memory problem
-
ఏళ్లు గడిచినా గతం గుర్తుండేలా..!
గతేడాది సరిగ్గా ఇదే రోజు ఈ క్షణం ఏం చేశారో చెప్పండంటే దాదాపు చాలామందికి గుర్తుండకపోవచ్చు. అయితే ఇకపై ఈ సమస్య తీరనుంది. మనిషి జీవితంలో జరిగే ప్రతీ నిమిషాన్ని గుర్తుంచుకునేలా కొత్త టెక్నాలజీని రూపొందించారు. ఈమేరకు అద్వైత్పాలీవాల్ అనే యువకుడు ప్రత్యేక గాడ్జెట్‌ను తయారు చేశారు.‘ఐరిస్’ అనే ఈ పరికరానికి చాలా ప్రత్యేకతలున్నట్లు ఆయన తెలిపారు. ‘ఇది మనిషి జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనను నిమిషం వ్యవధిలో ఫొటోలు తీస్తుంది. ఇలా తీసిన ఫొటోలను యూజర్లు వాడుతున్న డివైజ్‌లో లేదా క్లౌడ్‌లో టైమ్‌లైన్ ప్రకారం స్టోర్ చేసుకుంటుంది. ఇది కృత్రిమమేధ సాయంతో పనిచేస్తుంది. గతంలో మాదిరి ప్రస్తుతం ఏదైనా సంఘటన జరిగితే అందుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తుంది. ఈ ‘ఐరిస్’ పరికరం ధరించేందుకు వీలుగా ఉంటుంది’ అని అద్వైత్ పేర్కొన్నారు.ఐరిస్ ఫొటోలు తీస్తున్నప్పుడు వినియోగదారులు డిస్ట్రాక్షన్(పరద్యానం)లో ఉన్నట్లు గమనిస్తే తిరిగి ట్రాక్‌లోకి రావాలని సూచిస్తుంది. గతం గుర్తుపెట్టుకోలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అద్వైత్ తెలిపారు. రోగులు, పని ప్రదేశాల్లో భద్రతకు, వృద్ధుల సంరక్షణకు ఇది ఎంతో తోడ్పడుతుందని చెప్పారు. ఐరిస్‌కు సంబంధించి వ్యక్తుల గోప్యతపై అద్వైత్ స్పందించారు. ‘ప్రతి ఆవిష్కరణకు మంచి, చెడూ ఉంటాయి. జ్ఞాపకశక్తి సరిగా లేనివారికి ఈ ఆవిష్కరణ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఫొటో రికార్డులను ఎలా వాడుతారన్నది మాత్రం కీలకంగా మారనుంది. గోప్యతా, భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ ఈ పరికరాన్ని ఎలా ఉపయోగించాలో అంతిమంగా నిర్ణయించుకునేది మాత్రం వినియోగదారులే’నని అద్వైత్ అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ‘తప్పు జరిగింది..క్షమించండి’ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్(ఏఐ), హార్డ్‌వేర్‌లో కొత్త ఆవిష్కరణల కోసం కేంబ్రిడ్జ్‌లో ‘హ్యాకర్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్’ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఆగ్మెంటేషన్ ల్యాబ్‌లో అద్వైత్ ఈ పరికరాన్ని తయారు చేశారు.I built Iris, a wearable that gives you infinite memory of your life.It takes a picture every minute, captions and organizes them into a timeline, and uses AI to help you remember forgotten details.Iris also has a focus mode. It notices when you get distracted and proactively… pic.twitter.com/fQxzpBRmIA— Advait Paliwal (@advaitpaliwal) September 24, 2024 -
చీటికిమాటికి మర్చిపోతున్నారా? మతిమరుపు నుంచి ఎలా బయటపడాలి?
మతిమరుపు.. దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దశలో దీని బారిన పడుతూనే ఉంటాం. అప్పుడే పెట్టిన వస్తువులను కాసేపట్లోనే మర్చిపోవడం, మళ్లీ వెంటనే గుర్తుకురావడం మామూలే. అయితే మతిమరుపు రెండు రకాలుగా ర్పడుతుంది. మొదటి రకం ఫిజికల్ డ్వామెజ్ ద్వారా, రెండవది మెంటల్ డ్యామేజ్ ద్వారా ఏర్పడేది. దీంట్లో మొదటిరకం నివారణకు మెడిసిన్స్ వాడాల్సిందే. కొందరికి పుట్టుకతోనే మతిమరుపు ఉంటుంది. ఇక రెండో రకంలో.. మెడిటేషన్ ద్వారా జ్ఞాపకశక్తిని తిరిగి పొందవచ్చు. అదెలాగో ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ నవీన్ నడిమింటి మాటల్లోనే.. ఇవి పాటిస్తే కంట్రోల్లో ఉండే ఛాన్స్ ప్రతిరోజూ ఏదో ఒక వ్యాయామం చెయ్యడం. మెదడును యాక్టివ్‌గా ఉంచుకోవడం. అంటే మెదడుకు మేత పెట్టే పజిల్స్,సుడోకు లాంటివి రోజూ సాధన చేస్తూ ఉండటం. మెమరీకి సంబంధించిన ఆటలు ఏదైనా ఆడుతూ ఉండటం. ఉదాహరణకు ఎవరినైనా కొన్ని వస్తువులు ఒక గదిలో పెట్టమని, వాటిని మీరు ఒక నిమిషం పాటు చూసి బయటకు వచ్చి, ఏమేం చూసి వచ్చారో అన్నీ గుర్తు చేసుకుని చెప్పడం, రాయడం. ఇది పిల్లల్లో కూడా జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి ఆడించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అన్నింటికీ మంచిది. నలుగురితో ఉల్లాసంగా గడపడం. దీనివల్ల నిద్రాణమైన జ్ఞాపకాలు బయటికి వచ్చి జ్ఞాపకశక్తి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో మీరు వాడే వస్తువులను క్రమపద్ధతిలో ఉంచుకోవడం వల్ల, ఏది ఎక్కడ ఉంటుందో సులభంగా గుర్తుంటుంది. ఉదాహరణకు మీ కళ్ళజోడు ఎప్పుడూ బెడ్ పక్కనే చిన్న టేబుల్ మీద ఉంచే అలవాటు చేసుకోవచ్చు. ఎప్పుడైనా కనబడనప్పుడు నేరుగా అక్కడికే వెళ్ళి వెతకచ్చు, ఇంట్లోవాళ్ళెవరైనా ఆ చోటు మార్చేస్తే తప్ప. మంచి నిద్ర కేవలం మతిమరుపు నివారించడానికే కాదు, ఆరోగ్యానికి కూడా అవసరం. మంచి నిద్రలో మెదడు సమాచారాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తుంది. మరిచిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. -
చిన్నవయసులోనే గజినీలుగా మరుతున్నారు.. విటమిన్ బి12 కారణమే
భద్రంగా దాచిన వస్తువును ఎక్కడ ఉంచిందీ గుర్తులేకపోవడం.. ఆఫీస్‌కు ఆలస్యమవుతోందనే భయంతో బైక్ కీస్‌ను మరిచి గబగబా ఇంటి నుంచి బయటకు వచ్చేయడం.. స్కూల్‌కి టైమ్ అవుతోందనే హడావుడిలో అమ్మ ఇచ్చిన లంచ్ బాక్స్ మరిచిపోవడం.. ఇలా చాలా మంది చిన్న వయసులోనే గజినీలుగా మారుతున్నారు. ఒకప్పుడు అరవై ఏళ్లు దాటిన వారిలో మతిమరుపు కనిపించేది. ఇప్పుడు 16 ఏళ్ల వారినీ మతిమరుపు వేధిస్తోంది. పాతికేళ్ల వారిలో ఇది తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. పరీక్షల భయం, పని ఒత్తిడి, ఆందోళనలు మతిమరుపునకు ప్రధాన కారణాలు. పౌష్టికాహార లోపం, కొన్ని రకాల రోగాలు కూడా మతిమరుపునకు దారితీస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. టీనేజ్లోనే.. మతిమరుపు సమస్యకు టీనేజ్‌లో బీజం పడు తోంది. 25 నుంచి 35 ఏళ్ల వయస్సు వారిలో అధికమవుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కొందరు ఏదో సమస్యతో తమ వద్దకు వచ్చినప్పుడు వాళ్లు మతిమరుపుతో బాధపడుతున్నట్లు గుర్తించగలుగుతున్నామని వైద్య నిపుణులు అంటున్నారు. 20 నుంచి 30 శాతం మంది యువత ఇలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. అధిక ఒత్తిడి చేసే పనిలో టెన్షన్, యాంగ్జయిటీ, మానసిక అంశాలు జ్ఞాపక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో గుర్తుకు రాని విషయం కోసం యువత సతమతమవుతోంది. తీరా సమయానికి అది గుర్తుకు రాదు. అంతలా మెదడు పట్టు తప్పుతోంది. యాంగ్జయిటీతో ముప్పు మెమరీ పవర్ తగ్గిపోవడానికి మానసిక సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం యాంగ్జయిటీ. ఏ పని చేసినా ఆందోళనతో చేయడం, హడావుడిగా మాట్లాడటంతో ఒత్తిడి పెరిగిపోతోంది. అది మనసుపై ప్రభావం చూపుతోంది. దీంతో విన్న విషయం గుర్తుకు రాని పరిస్థితి. ఉద్యోగంలో పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక అంశాలు కూడా యువతపై ప్రభావం చూపుతున్నాయి. పిల్లల్లో హోం వర్క్, మార్కులపై వత్తిడి, పనిష్మెంట్లు, వారిలో ఒత్తిడి పెంచి అదికాస్తా మతిమరుపునకు కారణమవుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. బీపీ, మధుమేహం ప్రభావం డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ వంటివి సోకి ఐదేళ్లు దాటిన వారిలో మతిమరుపునకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధులు ఉన్న వారిలో హార్మోన్ల అభివృద్ధిలో లోపాలు చోటుచేసుకుంటా యని వైద్యులు చెపుతున్నారు. ఆనందంగా ఉండకుండా, మానసికంగా మందకొడిగా ఉండటంతో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్ బీ 12 కారణమని, దాని లోపంతో సమస్య ఎదురవుతోందని వైద్యులు చెబుతున్నారు. పౌష్టికాహారం లేక పోవడంతో బ్రెయిన్ సెల్స్ అభివృద్ధి జరగడం లేదని చెబుతున్నారు. రెడీమేడ్ ఫుడ్ జోలికి వెళ్లకూడదని సూచిస్తున్నారు. బీ 12 నాన్ వెజ్‌లో అధికంగా, పుష్కలంగా లభిస్తుందని, ఆకుకూరలు తింటే కాస్త జ్ఞాపకశక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఏకాగ్రతే లేదు యువతలో ఏకాగ్రత లోపిస్తోంది. వినడం, విన్నదానిని మనసులో ముద్రించుకో వడం, తిరిగి దానిని చెప్పడం, చెప్పే విషయాల్లో యువతలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. గుర్తుంచు కున్నట్లుగా ఉంటుంది.. కానీ గుర్తుకు రాదు. చాలా మంది ఒక పనిని చేస్తూ మరికొరితో మాట్లాడుతుంటారు. ఈ సమయంలో వారు చెప్పే విషయాలు పెద్దగా వినక పోవడంతో, తర్వాత గుర్తు చేసుకుందామన్నా జ్ఞప్తికి రాని పరిస్థితి ఉంటోంది. మతి మరుపునకు ప్రధాన కారణం ఒత్తిడి. డిప్రె షన్, యాంగ్జయిటీ, ఆల్కహాల్, మత్తు పదార్థా లకు అలవాటు పడిన వారిలో మతిమరుపు సమస్య తలెత్తుతోంది. ఒత్తిడిని జయించేందుకు ప్రతి ఒక్కరు బ్రెయిన్‌కు ఎక్సర్సైజ్ చేయించాలి. అంటే స్వతహాగా లెక్కలు కట్టడం, ఫోన్ నంబర్లు గుర్తు పెట్టుకోవడం వంటివి చేయాలి. అప్పుడు మతి మరుపు తగ్గే అవకాశం ఉంటుంది. పౌష్టికాహారం తీసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలపై మార్కుల కోసం ఒత్తిడి తేకూడదు. ఒత్తిడి వారిని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. – డాక్టర్ ఆర్.తార, అసిస్టెంట్ ప్రొఫెసర్, మానసిక వైద్య విభాగం, జీజీహెచ్ -
మీ స్మార్ట్‌ఫోన్‌లో మెమరీ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా..! ఐతే ఇలా ట్రై చేయండి..!
మీరు ఒక యాప్‌ను ఇన్స్టాల్ చేస్తోన్న సమయంలో ‘స్టోరేజ్ ఫుల్ డిలీట్ సమ్ ఐటమ్స్’ అంటూ మెసేజ్ వస్తే వెంటనే మనకు పనికిరాని ఫోటోలను, ఇతర ఫైళ్లను డిలీట్ చేస్తాం. ఇలాంటి సందర్భాలను మనలో చాలా మందే ఎదుర్కొని ఉంటాం. మీకున్న స్మార్ట్‌ఫోన్‌తోనే మెమరీ స్టోరేజ్ సమస్యలను ఈ చిన్న చిట్కాతో తొలగించవచ్చును. స్మార్ట్‌ఫోన్ మెమరీ స్టోరేజ్‌లో కాకుండా క్లౌడ్ స్టోరేజ్ యాప్స్‌తో మీకు నచ్చినంతా మెమరీ క్లౌడ్‌లో సేవ్ చేసుకోవచ్చును. పలు క్లౌడ్ యాప్స్ అత్యంత సురక్షితమైనవి, సమర్థవంతమైనవి. మీ డేటాను ఇంటర్నెట్ సహయంతో క్లౌడ్ స్టోరేజ్‌లో సేవ్ చేసుకోవడంతో మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎప్పుడూ..‘ స్టోరేజ్ ఫుల్ డిలీట్ సమ్ ఐటమ్స్..’ అనే మెసేజ్ ఎప్పుడు రాదు. ఇప్పటివరకు వందల్లో క్లౌడ్ యాప్స్‌లో అందుబాటులో కలవు. వాటిలో కొన్ని ఉచితంగానే సర్సీస్‌ను అందిస్తున్నాయి. మరికొన్ని యాప్స్ కొంత మేర ఫీజును వసూలు చేస్తున్నాయి. టాప్ క్లౌడ్ స్టోరజ్ యాప్స్ మీ కోసం... ► అమెజాన్ డ్రైవ్ అమెజాన్ తీసుకొచ్చిన క్లౌడ్ ఆధారిత స్టోరేజ్ యాప్ అమెజాన్ డ్రైవ్. అమెజాన్ ప్రైమ్ యూజర్లు వీటి సేవలను పొందవచ్చును. ఫోటోలు, వీడియోల కోసం అపరిమిత బ్యాకప్‌తో పాటు 5GB ఉచిత నిల్వను అమెజాన్ డ్రైవ్ యూజర్లకు అందిస్తోంది. మీరు సంవత్సరానికి సుమారు రూ. 700 చెల్లిస్తే అపరిమిత స్టోరేజ్‌ను అప్‌గ్రేడ్ కావచ్చు. ► ఆటోసింక్(Autosync) ఈ యాప్‌ను మెటాకంట్రోల్ రూపొందించింది. క్లౌడ్ స్టోరేజ్ మెనేజర్‌గా ఆటోసింక్ ఎంతబాగో ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లో మీరు గూగుల్ డ్రైవ్, వన్‌డ్రైవ్, డ్రాప్ బాక్స్, బాక్స్, మెగా లాంటి క్లౌడ్ యాప్స్‌ను ఒకే దగ్గర కల్పిస్తోంది. అపరిమిత స్టోరేజ్ కోసం నెలకు 9.99 (సుమారు రూ. 745)డాలర్లను వసూలు చేస్తోంది. ► డ్రాప్ బాక్స్ ఈ యాప్ మనలో కొంత మందికి సుపరిచితమే. డ్రాప్ బాక్స్ ఇప్పటికే చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్స్ వాడుతున్నారు. ఇది 2జీబీ డేటా వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్ అప్షన్‌ను అందిస్తోంది. నెలకు రూ. 12 వందలను చెల్లిస్తే 2టీబీ స్టోరేజ్‌ను ఒకేసారి ఆరుగురు సభ్యులు వాడవచ్చును. ► గూగుల్ డ్రైవ్ ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌తో పాటుగా క్లౌడ్ స్టోరేజ్ సౌకర్యాన్ని గూగుల్ అందిస్తోంది. యూజర్లు 15 జీబీ వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను పొందవచ్చును. నెలకు సుమారు రూ. 150 చెల్లించి 100జీబీ డేటాను క్లౌడ్ స్టోరేజ్‌ను పొందవచ్చును. ► మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్ గూగుల్ డ్రైవ్ మాదిరి క్లౌడ్ స్టోరేజ్ విషయంలో మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్ సేవలను మైక్రోసాఫ్ట్ అందిస్తోంది. మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్ అనేది ఒక ప్రముఖ క్లౌడ్ స్టోరేజ్ ఎంపిక. ఎందుకంటే ఇది వివిధ రకాల విండోస్ ఉత్పత్తులతో నేరుగా కలిసిపోతుంది. యూజర్లు 5జీబీ వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను పొందవచ్చును. నెలకు 6.99 డాలర్లను చెల్లిస్తే 1టీబీ వరకు క్లౌడ్ స్టోరేజ్‌ను పొందవచ్చును. వన్‌డ్రైవ్‌తో పాటుగా ఆఫీస్365 సేవలను కూడా పొందవచ్చును. ► నెక్స్ట్‌క్లౌడ్ నెక్స్ట్‌క్లౌడ్ అనేది విభిన్నమైన క్లౌడ్ స్టోరేజ్ యాప్. ఇది రెసిలియోసింక్ యాప్ లాగా పని చేస్తుంది.మీ కంప్యూటర్ , మీ ఫోన్ మధ్య ఫైల్‌లను సమకాలీకరించడానికి యాప్ మిమ్మల్ని అనుమతిస్తుంది. నెక్స్ట్ క్లౌడ్ సర్వర్‌లో మీ క్లౌడ్ స్టోరేజ్ సపరేట్గా ఆన్లైన్లో ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ► రెసిలియో సింక్ రెసిలియో సింక్ (బిట్టోరంట్ సింక్)గా కొత్త మందికి ఈ క్లౌడ్ స్టోరేజ్ యాప్ పరిచయం. స్వంత క్లౌడ్ స్టోరేజీని చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఉత్తమమైన క్లౌడ్ స్టోరేజ్ సొల్యూషన్ రెసిలియో సింక్. ఇది డ్రాప్‌బాక్స్, గూగుల్ డ్రైవ్ మొదలైన క్లౌడ్ స్టోరేజ్ యాప్స్‌లా పనిచేస్తుంది. మీ స్టోరేజ్‌ను ఈ యాప్‌ను సింక్‌లో ఏర్పాటుచేయడం ద్వారా క్లౌడ్‌లో మీ ఫైల్స్ భద్రంగా సేవ్ అవుతాయి. ► ట్రెసోరిట్ ట్రెసోరిట్ అనేది సరికొత్త, ఖరీదైన క్లౌడ్ స్టోరేజ్ యాప్స్‌లో ఒకటి. అయితే, ఈ యాప్ భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడదు. అప్లోడ్ చేయబడిన ప్రతి ఫైల్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను కలిగి ఉంటుంది. ప్రైమరీ యూజర్లకు 1 జీబీ వరకు ఉచిత స్టోరేజ్‌ను పొందవచ్చును. నెలకు 12.50 డాలర్లను చెల్లించి 500జీబీ క్లౌడ్ స్టోరేజ్ డేటాను ప్రీమియం యూజర్లకు అందిస్తోంది. చదవండి: స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో కింగ్..జనవరి నుంచి ఆ స్మార్ట్ ఫోన్ ఇక కనిపించదు! -
చెదురుతున్న జ్ఞాపకాలు
బోస్టన్: ఫొటోల తరహాలోనే మన జ్ఞాపకాలు కూడా కాలక్రమేణా వాటి నాణ్యతను కోల్పోతాయని ఓ అధ్యయనంలో తేలింది. సాధారణంగా మనుషులు గతంలో చేసిన ఒక్కో ఘటనను ఒక్కో తరహాలో గుర్తుంచుకుంటారని ఈ పరిశోధనలో పాల్గొన్న బోస్టన్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ మౌరీన్ రిట్చీ తెలిపారు. గతంలో ఎదురైన పరిస్థితులను మరోసారి ఎదుర్కొన్నప్పుడు ఆ ఘటన తాలూకు ఎక్కువ విషయాలు మన మెదడులో నిక్షిప్తమవుతాయని వెల్లడించారు. మరికొన్ని సందర్భాల్లో మాత్రం ఈ జ్ఞాపకాలు స్పష్టత లేకుండా, తక్కువ వివరాలతోనే గుర్తుంటాయని పేర్కొన్నారు. ‘భావోద్వేగ’ అంశాల్లో ఎక్కువ స్పష్టత.. రోజువారీ పనులతో పోల్చుకుంటే కారు ప్రమాదం వంటి ఘటనలు వ్యక్తుల మెదళ్లలో బలంగా నిక్షిప్తమవుతాయని గతంలో నిర్వహించిన పరిశోధనలో తేల్చినట్లు రిట్చీ చెప్పారు. ఇలా స్పష్టమైన జ్ఞాపకాలు ఏర్పడటానికి ఆయా వ్యక్తులు వాటిని ఎలా గుర్తుంచుకున్నారు? ఏరకంగా గుర్తుంచుకున్నారు? అనే విషయాలకు మధ్య సంబంధాన్ని తెలుసుకునే దిశగా తమ పరిశోధన సాగిందని వెల్లడించారు. ఇందులో భాగంగా తాము మూడు పరిశోధనలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులకు మానసికంగా కలత కలిగించే చిత్రాలు, సాధారణ చిత్రాలను అందించామన్నారు. ఇవి వేర్వేరు రంగులు, నాణ్యతతో ఉన్నాయన్నారు. అనంతరం వారికి ఏం జ్ఞాపకం ఉందో చెప్పమని కోరగా నిజమైన చిత్రాలను తక్కువ నాణ్యతతో గుర్తుంచుకున్నట్లు తేలిందన్నారు. అలాగే మానసికంగా కలత కలిగించే చిత్రాలను చూసినవారు వాటిని అత్యంత కచ్చితత్వంతో గుర్తుంచుకున్నారనీ, వారి జ్ఞాపకాల నాణ్యత ఏమాత్రం తగ్గలేదని రిట్చీ చెప్పారు. ఫేడింగ్ ఎఫెక్ట్.. సాధారణ ఘటనలను గుర్తుంచుకునే క్రమంలో వాటికి సంబంధించిన చిన్నచిన్న అంశాలను మర్చిపోతారని రిట్చీ తెలిపారు. ఉదాహరణకు సంగీత విభావరికి వెళ్లిన వ్యక్తులు తమ ఇష్టమైన గాయకులను, సంగీతాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారన్నారు. అదే సమయంలో ఆ కార్యక్రమంలో వాతావరణం, లైట్లు, శబ్ద తీవ్రత చూచాయగా జ్ఞాపకం ఉంటాయన్నారు. ఇవి కాలక్రమేణా జ్ఞాపకాల నుంచి తొలగిపోతాయని వెల్లడించారు. దీన్ని ‘ఫేడింగ్ ఎఫెక్ట్’గా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. నిజ ఘటనలతో పోల్చుకుంటే ఏ జ్ఞాపకాలైనా తక్కువ కచ్చితత్వంతోనే మెదడులో నిక్షిప్తమవుతాయన్నారు. ఇలా జరిగినప్పటికీ భావోద్వేగాలకు సంబంధించిన జ్ఞాపకాలపై ఈ ఫేడింగ్ ఎఫెక్ట్ ఎలాంటి ప్రభావం చూపలేదని స్పష్టం చేశారు. -
కంప్యూటర్‌తో మతిమరుపు దూరం!
వాషింగ్టన్: కనీసం వారానికి ఒకసారి కంప్యూటర్ను వాడటం వలన వృద్ధులలో మతిమరుపు వచ్చే అవకాశం తగ్గుతోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. కంప్యూటర్ వాడకం, చదవటం, రాయటం లాంటి చర్యల ద్వారా మెదడు ఉత్తేజితమౌతుందని, తద్వారా మెదడు క్రియాశీలకంగా పనిచేస్తూ మానసికపరమైన సమస్యలు తగ్గిపోతున్నాయని అమెరికాకు చెందిన మయో క్లినిక్ వెల్లడించింది. మలి వయసులో ఎదుర్కొనే అనేక మానసిక సమస్యలకు ప్రధాన కారణం మెదడును క్రియాశీలకంగా ఉంచే మానసిక కార్యకలాపాల్లో పాల్గొనకపోవటమే అని పరిశోధనకు నేతృత్వం వహించిన క్రెల్ రోచ్ తెలిపారు. కంప్యూటర్ను వారానికి ఒక సారి వాడటం ద్వారా మానసిక రుగ్మతల భారీన పడే అవకాశం 42 శాతం తగ్గుతోందని, మేగజైన్లు చదవటం, సామాజిక కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించే వారిలో మతిమరుపు అవకాశం 30 శాతం మేర తగ్గుతోందని ఆయన తెలిపారు.