Microsoft team
-
మైక్రోసాఫ్ట్ యూజర్లకు బ్యాడ్ న్యూస్
అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రోసాఫ్ట్ టీమ్స్ వెబ్ యాప్ నిలిచిపోనుంది. ఈ రోజు(నవంబర్ 30) నుండి మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో తన మైక్రోసాఫ్ట్ టీమ్స్ వెబ్ యాప్‌కి సపోర్ట్ నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఒక వేల మీరు మైక్రోసాఫ్ట్ టీమ్స్ సేవలను ఉపయోగించాలని అనుకుంటే మాత్రం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ని ఉపయోగించాలని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లో టీమ్స్ సేవలు నిలిచిపోనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రకటించింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లో వినియోగదారులందరని మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ను ఉపయోగించుకునేలా చేయాలని సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. (చదవండి: మోటో జీ 5జీ లాంచ్ నేడే) 2021, ఆగస్టు 17 నుంచి ఆఫీస్ 365, వన్ డ్రైవ్, ఔట్లుక్ వంటివి ఎక్స్‌ప్లోరర్11కు సపోర్టు చేయవని తెలిపింది. దశల వారీగా వీటిని నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. మార్చి 9, 2021 తరువాత నుంచి ఎడ్జ్ లెగస్సీ డెస్క్ టాప్ యాప్ కొత్త సెక్యూరిటీ అప్ డేట్స్ పొందలేదని స్పష్టం చేసింది. దీనికి బదులుగా కొత్త మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కొత్త విండోస్ ఫీచర్ అప్ డేట్స్ తో అందుబాటులో ఉండనుందని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ను మైక్రో సాఫ్ట్ కొత్తగా తీసుకొచ్చింది. క్రోమ్ బ్రౌజర్ మాదిరిగానే ఇది కూడా సమర్థవంతంగా, వేగంగా పనిచేస్తుందని తెలిపింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 25 సంవత్సరాల క్రితం, 1995 ఆగస్టులో విడుదలైంది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించిన వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్. 2003 ఏడాదిలో 95 శాతం వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. ఫైర్ఫాక్స్, గూగుల్ క్రోమ్ వంటి వాటితో పోటీ నేపథ్యంలో ఈ కొత్త వెబ్ బ్రౌజర్ ని తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. -
మైక్రోసాఫ్ట్ బృందం వర్సిటీల సందర్శన
ఏఎన్‌యూ: మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ సంస్థ ప్రతినిధి బందం బుధవారం యూనివర్సిటీని సందర్శించింది. ఏపీ నూతన రాజధాని ప్రాంతంలో మైక్రోసాఫ్ట్ సంస్థ నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తరుణంలో ఆ సంస్థ ప్రతినిధులు ఏఎన్‌యూని సందర్శించటం ప్రాధాన్యాన్ని సందర్శించుకుంది. మైక్రోసాఫ్ట్ అమెరికా సంస్థ ప్రతినిధులు మైక్ డేరో, మారియా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ రవి, మైక్రోసాఫ్ట్ బెంగళూరు బ్రాంచ్ ఇన్ఛార్జ్ అరుణారెడ్డి, హైదరాబాద్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ ప్రభు ఏలిశెట్టి, ఎన్ఆర్ఐ డాక్టర్ ప్రసాద్‌తో కూడిన ప్రతినిధి బృందం ఏఎన్‌యూలోని విద్య, పరిశోధన, మౌలిక వసతులను పరిశీలించింది. అనంతరం పరిపాలనా భవన్లో వీసీ ఆచార్య ఏ రాజేంద్రప్రసాద్, వర్సిటీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఐటీ సంబంధిత విద్య, పరిశోధనల గురించి అధికారులు వివరించారు.. వృత్తి విద్యా కోర్సులకు ఉపయోగపడేలా మైక్రోసాఫ్ట్ నుంచి సహకారమందించాలని కోరారు. ఏఎన్‌యూలో మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలో డేటా ఎనాలసిస్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఏపీలో మైక్రోసాఫ్ట్ సేవలు విస్తరిస్తున్నాం.. డైక్మెన్ ఆడిటోరియంలో యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు చర్చాగోష్టి నిర్వహించారు. మైక్ డేరో మాట్లాడుతూ ఏపీలో మైక్రోసాఫ్ట్ సేవలను విస్తరించనున్నామని తెలిపారు. మైక్రోసాఫ్ట్ సంస్థలో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మైక్రోసాఫ్ట్ సంస్థ ఆవిర్భావం, దాని సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రతినిధులు సమాధానాలిచ్చారు.