migrate
-
ఎప్పుడొస్తావు.. నాన్నా..!
భార్యా బిడ్డలను పోషించుకునేందుకు పొట్టచేత బట్టుకుని పరాయి దేశానికి వెళ్లిన ఆ ఇంటి యజమాని ఎక్కడున్నాడో.. ఏమయ్యాడో.. తెలియని పరిస్థితిలో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. పిల్లలైతే నాన్నా ఎప్పుడొస్తావు.. అంటూ ఎదురు చూస్తున్నారు.. గల్ఫ్ దేశంలో సేఠ్ల చేతిలో చిత్ర హింసలకు గురై ఆచూకీ లేకుండా పోయిన తమ తండ్రిని తమ వద్దకు చేర్చాలంటూ ఆ చిన్నారులు విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంట తడిపెట్టిస్తోంది. సాక్షి,లక్కిరెడ్డిపల్లె(వైఎస్సార్‌కడప) : లక్కిరెడ్డిపల్లె మండలం మద్దిరేవుల గ్రామం రెడ్డివారిపల్లెకు చెందిన సయ్యద్ అలీ 2013 సంవత్సరం జనవరి నెల 31వ తేదీన చెన్నై నుంచి కువైట్‌కు జి8300359 నెంబరు గల పాస్‌పోర్టు ద్వారా వెళ్లాడు. అప్పటి నుంచి సయ్యద్ అలీని కువైట్ సేఠ్లు(కఫిల్) మారుస్తూ, అతడిని కొడుతూ ఉండేవారు. ఈ ఆరు సంవత్సరాల కాలంలో ఇతను నలురుగు కఫిల్ల వద్ద పని చేశాడు. కువైట్‌లో ఇతడిని గొర్ల కాపరిగా, తోట హమాలీగా పనికి కుదుర్చుకున్నారు. కఫిల్ అతడిని ప్రతి రోజూ కొడుతూ ఉండేవాడని, ఈ విషయమై గొడవ కూడా జరగడంతో అతను 2016 సంవత్సరం జూన్ 10వ తేదీన ఇంటికి నెట్ ద్వారా ఫోన్ చేసి సిటీకి దూరంగా ఉన్న అడవిలో మరో కఫిల్ వద్ద పని దొరికిందని, అక్కడికే వెళ్తున్నానని, అక్కడ బాగుంటే ఉంటానని, లేకుంటే నాలుగు రోజుల్లో ఇండియాకు తిరిగి వస్తానని చెప్పాడు. ఇక అంతే అప్పటి నుంచి సయ్యద్ అలీ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదు. దీంతో అతను ఏమయ్యాడోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 2016వ సంవత్సరం ఆగస్టు నెల 11వ తేదీన కువైట్‌లో ఉంటున్న జి.కె.రాచపల్లెకు చెందిన అబ్దుల్ రహిమాన్ అనే వ్యక్తి ఇక్కడికి ఫోన్ చేసి సయ్యద్ అలీ ఇండియాకు వచ్చాడా అని అడిగాడు. సయ్యద్ అలీ మరణించి రెండు నెలలు అయిందని , అతని బంధువులు ఎవ్వరూ కువైట్‌లో లేరా అని అక్కడి కఫిల్ తనను అడిగాడని రహిమాన్ పేర్కొన్నాడు.ఈమేరకు ఇండియన్ ఎంబసీలో ఫిర్యాదు చేసినా ఇంకా సయ్యద్ అలీ ఆచూకి తెలియలేదని, సమాధానం వస్తోందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సయ్యద్ అలికి భార్య రహమతున్నిసా, కుమారుడు అమీర్, కుమార్తె ఆసిఫా ఉన్నారు. మూడేళ్లుగా ఆచూకీ లేకుండా పోయిన తమ అన్న ఏమయ్యాడో తేల్చాలని, సయ్యద్ అలీ తమ్ముడు సయ్యద్ షరీఫ్ బుధవారం కువైట్ ఎన్ఆర్ఐలకు వినతిపత్రం అందజేశాడు. భర్త కోసం భార్య, తండ్రి కోసం పిల్లలు ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న నేపథ్యంలో అధికారులు స్పందించి అతని ఆచూకీపై స్పష్టత ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. -
స్వదేశానికి ఫారహాద్దీన్ మృతదేహం
కరీంనగర్ జిల్లాకు చెందిన మహమ్మద్ ఫారహాద్దీన్ కువైట్‌లో మరణించారు. అతని మృతదేహాన్ని స్వదేశానికి తరలించారు. మహమ్మద్ ఫేరాజుద్దీన్ కువైట్‌లో డ్రైవర్‌గా పనిచేసేవాడు. మే 14న జరిగిన రోడ్డు ప్రమాదం అతను మృతిచెందారు. ఫారహాద్దీన్ మృతదేహాన్ని ఫ్లయిట్ నెం. అల్ జజీరా J9-403లో కువైట్ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఉదయం 1.35గం.లకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. అతని బంధువు ఆసాఢహ్మద్ ఖాన్‌ను సిటీస్ బస్సు యాజమాన్యం అదే ప్లయిట్ లో శవపేటికతో పాటు పంపారు. వారి దగ్గరి బంధువు ఖాజా జాహీరోద్దీన్, సామాజిక కార్యకర్త శ్రీ స్వదేశ్ పరికిపండ్ల హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో శవపేటికను స్వీకరించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో చిట్టి బాబు నేతృత్వంలో అంబులెన్సును ఏర్పాటు చేశారు. మదదు పోర్టల్ ద్వారా, ఎంబసీ సహకారం తీసుకున్నారు. ఖాదర్ సిటీ బస్సు యాజమాన్యం తరపున సెటిల్మెంట్లో ఒకరిని ఇచ్చి పంపడంలో చాలా బాగా సహకరించింది. అతని మిత్రులు సర్వర్, అదిల్ సహకరించారు. శ్రీ భీం రెడ్డి, ఆ ఏరియా సీఐ త్వరగా వెంటనే స్పందించారు. ఈ మొత్తం పనిలో తెలంగాణ ప్రభుత్వం, సిటీ బాస్ యాజమాన్యం, ఇంటివారితో మాట్లాడం పనులు జరుగడంలో గంగుల మురళీధర్ రెడ్డి తన పని చేసారు. భవిష్యత్తులో ఇతని ఇన్సూరెన్సు కు కూడా కంపెనీ తో కలిసి పని చేయడానికి ప్రయత్నిస్తాను అని తెలిపారు. మృతుడికి సంబంధించిన వివరాలు : చిరునామా: ఇంటినెంబర్ 8-14-3/5, కృష్ణ నగర్, కళ్యాణి గార్డెన్ దగ్గర, బొమ్మకల్ (గ్రామం ), కరీంనగర్ జిల్లా -
ఊరు వలసబాట..
సాక్షి, వేమనపల్లి: ఉన్న భూములు అటవీ వివాదంలో ఉన్నాయి.. చేద్దామంటే పనులు లేవు.. తిందామంటే తిండికి లేదు,. వారికి వేరే ఉపాధి లేక రాజారం ఊరు వలస బాట పట్టింది. అందురు పనుల కోసం పట్నం బోతే ఇంటివద్ద ఉన్నోళ్లు చీపుర్ల కోసం అడవిబాట పడుతున్నారు. అక్కడ దొరికే చీపురు పుల్లలను సేకరించి, చీçపుర్లను తయారు చేసి వాటిని విక్రయించిన డబ్బులతోనే జీవనం సాగిస్తున్నారు. రాజారం గ్రామంలో మొ త్తం 88 కుటుంబాలున్నాయి. వీటిలో 56 కుటుంబాలు గత 15 రోజుల నుంచి మంచిర్యాలకు వలస వెళ్తూనే ఉన్నారు. ఇక ఇంటి వద్ద ఉండే ముసలివారు చీపురు పుల్లల సేకరణను ఉపాధిగా ఎంచుకున్నారు. వరి కోతలు, పత్తి తీయడం పనులు మొదలయ్యేదాక వీరికి ఈ పనే ఆధారం. తెల్లవారకముందే సద్ది మూట పట్టుకుని అడవిబాట పడుతారు. వన్యమృగాల భయాన్ని లెక్క చేయకుండా చెట్టూ పుట్టా తిరిగి చీపురు పుల్లలు సేకరిస్తున్నారు. వాటిని ఇంటికి తెచ్చి ఎండలో ఆరబెట్టి వాటిని కట్టలుగా కడుతారు. సమీప గ్రామాల్లో తిరిగి రూ.20 లకు కట్ట చొప్పన అమ్మి జీవనం సాగిస్తున్నారు. పొద్దంతా కష్టపడి చీపురు పుల్లలు ఏరినా.. సరైన కూలీ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేలని భూవివాదం.. రాజారం గిరిజనులు భూముల్లేని పేదలు కాదు. చీపురు సేకరణ, వలసలు వెళ్లటమే వీరికి ప్రధానాధారం కాదు. గోదుంపేట శివారులో ఉన్న వీరి భూములు అటవీ వివాదంతో తుడిచిపెట్టుకు పోయాయి. ఈ శివారులో 54 కుటుంబాలకు సాగు భూములున్నాయి. గత 20 ఏండ్ల క్రితమే ప్రభుత్వం పట్టాలిచ్చింది. ఐటీడీఏ సహకారంతో బోర్లు వేసి మామిడి చెట్లు పెంచి ఉపాధి చూపింది. గత 8 సం.లుగా ఆ భూమిపై అటవీ అధికారుల బెదిరింపులు మొదలయ్యాయి. దీం తో భూములను వదిలిపెట్టడంతో వీరు ఉపాధి కోల్పొయి కూలీలుగా మారారు. గత మూడు నెలల క్రితం మా భూములు మాగ్గావాలని గిరిజనులు ఉద్యమానికి సిద్దమయ్యారు. భూముల వద్దకు వెళ్లి సాగు చేసేందుకు అరకలు కట్టారు. దీంతో అటవీ, పోలీస్ అధికారులు 9 మందిపై కేసులు నమోదు చేశారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆగాలని స్వయంగా జిల్లా కలెక్టర్ సూచించడంతో గిరిజను లు శాంతించారు. పల్లెల్లో వరి కోతలు, పత్తి సేకర ణ పనులు ప్రారంభం కాకపోవడంతొ కడుపు నిండే మార్గం లేక మంచిర్యాలలోని పలు ప్రాం తాలకు ఇటుక పనికి వెళ్తున్నారు. ఇంటి వద్ద ఉన్న వారు చీపుర్లను అమ్ముకుంటు ఉపాధి పొందుతున్నారు. మేం బతుకుడెట్ల.. మాకు గోదుంపేట శివారులో భూములు ఉన్నా యి. కానీ అటవీఅధికారులు సాగు చేయకుండా బెదిరిస్తున్నారు. ఇగ మేం బతుకుడెట్ల. అందరం మంచిర్యాల ఇటుక ప నులకు పోతె ఇంటి కాడున్నోళ్లు చీపురు ఏరేందుకు పోతాండ్లు. – బుర్సమాంతయ్య రాజారం ఊళ్లో ఉపాధి లేదు.. మాకు ఊళ్ల వేరే ఉపాధి లేదు. ఇగ ఏం పనిజేసుడు. మేమంతా ఇటుక పనికి పోతె ఇంటి కావలికి ముసులోళ్లు ఉంటుర్రు. ఆళ్లకు బువ్వ ఎట్ల, ఉపాసం ఉండలేక చీపురుపుల్లలు ఏరేందుకు పోతుల్లు. వాటితో వచ్చిన పైసలతోని బియ్యం, సామాన్లు కొనుక్కొని జీవనం సాగిస్తున్నారు. – నాయిని చంద్రు -
ప్రేమయాత్రలో 14వేల కిలోమీటర్లు...
బ్కోడ్స్కా వారోస్, క్రొయేషయా : ప్రేమ ఎంత గొప్పదంటే అనాముకుడిని సైతం ఆకాశమంతా ఎత్తు ఎదిగేలా చేస్తుంది. పిరికివారిని సైతం గొప్ప సాహసికులుగా మారుస్తుంది. దూర, భారాల్ని సైతం లెక్కచేయదు. ప్రేమకున్న శక్తే అలాంటిది. అందుకే క్లెపెతాన్ ప్రతి ఏడాది శీతాకాలం అయిపోగానే దక్షిణాఫ్రిక నుంచి 14వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి తూర్పు క్రొయేషియాలోని బ్రోడ్స్కి వారోస్ గ్రామంలో ఉన్న తన ప్రియురాలు మలేనాను కలుసుకుంటాడు. శీతకాలం అయిపోగానే రావడం ఏంటి, ఎప్పుడు మలేనా దగ్గరే ఉండొచ్చు కదా అంటే శీతకాలం కొంగలకు క్రొయేషియా అనుకూలమైన తావు కాదు. అవును మలేనా, క్లెపెతాన్ రెండు కొంగలు. మరి మలేనా కూడా క్లెపెతాన్తో దక్షిణాఫ్రికా వెళ్లొచ్చు కదా అనుకుంటే అది కుదరరు. ఎందుకంటే మలేనా వికలాంగురాలు. మనుషులకే ఆదర్శంగా నిలిచిన ఈ ప్రేమ కొంగలు తూర్పు క్రొయేషియాలోని ఒక రిటైర్డ్ పాఠశాల ఉపాధ్యాయుడు స్టెపెన్ వోకిక్ ఇంట్లో జతకట్టాయి. ఓసారి వీటి ప్రేమకథను వినమంటున్నాడు వోకిక్. కొన్నాళ్ల క్రితం వోకిక్కి తన ఇంటి దగ్గరలోని చెరువు వద్ద గాయాలతో ఉన్న ఆడకొంగ మలేనా కనిపించింది. వేటగాడు మలేనాను తూపాకీతో కాల్చడం వల్ల మలేనా కాలు విరిగిపోయింది. గాయంతో బాధపడుతున్న మలేనాను వోకిక్ తన ఇంటికి తీసుకువచ్చాడు. దానికి వైద్యం చేసి ప్రాణాలు కాపాడాడు. ఈ క్రమంలోనే మలేనా క్లెపెతాన్ రెండు జతయ్యాయి. ఇవి ఇప్పటికే 62 పిల్లలను కూడా చేశాయి. శీతాకాలం క్లెపెతాన్ తూర్పు క్రొయేషియా నుంచి దక్షిణాఫ్రికకు వలస వెళ్తాడు. ఆ సమయంలో వోకిక్ మలేనాకు తన ఇంటిలోనే ఒక గదిలో హీటర్‌ను ఏర్పాటు చేసి వెచ్చగా ఉండేలా చుస్తాడు. వసంత రుతువు మొదలవ్వగానే క్లెపెతాన్ దక్షిణాఫ్రిక నుంచి తూర్పుక్రొషియాకి వస్తాడు. వేసవిలో ఈ ప్రేమ జంట కోసం వోకిక్ తన ఇంటి పైన వసతిని ఏర్పాటు చేస్తాడు. ఇప్పటి నుంచే క్లెపెతాన్ తన పిల్లలకు ఎగరడంలో శిక్షణ ఇస్తున్నాడు. ఈ సారి ఆగస్టులో తన పిల్లలతో కలిసి ఈ మగ కొంగ దక్షిణాఫ్రికకు వలస వెళ్లనుంది. ఈ ప్రేమ పక్షులు ప్రస్తుతం క్రొయేషియాలో సెలబ్రటీలయ్యాయి. 1993లో వోకిక్ మలేనాను తన ఇంటికి తీసుకువచ్చాడు. నాటి నుంచి నేటి వరకూ మలేనా వోకిక్తో పాటే కలసి ఉంటుంది. వీరిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. వోకిక్ తనతోపాటు మలేనాను చేపలుపట్టడానికి తీసుకువెళ్తాడు, ఇద్దరూ కలిసి టీవీ కూడా చూస్తారు. మలేనా పూర్తి బాధ్యత నాదే అంటున్నారు వోకిక్. క్రొయేషియాలో దాదాపు 1500 జతల తెల్ల కొంగలు ఉన్నాయి. సెంట్రల్ క్రొయేషియాలోని సిగాక్ 1994లో తొలి కొంగల గ్రామంగా పొందింది. ప్రస్తుతం బోడ్స్కా వారోస్ గ్రామంలో 210 పక్షులు ఉన్నాయి. ఇవి గ్రామస్తుల ఇళ్ల పైన ఏర్పాటుచేసుకున్న తమ గూళ్లలో నివసిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ మనుషుల సంఖ్య కన్నా రెట్టింపుగా పక్షుల సంఖ్య ఉండటం గమనార్హం. -
అమెరికా నుంచి భారత్‌కు ఏటా వెయ్యి కోట్ల డాలర్లు
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ప్రపంచంలో పాతిక కోట్ల మంది ప్రజలు తాము పుట్టిన దేశంలో కాకుండా బతుకుతెరువు కోసం పరాయి దేశంలో జీవిస్తున్నారు. వారు తమ సంపాదనలో కొంత భాగాన్ని ఏటా మాతృదేశంలోని కుటుంబ సభ్యులకు పంపిస్తున్నారు. అలా వారు తమ దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా పరోక్షంగా తోడ్పడుతున్నారు. ప్రపంచంలో ఇలా ఉద్యోగం చేస్తున్న దేశం నుంచి మాతృదేశానికి ఆర్థిక వనరులు తరలడంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ 1990 నుంచి పరిశీలిస్తే 2015 సంవత్సరానికి ఎంతో పెరిగాయి. ఒక్క 2015 సంవత్సరంలోనే ఓ దేశం నుంచి మరో దేశానికి వెళ్లిన నిధులు మొత్తం 58, 200 కోట్ల డాలర్లని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. ప్యూ రీసెర్చ్ సెంటర్ కూడా ఈ అంకెలనే పేర్కొంది. 19 శాతం మంది వలసదారులున్న అమెరికా నుంచి 2015 సంవత్సరంలో 13,350 కోట్ల డాలర్లు ఇతర దేశాలకు వెళ్లాయి. ప్రధానంగా నిధులు అభివద్ధి చెందిన దేశాల నుంచి అభివద్ధి చెందుతున్న వర్ధమాన దేశాలకు వెళుతున్నాయి. అమెరికా నుంచి మెక్సికోకు 2,430 కోట్ల డాలర్లు, చైనాకు 1,620 కోట్ల డాలర్లు, భారత్‌కు వెయ్యి కోట్ల డాలర్లు బదిలీ అయ్యాయి. అమెరికా తర్వాత ఎక్కువ మంది వలసదారులున్న జర్మనీ నుంచి 2,280 కోట్ల డాలర్లు వెళ్లగా, పోలాండ్ 210 కోట్లు, ఫ్రాన్స్ 190 కోట్లు, ఇటలీ 130 కోట్ల డాలర్లు అందుకున్నాయి. బాగా చదువుకున్న పాశ్చాత్య దేశాల నుంచే కాకుండా పేద దేశాల నుంచి వలసలు ఎక్కువగా ఉన్న సౌదీ అరేబియా నుంచే అమెరికా తర్వాత ఎక్కువ మొత్తం ఆర్థిక వనరులు వలసదారుల మాతృదేశాలకు తరలిపోతున్నాయి. 2015 సంవత్సరంలో సౌదీ నుంచి 4,570 కోట్ల డాలర్లు తరలిపోగా, లెబనాన్ 140 కోట్లు, మయన్మార్ 95.40 కోట్లు, సిరియా 47.40 కోట్ల డాలర్లు అందుకున్నాయి. ఇలా వలసదారుల నుంచి అందిన సొమ్మును వారి బంధువులు ఎక్కువగా తిండి, ఇంటి అవసరాలకే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఈ మొత్తాలు ఓ దేశం అధికారికంగా అందించే ఆర్థిక సహాయంకన్నా ఎక్కువగాను, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకన్నా తక్కువగాను ఉంటున్నాయి. 2015 లో అమెరికా నుంచి ఇతర దేశాలకు బదిలీ అయిన డబ్బు $ 133,552,000,000 2015 లో జర్మనీ నుంచి ఇతర దేశాలకు బదిలీ అయిన డబ్బు $ 22,861,000,000 2015 లో సౌదీ అరేబియా నుంచి ఇతర దేశాలకు చేరిన డబ్బు $ 45,739,000,000 -
సౌదీలో రాయికల్ వాసి మృతి
రాయికల్ : రాయికల్‌కు చెందిన గొల్లపల్లి హరీందర్ (46) అనే కార్మికుడు అనారోగ్యంతో సౌదీలో మృతిచెందాడు. తొమ్మిదేళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీ వెళ్లిన హరీందర్ వారం క్రితం అనారోగ్యంతో మృతిచెందగా.. కుటుంబీకులకు ఆలస్యంగా సమాచారం అందింది. విషయం తెలుసుకున్న కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేలా చర్యలు చేపట్టాలని వారు వేడుకుంటన్నారు.