Microsoft devices company
-
మైక్రోసాఫ్ట్ లూమియా 540 @ రూ.10,199
హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ డివెసైస్ కంపెనీ మైక్రోసాఫ్ట్ లూమియా 540 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ ధర రూ.10,199 అని మైక్రోసాఫ్ట్ డివెసైస్ ఒక ప్రకటనలో తెలిపింది. యువజనులను దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తున్నామని నోకియా ఇండియా సేల్స్ ఎండీ అజయ్ మెహతా తెలిపారు. (మైక్రోసాఫ్ట్ డివెసైస్కు నోకియా ఇండియా సేల్స్ అనుబంధ కంపెనీగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.) విండోస్ ఫోన్ 8.1 ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్‌ను విండోస్ 10 ఓఎస్‌కు కూడా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని మెహతా పేర్కొన్నారు. 5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌తో విశాలమైన యాంగిల్స్‌లో సెల్ఫీలు తీసుకోవచ్చని వివరిం చారు. ఈ ఫోన్లో క్వాడ్-కోర్ 200 సిరీస్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ, 30 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ మెమెరీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, వంటి ప్రత్యేకతలున్నాయని మెహతా తెలిపారు. -
మైక్రోసాఫ్ట్‌తో ఐడియా జట్టు
విండోస్ స్టోర్ నుంచి యాప్‌లు, గేమ్స్ కొనుగోలు లక్ష్యం న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లు తయారు చేసే మైక్రోసాఫ్ట్ డివెసైస్ సంస్థ ప్రముఖ టెలికం కంపెనీ ఐడియా సెల్యులర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఐడియా వినియోగదారులు విండోస్ స్టోర్ నుంచి ప్రీమియం యాప్‌లు, గేమ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. వీటికి చెల్లింపులు వినియోగదారుడి ప్లాన్‌ను అనుసరించి ఉంటాయి. పోస్ట్ పెయిడ్ అయితే వీటికి నెలవారీ బిల్లుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ప్రిపెయిడ్ వినియోగదారులైతే, బ్యాలె న్స్ నుంచి తగ్గించబడుతుంది. మైక్రోసాఫ్ట్ ద్వారా సమగ్రమైన బిల్లింగ్‌ను ఆఫర్ చేస్తున్న తొలి భారత టెలికం సంస్థ ఐడియా అని, మరిన్ని సంస్థలతో ఈ తరహా ఒప్పం దాలు కుదుర్చుకోనున్నామని నోకియా ఇండియా (మైక్రోసాఫ్ట్ డివెసైస్ సబ్సిడరీ) సేల్స్ డెరైక్టర్ నిఖిల్ మాధుర్ చెప్పారు. ఈ విధానం క్రెడిట్ కార్డులు లేనివారికి ప్రయోజనకరమని పేర్కొన్నారు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లకు గట్టిపోటీనిస్తున్న విండోస్ స్టోర్‌లో ప్రస్తుతం 5,50,000 యాప్‌లు ఉన్నాయి. ఇప్పటివరకూ 800 కోట్ల క్యుమిలేటివ్ డౌన్లోడ్లు జరిగాయి.