milishiya
-
ఆంధ్ర-ఒడిషా సరిహద్దుల్లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర-ఒడిషా సరిహద్దుల్లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. పెదబయలు కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఎమ్మెల్యే సర్వేశ్వరరావును కాల్చి చంపిన కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇదిలా ఉండగా.. మంగళవారం 60 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరో 30 మంది మిలీషియా సభ్యులు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు. -
మావోయిస్టు మిలీషియా కమాండర్ అరెస్టు
జి.మాడుగుల(పాడేరు): మావోయిస్టు మండ ల మిలీషియా కమాండర్ పాంగి భీమన్న అలియాస్ మల్లేశ్వరరావును స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. జి.మాడుగుల పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ విజయ్‌కుమార్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. జి.మాడుగుల మండలంలో నుర్మతి రోడ్డు కంబాలు బయలు గ్రామం సమీపంలో గురువారం వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న పాంగి భీమన్నను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్టు చెప్పారు. మావోయిస్టు పార్టీలో మిలీషియా సభ్యుడిగా పని చేస్తున్నట్టు తేలిందని ఆయన చెప్పారు. మండలంలో బొయితిలి పంచాయతీ మండిభ గ్రామానికి చెందిన పాంగి భీమన్న అలియాస్ మల్లేశ్వరరావు 12 సంవత్సరాలు నుంచి మావోయిస్టు మిలీషియా సభ్యుడిగా పని చేస్తూ, మండల పరిధిలో మిలీషియా కమాండర్‌గా వ్యవహరిస్తున్నట్టు ఆయన తెలిపారు. నుర్మతి–మద్దిగరువు రోడ్డులో వేర్వేరు ప్రాంతాల్లో నాలుగు పొక్లెయిన్లను దగ్ధం చేసిన ఘటన, మద్దిగరువుకు చెందిన కొలకాని సూర్యా, ముక్కల కిశోర్‌కుమార్‌లను హతమార్చిన సంఘటన, పెదబయలు మండల జక్కం వద్ద మందుపాతర పేల్చిన సంఘటనలో భీమన్న అలియాస్ మల్లేశ్వరరావు పాత్ర ఉన్నట్టు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. భీమన్నను మావోయిస్టులు బలవంతగా తీసుకెళ్లి ఈ ఘటనలు చేయించారని ఆయన చెప్పారు. భీమన్నపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలిస్తున్నట్టు సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. మావోయిస్టు మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోతే ఎటువంటి కేసులు లేకుండా వారి ఇళ్లకు పంపించేస్తామని సీఐ చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఐ శ్రీను పాల్గొన్నారు. -
మిలీషియా కమాండర్ అరెస్టు
కాకినాడ క్రైం (కాకినాడ సిటీ): మావోయిస్ట్‌లకు కొరియర్‌గా పనిచేస్తూ.. కార్యకలాపాలకు ఆకర్షితుడిగా మారి 37 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి కారణమైన మిలీషియా కమాండర్‌ని చింతూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మిలీషియా కమాండర్ అరెస్ట్ వివరాలను సోమవారం కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా చీపూరుగూడెంకి చెందిన ఇరవై ఏళ్ల మిలీషియా కమాండర్ మదివి మాస అలియాస్ (పండమాస, సుభాష్ మహేష్, పద,సురేష్) అయిదేళ్లుగా మావోయిస్ట్ కార్యాకలాపాల్లో పాల్గొంటున్నాడు. చీపురుగూడెంలో హిడుమల్ ఎస్‌జడ్‌సీఎం, డీకేఎస్‌జడ్‌సీఎం బెటాలియన్ కమాండర్ ద్వారా మావోయిస్ట్ పార్టీలో చేరి, మరో 30 మందితో 15 రోజులు ఎలమగొండలో మావోయిస్ట్ దళంతో రన్నింగ్, 303, 12 బోర్ రైఫిల్ ఫైరింగ్ వంటి వాటిలో ప్రత్యేక తర్ఫీదు పొందాడు. మావోయిస్ట్ హిడుమల్ ఆధ్వర్యంలో సప్లయ్ టీం సభ్యుడిగా చేరి సుమారు రూ.10.50 లక్షలతో మావోయిస్ట్‌లకు అవసరమైన మోటార్ బైక్, మందులు, మొబైల్స్, టాబ్స్,12 వాట్స్ బేటరీస్, వైర్ బండిల్స్,క్లాత్స్,కిట్ బేగ్స్, రేషన్, పెట్రోలు, డీజిల్, తుపాకులు కొనుగోలు చేసి సరఫరా చేసేవాడు. అనంతరం మిలీషియా కమాండర్‌గా మారి అనేక సంఘటనల్లో పాల్గొన్నాడు. ఈ ఏడాది మార్చి 11, ఏప్రిల్ 24వ తేదీల్లో చత్తీస్‌గఢ్ జిల్లా భుర్కంపాల్ సంఘటనల్లో 37 మంది సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసి హతమార్చిన సంఘటనలో నిందితుడిగా ఉన్నాడు. ఇతడిపై ఒడిశా ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డును ప్రకటించింది. శుక్రవారం చింతూరు డివిజన్ ఏటపాక మండలం పిచుకులపాడు టి.జంక్షన్ వద్ద ఉన్నతాధికారుల ఆదేశాలపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా భద్రాచలం వైపు నుంచి వస్తున్న ఆటోను తనిఖీ చేస్తుండగా ఆటోలో నుంచి నుంచి దూకి పారిపోతున్న వ్యక్తిని పట్టుకుని విచారణ చేయగా మిలిషీయా కమాండర్‌గా గుర్తించి అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. మావోయిస్ట్ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ సత్ఫలితాలు సాధిస్తున్న ఐపీఎస్ ఓఎస్డీ అంబురాజన్ను అభినందించారు. నక్సల్స్ కార్యకలాపాలపై మరింత నిఘా పెంచాలని కోరారు. చింతూరు ఓఎస్డీ అంబురాజన్, ఓఎస్డీ వై.రవిశంకర్‌రెడ్డి, డీఎస్పీ దిలిప్ కిరణ్,సీఐ ఆర్. రవికుమార్ పాల్గొన్నారు. -
ఏడుగురు మిలీషియా సభ్యుల అరెస్టు
చింతూరు (రంపచోడవరం): మావోయిస్టులకు సహకరిస్తున్న ఏడుగురు మిలీషియా సభ్యులను అరెస్టు చేసినట్టు చింతూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్ శుక్రవారం తెలిపారు. చింతూరు సబ్ డివిజ¯ŒS పరిధిలోని ఏడుగురాళ్లపల్లి, పేగ ప్రాంతాల్లో మందుపాతర్లు అమర్చడం, చెట్లు నరకడం, రహదారులు తవ్వడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మావోయిస్టు దళ సభ్యులకు వీరు సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన మావోయిస్టు ఘటనలకు సంబం ధించి లోతుగా దర్యాప్తు చేపట్టగా మిలీషియా సభ్యుల సహకారం వెలుగులోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. చింతూరు మండలం పూంగుట్టకు చెందిన కుంజా రాజు, దిరిడి అడమయ్య, ముచ్చిక మాడయ్య, దిరిడి గంగయ్య, బోరింగుంపుకు చెందిన సోడె అడమయ్య, కలిగుండంకు చెందిన పూనెం రాజు, చత్తీస్‌గఢ్ రాష్ట్రం బాలంతోగుకు చెందిన ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. పేలుడు ఘటనలో ఇద్దరు మృతి: ఈనెల 27వ తేదీన భారత్‌బంద్ సందర్భంగా జాతీయ రహదారిపై మందుపాతర అమర్చేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో అది పేలడంతో చింతూరు మండలం బండిగుంపుకు చెందిన కోటేష్ అలియాస్ నందు, గొల్లగుప్పకు చెందిన ఐతు అలియాస్ సురేష్‌లు మృతిచెందారని డీఎస్పీ తెలిపారు. కోటేష్ అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రంగా గాయపడిన ఐతును సహచరులు చత్తీస్‌గఢ్ రాష్ట్రం బాలంతోగు గ్రామం వద్ద పడేశారన్నారు. మృతదేహం వద్ద లభించిన ఆధార్‌కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారమివ్వడంతో తల్లిదండ్రులు వెళ్లి ఐతు మృతదేహాన్ని గొల్లగుప్పకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ దుర్గాప్రసాద్, ఎస్ఐ శ్రీనివాస్‌కుమార్ పాల్గొన్నారు.