merit
-
మిగిలిన గురుకుల పోస్టులను మెరిట్‌తో భర్తీ చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గురుకుల నియామకాల్లో మిగిలిపోయిన పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్ రిక్రూట్మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చి న ఉత్తర్వులను పాటించాలని సూచించింది. దీనిపై తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. విచారణను వచ్చే నెల 22వ తేదీకి వాయిదా వేసింది. అభ్యర్థులు పోస్టులు వదులుకోవడంతో..: గురుకులాల్లో డిగ్రీ అధ్యాపకులు, జూనియర్ లెక్చరర్లు, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ తదితర పోస్టుల భర్తీ కోసం 2023 ఏప్రిల్ 5న తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్లు ఇచ్చి ంది. అయితే ఈ నియామకాలను అవరోహణ క్రమంలో ఎగువ స్థాయి పోస్టులను ముందు, దిగువ స్థాయి పోస్టులను తర్వాత) చేపట్టాల్సి ఉన్నా.. ఒకేసారి అన్ని ఉద్యోగాల భర్తీ చేపట్టింది. దీనితో మూడు, నాలుగు పోస్టులకు ఎంపికైన మెరిట్ అభ్యర్థులు ముఖ్యమైన పోస్టులను ఎంచుకోగా.. మిగతా పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఇలా మిగిలిన పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్లకు చెందిన విజయ్ మనోహర్‌తోపాటు మరో 20 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది హిమాగ్జి వాదనలు వినిపిస్తూ.. నోటిఫికేషన్ ఇచ్చి న పోస్టులన్నీ భర్తీ కాకుండా మిగిలిపోతే, వాటిని తదుపరి మెరిట్ అభ్యర్థులతో నింపవచ్చని గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. పిటిషనర్లు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఈ మేరకు వినతిపత్రం కూడా అందజేశారని కోర్టుకు విన్నవించారు. బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారని.. మిగిలిన ఖాళీల్లో పిటిషనర్లను భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే తదుపరి గురుకుల నియామక ప్రక్రియపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. -
చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన కూలీ బిడ్డ..
హుజూర్నగర్/మంచిర్యాల అర్బన్/సాక్షి, హైదరాబాద్: రెక్కాడితే గానీ కడుపునిండని పేదరికం. అయినా వారి చదువుకు పేదరికం అడ్డుకాలేదు. కష్టాలను దిగమింగి మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఇంటరీ్మడియట్ పరీక్షల్లో సత్తా చాటారు. సంపదకు, సరస్వతీ కటాక్షానికి సంబంధం లేదని నిరూపించారు. ప్రభుత్వ కాలేజీలో చదివి ప్రతిభాపాటవాలను కనబర్చిన ఈ విద్యార్థులను పలువురు అభినందించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిరుపేద కుటుంబానికి చెందిన సీఎస్వీ వైష్ణవిదేవి ఎంపీసీలో 1000 మార్కులకు 991 మార్కులు సాధించి ఔరా అనిపించింది. వైష్ణవి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివింది. వైష్ణవి తండ్రి సీఎస్ సురేంద్ర కుమార్ పెయింటర్ కాగా, తల్లి రాజమణి గృహిణి. ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమని ఆమె చెప్పింది. కూలీ బిడ్డ... మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా క్రిష్ణాకాలనీలో ఓ చిన్న గదిలో ఆకుల లక్ష్మీ.. కుతూరు శిరీష, కుమారుడు శివసాయికుమార్‌తో కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. శిరీష మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్‌లో మల్టీ పర్పస్‌హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ) కోర్సులో చేరింది. ఇంకోవైపు బ్రిడ్జి కోర్సు బైపీసీ కూడా చదువుతుంది. ఇంటర్ ఫలితాల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూలో 500 మార్కులకుగాను 495 సాధించింది. బైపీసీ తర్వాత బీకాం చేసి సీఏ కావాలన్నదే లక్ష్యమని శిరీష తెలిపింది. అత్యధికం 994! ఇంటర్లో 994 మార్కులు టాప్‌ర్యాంక్‌గా నమోదైనట్టు తెలిసింది. బాన్సువాడకు చెందిన అక్రమహబీన్ అనే విద్యార్థిని 994 మార్కులు సాధించింది. ఎంపీసీలో వరంగల్‌కు చెందిన పూజా, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోల్‌కు చెందిన పి.రాజేశ్ కూడా 994 మార్కులు సాధించాడు. వీరు ప్రైవేటు కాలేజీల్లో చదివారు. ఈసారి ఇంటర్ బోర్డ్ కేవలం ప్రభుత్వ కాలేజీల్లో అత్యధిక మార్కులు సాధించిన టాపర్ల జాబితాను మాత్రమే విడుదల చేసింది. ప్రైవేటు కాలేజీలతో కలుపుకుని రాష్ట్రంలో టాపర్లు ఎవరన్నది ప్రకటించలేదు. ► నిజామాబాద్‌కు చెందిన ఆరెపల్లి దీక్షిత ఎంపీసీలో 992 మార్కులు సాధించింది. ఆమె తల్లిదండ్రులు రమేశ్, భాగ్య ముంబైలో రజక వృత్తిలో ఉండగా, దీక్షిత స్థానికంగా బంధువుల వద్ద ఉంటూ చదుకుంటోంది. ► జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పాటిల్ వర్ష (బైపీసీ), సీహెచ్ రష్మిత (ఎంపీసీ) 992 మార్కులు సాధించారు. ► ఖమ్మంలోని ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ చదువుతున్న తప్పేట రోహిణి 990 మార్కులు సాధించింది. ► సత్తుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ ద్వితీయ సంవత్సరం హెచ్ఈసీ విద్యారి్థని దాసరి సిరి వెయ్యి మార్కులకు గాను 972 మార్కులు సాధించింది. ఆమె తండ్రి దాసరి ధర్మయ్య లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, తల్లి స్వప్న గృహిణి. ► నిర్మల్ జిల్లా భైంసా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉర్దూ మీడియం విద్యారి్థనులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. సెకండియర్ ఎంపీసీలో జవేరియా ఫిర్దోస్ నబా 990/1000 మార్కులు సాధించగా, ఫస్టియర్‌కు చెందిన అదీబానాజ్ 462/470 మార్కులు సాధించింది. చదవండి: అమ్మాయిలదే హవా -
రాహుల్‌పై స్మృతి ఇరానీ వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలను ఉద్దేశించి.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి స్మృతి ఇరానీ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు నవభారత నిర్మాణానికి కృషి చేస్తోందని, ఈ నవభారతంలో వారసత్వం కన్నా ప్రతిభకే పెద్దపీట వేస్తామని, ప్రతిభా ఆధారంగానే ప్రతి ఒక్కరికీ అవకాశాలు లభిస్తాయని అన్నారు. 'ఇండియా టుడే మైండ్ రాక్స్-2017' కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 'ఢిల్లీలో తమ కుటుంబాల కోసం కష్టపడి పనిచేసేవారికి ఎప్పుడూ ఓ బెరుకు ఉంటుంది. ఎవరో ఒకరు వచ్చి 'మా నాన్న ఎవరో మీకు తెలుసు కదా' అని అడుగుతారని.. ప్రతిభ ఆధారంగా కాకుండా వారసత్వం ఆధారంగా అవకాశాలు తన్నుకుపోతారని భయం ఉంటుంది. కానీ, మోదీ నవభారతంలో ఇలా చెప్తే కుదరదు' అని స్మృతి ఇరానీ తెలిపారు. 'కలలు కనే సాహసం, ప్రతిభా ఆధారంగా వాటిని సాధించుకొనే తెగువ ఉన్నవారిదే ఈ నవభారతం' అని ఆమె వివరించారు. రాజకీయాల్లోకి రావాలన్న ఇష్టమున్న యువత ఎవరైనా ఈ రంగాన్ని ఎంచుకోవచ్చా? లేక రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నవారే రావాలా? అన్న వ్యాఖ్యాత ప్రశ్నకు ఆమె ఈ విధంగా బదులిచ్చారు. -
అయ్యో!
– చేతిదాక వచ్చి ఇమాంబీకి దక్కని పోస్టు – మెరిట్జాబితాలో పేరున్నా కానిస్టేబుల్ పోస్టు గల్లంతు – బీసీ–ఈ కేటగిరిలో 83 మార్కులకే పోస్టు – ఈ యువతికి 90 మార్కులొచ్చినా దక్కని ఉద్యోగం కోవెలకుంట్ల: ఎలాగైనా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఆ యువతి నిరంతరం శ్రమించింది. ప్రాథమిక పరీక్ష, ఈవెంట్స్, మెయిన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. మెరిట్ జాబితాలో పేరు ఉండటంతో పోస్టు గ్యారెంటీ అని ఆ యువతితో పాటు కుటుంబసభ్యులు సంతోషపడ్డారు.అయితే, రిక్రూట్మెంట్ బోర్డు తప్పిదం పోస్టు చేజారేలా చేసి వారికి నిరాశమిగిల్చింది. వివరాల్లోకి వెళితే.. కోవెలకుంట్ల మండలంలోని వెలగటూరు గ్రామానికి చెందిన షేక్ ఖాదర్‌బాషా కుమార్తె షేక్ చిన్న ఇమాంబీ 2016 సంవత్సరంలో ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేసుకుని ప్రాథమిక పరీక్ష, ఈవెంట్స్ పూర్తి చేసుకుంది. మెయిన్ పరీక్షలో 90 మార్కులు సాధించి మెరిట్ జాబితాలో చేరింది. సివిల్ పోస్టుకు 90 మార్కులు, ఏఆర్ కానిస్టేబుల్పోస్టుకు సంబంధించి 94 మార్కులు వచ్చాయి. బీసీ–ఈ కేటగిరీలో మహిళా కోటాలో 83 మార్కులకే పోస్టును కేటాయిస్తూ కానిస్టేబుల్ పోస్టుల ఎంపిక జాబితాను రిక్రూట్‌బోర్డు ప్రకటించింది. ఆ జాబితాలో ఇమాంబీ పేరు లేదు. 83 మార్కులకే పోస్టు రాగా 90 మార్కులు వచ్చినా ఎంపిక జాబితాలో పేరు లేకపోవడంతో ఆందోళన చెందిన ఇమాంబీ తల్లిదండ్రులు జిల్లా ఎస్పీ ఆకేరవికృష్ణను కలిసి వివరాలు అందజేశారు. రిక్రూట్మెంట్ బోర్డు నిర్వాకంతో చేతిదాక వచ్చిన పోస్టు దక్కకుండా పోయిందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. న్యాయం చేయండి సారూ.. ఖాదర్‌బాషా గౌండా పనిచే సుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుమార్తెకు కానిస్టేబుల్ పోస్టు వస్తుందని ఆనందపడగా బోర్డులో చోటు చేసుకున్న తప్పిదంతో పోస్టు చేజారింది. మొదట రిక్రూట్మెంట్ అధికారులు క్రిమిలేయర్ సర్టిఫికెట్ అవసరం లేదని చెప్పి తర్వాత సర్టిఫికెట్ మెలిక పెట్టారని ఇమాంబీ ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేసి కానిస్టేబుల్ పోస్టుకు ఎంపిక చేయాలని ఆ యువతి తల్లిదండ్రులు రిక్రూట్మెంట్ అధికారులను కోరుతున్నారు. -
ఎస్ఐల ప్రొవిజినల్ జాబితా విడుదల
అభ్యంతరాలుంటే 27వ తేదీ నుంచి సంప్రదించాలని డీఐజీ సూచన కర్నూలు: ఎస్సీటీ-2016 ఎస్ఐల నియామకానికి సంబంధించిన మెరిట్ జాబితా కటాఫ్ మార్కులు, ప్రొవిజినల్ సెలక్షన్ జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి అభ్యంతరాలుంటే సోమవారం నుంచి కార్యాలయంలో సంప్రదించాలని కర్నూలు డీఐజీ రమణకుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నాల్గవ జోన్ పరిధిలోని అభ్యర్థులు తన కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా సూచించారు. -
తప్పుల తడకగా మెరిట్ జాబితా
– వైద్య ఆరోగ్యశాఖలో నిర్లక్ష్యం – పీహెచ్సీ అభ్యర్థుల ఆందోళన కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో కొత్తగా మంజూరైన నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేందుకు పలు పోస్టులకు అధికారులు వెల్లడించిన మెరిట్ జాబితా తప్పుల తడకగా మారింది. ప్రతి పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్, ఫార్మాసిస్టు, స్టాఫ్‌నర్సు, ల్యాబ్‌టెక్నీషియన్ పోస్టులకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. 12 స్టాఫ్‌నర్సు పోస్టులకు 1,406 మంది, నాలుగు ఫార్మాసిస్టు పోస్టులకు 600 మంది, నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు 600 మంది, 8 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 100 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల దరఖాస్తుల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు మెరిట్ జాబితాను తయారు చేసి ఈ నెల 13వ తేదీన వెబ్సైట్లో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రదర్శించారు. కాగా ఈ మెరిట్ జాబితాపై పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై డీఎంహెచ్‌వో కార్యాలయ ఏడీ కృష్ణప్రసాద్‌ను వివరణ కోరగా తక్కువ సమయంలో మెరిట్ జాబితాను తయారు చేయడం వల్ల కొన్ని తప్పులు దొర్లి ఉంటాయని, అందుకే మెరిట్ జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తున్నామన్నారు. అభ్యంతరాల ఆధారంగా జాబితాను మళ్లీ మారుస్తామని తెలిపారు. తప్పుల తడకగా మెరిట్ జాబితా 1. కర్నూలు నగరానికి చెందిన పి.హుసేన్ కుమార్తె పి.షరీఫా వాస్తవంగా బీసీ–బి అయితే మెరిట్ జాబితాలో ఆమెను బీసీ–డీగా చూపారు. అంతేగాక ఆమెను అతడుగా మార్చేశారు. 2. సీరియల్ నెంబర్ 332లోని బి.బాలరాజు డీఎంఎల్టీ చదివి ల్యాబ్‌టెక్నీషియన్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. అతను 2009 జూన్‌లో కోర్సు పూర్తి చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏడేళ్లు పూర్తయ్యింది. కానీ అధికారులు మాత్రం ఆరేళ్లుగా చూపారు. 3. సీరియల్ నెంబర్ 356లోని పుల్లూరు సుధాకర్ ఒకేషనల్‌లో ఎంఎల్టీ పూర్తి చేశారు. అతని సరాసరి మార్కులు వెయ్యి కాగా 550కి చూపారు. అది కూడా 550 మార్కులకు అతనికి 560 మార్కులు వచ్చాయని పేర్కొన్నారు. 4. సీరియల్ నెంబర్ 34 బీఎన్ఎస్ గౌరికుమారి బిఎస్సీ ఎంఎల్టీ పూర్తి చేశారు. ఆమె సరాసరి మార్కులు 1450 కాగా అధికారులు మాత్రం 1150గా చూపించారు. -
ఒలింపియాడ్‌లో ఎంపీఎస్ విద్యార్థుల ప్రతిభ
మెుదటి ర్యాంకర్ శ్రీమహాలక్ష్మికి స్వర్ణపతకం సాయిభార్గవికి 7, హర్షిత్‌కు 10 ర్యాంకులు మండపేట : సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో గత ఫిబ్రవరిలో జరిగిన ఒలింపియాడ్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన తమ విద్యార్థులు పలు పతకాలు అందుకున్నట్టు పట్టణానికి చెందిన మండపేట పబ్లిక్ స్కూల్ (ఎంపీఎస్) కరస్పాండెంట్ వల్లూరి చిన్నారావు తెలిపారు. 9వ తరగతి విద్యార్థిని ఎ.శ్రీమహాలక్ష్మి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించిందన్నారు. గురువారం నెల్లూరు టౌన్‌హాలు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీడా రవిచంద్ర, నెల్లూరు ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ యాదవ్‌ల చేతుల మీదుగా బంగారు పతకం, నగదు బహుమతి అందుకున్నట్టు తెలిపారు. 5వ తరగతి చదువుతున్న డి.వీరసాయి భార్గవి రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంకు, 8వ తరగతి విద్యార్థి సీహెచ్ హర్షిత్ 10వ ర్యాంకు సాధించి, బహుమతులు అందుకున్నారన్నారు. పతకాలు సాధించిన విద్యార్థులను చిన్నారావు, స్కూల్ ఉపాధ్యాయులు అభినందించారు. -
సీఎంఏలో గుంటూరు విద్యార్థిని ప్రతిభ
గుంటూరు: సీఏ కోర్సుల ఫలితాల్లో గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థిని ముళ్లపూడి దీప్తి ఉత్తమ ప్రతిభ కనబరుస్తోంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ప్రకటించిన సీఎంఏ ఫైనల్ ఫలితాల్లో బాలికల విభాగంలో జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. సీఏ ప్రవేశ పరీక్ష అయిన సీఏ-సీపీటీలో జాతీయస్థాయిలో 9వ ర్యాంకు, ఐసీడబ్ల్యుఏ ఇంటర్లో 10వ ర్యాంకు కైవసం చేసుకుంది. సీఎంఏ ఫైనల్ గ్రూప్-3తోపాటు, ఫైనాన్షియల్ ఎనాలసిస్-బిజినెస్ వాల్యూయేషన్ పేపర్లో మహిళా విభాగంలో అత్యధిక మార్కులు సాధించి, సీఎంఏ ఫైనల్లో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా కోల్‌కత్తాలోని ఐసీఏఐ సంస్థ మార్చి 20న జరగనున్న సీఏ విద్యార్థుల కాన్వొకేషన్లో దీప్తికి రజత పతకంతో పాటు, డాక్టర్ అజిత్ సింఘ్వయ్ బంగారు పతకం, నార్తర్న్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ మెరిట్ అవార్డు బుక్ ప్రైజ్ బహుకరించనుంది. -
రేపట్నుంచి మెడికల్ అడ్మిషన్ కౌన్సిలింగ్!
హైదరాబాద్: మెడికల్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ను శనివారం నుంచి నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మెడికల్ కౌన్సిలింగ్ సెప్టెంబర్ 5 తేది వరకు కొనసాగుతుందని తెలిపారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, హైదరాబాద్, వరంగల్ పట్టణాల్లో మెడికల్ కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. శనివారం మెరిట్ ఆధారంగా ఓపెన్ కేటగిరిలో 1 నుంచి 1500 ర్యాంక్ సాధించిన అభ్యర్థులకు మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.