ఘనంగా మిలాద్-ఉన్-నబీ | Milad-un-Nabi celebrated | Sakshi
Sakshi News home page

ఘనంగా మిలాద్-ఉన్-నబీ

Dec 24 2015 11:45 PM | Updated on Sep 3 2017 2:31 PM

ఘనంగా మిలాద్-ఉన్-నబీ

ఘనంగా మిలాద్-ఉన్-నబీ

మహ్మద్ ప్రవక్త జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో గురువారం మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా

సిటీబ్యూరో: మహ్మద్ ప్రవక్త జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో గురువారం మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ ధార్మిక, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వాడవాడలా మిలాద్ వేదికలను ఏర్పాటు చేశారు. పేదలకు అన్నదానం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు యువకులు పచ్చజెండాలు పట్టుకొని బైక్ ర్యాలీ నిర్వహిస్తూ నినాదాలతో హోరెత్తించారు. పాతబస్తీలో జరిగిన ప్రదర్శనలో వేలాది మంది యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు, ఇస్లామిక్ స్కాలర్స్ హాజరయ్యారు.

ఆల్ ఇండియా మజ్లిస్ తామీర్-ఏ-మిల్లత్ ఆధ్వర్యంలో నిజాం కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. మిలాద్ ప్రదర్శన సందర్భంగా ఎలాంటి అవాంఛనీ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement