men molest women
-
మహిళలకు మాజీ మంత్రి షాకింగ్ సలహా
రాంపూర్: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆజంఖాన్ మరోసారి తనదైన శైలిలో వార్తలు నిలిచారు. అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరగకుండా ఉండాలంటే మహిళలు ఇళ్లలో ఉండటమే మేలు అని ఆయన షాకింగ్ సలహా ఇచ్చారు. తన జిల్లా రాంపూర్‌లో ఇద్దరు అమ్మాయిలను 14మంది ఆకతాయిలు అత్యంత దుర్మార్గంగా లైంగికంగా వేధించిన ఘటనకు సంబంధించిన వీడియో వెలుగుచూసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీలో యోగి సర్కారు వచ్చిన తర్వాత నేరాలు అమాంతం పెరిగిపోయాయని, శాంతిభద్రతలు క్షీణించాయని ఒకవైపు సమాజ్‌వాదీ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తుండగా అందుకు భిన్నంగా ఆజంఖాన్ స్పందించారు. 'రాంపూర్‌లో అమ్మాయిలను వేధించిన ఘటనలో ఆశ్చర్యపోవడానికేముంది. బీజేపీ ప్రభుత్వం వచ్చాక అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు పెరిగిపోయాయి' అని ఆయన అన్నారు. బులంద్‌షహర్ గ్యాంగ్‌రేప్ ఘటన తర్వాత మహిళలు ఇంట్లో ఉండేలా పురుషులు చూసుకోవడమే మంచిది. అమ్మాయిలు కూడా అసభ్య ఘటనలు చోటుచేసుకునే ప్రదేశాలకు వెళ్లకూడదు' అంటూ ఆయన సలహా ఇచ్చారు. 14 ఏళ్ల కూతురిని, తల్లిని గ్యాంగ్‌రేప్ చేసిన బులంద్‌షహర్ ఘటనపై అప్పట్లో మంత్రిగా ఉన్న ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అఖిలేశ్ ప్రభుత్వాన్ని బద్నా చేసే రాజకీయ కుట్రతోనే ఈ ఘటన జరిగిందని ఆయన పేర్కొనడం దుమారం రేపింది. -
అమ్మాయిలపై వేధింపుల షాకింగ్ వీడియో!
-
అమ్మాయిలపై వేధింపుల షాకింగ్ వీడియో!
రాంపూర్: పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఇద్దరు అమ్మయిలను 14 మంది ఆకతాయిలు అత్యంత కిరాతకంగా లైంగికంగా వేధించిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగుచూసింది. ఇద్దరు అమ్మాయిలను ఆకతాయిలు లైంగికంగా వేధించి.. అసభ్యంగా తాకుతూ, తిడుతూ అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించారు. అంతేకాకుండా ఈ ఘటనను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. రాంపూర్ జిల్లా తాండ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి.. ఇతర నిందితులను పట్టుకునేందుకు గాలింపులు చేపడుతున్నారు. ఆకతాయిల చేతిలో వేధింపులు ఎదుర్కొన్న ఇద్దరు బాధితులను సైతం గుర్తించారు. చుట్టూ చెట్లు ఉన్న పరిసరాల్లో బైకుల వచ్చినట్టు కనిపించిన ఆకతాయిల ఇద్దరు అమ్మాయిలపైనే చెలరేగిపోయారు. అత్యంత దుర్మార్గంగా ఓ అమ్మాయి పట్ల ప్రవర్తించారు. వారిని అసభ్యంగా తాకుతు, తోసేస్తూ, తిడుతూ కనిపించారు. నిస్సహాయస్థితిలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు కేకలు పెడుతూ, తమను విడిచిపెట్టాలని దీనంగా అర్థించారు. అయినా ఆ కిరాతకులు పట్టించుకోకుండా వారిని లైంగికంగా వేధించి.. తమలోని క్రూరత్వాన్ని చాటుకున్నారు. యూపీలో భారీ మెజారిటీతో బీజేపీకి చెందిన యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో నేరాలు అమాంతం పెరిగిపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్రంగా క్షీణిస్తుండటంతో ప్రతిపక్షాలు అదేపనిగా యోగి సర్కారుపై మండిపడుతున్నాయి.