సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. స్వతంత్ర్య సమరయోధుల ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీ నేతలు. రిపబ్లిక్ డే సందర్బంగా జాతీయ జెండాను మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక, ఏపీలోని పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ సమానంగా ఎదగాలనే దృక్పథంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాం. పేదరికం లేని సమాజం కోసం మనమంతా కృషిచేయాలి. మనల్ని మనం పరిపాలించుకుంటూ ఎంతో పురోభివృద్ధిలోకి వెళుతున్నాం. బ్రిటీష్ పాలకుల నుంచి విముక్తి కోసం బానిస సంకెళ్ళు తెంచుకుని పరిపాలించుకోవాలని అనేక మంది పోరాటాలు చేశారు.
ఈ క్రమంలో మనల్ని మనం పరిపాలించుకునే సర్వసత్తాక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకున్నాం. అందరూ సమానంగా ఎదగాలనే దృక్పథంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలను మన పాలనలో చూశాం. ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా ఎదగాలనే మన ప్రయత్నం కొనసాగించాలి. పేదరికాన్ని పారద్రోలి స్వతంత్ర భారతాన్ని నిర్మించుకోవడానికి మనమంతా కృషిచేయాలని పార్టీ తరఫున ప్రజలకు విజ్క్షప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా వేడుకల్లో పార్టీ నేతలు పాల్గొన్నారు.
విశాఖలో వేడుకలు..
విశాఖలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండానుమాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించారు. అనంతరం అమర్నాథ్ మాట్లాడుతూ..‘మన రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులో లేదు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. రాష్ట్ర ప్రజల హక్కులను వైఎస్సార్‌సీపీ కాపాడుతుంది. విజయసాయి రెడ్డి రాజీనామా గురించి ఆయనే చెప్పారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని మాట్లాడారు. తన లాంటి వారిని వెయ్యి మందిని తయారు చేయగలరని సాయిరెడ్డి చెప్పారు.
నాయకులను ఏ విధంగా తయారు చేయాలో వైఎస్ జగన్‌కు తెలుసు. వైఎస్ జగన్ ఒక టార్చ్‌బేరర్. చంద్రబాబు మీద నమ్మకం లేకనే గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు నలుగురు టీడీపీని వీడిచారా. నాయకుల మీద రాజకీయంగా ఒత్తిడి ఉంటుంది. కొంతమంది తట్టుకుంటారు మరి కొంతమంది తట్టుకొని నిలబడలేరు. పెట్టుబడులు రాకపోయేసరికి దావోస్ పర్యటనపై చంద్రబాబు మాట మార్చారు. దావోస్ పర్యటన ఒక మిథ్య అంటూ మాట్లాడుతున్నారు. పదిసార్లు దావోస్ వెళ్లి వచ్చిన తరువాత మిథ్య అని తెలిసిందా? అంటూ ప్రశ్నించారు.
విజయవాడలో..
విజయవాడలో జాతీయ జెండా ఎగురవేసిన సెంట్రల్ నియోజకవర్గ మాజీ MLA మల్లాది విష్ణు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ..‘రాజ్యాంగ అమలు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా లేదు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులు రాజ్యమేలుతున్నాయి. రాజ్యాంగానికి అనుగుణంగా పని చేయాల్సిన సంస్థలు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. గవర్నర్ చేత ప్రభుత్వం అన్ని అబద్దాలు చెప్పించింది.
దావోస్ పర్యటనలో ఒక్క పరిశ్రమ రాలేదు. పరిశ్రమలు తీసుకురాకుండా ఎదురుదాడి చేస్తున్నారు. షేక్ హాండ్స్ కోసం కాదు దావోస్‌కు వెళ్లేది. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని నేడు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. మూడు పార్టీలు భిన్నమైన ఆలోచనతో ముందుకు వెళ్తున్నాయి. ఓటు ద్వారా, నియంతృత్వం ద్వారా ఓటు హక్కును వినియోగించుకొన్నామని చెప్పే వాళ్ళు ముందుకు రావాలి.. ప్రభుత్వాన్ని ప్రశించాలి. విద్య, వైద్యాల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఆసుపత్రుల్లో పిల్లలను ఎత్తుకెళ్తున్నారు.. కనీసం మందులు కూడా లేవు. వ్యవస్థలను ప్రక్షాళన చేయాలి. తప్పులు ఎవరు చేస్తున్నారు, ఎవరు అబద్ధాలు, ఎవరు ప్రజల్లో మోసం చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి అని కామెంట్స్ చేశారు.
వైఎస్సార్ జిల్లాలో..
వైఎస్ఆర్ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండా ఎగురవేసిన జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష, మేయర్ సురేష్ బాబు. ఈ సందర్భంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ జిల్లాలో..
ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది త్యాగం ఫలితంగా ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. గత ఐదేళ్లలో అంబేద్కర్, మహాత్మా గాంధీ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లిన నాయకుడు వైఎస్ జగన్. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సుసాధ్యం చేసిన వ్యక్తి వైఎస్ జగన్. రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడంలో వైఎస్ జగన్ అడుగుజాడల్లో మేము వెళ్తాం అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment