ఏళ్లు గడిచినా గతం గుర్తుండేలా..! | Want Infinite Memory Of Life? Indian-Origin Techie Launches New AI Gadget | Sakshi
Sakshi News home page

ఏళ్లు గడిచినా గతం గుర్తుండేలా.. కొత్త పరికరం ఆవిష్కరణ

Published Wed, Sep 25 2024 1:27 PM | Last Updated on Wed, Sep 25 2024 5:31 PM

how we memorize past things for better future

గతేడాది సరిగ్గా ఇదే రోజు ఈ క్షణం ఏం చేశారో చెప్పండంటే దాదాపు చాలామందికి గుర్తుండకపోవచ్చు. అయితే ఇకపై ఈ సమస్య తీరనుంది. మనిషి జీవితంలో జరిగే ప్రతీ నిమిషాన్ని గుర్తుంచుకునేలా కొత్త టెక్నాలజీని రూపొందించారు. ఈమేరకు అద్వైత్‌పాలీవాల్‌ అనే యువకుడు ప్రత్యేక గాడ్జెట్‌ను తయారు చేశారు.

‘ఐరిస్‌’ అనే ఈ పరికరానికి చాలా ప్రత్యేకతలున్నట్లు ఆయన తెలిపారు. ‘ఇది మనిషి జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనను నిమిషం వ్యవధిలో ఫొటోలు తీస్తుంది. ఇలా తీసిన ఫొటోలను యూజర్లు వాడుతున్న డివైజ్‌లో లేదా క్లౌడ్‌లో టైమ్‌లైన్‌ ప్రకారం స్టోర్‌ చేసుకుంటుంది. ఇది కృత్రిమమేధ సాయంతో పనిచేస్తుంది. గతంలో మాదిరి ప్రస్తుతం ఏదైనా సంఘటన జరిగితే అందుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తుంది. ఈ ‘ఐరిస్‌’ పరికరం ధరించేందుకు వీలుగా ఉంటుంది’ అని అద్వైత్‌ పేర్కొన్నారు.

ఐరిస్‌ ఫొటోలు తీస్తున్నప్పుడు వినియోగదారులు డిస్ట్రాక్షన్‌(పరద్యానం)లో ఉన్నట్లు గమనిస్తే తిరిగి ట్రాక్‌లోకి రావాలని సూచిస్తుంది. గతం గుర్తుపెట్టుకోలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అద్వైత్‌ తెలిపారు. రోగులు, పని ప్రదేశాల్లో భద్రతకు, వృద్ధుల సంరక్షణకు ఇది ఎంతో తోడ్పడుతుందని చెప్పారు. ఐరిస్‌కు సంబంధించి వ్యక్తుల గోప్యతపై అద్వైత్‌ స్పందించారు. ‘ప్రతి ఆవిష్కరణకు మంచి, చెడూ ఉంటాయి. జ్ఞాపకశక్తి సరిగా లేనివారికి ఈ ఆవిష్కరణ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఫొటో రికార్డులను ఎలా వాడుతారన్నది మాత్రం కీలకంగా మారనుంది. గోప్యతా, భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ ఈ పరికరాన్ని ఎలా ఉపయోగించాలో అంతిమంగా నిర్ణయించుకునేది మాత్రం వినియోగదారులే’నని అద్వైత్‌ అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: ‘తప్పు జరిగింది..క్షమించండి’

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌(ఏఐ), హార్డ్‌వేర్‌లో కొత్త ఆవిష్కరణల కోసం కేంబ్రిడ్జ్‌లో ‘హ్యాకర్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్’ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఆగ్మెంటేషన్ ల్యాబ్‌లో అద్వైత్‌ ఈ పరికరాన్ని తయారు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement