హైదరాబాద్ : గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో బుధవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. ప్రకాశం జిల్లా . ఒంగోలు, అద్దంకి, కొరిశపాడు తదితర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడి లేచారు. భయంతో వారంతా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొరిశపాడు మండలంలోని పలు గ్రామాల్లో ఉదయం 6.10 గంటలకు ప్రారంభమైన భూ ప్రకంపనలు కొన్ని క్షణాల పాటు కొనసాగాయి.
మరోవైపు గుంటూరు జిల్లాలోనూ భూమి నాలుగు క్షణాలపాటు కంపించింది. చిలకలూరి పేట మండలం మద్ధిరాల, రాజాపేట, ఎడవల్లి, మురికిపూడి గ్రామాల్లో భూప్రకంపనలు వచ్చాయి. మూడు నెలల క్రితం కూడా ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే.
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భూప్రకంపనలు
Published Wed, Feb 25 2015 8:22 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement