల ఇడ్లీ, చపాతీ, పూరీ, దోసె వంటి వాటిని తీçసుకోవడం ఇష్టం లేకపోతే లేదా సమయం సరిపోకపోతే మొలకెత్తిన గింజలు, ఉడికించిన కోడిగుడ్లు, నూనె లేకుండా చపాతీలు, పండ్ల రసాలేకాక... ఐదు నానబెట్టిన బాదం పప్పులు, పండ్లు, కూరగాయలతో కలగలిపిన సలాడ్లు వంటివి తీసుకోవడం మంచిది. కనీసం ఇలా చేసినా కూడా అనారోగ్యాన్ని కలిగించే వైరల్ ఇన్ఫెక్షన్లు దాదాపు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. వీటితో పాటు.. అల్పాహారంలో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఒత్తిడిని అధిగమించడమే కాకుండా, జ్ఞాపకశక్తి పెంచుతాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే డైటింగ్ చేసే వారు నిర్లక్ష్యం చేయకుండా.. అల్పాహారం తీసుకోవడం మరువకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చదవండి: Mental Health: మంచి మ్యూజిక్, యోగా, డాన్స్, స్విమ్మింగ్.. వీటితో ఒత్తిడి హుష్!! -
ఆ సమయంలో ఇవి తింటే స్మార్ట్ కిడ్..
న్యూయార్క్: మీరు తల్లి కాబోతున్నారా? చురుకైన, తెలివైన స్మార్ట్‌కిడ్ కావాలని కలలు కంటున్నారా? అయితే మీలాంటి వారికోసమే ఈ వార్త. బిడ్డ మెదడు ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే గుడ్డులోని పచ్చసొన, నట్స్, క్యాబేజీ జాతికి చెందిన కూరగాయలు వంటి ఆహారాలు విరివిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది పుట్టబోయే బిడ్డ మెదడుకు, జ్ఞాపక శక్తికి మంచి బూస్ట్ ఇస్తుందని తాజా అధ్యయనం తేల్చింది. అంతేకాదు గర్భధారణ సమయంలో విటమిన్ బి కాంప్లెక్స్ సముదాయములోని కోలైన్ విరివిగా తీసుకోవాలని చెబుతోంది. గర్భం దాల్చిన మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ఎపుడూ పెద్ద ప్రశ్నే. ఎంత చదువుకున్న మహిళలైనా ఈ విషయంలో తర్జన భర్జన పడుతూనే ఉంటారు. అయితే గర్భధారణలో చివరి మూడు నెలల్లో తీసుకునే ఆహారం చాలా ముఖ్యమని తాజా అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా కొవ్వు తీసేసిన ఎర్ర మాంసం, (లీన్ రెడ్ మీట్) చేపలు, గుడ్లు, తృణధాన్యాలను ఎక్కువగా తీసుకుంటే శిశువు ఆరోగ్యంగా ఎదుగుతుందని ఈ అధ్యయనం తేల్చింది. రోజువారీ ఈ ఆహార పదార్ధాల వినియోగంతో బిడ్డల ఎదుగుదలలో వేగం, విజువల్ జ్ఞాపకశక్తి నాలుగు, ఏడు, 10 , 13 నెలల వయస్సులో మెరుగుపర్చిందని ఈ అధ్యయనం సూచించింది. గర్భధారణ సమయంలో అధికంగా తీసుకోవాల్సిన కోలిన్ చాలామంది మహిళలు చాలా తక్కువ మోతాదులో తీసుకుంటున్నారనీ, రోజుకు సిఫార్సు చేయబడిన 450 మిల్లీగ్రాముల కన్నా తక్కువ వినియోగిస్తారు. కానీ, గర్భధారణ చివరి త్రైమాసికంలో ప్రతిరోజూ సిఫార్సు చేసిన కొలైన రిచ్ ఫుడ్స్ తినడం రెండుసార్లు కంటే ఎక్కువ తీసుకోవాలని తద్వారా పాపాయి ఎదుగుదల బావుంటుందని అధ్యయనం చెబుతోంది. ఆప్టిమల్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ (సంక్లిష్ట సామర్ధ్యాలు మెదడు-ఆధారిత నైపుణ్యాలు:సరళంనుంచి చాలా సంక్లిష్టమైన పని అయినా నేర్చుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం, పరిష్కారం, శ్రద్ధ వహించడం లాంటివి) మెరుగుపడతాయని తెలిపింది. న్యూయార్క్‌లోని కార్నెల్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ , మేరీ కాడిల్ ఆధ్వర్యంలో ఈ స్డడీ జరిగింది. తమ అధ్యయనంలో భాగంగా రెండు గ్రూపుల గర్భిణీలను పరిశీలించినట్టు చెప్పారు. మొదటి గ్రూపునకు రోజు కోలిన్ 930 మి.గ్రా. ఇవ్వగా, రెండవ గ్రూపునకు రోజుకు 480మి.గ్రా ఇవ్వగా ఇద్దరిలోనూ వేగమైన ప్రయోజనాలు కలిగినప్పటికీ రెండవ గ్రూపు కంటే.. మొదటి గ్రూపులోని పిల్లలు మెదడు అభివృద్ధి గణనీయమైన ఫలితాలు కనిపించాయని స్టడీ పేర్కొంది. ఎఫ్ఏఎస్ఈబీ అనే జర్నల్ ఈ అధ్యయనం ప్రచురితమైంది. -
జ్ఞాపకశక్తిని పెంచుకోవాలా..?
జ్ఞాపకశక్తిని పెంచుకోవడం ఎలాగని ఆలోచిస్తున్నారా.. అదేమంత కష్టం కాదు. బాగా చదువుకున్న నాలుగు గంటల తర్వాత వెళ్లి వ్యాయామం చేస్తే చాలు.. దీర్ఘకాలంలో మీ జ్ఞాపకశక్తి బ్రహ్మాండంగా పెరుగుతుందట. ఈ విషయాన్ని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. చదివిన నాలుగు గంటల తర్వాత ఇలా వ్యాయామం చేస్తే, దానికి ముందు చదివిన విషయం రెండు రోజుల పాటు అలాగే గుర్తుండిపోతుందని, చేయని వాళ్లు మాత్రం త్వరగా మర్చిపోతున్నారని శాస్త్రవేత్తలు అన్నారు. మెదడులో నేర్చుకోడానికి, జ్ఞాపకశక్తికి కీలక కేంద్రమైన హిప్పోక్యాంపస్ మీద వ్యాయామం మంచి ప్రభావం చూపుతుంది. దానివల్ల జ్ఞాపకశక్తిని కేంద్రీకరించుకోవడం, దీర్ఘకాలంలో జ్ఞాపకశక్తిని పెంచుకోవడం వీలవుతుందని నెదర్లాండ్స్‌లోని రాడ్బౌడ్ యూనివర్సిటీకి చెందిన గిల్లెన్ ఫెర్నాండెజ్ చెప్పారు. 72 మంది విద్యార్థుల మీద చేసిన పరిశోధనల ఆధారంగా చదువుకున్న నాలుగు గంటల తర్వాత వెళ్లి వ్యాయామం చేస్తే జ్ఞాపకశక్తి బ్రహ్మాండంగా పెరుగుతుందన్న విషయాన్ని గ్రహించినట్టు ఫెర్నాండెజ్ తెలిపారు.