గుంటూరు: సీఏ కోర్సుల ఫలితాల్లో గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థిని ముళ్లపూడి దీప్తి ఉత్తమ ప్రతిభ కనబరుస్తోంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ప్రకటించిన సీఎంఏ ఫైనల్ ఫలితాల్లో బాలికల విభాగంలో జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. సీఏ ప్రవేశ పరీక్ష అయిన సీఏ-సీపీటీలో జాతీయస్థాయిలో 9వ ర్యాంకు, ఐసీడబ్ల్యుఏ ఇంటర్‌లో 10వ ర్యాంకు కైవసం చేసుకుంది.
సీఎంఏ ఫైనల్ గ్రూప్-3తోపాటు, ఫైనాన్షియల్ ఎనాలసిస్-బిజినెస్ వాల్యూయేషన్ పేపర్‌లో మహిళా విభాగంలో అత్యధిక మార్కులు సాధించి, సీఎంఏ ఫైనల్‌లో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా కోల్‌కత్తాలోని ఐసీఏఐ సంస్థ మార్చి 20న జరగనున్న సీఏ విద్యార్థుల కాన్వొకేషన్‌లో దీప్తికి రజత పతకంతో పాటు, డాక్టర్ అజిత్ సింఘ్వయ్ బంగారు పతకం, నార్తర్న్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ మెరిట్ అవార్డు బుక్ ప్రైజ్ బహుకరించనుంది.