Milad-Un-Nabi
-
రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు
-
సీఎం జగన్ మిలాద్–ఉన్–నబీ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుగు రాష్ట్రాల ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత, ప్రపంచ శాంతి.. మహ్మద్ ప్రవక్త మానవాళికి ఇచ్చిన గొప్ప సందేశాలని చెప్పారు. అల్లాహ్ దీవెనలతో అందరికీ మంచి జరగాలని సీఎం జగన్ మనసారా ఆకాంక్షించారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత, ప్రపంచ శాంతి మహ్మద్ ప్రవక్త మానవాళికి ఇచ్చిన గొప్ప సందేశాలు. మహ్మద్ ప్రవక్త పుట్టినరోజు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముస్లిం సోదరసోదరీమణులందరికీ శుభాకాంక్షలు. అల్లాహ్ దీవెనలతో అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) October 9, 2022 చదవండి: (కుప్పం కోసం కుస్తీ: ఫోన్లు చేసినా.. బుజ్జగించినా.. మాకొద్దు బాబూ!) -
Eid Milad-un-Nabi: 19న సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: మిలాద్-ఉన్-నబీ పండుగు సెలవును అక్టోబర్ 20వ తేదీకి బదులుగా 19కి మారుస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, నిన్నటి రోజున యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సెలవు దినాన్ని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో ప్రభుత్వం సెలవును మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
వైఎస్ జగన్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు
హైదరాబాద్ : మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా కూడా ఆయన ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ శాంతి, సంతోషం, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు. శాంతి సామరస్యాలతో, సోదర భావంతో మెలగాలని ప్రవక్త సందేశమిచ్చారని వైఎస్ జగన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముస్లింలు సోమవారం మిలాద్ ఉన్ నబీ పండుగను జరుపుకుంటున్నారు. Milad-un-Nabi greetings to all my brethren. Wishing you, your family and loved ones, peace, happiness and prosperity on this pious occasion — YS Jagan Mohan Reddy (@ysjagan) 12 December 2016 -
ఘనంగా మిలాద్-ఉన్-నబీ
సిటీబ్యూరో: మహ్మద్ ప్రవక్త జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో గురువారం మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ ధార్మిక, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వాడవాడలా మిలాద్ వేదికలను ఏర్పాటు చేశారు. పేదలకు అన్నదానం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు యువకులు పచ్చజెండాలు పట్టుకొని బైక్ ర్యాలీ నిర్వహిస్తూ నినాదాలతో హోరెత్తించారు. పాతబస్తీలో జరిగిన ప్రదర్శనలో వేలాది మంది యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు, ఇస్లామిక్ స్కాలర్స్ హాజరయ్యారు. ఆల్ ఇండియా మజ్లిస్ తామీర్-ఏ-మిల్లత్ ఆధ్వర్యంలో నిజాం కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. మిలాద్ ప్రదర్శన సందర్భంగా ఎలాంటి అవాంఛనీ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.