ఏడుగురు మిలీషియా సభ్యుల అరెస్టు
Published Fri, Mar 10 2017 11:30 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
చింతూరు (రంపచోడవరం):
మావోయిస్టులకు సహకరిస్తున్న ఏడుగురు మిలీషియా సభ్యులను అరెస్టు చేసినట్టు చింతూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్ శుక్రవారం తెలిపారు. చింతూరు సబ్ డివిజ¯ŒS పరిధిలోని ఏడుగురాళ్లపల్లి, పేగ ప్రాంతాల్లో మందుపాతర్లు అమర్చడం, చెట్లు నరకడం, రహదారులు తవ్వడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మావోయిస్టు దళ సభ్యులకు వీరు సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన మావోయిస్టు ఘటనలకు సంబం ధించి లోతుగా దర్యాప్తు చేపట్టగా మిలీషియా సభ్యుల సహకారం వెలుగులోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. చింతూరు మండలం పూంగుట్టకు చెందిన కుంజా రాజు, దిరిడి అడమయ్య, ముచ్చిక మాడయ్య, దిరిడి గంగయ్య, బోరింగుంపుకు చెందిన సోడె అడమయ్య, కలిగుండంకు చెందిన పూనెం రాజు, చత్తీస్‌గఢ్ రాష్ట్రం బాలంతోగుకు చెందిన ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
పేలుడు ఘటనలో ఇద్దరు మృతి: ఈనెల 27వ తేదీన భారత్‌బంద్ సందర్భంగా జాతీయ రహదారిపై మందుపాతర అమర్చేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో అది పేలడంతో చింతూరు మండలం బండిగుంపుకు చెందిన కోటేష్ అలియాస్ నందు, గొల్లగుప్పకు చెందిన ఐతు అలియాస్ సురేష్‌లు మృతిచెందారని డీఎస్పీ తెలిపారు. కోటేష్ అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రంగా గాయపడిన ఐతును సహచరులు చత్తీస్‌గఢ్ రాష్ట్రం బాలంతోగు గ్రామం వద్ద పడేశారన్నారు. మృతదేహం వద్ద లభించిన ఆధార్‌కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారమివ్వడంతో తల్లిదండ్రులు వెళ్లి ఐతు మృతదేహాన్ని గొల్లగుప్పకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ దుర్గాప్రసాద్, ఎస్‌ఐ శ్రీనివాస్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement