సమైక్య గర్జన... భద్రత గుప్పిట్టో హస్తిన
న్యూఢిల్లీ: సమైక్యాంధ్ర ఆందోళనల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భారీ స్థాయిలో పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా పలు మెట్రోస్టేషన్ల మూసివేశారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, కేంద్రమంత్రుల ఇళ్ల వద్ద పోలీస్ బందోబస్తు పటిష్టం చేశారు.
పార్లమెంట్‌కు వెళ్లే రహదారుల్లో రాపిడ్ యాక్షన్ బలగాలను పెద్ద సంఖ్యలో మొహరించారు. ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాటర్‌కెనాన్, వజ్ర వాహనాలు అందుబాటులో ఉంచారు. పార్లమెంట్ వైపునకు సమైక్యవాదులు వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో భద్రత కట్టుదిట్టం చేశారు.