Mild earthquake
-
అద్దంకిలో స్వల్ప భూప్రకంపనలు
అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకిలో శనివారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో రెండు సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ వారంలో భూప్రకంపనలు సంభవించడం ఇది రెండో సారి అని స్థానికులు వెల్లడించారు. ఈ భూప్రకంపనలు వల్ల ఏలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించ లేదని సమాచారం. -
హిమాచల్ ప్రదేశ్లో స్వల్ప భూకంపం
-
భూప్రకంపనలపై అప్రమత్తమైన యంత్రాంగం
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలపై ఇంఛార్జీ కలెక్టర్ హరి జవహర్ లాల్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. భూ ప్రకంపనలు వచ్చిన ప్రాంతాల నుంచి వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. జియాలజిస్ట్ లతో చర్చించి ప్రకంపనలకు గల కారణాలు తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తమ ఇంట్లో కూడా సుమారు 3 సెకన్ల పాటు భూమి కంపించినట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటనతో జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని హరి జవహర్ లాల్ తెలిపారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో బుధవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. ప్రకాశం జిల్లా ఒంగోలు, అద్దంకి, కొరిశపాడు తదితర ప్రాంతాల్లో, మరోవైపు గుంటూరు జిల్లాలోనూ చిలకలూరి పేట మండలం మద్ధిరాల, రాజాపేట, ఎడవల్లి, మురికిపూడి గ్రామాల్లో భూప్రకంపనలు వచ్చాయి. -
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భూప్రకంపనలు
-
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భూప్రకంపనలు
హైదరాబాద్ : గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో బుధవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. ప్రకాశం జిల్లా . ఒంగోలు, అద్దంకి, కొరిశపాడు తదితర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడి లేచారు. భయంతో వారంతా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొరిశపాడు మండలంలోని పలు గ్రామాల్లో ఉదయం 6.10 గంటలకు ప్రారంభమైన భూ ప్రకంపనలు కొన్ని క్షణాల పాటు కొనసాగాయి. మరోవైపు గుంటూరు జిల్లాలోనూ భూమి నాలుగు క్షణాలపాటు కంపించింది. చిలకలూరి పేట మండలం మద్ధిరాల, రాజాపేట, ఎడవల్లి, మురికిపూడి గ్రామాల్లో భూప్రకంపనలు వచ్చాయి. మూడు నెలల క్రితం కూడా ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. -
భారత్ - మయన్మార్ సరిహద్దులో భూకంపం
మణిపూర్: భారత్ - మయన్మార్ సరిహద్దులో ఆదివారం భూంకంప సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కెల్పై 5గా గుర్తించారు. సరిహద్దుల్లోన్ని ప్రజలు మాత్రం భయంలో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్ణం కానీ సంభవించ లేదని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం 11.08 నిమిషాలకు ఈ భూకంపం సంభవించిందని చెప్పారు. ప్రపంచంలో అత్యధిక భూకంపం సంభవించే ప్రాంతాలలో జాబితాలో ఈశాన్యంలోని ఏడు రాష్ట్రాలు ఆరో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.