mh 17
-
ఆ విమానాలకే ఎందుకలా జరుగుతోంది?
కౌలంపూర్: మలేసియా విమానాలకే ఎందుకిలా జరుగుతోంది- విమాన ప్రయాణికులను తొలుస్తున్న ప్రశ్న ఇది. ఏడాది కాలంలో మలేసియాకు చెందిన మూడు విమానాలు విషాదానికి కారణమయ్యాయి. ఈ ఏడాది మార్చి 8న మలేసియా ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్ 370 కనిపించకుండాపోయింది. పది నెలలు గడుస్తున్నా ఈ విమానం ఆచూకీ ఇంతవరకు కనిపెట్టలేకపోయారు. ఇందులో ఉన్న 237 మంది మృతి చెందినట్టు ప్రకటించారు. మలేసియా ఎయిర్ లైన్స్ కే చెందిన ఎమ్ హెచ్ 17 విమానాన్ని జూలై 17న ఉక్రెయిన్ గగనతలంలో రష్యా అనుకూల తిరుగుబాటుదారులు కూల్చివేశారు. ఈ దారుణ ఘటనలో మొత్తం 298 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మలేసియాకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా విమానం 162 మందితో గగన తలంలో అదృశ్య కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళుతూ క్యూజెడ్8501 విమానం ఆకాశమార్గంలో అదృశ్యమైంది. బెలిటంగ్ ద్వీపం తూర్పు తీరంలో ఈ విమానం కూలిపోయిందని ధ్రువీకరించిన వార్తలు వస్తున్నాయి. మలేసియాకు చెందిన విమానాలకు వరుస ప్రమాదాలు ఎదురవుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దేశపు విమానాలకే ఎందుకిలా జరుగుతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
నీడలా వెంటాడుతున్న విమాన ప్రమాదాలు
హైదరాబాద్: అందేంటోగాని ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణీకులను ప్రమాదాలు నీడలా వెంటాడుతున్నాయి .... ఓ విమానం అదృశ్యమైంది... దాని జాడ ఇప్పటికి తెలియలేదు. మరో విమానాన్ని వేర్పాటు వాదులు క్షిపణులతో కూల్చివేశారు. మరో విమానం అదృశ్యం. అలాగే మరో విమానం కుప్పకూలింది. ఆదివారం ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం క్యూజెడ్ 8501 గగనతలం నుంచి అదృశ్యమైంది. సురబయా నుంచి సింగపూర్ బయలుదేరిన ఈ విమానం కొద్ది సేపటికే విమానాశ్రయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయని ఇండొనేసియా మీడియా ప్రకటించింది. ఈ అదృశ్యమైన విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలపి 162 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది వరుసగా ... *మార్చి 8వ తేదీన ఎమ్హెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు బయలుదేరింది. ఈ విమానం బయలుదేరిన కొద్ది గంటకే ఆ విమానం కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ రాడార్ స్క్రీన్ నుంచి మాయమైంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 225 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది మొత్తం 237 మంది గల్లంతయ్యారు. ఆ విమాన ఆచూకీ కోసం... ప్రపంచదేశాలు ఏకమై జల్లెడ పట్టిన ఇంత వరకు ఆ విమానం జాడ తెలియలేదు. * జూలై 17న ఎమ్ హెచ్ 17 విమానం నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టర్డామ్ నుంచి మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు బయలుదేరింది. ఈ విమానం ఉక్రెయిన్ గగనతలంలోకి ప్రవేశించగానే ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారుల శక్తిమంతమైన క్షిపణితో దాడి చేశారు. దాంతో విమానం కుప్పకూలింది. ఈ విమాన ప్రమాదంలో మొత్తం 298 మంది మరణించారు. * జూలై 23న ట్రాన్స్‌ఏసియా ఎయిర్వేస్ విమానం తైవాన్‌లో కుప్పకూలింది.ఈ దుర్ఘటనలో 51 మంది మరణించారు. * ఆగస్టు 10న టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయం నుంచి దక్షిణ ఖొరసాన్ ప్రావిన్స్ లోని టబాస్ నగరానికి బయలుదేరిన టబాన్ ఎయిర్ లైన్స్ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందారు. * ఆగస్టు 25న ఎండీ -83 బుర్కినా ఫాసో రాజధాని ఔగాడౌగో నుంచి అల్జీరియా రాజధాని అల్జీర్స్‌కు విమానం బయలుదేరింది. విమానం బయలుదేరిన 50 నిమిషాల అనంతరం ఏటీసీతో సంబంధాలు తెగిపోయింది. విమానంలో 50 మందికిపైగా ఫ్రాన్స్ జాతీయులు, 27 మంది బుర్కినా ఫాసో జాతీయులతోపాటు మరో 12 దేశాలకు చెందిన ప్రయాణికులు మృతి చెందారు. -
370... 130... 17
అదేంటో గాని మలేషియా ఎయిర్ లైన్స్ విమానాలని ప్రమాదాలు నిడలా వెంటాడుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానం మన జ్ఞాపకాల దొంతర నుంచి చెరిగిపోక మునుపే గురువారం సాయంత్రం ఎమ్హెచ్ 17 విమానం కుప్పకూలింది. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ బయలుదేరిన విమానం గురువారం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్ సమీపంలో తిరుబాటుదారులు క్షిపణులతో పేల్చివేశారు. ఆ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 280, సిబ్బంది 15 మంది మొత్తం 295 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విమానంలోని మృతుల్లో అత్యధికులు అంటే సగానికి సగం మంది డచ్ దేశానికి చెందిన వారే ఉన్నారు. ఈ ఏడాది మార్చి 8వ తేదీన ఎమ్హెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు బయలుదేరింది. బయలుదేరిన కొద్ది గంటకే ఆ విమానం కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ రాడార్ స్క్రీన్ నుంచి మాయమైంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 225 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది మొత్తం 237 మంది గల్లంతయ్యారు. ఆ విమాన ఆచూకీ కోసం... ప్రపంచదేశాలు ఏకమై జల్లెడ పట్టిన ఇంత వరకు ఆ విమానం జాడ దొరకలేదు. దాంతో తమ బంధువుల ఆచూకీ తెలుసుకోవడంతో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమాన ప్రయాణికుల బంధువులు స్నేహితులు మలేషియా ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. మలేషియా ప్రభుత్వానికి ఎమ్హెచ్ 370 విమానం ఆచూకీ కనుగోవడం పెద్ద తల నొప్పిగా తయారైంది. అంతలో నిన్న సాయంత్రం మరో విమానం ప్రమాదం జరగడంతో మలేషియా ప్రభుత్వం తీవ్ర ఆందోళనలో ఉంది. ఈ రెండు విమాన ప్రమాదాలు కేవలం 130 రోజులు తేడాలో జరిగాయి. -
అతనికి విమానం కూలుతుందని ముందే తెలుసా?
విమానం ఎక్కే ముందు ఆ ప్రయాణికుడు ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టాడు. "విమానానికి ఏదైనా అయితే ఇదిగో నేనెక్కిన విమానం ఇలా ఉంటుంది" అంటూ పోస్టు చేశాడు అతను. కొద్ది గంటల తరువాతే అతను ప్రయాణిస్తున్న విమానం ఉక్రేన్ గగనతలం నుంచి భూతలానికి నిప్పురవ్వలా రాలిపోయింది. దాంతో అతని ప్రాణాలు కూడా అనంతవాయువుల్లో కలిసిపోయాయి. కోర్ పాన్ అనే డచ్ ప్రయాణికుడు ఉక్రేన్ లో కుప్పకూలిన విమానంలో ప్రయాణించి, కౌలాలంపూర్ కి బయలుదేరాడు. విమానం ఎక్కడానికి క్షణాల ముందు విమానం ఫోటో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. హిందూ మహాసముద్రంలో కుప్పకూలిన ఎం హెచ్ 370 గుర్తుకొచ్చిందేమో, కాస్త సరదాగా ఓ కామెంట్ కూడా పెట్టాడు. దానికి మిత్రుల నుంచి కామెంట్లు కూడా వచ్చాయి. ఆ తరువాత కాస్సేపటికే ప్రమాదం జరగడంతో మిత్రుల కామెంట్లు వేళాకోళం నుంచి విషాదానికి మారాయి. కోర్ పాన్ తో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ నీల్ ట్యే తోలా కూడా అదే విమానంలో ఉంది. కలసి చేసిన ప్రయాణమే వారి ఆఖరి ప్రయాణంగా మారింది.