
మైక్రోసాఫ్ట్ లూమియా 540 @ రూ.10,199
హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ డివెసైస్ కంపెనీ మైక్రోసాఫ్ట్ లూమియా 540 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ ధర రూ.10,199 అని మైక్రోసాఫ్ట్ డివెసైస్ ఒక ప్రకటనలో తెలిపింది. యువజనులను దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తున్నామని నోకియా ఇండియా సేల్స్ ఎండీ అజయ్ మెహతా తెలిపారు. (మైక్రోసాఫ్ట్ డివెసైస్‌కు నోకియా ఇండియా సేల్స్ అనుబంధ కంపెనీగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.) విండోస్ ఫోన్ 8.1 ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్‌ను విండోస్ 10 ఓఎస్‌కు కూడా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని మెహతా పేర్కొన్నారు.
5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌తో విశాలమైన యాంగిల్స్‌లో సెల్ఫీలు తీసుకోవచ్చని వివరిం చారు. ఈ ఫోన్‌లో క్వాడ్-కోర్ 200 సిరీస్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ, 30 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ మెమెరీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, వంటి ప్రత్యేకతలున్నాయని మెహతా తెలిపారు.