పేలిన విమానం, కాలిన బస్సులు
పాకిస్తాన్ లోని లాహోర్ లోని బల్దియా ప్రాంతంలో ఒక పాక్ ఎయిర్ ఫోర్స్ విమానం పేలిపోయింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు పైలట్లు చనిపోయారు. పేలిన విమానం తాలూకు మండుతున్న శకలాలు కింద పడటంతో చాలా మందికి గాయాలయ్యాయి.
బల్దియాలో రద్దీగా ఉండే బస్ టర్మినల్ దగ్గర ఈ ప్రమాదం జరగడంతో అక్కడ ఉన్న మూడు బస్సులు కూడా నిప్పంటుకున్నాయి. అగ్నిమాపక దళాలు, సహాయ బృందాలు వచ్చే లోపునే ప్రాంతమంతా అగ్నిదగ్ధమైపోయింది.
ఈ విమానాన్ని పాక్ వైమానిక దళం ట్రెయినింగ్ కోసం ఉపయోగిస్తోంది.