
సాక్షి, అమరావతి: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత, ప్రపంచ శాంతి.. మహ్మద్ ప్రవక్త మానవాళికి ఇచ్చిన గొప్ప సందేశాలని చెప్పారు. అల్లాహ్ దీవెనలతో అందరికీ మంచి జరగాలని సీఎం జగన్ మనసారా ఆకాంక్షించారు.
సాటి మనుషుల పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత, ప్రపంచ శాంతి మహ్మద్ ప్రవక్త మానవాళికి ఇచ్చిన గొప్ప సందేశాలు. మహ్మద్ ప్రవక్త పుట్టినరోజు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముస్లిం సోదరసోదరీమణులందరికీ శుభాకాంక్షలు. అల్లాహ్ దీవెనలతో అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 9, 2022
చదవండి: (కుప్పం కోసం కుస్తీ: ఫోన్లు చేసినా.. బుజ్జగించినా.. మాకొద్దు బాబూ!)
Comments
Please login to add a commentAdd a comment