MI vs GT
-
GT VS MI: మొదటి మ్యాచ్‌కు ముందే 'ఆ' నిర్ణయం తీసుకున్నాం.. ప్రసిద్ద్ బౌలింగ్ అద్భుతం: గిల్
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (మార్చి 29) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ అన్ని విభాగాల్లో సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్‌కు దిగి భారీ స్కోర్ (196/8) చేసిన ఆ జట్టు.. ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాప్-3 బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తన క్లాస్‌ను ప్రదర్శించాడు. శుభ్‌మన్ గిల్ (27 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), జోస్ బట్లర్ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్) భారీ స్కోర్లు చేయకపోయిన బాగా ఆడారు. స్లోగా ఉన్న పిచ్‌పై ఈ ముగ్గురు సూపర్‌గా బ్యాటింగ్ చేశారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా (4-0-29-2) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బౌల్ట్ (4-0-34-1), దీపక్ చాహర్ (4-0-39-1), సాంట్నర్ (3-0-25-0) పర్వాలేదనిపించగా.. ముజీబ్ రెహ్మాన్ (2-0-28-1), యువ పేసర్ సత్యనారాయణ రాజు (3-0-40-1) భారీగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆదిలోనే తడబడింది. సిరాజ్ తొలి ఓవర్లోనే ముంబైని దెబ్బకొట్టాడు. రెండు బౌండరీలు బాది జోరుమీదున్న రోహిత్ శర్మను (8) క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం ఐదో ఓవర్లో సిరాజ్ మరోసారి చెలరేగాడు. ఈసారి మరో ఓపెనర్ రికెల్టన్ను (6) రోహిత్ తరహాలోనే క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆతర్వాత క్రీజ్‌లోకి వచ్చిన తిలక్ వర్మ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 48; ఫోర్, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ దశలో గుజరాత్ ప్రస్దిద్ద్ కృష్ణను బరిలోకి దించింది. ప్రసిద్ద్ అద్భుతంగా బౌలింగ్ చేసి క్రీజ్‌లో కుదురుకున్న తిలక్, స్కైలను ఔట్ చేశాడు. ఇక్కడే ప్రసిద్ద్ ముంబై చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.ప్రసిద్ద్ అద్భుతమైన స్లో బాల్స్‌తో ముంబై బ్యాటర్లను ఇరుకునపెట్టాడు. తిలక్, స్కై ఔటయ్యాక హార్దిక్ బ్యాటింగ్‌కు దిగకుండా రాబిన్ మింజ్‌ను పంపి తప్పు చేశాడు. మింజ్ (6 బంతుల్లో 3), హార్దిక్ (17 బంతుల్లో 11) బంతులు వృధా చేసి ముంబై ఓటమిని ఖరారు చేశారు. ఆఖర్లో నమన్ ధీర్ (11 బంతుల్లో 18 నాటౌట్), సాంట్నర్ (9 బంతుల్లో 18 నాటౌట్) భారీ షాట్లు ఆడినా అప్పటికే ముంబై ఓటమి ఖరారైపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసిన ప్రసిద్ద్ కృష్ణకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గుజరాత్ బౌలరల్లో ప్రసిద్ద్, సిరాజ్ చెరో 2, రబాడ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్ ఈ సీజన్లో బోణీ కొట్టింది. ముంబై వరుసగా తమ రెండో మ్యాచ్‌లో కూడా పరాజయంపాలైంది.మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ మ్యాచ్‌ను బ్లాక్ సాయిల్ పిచ్‌పై ఆడాము. ఇది మాకు కలిసొచ్చింది. మొదటి మ్యాచ్‌కు ముందే ఈ పిచ్‌పై ఆడాలని నిర్ణయించుకున్నాము. ఈ వికెట్ మాకు సూటైంది. బంతి పాతబడిన తర్వాత ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం కష్టం. అందుకే పవర్ ప్లేలోపే వీలైనన్ని పరుగులు సాధించేందుకు ప్రయత్నించాము. మనందరం ప్రణాళికలు వేసుకుంటాము. కొన్ని వర్కౌట్ అవుతాయి. మరికొన్ని కావు. రషీద్ ఖాన్‌ను తన కోటా నాలుగు ఓవర్లు వేయించకపోవడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. వాస్తవానికి రషీద్‌ను ఆఖర్లో బౌలింగ్ చేయిద్దామనే అనుకున్నాను. కానీ పేసర్లు బాగా బౌలింగ్ చేస్తుండటంతో అతన్ని బరిలోకి దించలేదు. ప్రసిద్ద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. -
GT VS MI: మేము ప్రొఫెషనల్‌గా ఆడలేదు.. రెండిటిలోనూ విఫలమయ్యాం: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్-2025లో భాగంగా నిన్న (మార్చి 29) గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. హోం గ్రౌండ్లో (అహ్మదాబాద్) జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ ముంబైని చిత్తు చేసింది. స్లోగా ఉన్న పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ (196/8) చేసిన గుజరాత్.. ఆతర్వాత దాన్ని అద్భుతంగా డిఫెండ్ చేసుకుంది. ఈ మ్యాచ్ గెలుపుకు గుజరాత్ బ్యాటర్లు, బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాలి. తొలుత బ్యాటింగ్‌లో వారు ఎక్కువ రిస్క్ చేయకుండానే పరుగులు రాబట్టారు. సాయి సుదర్శన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి తనలోని క్లాస్‌ను ప్రదర్శించాడు. శుభ్‌మన్ గిల్ (27 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), జోస్ బట్లర్ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్) కూడా బాగా ఆడారు. వీరు చేసింది తక్కువ పరుగులే అయినా ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేశారు. ఆతర్వాత వచ్చిన షారుఖ్ ఖాన్ (9), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (18), రాహుల్ తెవాటియా (0), రషీద్ ఖాన్ (6), రబాడ (7 నాటౌట్), సాయి కిషోర్ (1) నిరాశపర్చినా చివరికి గుజరాత్ మంచి స్కోరే చేసింది. సాయి సుదర్శన్ చివరి వరకు క్రీజ్‌లో ఉండి ఉంటే గుజరాత్ ఇంకా భారీ స్కోర్ చేసేది. ముంబై ప్రధాన పేసర్లు బౌల్ట్ (4-0-34-1), దీపక్ చాహర్ (4-0-39-1) బాగానే బౌలింగ్ చేసినా స్పిన్నర్ ముజీబ్ రెహ్మాన్ (2-0-28-1), యువ పేసర్ సత్యనారాయణ రాజు (3-0-40-1) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. సాంట్నర్ (3-0-25-0) పర్వాలేదనిపించగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (4-0-29-2) అద్భుతంగా బౌలింగ్ చేశాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబైను గుజరాత్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆదిలోనే దెబ్బ కొట్టాడు. సిరాజ్ ఇద్దరు ముంబై ఓపెనర్లను పవర్ ప్లేలోనే ఔట్ చేశాడు. తొలుత రోహిత్‌ను (8) క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్.. ఆతర్వాత మరో ఓపెనర్ రికెల్టన్ను (6) కూడా అదే తరహాలో పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత క్రీజ్‌లోకి వచ్చిన తిలక్ వర్మ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 48; ఫోర్, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఈ దశలో గుజరాత్ తమ ఏస్ పేసర్ ప్రస్దిద్ద్ కృష్ణను బరిలోకి దించింది. ప్రసిద్ద్ అద్భుతంగా బౌలింగ్ చేసి క్రీజ్‌లో కుదురుకున్న తిలక్, స్కైలను ఔట్ చేశాడు. ఇక్కడే ప్రసిద్ద్ ముంబై చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ప్రసిద్ద్ అద్భుతమైన స్లో బాల్స్‌తో ముంబై బ్యాటర్లను బెంబేలెత్తించాడు. తిలక్, స్కై ఔటయ్యాక హార్దిక్ బ్యాటింగ్‌కు దిగకుండా రాబిన్ మింజ్‌ను పంపి తప్పు చేశాడు. మింజ్ (6 బంతుల్లో 3), హార్దిక్ (17 బంతుల్లో 11) ఇద్దరూ బంతులు వృధా చేసి ముంబై ఓటమిని ఖరారు చేశారు. ఆఖర్లో నమన్ ధీర్ (11 బంతుల్లో 18 నాటౌట్), సాంట్నర్ (9 బంతుల్లో 18 నాటౌట్) భారీ షాట్లు ఆడినా అప్పటికే ముంబై ఓటమి ఖరారైపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసిన ప్రసిద్ద్ కృష్ణకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గుజరాత్ బౌలరల్లో ప్రసిద్ద్, సిరాజ్ చెరో 2, రబాడ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్ ఈ సీజన్లో బోణీ కొట్టింది. ముంబై వరుసగా తమ రెండో మ్యాచ్‌లో కూడా పరాజయంపాలైంది.మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము ప్రొఫెషనల్‌గా ఆడలేదు. బ్యాటింగ్, బౌలింగ్ రెండిటిలోనూ విఫలమయ్యాం. రెండు విభాగాల్లో 15-20 పరుగులు తక్కువ పడ్డాయని అనుకుంటున్నాను. ఫీల్డ్‌లో ప్రాథమిక తప్పులు చేసాము. దానికి వల్ల ప్రత్యర్థులకు 20-25 పరుగులు అదనంగా వచ్చాయి. టీ20ల్లో మ్యాచ్ ఫలితాన్ని ఈ పరుగులే నిర్దేశిస్తాయి. గుజరాత్ ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వారు ఛాన్స్‌లు ఎక్కువగా తీసుకోలేదు. పిచ్ కఠినంగా ఉందని వారికి కూడా తెలుసు. వారు ప్రమాదకర షాట్లు ఆడకుండా పరుగులు సాధించగలిగారు. ఈ పరాజయానికి మేమంతా బాధ్యత తీసుకోవాలి. ఇంకా ప్రారంభ దశల్లోనే ఉన్నాము. బ్యాటర్లు టచ్‌లోకి రావాలి. వారు త్వరలోనే సామర్థ్యం మేరకు రాణిస్తారని ఆశిస్తున్నాను. గుజరాత్ బౌలర్లు స్లో డెలివరీలను అద్భుతంగా బౌల్ చేశారు. వాటిని ఎదుర్కోవడం చాలా కష్టమైంది. కొన్ని బంతులు నేరుగా వికెట్లపైకి వచ్చాయి. కొన్ని బౌన్స్ అయ్యాయి. ఇలాంటి బంతులను ఎదుర్కోడం బ్యాటర్లకు చాలా కష్టం. గుజరాత్ బౌలర్లు నేను బంతితో చేసిందే చేసి సఫలమయ్యారు. -
MI vs GT: 41 బంతుల్లో సెంచరీ చేశాడు.. అతడిని కొనసాగించండి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమైంది. మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్ (MI)- గుజరాత్ టైటాన్స్ (GT) శనివారం అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో ముంబై ప్రస్తుత, గుజరాత్ మాజీ సారథి హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.అయితే, హార్దిక్ రాకతో ముంబై తుదిజట్టులో ఎవరిపై వేటు పడుతుందనే అంశంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కెప్టెన్ ఆగమనం వల్ల ముంబై మరింత పటిష్టంగా మారుతుందని.. అయితే, రియాన్ రికెల్టన్ లేదంటే.. విల్ జాక్స్ సేవలను జట్టు కోల్పోతుందని పేర్కొన్నాడు.జాక్స్‌కే ఓటు వేస్తాఈ ఇద్దరిలో ఎవరిని కొనసాగించాలంటే తాను మాత్రం జాక్స్‌కే ఓటు వేస్తానని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు. ఈ మేరకు.. ‘‘హార్దిక్ పాండ్యా జట్టులోకి రావడం ముంబైకి భారీ ఉపశమనం. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అతడు లేని లోటు గత మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది.హార్దిక్ రాక వల్ల మిడిలార్డర్లో స్థిరత్వం చేకూరుతుంది. అయితే, అతడు వచ్చాడు కాబట్టి రియాన్ రికెల్టన్ లేదంటే విల్ జాక్స్.. ఈ ఇద్దరిలో ఒకరు తప్పుకోక తప్పదు. నేనైతే విల్ జాక్స్‌ను కొనసాగించాలని చెబుతా.రికెల్టన్ను తప్పించండిఎందుకంటే గతంలో అతడు ఈ వేదికపై విధ్వసంకర శతకం బాదాడు. మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సిక్సర్లు బాదాడు. అప్పుడు అతడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడేవాడు. ఏదేమైనా.. రికెల్టన్ను తప్పించి.. విల్ జాక్స్‌ను కొనసాగిస్తూ.. రికెల్టన్ స్థానంలో రాబిన్ మింజ్‌ను వికెట్ కీపర్‌గా వాడుకుంటే సరిపోతుంది’’ అని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఇక బౌలింగ్ విభాగం గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రాకతో బౌలింగ్ యూనిట్ కూడా బలపడుతుంది. ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంట్నర్లతో పాటు రీస్ టాప్లీను ఆడించవచ్చు. హార్దిక్ రాకతో ముంబై తుదిజట్టులో భారీ మార్పులు ఖాయం’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.అందుకే తొలి మ్యాచ్‌కు దూరంఇదిలా ఉంటే.. విల్ జాక్స్ గతేడాది ఆర్సీబీకి ఆడుతూ.. గుజరాత్‌తో మ్యాచ్‌లో 41 బంతుల్లోనే అజేయ శతకంతో మెరిశాడు. మరోవైపు.. గతేడాది ఆఖరి లీగ్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా.. హార్దిక్ పాండ్యాపై నిషేధం పడింది. అందుకే ఐపీఎల్-2025లో ముంబై ఆరంభ మ్యాచ్‌కు అతడు దూరమయ్యాడు. కాగా ఈ ఏడాది తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడ్డ ముంబై.. నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది.ఐపీఎల్-2025లో తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తుదిజట్టురోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు.బెంచ్: విఘ్నేశ్ పుతూర్, అశ్వనీ కుమార్, రాజ్ బవా, కార్బిన్ బాష్, కర్ణ్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీ, ముజీబ్ ఉర్ రెహమాన్, హార్దిక్ పాండ్యా, క్రిష్ణన్ శ్రీజిత్, అర్జున్ టెండుల్కర్, బెవాన్ జేకబ్స్.చదవండి: ఇంత త్వరగా వస్తాడనుకోలేదు: ధోనిపై సెహ్వాగ్ ఘాటు విమర్శలు