మైక్రోసాఫ్ట్‌తో ఐడియా జట్టు | Microsoft ties up with Idea for paid apps, games | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్‌తో ఐడియా జట్టు

Published Tue, Jan 13 2015 1:51 AM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM

మైక్రోసాఫ్ట్‌తో ఐడియా జట్టు - Sakshi

మైక్రోసాఫ్ట్‌తో ఐడియా జట్టు

విండోస్ స్టోర్ నుంచి యాప్‌లు, గేమ్స్ కొనుగోలు లక్ష్యం
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్‌లు తయారు చేసే మైక్రోసాఫ్ట్ డివెసైస్ సంస్థ ప్రముఖ టెలికం కంపెనీ ఐడియా సెల్యులర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఐడియా వినియోగదారులు విండోస్ స్టోర్ నుంచి ప్రీమియం యాప్‌లు, గేమ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. వీటికి చెల్లింపులు వినియోగదారుడి ప్లాన్‌ను అనుసరించి ఉంటాయి.

పోస్ట్ పెయిడ్ అయితే వీటికి నెలవారీ బిల్లుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.  ప్రిపెయిడ్ వినియోగదారులైతే, బ్యాలె న్స్ నుంచి తగ్గించబడుతుంది. మైక్రోసాఫ్ట్ ద్వారా సమగ్రమైన బిల్లింగ్‌ను ఆఫర్ చేస్తున్న తొలి భారత టెలికం సంస్థ ఐడియా అని, మరిన్ని సంస్థలతో ఈ తరహా ఒప్పం దాలు కుదుర్చుకోనున్నామని నోకియా ఇండియా (మైక్రోసాఫ్ట్ డివెసైస్ సబ్సిడరీ) సేల్స్ డెరైక్టర్ నిఖిల్ మాధుర్ చెప్పారు.

ఈ విధానం క్రెడిట్ కార్డులు లేనివారికి ప్రయోజనకరమని పేర్కొన్నారు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లకు గట్టిపోటీనిస్తున్న విండోస్ స్టోర్‌లో ప్రస్తుతం 5,50,000 యాప్‌లు ఉన్నాయి. ఇప్పటివరకూ 800 కోట్ల క్యుమిలేటివ్ డౌన్‌లోడ్‌లు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement