Mineral salts
-
ఖనిజ లవణ మిశ్రమం ప్రాముఖ్యత
పశువు ఆరోగ్య రక్షణలో, పునరుత్పత్తిలో ఖనిజ లవణాలు ప్రముఖ పాత్రవహిస్తాయి. ఇవి జీవ రసాల(హార్మోన్స్) పని తీరును ప్రభావితం చేసి తద్వారా శరీరంలో జరిగే జీవ చర్యలను నియంత్రిస్తాయి. జీవరసాలు వాటి సామర్థ్యం మేరకు ప్రతిభావంతంగా పని చేయడానికి ఖనిజ లవణాలు అవసరం. ముఖ్యమైన ఖనిజ లవణాలు: 1. కాల్షియం 2. ఫాస్ఫరస్ 3. సోడియం 4. పొటాషియం 5. కాపర్ 6. కోబాల్ట్ 7. మెగ్నీషియం 8. క్లోరిన్ 9. ఐరన్. ఖనిజ లవణాల లోపం ఏర్పడితే పశువు ఎదుగుదల, జీర్ణప్రక్రియ, పునరుత్పత్తి ప్రక్రియలలో సమస్యలు ఏర్పడతాయి. ఖనిజ లవణ మిశ్రమం వాడకం వలన లాభాలు : ♦ దూడలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ♦ పశువులలో రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది. ♦ పెయ్య పడ్డలు సకాలంలో తొలి ఎదను చూపుతాయి. ♦ పాడి పశువుల పునరుత్పత్తి చక్రం సక్రమంగా జరుగుతుంది. ♦ పాల దిగుబడి పెరుగుతుంది. ♦ చూడి పశువులు ఈనిన తర్వాత పశువులలో మెయ్య దిగడం (ప్రొలాప్స్) లాంటి సమస్యలు ఉండవు. ♦ పశువుల ఈనిన తర్వాత వచ్చే మాయ పడకపోవడం, పాల జ్వరం లాంటి సమస్యలను నివారించవచ్చు. ♦ పశువులు బట్టలు, మట్టి, కాగితాలు లాంటి పదార్థాలు తినటం, మూత్రం తాగడం వంటి దురలవాట్లకు లోనుకావు. ♦ పశువుల చర్మం నిగనిగలాడుతూ ఆరోగ్యకరంగా ఉంటుంది. ఖనిజ లవణం ఇవ్వవలసిన మోతాదు 1 దూడలకు.. 5–20 గ్రాములు రోజుకు ఒకసారి. 2 పెయ్యలు / పడ్డలకు.. 20–30 గ్రాములు రోజుకు ఒకసారి. 3 పాడి పశువులకు.. 50–60 గ్రాములు రోజుకు ఒకసారి. 4 ఖనిజ లవణాన్ని దాణాతో కలిపి పశువుకు అందించాలి. గమనిక : ప్రతి ఈతకు మధ్య 14–15 నెలల వ్యవధి ఉండేలా పాడి రైతులు జాగ్రత్తపడాలి. పాడి పశువుల నుంచి, వాటి జీవితకాలంలో ఎక్కువ దూడలు, అధిక పాల ఉత్పత్తి పొందేలా శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఆర్థికంగా అభివృద్ధి పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
ఖనిజ, లవణాలు సమపాళ్లలో అందించాలి
దండేపల్లి : పశువులకు ఖనిజ, లవణాలు (మినరల్ మిక్చర్) సమపాళ్లలో అందించాలి. లేదంటే అనారోగ్యం, ఉత్పత్తి, పునరుత్పత్తి సమస్యలు తలెత్తుతాయి. ఖనిజ లవణాలు లోపించకుండా అన్ని పోషకాలతో కూడిన మిశ్రమాన్ని కలిపి ఇవ్వాలి. ఈ పోషకాలు లోపిస్తే రక్తహీనత, సరైన శరీర ఎదుగుదల ఉండకపోవడం..ఆలస్యంగా యుక్త వయస్సుకు రావడం, ఎదకు రాకపోవడం, మూగఎద, తిరిగిపొర్ల డం, పాడి పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గుతుందని లక్సెట్టిపేట పశుసంవర్ధకశాఖ అదనపు సహాయ సంచాలకులు వీరయ్య వివరించారు. పశువు ఆరోగ్యంలో ఖనిజ, లవణాల పాత్ర కీలకం పశువు ఆరోగ్యంలో ఖనిజ, లవణాల పాత్ర ఎనలేనిది. పశువు శరీరం సక్రమంగా పనిచేయడానికి పిండి పదార్థాలు, మాంసకృతులతోపాటు కొద్ది పరిమాణంలో ఖనిజ, లవణాలు, విటమిన్లు అవసరమవుతాయి. మొక్కలు, పశువుల్లో సుమారు 40శాతం ఖనిజ, లవణాలు ఉండగా వాటిలో 15శాతం మాత్రమే ప్రధానంగా అవసరమవుతాయి. పశువు శరీరంలో ఉండే పరిమాణం బట్టి స్థూల, సూక్ష్మపోషకాలుగా విభజించారు. శరీరానికి ఎక్కువ పరిమాణంలో అవసరమయ్యే స్థూల ఖనిజ , లవణాలైన కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, సోడియం క్లోరిన్, పోటాషియం, తక్కువ మోతాదులో అవసరమయ్యే సూక్ష్మ ఖనిజ లవణాలైన కాపర్, కోబాల్ట్, ఐరన్, జింక్, మాంగనీస్, అయోడిన్, సెలీనియం, ప్లోరిన్, మాలిబ్దమ్, క్రోమియం. ఖనిజ, లవణాల విధులు.. ఖనిజ, లవణాలు విడిగా కాకుండా ఇతర లవణాలతో కలిసి విధులు నిర్వహిస్తాయి. శరీరం లో జరిగే వివిధ జీవన ప్రక్రియలకు ఎంజైమ్‌లకు మధ్యవర్తిగా పనిచేస్తూ, సమతుల్యాన్ని కాపాడుతాయి. శరీరంలోని అన్ని రకాల ఎముకలు, దంతాల ఎదుగుదలకు, వాటి పటిష్టానికి , వెంట్రుకలు తయారీలో ఉపయోగపడతాయి. పశువు జీర్ణ ప్రక్రియ రక్త కణాల్లో హిమోగ్లోబిన్, తయారీ, రక్తం గడ్డకట్టుటకు తోడ్పడతాయి. పాల ఉత్పత్తి లోనూ, పునరుత్పత్తి, హార్మోన్స్, ఎంజైమ్‌ల తయారీలోనూ ప్రధాన పాత్ర పోషిస్తాయి. రక్తకణాల అభివృద్ధికి తోడ్పడతాయి. స్థూల పోషక లోపాలు- లక్షణాలు కాల్షియం : ఈ లవణం లోపిస్తే పునరుత్పత్తిపై పెద్దగా ప్రభావం చూపకపోయినా.. చూడి పశువుల్లో ‘మయ్య’(ఈనక ముందు, ఈనిన తర్వాత) సరిగా ఈన లేకపోవడం, ఈనిన తర్వాత పాల జ్వరం రావ డం జరుగుతుంది. మయ్య వేయకపోవడంతో పాల ఉత్పత్తి తగ్గుతుంది. లేగ దూడల్లో ఎముకలు అసమానంగా పెరుగుట వల్ల రికెట్స్ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. పెద్దపశువుల్లో ఎముకలు బలహీనపడి ‘అస్టియోషి మలేషియా’ వస్తుంది. ఎముకల పొడి, ఎండు చేపల దాణా, పప్పుజాతి గడ్డిలో కాల్షియం అధికంగా లభిస్తుంది. పాస్పరస్ : దీని లోపంతో యుక్త వయస్సు పశువుల్లో రికెట్స్, పెద్దపశువుల్లో ‘అస్టియో మలేషియా’ వ్యాధి వస్తుంది. అంతే కాకుండా మట్టి నాకుతాయి. తద్వారా ఆకలి మందగిస్తుంది. పాడి పశువుల్లో పాలదిగుబడి తగ్గుతుంది. పెరుగుదల లోపిస్తుంది. పెయ్యలు ఆలస్యంగా యుక్త వయస్సుకు వస్తాయి. కొన్నింటిలో మూగ ఎద, మరి కొన్నింటిలో పూర్తిగా ఎదకు రాక పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈతల మధ్య విరామం ఎక్కువగా ఉంటుంది. చూడిశాతం తక్కువగా ఉండడం.. తిరిగి పొర్లడం, వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎముకల పొడి, ఎండు చేపల దాణా, తవుడు , తృణధాన్యాలలో పాస్పరస్, అధికంగా ఉంటుంది. కాల్షియం, పాస్పరస్ ఎప్పుడు 2:1 నిష్పత్తిలో ఉండాలి. మెగ్నీషియం : ఈ లోపంతో ‘మెగ్నీషియం టెంటాని’ సంభవించి పశువు నీరసంగా ఉంటుంది. కేవలం పాలతోనే పెరిగే దూడల్లో మెగ్నీషియం లోపం ఏర్పడుతుంది. గోధుమలు, తవుడు, పప్పు జాతి పశుగ్రాసాల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. సోడియం, క్లోరిన్ : దీని లోపం పెద్దగా పైకి కనిపించదు. ఒకవేళ ఇది లోపిస్తే పశువుల్లో ఆకలి మందగిస్తుంది. పెరుగుదల ఉండదు. ఈ రెండు ఖనిజాలు ఉప్పు రూపంలో ఇవ్వవచ్చు. పోటాషియం : దీని లోపం అరుదుగా ఉంటుంది. ఇది లోపిస్తే పాడి పశువుల్లో పాల ఉత్పత్తి త గ్గి లేగ దూడల్లో పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. సూక్ష్మ పోషక లోపాలు-లక్షణాలు కాఫర్ : దీని లోపంతో పశుల్లో రక్తహీనత, వెంట్రుకలు రంగు మారుట, పెరుగుదల మందగించడం, నాడీ మండల వ్యాధులు, కండరాల బలహీనత, విరేచనాలు, పునరుత్పత్తి సమస్యలు, ఎదకు రాకపోవడం, ఆలస్యంగా యుక్త వయస్సుకు రావడం, తిరిగి పొర్లడం, మూగ ఎద లక్షణాలు కనిపిస్తాయి. గేదెల్లో శరీరంపై తెల్ల మచ్చలు ఏర్పడతాయి. గోధుమలు, తవుడు లో కాఫర్ అధికంగా ఉంటుంది. కోబాల్ట్ : ఈ దాతు లోపంతో పశువుల్లో ఆకలి, మందగించి రక్తహీనత ఏర్పడుతుంది. చర్మం బిరుసుగా ఉంటుంది. గేదెలు, ఆవుల్లో ఈతల మధ్య ఎక్కువ విరామం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐరన్ : దీని లోపం కేవలం పాల మీద మాత్రమే ఆధార పడే లేగదూడల్లో కనిపిస్తుంది. రక్త హీనత ఏర్పడుతుంది. పప్పు జాతి పశుగ్రాసాల్లో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. జింక్ : దీని లోపంతో పశువుల్లో ఎదుగుదల స్తంభిస్తుంది. చర్మవ్యాధులు, వెంట్రుకలు రాలుట అధికమై పశువులు మృత్యువాత పడతాయి. తువుడు, పిండి చెక్కల్లో జింక్ అధికంగా ఉంటుంది. అయోడిన్ : ఇది థైరాయిడ్ గ్రంథిలో ఉండి థైరాక్సిడ్ అనే హార్మోన్ ఉత్పత్తికి సహకరిస్తుంది. అయోడిన్ లోపంతో థైరాయిడ్ గ్రంథి పరిమాణం పెరిగి ‘గాడర్’ అనే వ్యాధి సోకుతుంది. చూడి పశువులకు వెంట్రుకలు లేని, బలహీనమైన దూడలు జన్మిస్తాయి. పునరుత్పత్తి సమస్యతో ఎదకు రాకపోవడం, చూడి కట్టకపోవడం, మాయ వేయకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మాంగనీసు : దీని లోపంతో పెరుగుదల మందగిస్తుంది. గర్బస్రావం జరుగుతుంది. ఎదకు రాకపోవడం, అండం ఆలస్యంగా విడుదల కావడం.. చూడి కట్టక పోవడం, మూగ ఎద లక్షణాలు, లేగ దూడల్లో కీళ్ల వాపు వస్తాయి. తవుడు, పశుగ్రాసాలు, ఎండు గడ్డిలో మాంగనీసు అధికంగా లభిస్తుంది. సెలీనియం : దీని లోపం వలన కీళ్లు గట్టిపడుతాయి. పశువులు కుంటుతాయి, శరీరం మీద, తోక వెంట్రుకలు రాలిపోతాయి. కండరాల బలహీనత, వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. పొదుగు వాపు వ్యాధులు కూడా వస్తాయి. క్రోమియం : ఈ ఖనిజ లోపంతో పశువుల్లో పెరుగుదల స్తంభిస్తుంది. కంటి సమస్యలు తలెత్తుతయి. ప్లోరిన్ : ఎముకలు, దంత నిర్మాణానికి ఇది కొంత మోతాదులో అవసరమవుతుంది. ఈ ఖనిజ లోపంతో ఏర్పడే సమస్యలు అరుదుగా ఉంటాయి. మారిబ్దనమ్ : వీటి లోపంతో పశువులు నీరసంగా ఉంటాయి. శరీరంపై గల వెంట్రుకలు బిరుసుగా మారతాయి. నేల ప్రభావంతో.. పశుగ్రాసాలు సాగుచేసే నేలలో ఖనిజ, లవణాలు లోపిస్తే ఆ నేలలో సాగు చేసిన మేతను తిన్న పశువులో ఆయా ఖనిజ లవణాల లోపాలు కనిపిస్తాయి. పశుపోషకులు ఈ పద్ధతులు పాటిస్తే పశుసంపద వృద్ధి చెంది ఆర్థికంగా ప్రయోజనం పొందవచ్చు. -
పశువుల పోషణలో ఖనిజ లవణాల పాత్ర కీలకం
కర్నూలు(అగ్రికల్చర్): పశువుల పెరుగుదలలో ఖనిజ లవణాలు కీలకమని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ విజయుడు (8790997493) తెలిపారు. ఇవి జీవ రసాయన చర్యలకు మూలమైన జీవరసాల(హార్మోన్స్) పనితీరును ప్రభావితం చేసి తద్వారా శరీరం లో జరిగే జీవ చర్యలను నియంత్రిస్తాయన్నారు. వాటి సామర్థ్యం మేరకు ప్రతిభావంతంగా పనిచేయడానికి ఇవి అవసరమవుతాయన్నారు. ఖనిజ లవణ మిశ్రమాలు - వాటి ప్రాధాన్యతను ఆయన వివరించారు. పశువులు ఆరోగ్యం పెరగడానికి, పునరుత్పత్తికి, పాల ఉత్పత్తికి ఖనిజ లవణాలు ఎంతో తోడ్పడతాయి. ప్రధానంగా కాల్షియం, పాస్పరస్, సోడియం, పొటాషియం, కాపర్, కోబాల్ట్, మెగ్నీషియం, క్లోరిన్, ఐరన్ వంటి ఖనిజ లవణాలు అవసరం. ఖనిజ లవణాల లోపం ఏర్పడితే పశువు ఎదుగుదల, జీర్ణ ప్రక్రియ, పునరుత్పత్తి ప్రక్రియల్లో సమస్యలు ఏర్పడతాయి. ఖనిజ లవణాల మిశ్రమంతో లాభాలు ఇవి.. దూడలు ఆరోగ్యంగా పెరుగుతాయి, పశువులలో రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది. పెయ్య పడ్డలు సకాలంలో తొలి ఎదను చూపుతాయి. పాడి పశువుల పునరుత్పత్తి చక్రం సక్రమంగా జరుగుతుంది. పాల దిగుబడి పెరుగుతుంది. చూడి పశువులలో మెయ్య దిగడం, (పొలాప్స్) వంటి సమస్యలు ఉండవు. పశువులలో ఈనిన తర్వాత వచ్చే మాయ పడకపోవడం, పాలజ్వరం లాంటి సమస్యలను నివారించుకోవచ్చు. పశువులు బట్టలు, మట్టి, కాగితాలు లాంటి అనవసర ఆహార పదార్థాలు తినడం, మూత్రం తాగడం వంటి దురలవాట్లకు లోను కావు. పశువుల చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. ఇవ్వాల్సిన మోతాదు... దూడలకు 5 నుంచి 20 గ్రాములు, పెయ్య దూడలకు 20 నుంచి 30 గ్రాములు, పాడి పశువులకు 50 నుంచి 60 గ్రాములు రోజుకు ఒక పర్యాయం ఇవ్వాలి. ఖనిజ లవణాన్ని దాణాతో కలిపి పశువులకు అందించాలి. ఇవి పశువైద్య కేంద్రాల్లో లభిస్తాయి. -
జీవాణువులు.. ముఖ్యాంశాలు
జీవం అనేది పరమాణువులు, సంశ్లిష్ట అణువులతో ఏర్పడింది. వాటిలో ప్రధానమైనవి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, న్యూక్లియిక్ ఆమ్లాలు, లిపిడ్లు మొదలైనవి. వీటిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు మనం తీసుకునే ఆహారంలో ప్రధాన భాగం. అంతేకాకుండా కొన్ని ఖనిజ లవణాలు, విటమిన్లు వంటివి కూడా జీవ క్రియల్లో ముఖ్య పాత్రను పోషిస్తాయి. కార్బోహైడ్రేట్లు: కార్బోహైడ్రేట్లు.. గ్లూకోజ్, చక్కెర (సుక్రోజ్) వంటి తక్షణ శక్తినిచ్చే పదార్థాలు. ఇవి మొక్కల్లో పిండి పదార్థాల (స్టార్‌చ) రూపంలో, జంతువుల్లో గ్లైకోజెన్, గడ్డి (సెల్యులోజ్) రూపంలో నిల్వ ఉంటాయి. వీటి సాధారణ ఫార్ములా: ఇ్ఠ(ఏ2ై)డ. ఇవి అనేక సంఖ్యలో హైడ్రాక్సీ ప్రమేయాలున్న ఆల్డిహైడ్లు లేదా కీటోనులు. రుచికి తీపిగా ఉండే కార్బోహైడ్రేట్లను చక్కెరలు అంటారు. ఉదాహరణ: నిత్యం మనం ఉపయోగించే చక్కెర. దీని రసాయన నామం సుక్రోజ్ (పాలలోని చక్కెర లాక్టోజ్, తేనెలోని చక్కెర ఫ్రక్టోజ్). పండిన ద్రాక్షలో గ్లూకోజ్ ఉంటుంది. ఇందులోని అత్యంత తియ్యనైన పదార్థం ఫ్రక్టోజ్. గ్రీకు భాషలో శాఖరాన్ అంటే చక్కెర అని అర్థం. అందుకే కార్బోహైడ్రేట్లను శాకరైడ్లు అని కూడా అంటారు. ఒక సంక్లిష్టమైన స్టార్‌చ (బియ్యం, గోధుమలు, ఆకుకూరల్లో ఉండేది), సెల్యులోజ్ (గడ్డి, పత్తి, కలపలో లభించేది) వంటి కార్బోహైడ్రేట్లను అ చక్కెరలు (ూౌటఠజ్చటట) అంటారు. సాధారణంగా కార్బోహైడ్రేట్లు కార్బన్(ఇ), హైడ్రోజన్ (ఏ), ఆక్సిజన్ (ై) అనే మూలకాలతో నిర్మితమవుతాయి. సెల్యులోజ్, స్టార్చను ‘జలవిశ్లేషణ’ అనే ప్రక్రియ ద్వారా విడగొడితే చివరగా వచ్చేది గ్లూకోజ్. అంటే ఇటుకలతో గోడ నిర్మాణమైనట్లు గ్లూకోజ్ అనే అణువుతో స్టార్‌చ, సెల్యులోజ్ అనే సంక్లిష్ట అణువులు రూపొందుతాయి. సెల్యులోజ్ అనే ఎంజైమ్ మానవుల్లో ఉండదు. కాబట్టి గడ్డి (సెల్యులోజ్ ) మానవుల్లో జీర్ణం కాదు. స్టార్చను ‘అయోడిన్’ ద్రావణంతో గుర్తిస్తారు. స్టార్‌చ అయోడిన్‌తో కలిసి నీలి రంగును ఇస్తుంది. పాలలో చిక్కదనం కోసం స్టార్చ్ (పిండి)ని కలిపితే అయోడిన్ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. చక్కెర పరిశ్రమలో లభించే మొలాసిస్‌లో సుక్రోజ్ ఉంటుంది. దీన్ని ఉపయోగించి ‘కిణ్వప్రక్రియ’ ద్వారా ఆల్కహాల్ తయారు చేస్తారు. బ్యాక్టీరియా, మొక్కల కణ త్వచాలు(ఇ్ఛ గ్చిట) కార్బోహైడ్రేట్ల ద్వారా నిర్మితమవుతాయి. కాగితం పరిశ్రమలో కూడా సెల్యులోజ్ (కలప)ను ఉపయోగిస్తారు. ప్రోటీన్లు: పప్పు ధాన్యాలు, చిక్కుళ్లు, బఠానీలు, చేపలు, మాంసం, పాలు, చీస్ తదితర ఆహార పదార్థాలలో ప్రధానంగా ఉండే మాంసకృత్తులనే ప్రోటీన్లుగా వ్యవహరిస్తారు. జీవుల నిర్మాణానికి, నిర్వహణకు, ఎదుగుదలకు ఇవి ఎంతో ముఖ్యమైనవి. రసాయనికంగా ఇవి ఎమైనో ఆమ్లాల ద్వారా నిర్మితమవుతాయి (ఎమైనో ఆమ్లాల పాలీమర్లు). వీటిలో ృఇైృూఏృ అనే ఎమైడ్ బంధం పునరావృతమవుతుంది. అందువల్ల వీటిని పాలీ ఎమైడ్‌లు అంటారు. ఇవి కార్బన్ (ఇ), హైడ్రోజన్(ఏ) నైట్రోజన్(ూ), ఆక్సిజన్ (ై)లతో రూపొందుతాయి. పట్టు (సిల్క్), వెంట్రుకలు, ఉన్నిలో లభించే ప్రోటీన్‌ను కెరొటిన్ అంటారు. కండరాల్లో ఉండే ప్రోటీన్ మియోసిన్. రక్తంలో ఆక్సిజన్‌ను మోసుకుపోయే ‘హిమోగ్లోబిన్’ కూడా ఒక రకమైన ప్రోటీన్. లోపభూయిష్ట ప్రోటీన్ ‘సికిల్‌సెల్ హిమోగ్లోబిన్’ కారణంగా ‘సికిల్‌సెల్ ఎనీమియా’ అనే రక్త లోప వ్యాధి కలుగుతుంది. మన శరీరంలోని వివిధ రసాయన చర్యల్లో జీవ ఉత్ప్రేరక ఎంజైములుగా కూడా ప్రోటీన్లు వ్యవహరిస్తాయి. జంతు కణజాలం ప్రోటీన్లతో నిర్మితమవుతుంది. చాలా వరకు రోగకారక క్రిముల నుంచి రక్షణ కల్పించే ‘యాంటీ బాడీస్’గా కూడా ప్రోటీన్లు పని చేస్తాయి. వేడి చేసినప్పుడు ప్రోటీన్లు జీవ చర్యా శీలత కోల్పోతాయి. దీన్నే ప్రోటీన్ స్వభావ వికలత (ప్రోటీన్ డీనాచురేషన్) అంటారు. ఉదాహరణ: నీటిలో మరిగించినప్పుడు గుడ్డులోని తెల్లసొన స్కందనం చెందడం. పాలలోని బ్యాక్టీరియా ఏర్పర్చిన లాక్టికామ్లం పాలను పెరుగుగా మార్చడం కూడా స్వభావ వికలత (పాలు పులిసినప్పుడు వచ్చే వాసనకు కారణం లాక్టికామ్లం) కిందకు వస్తుంది. లిపిడ్లు: నూనె గింజలు, నూనెలు, కొవ్వుల్లో లిపిడ్లు ఉంటాయి. ఇవి తక్కువ పరిమాణంలో ఎక్కువ శక్తినిచ్చే పదార్థాలు (ఎక్కువ కెలోరిఫిక్ విలువను కలిగి ఉంటాయి). రసాయనికంగా గ్లిజరాల్, ఫాటీ ఆమ్లాల ట్రైఎస్టర్లు. నీటిలో కరగవు. ఇవి సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో నూనెలుగా, ఘన రూపంలో కొవ్వులుగా ఉంటాయి. అందుకే గది ఉష్ణోగ్రత వద్ద నెయ్యి ఘన రూపంలో ఉంటుంది. చాలావరకు నూనెలు ఒకటి అంతకంటే ఎక్కువ కార్బన్-కార్బన్ ద్విబంధాల (అసంతృప్తత)ను కలిగి ఉంటాయి. వీటిని ‘నెకెల్)’ లోహం సమక్షంలో హైడ్రోజనీకరణం చేస్తే సంతృప్త ‘కొవ్వు’ (ఉదాహరణ: డాల్డా)లుగా రూపాంతరం చెందుతాయి. హైడ్రోజనీకరణం ద్వారా అసంతృప్త నూనెలు సంతృప్త కొవ్వులుగా మారతాయి. ఆరోగ్యానికి అసంతృప్త నూనెలు మేలు చేస్తాయి. నూనెలను సోడియం హైడ్రాక్సైడ్ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ వంటి క్షారాలతో చర్య జరిపి సపోనిఫికేషన్ అనే క్షారజల విశ్లేషణ పద్ధతి ద్వారా సబ్బులను తయారు చేస్తారు. సబ్బు అనేది ఫాటీ ఆమ్లాల సోడియం (బట్టల సబ్బు) లేదా పొటాషియం (స్నానానికి ఉపయోగించే సబ్బు) లవణం. గ్లిజరాల్ అనేది లిపిడ్ల సహ ఉత్పన్నం. కొన్ని ముఖ్యమైన ఫాటీ ఆమ్లాలు: లారిక్ ఆమ్లం (కొబ్బరి నూనె, వెన్న), స్టియరిక్ ఆమ్లం (వెన్న, జంతువుల కొవ్వు). ఇవి సంతృప్త ఫాటీ ఆమ్లాలు. ఓలియిక్ ఆమ్లం(పత్తి, సోయా). ఇది అసంతృప్త ఫాటీ ఆమ్లం. దుర్వాసనను తొలగించే సబ్బులు, సూక్ష్మక్రిమి నాశక సబ్బులలో 3,4,5-ట్రైబ్రోమోసాలిసిలానిలైడ్ ఉంటుంది. మాయిశ్చరైజింగ్ పారదర్శక సబ్బులలో గ్లిజరాల్ ఉంటుంది. సాధారణ సబ్బులు కఠిన జలం (ఉప్పునీరు)తో నురగనివ్వవు. అందువల్ల అవి ఉప్పు నీటిలో తెల్లని అవక్షేపాన్నిచ్చి శుభ్రపరిచే గుణాన్ని కోల్పోతాయి. ఈ విషయంలో డిటర్జెంటులు మెరుగ్గా పని చేస్తాయి. ఇవి కఠిన జలంతో కూడా నురగనిస్తాయి. రసాయనికంగా ఇవి ఆల్కైల్ బెంజీన్ సల్ఫానేట్లు లేదా ఫాటీ ఆల్కహాల్‌ల సల్ఫేట్ లవణాలు. హార్మోన్లు: జీవ కణాల మధ్య వార్తాహరులుగా పనిచేసేవి హార్మోన్లు. వీటిని ఎండోక్రైన్ గ్రంథులు ఉత్పత్తి చేసి నేరుగా రక్తంలోకి విడుదల చేస్తాయి. హార్మోన్లు పలు రకాలుగా ఉంటాయి. అవి..రసాయనికంగా లభించే స్ట్టెరాయిడ్లు. ఉదాహరణ: ఈస్ట్రోజెన్, ఈ స్వడోల్ ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరోన్. ప్రోటీన్ హార్మోన్లు (పాలీపెప్టైడ్లు). వీటికి ఉదాహరణ: ఇన్సులిన్. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. ఎమైనో ఆమ్లాల ఉత్పన్నాల హార్మోన్. దీనికి ఉదాహరణ-థైరాక్సిన్. ఇది ఎదుగుదలకు దోహదం చేసే హార్మోన్. పాలీమర్లు: అతి చిన్న అణువులను నిర్మాణాత్మక యూనిట్లుగా తీసుకుని పెద్ద అణువులను తయారు చేసే ప్రక్రియను పొలిమరీకరణం అంటారు. చిన్న అణువును మోనోమర్లు అని, పొలిమరీకరణం ద్వారా చివరగా వచ్చే అణువులను పాలిమర్స్ అని అంటారు. సెల్యూలోజ్, రబ్బరు వంటివి సహజ పాలీమర్లు. వేడి లేదా ఒత్తిడికి గురి చేసినప్పుడు అనుకున్న ఆకృతులను పొందితే వాటిని ప్లాస్టిక్ అంటారు. ప్లాస్టిక్ రెండు రకాలు. వేడి చేసినప్పుడు మెత్తగా మారి, చల్లార్చగానే తమ ధర్మాలను తిరిగి పొందే వాటిని థర్మో ఎలాస్టిక్ ప్లాస్టిక్లు అంటారు. ఉదాహరణ-పాలిథీన్, పాలీవినైల్ క్లోరైడ్ (పీవీసీ), నైలాన్, సెల్యూలోజ్ ఎసిటేట్. అలాకాకుండా వేడి చేసినప్పుడు గట్టిగా మారే వాటిని థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ అంటారు. ఉదాహరణ-బెకలైట్. సహజ రబ్బరు ఐసోప్రీన్ పాలీమర్. దీనికి గట్టితనం కోసం నీటిని పీల్చుకునే ధర్మం తగ్గించడానికి సల్ఫర్‌ను కలిపి వేడి చేస్తారు. ఈ ప్రక్రియనే వల్కనైజేషన్గా వ్యవహరిస్తారు. విటమిన్లు: మన ఆహారంలో తీసుకోవాల్సిన కర్బన పదార్థాలు విటమిన్లు. వీటిని మొక్కలు సంశ్లేషించుకుంటాయి. కాని మానవ శరీరంలో సంశ్లేషం కావు. (కేవలం విటమిన్ ఉ మాత్రం సూర్యకాంతి సమక్షంలో శరీరంలో తయారవుతుంది). అ, ఈ, ఉ, ఓ విటమిన్లు కొవ్వు/నూనెలో.. ఆ, ఇ విటమిన్లు నీటిలో కరుగుతాయి. -
పశువులకు వీటి అవసరమూ ఉంటుంది!
పాడి-పంట: ఖనిజ లవణాల లోపం కారణంగా పశువులు అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. వాటిలో ఆలస్యంగా ఎదకు రావడం, తిరిగి పొర్లడం, గొడ్డుమోతుతనం ప్రధానమైనవి. పునరుత్పత్తి సమస్యలు కూడా ఎదురైతే ఈతల మధ్య అంతరం పెరుగుతుంది. అలాంటప్పుడు పాడి పశువుల పెంపకం లాభసాటిగా ఉండదు. ఆవు జాతి పశువు సంవత్సరానికి ఒక దూడను, గేదె 15 నెలలకు ఒక దూడను అందించగలిగినప్పుడే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. అలా ఉండాలంటే పశువులకు అవసరమైన ఖనిజాలను విధిగా అందించాలి. పశువులు ఖనిజాలను తమ శరీరంలో ఉత్పత్తి చేసుకోలేవు కాబట్టి వాటిని మేత ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మేత వనరుల్లో ఉండే ఖనిజాలు సైతం పూర్తి స్థాయిలో పశువులకు అందుబాటులో ఉండడం లేదు. ఫలితంగా రికెట్స్, ఆక్టియోమలేసియా, పైకా (విపరీతమైన ఆకలి), గిట్టల పెరుగుదలలో లోపం, చర్మం రంగును కోల్పోవడం, రక్తహీనత, మృత దూడలు పుట్టడం, గొంతువాపు, ఎదుగుదల లోపించడం, పాల దిగుబడి పడిపోవడం, పునరుత్పత్తి సామర్థ్యం తగ్గడం.... ఇలా అనేక ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. పాడి పశువుకు జన్యుపరంగా అధిక పాల దిగుబడినిచ్చే సామర్థ్యం ఉన్నప్పటికీ సమతుల్యమైన పోషణ లేకపోవడం వల్ల వాటి నుంచి పూర్తి స్థాయిలో ఉత్పాదకతను పొందలేకపోతున్నాము. వీటి అవసరం ఎక్కువ పాలలో 0.12% కాల్షియం, 0.10% భాస్వరం ఉంటాయి. పాడి పశువు శరీరానికి ఇవి తగినంత లభిస్తే పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఆవులతో పోలిస్తే గేదెలకు కాల్షియం అవసరం ఎక్కువ. ఎందుకంటే గేదె పాలలో వెన్న శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి మేతలో కొవ్వు పదార్థాలను ఎక్కువగా అందించాలి. అలాగే కొన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉత్పత్తి కావడానికి గంధకం చాలా అవసరం. విటమిన్ల తయారీకి కూడా గంధకం అవసరమవుతుంది. పశువు రక్తంలో కాల్షియం, భాస్వరం సరైన నిష్పత్తిలో ఉండాలి. లేకపోతే ఎముకల్లో నిల్వ ఉండే కాల్షియం రక్తంలోకి చేరుతుంది. అనంతరం ఆ పశువు అందించే పాలను తాగడం ద్వారా మన శరీరంలోకి చేరుతుంది. సాధారణ పశువు ఈనిన తర్వాత పాలజ్వరం, హైపోకాల్షియం (రక్తంలో కాల్షియం తగ్గడం) వంటి లక్షణాలు కన్పిస్తాయి. వీటిని నివారించాలంటే చూడి సమయంలో పశువుకు అదనంగా కాల్షియం ఇవ్వాలి. ఎందుకంటే పాలజ్వరం వచ్చిన పశువుల్లో పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. పాలజ్వరం నుంచి తేరుకున్న తర్వాత పశువుకు పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి ఓ కారణం ఉంది. పాలజ్వరం బారిన పడిన పశువుకు చనుల కండరాలు వదులవుతాయి. సూక్ష్మక్రిములు చనుల రంధ్రాల ద్వారా పొదుగులోకి ప్రవేశించి వ్యాధిని కలిగిస్తాయి. కాబట్టి పశువుకు కాల్షియం, భాస్వరం, సోడియం, పొటాషియం, గంధకం వంటి ఖనిల లవణాల ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. అవసరం తక్కువే అయినా... పశువుకు రాగి (కాపర్), జింక్, మాంగనీస్, అయొడిన్, కోబాల్ట్, క్రోమియం వంటి ఖనిజాల అవసరం కూడా ఉంటుంది. కాకపోతే కాస్త తక్కువ పరిమాణంలో అందిస్తే చాలు. ఇవి కూడా పాల దిగుబడికి దోహదపడతాయి. ఇవి లోపిస్తే పశువులు తక్కువ మేత తింటాయి. బరువు కోల్పోతాయి. పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ఈనిన తర్వాత మాయ పడదు. పశువు ఈసుకుపోతుంది. దూడలు తక్కువ బరువుతో పుడతాయి. విటమిన్ ‘ఎ’తో జింక్ కలిసినప్పుడు పశువు పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. జననేంద్రియాల కణాల క్రమం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక రాగి ధాతువు జననేంద్రియ సంబంధమైన ఓవరీస్ పనితనాన్ని పెంచుతుంది. మాంగనీస్ ఖనిజం చాలా వరకు ఎంజైమ్ రసాయనిక చర్యల్లో పాలుపంచుకుంటుంది. ఈ ఖనిజం లోపిస్తే పశువు శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. పునరుత్పత్తి సమస్యలు ఎదురవుతాయి. పాల దిగుబడి తగ్గుతుంది. పశువు గర్భంలోని దూడ పెరగడానికి అయొడిన్ దోహపడుతుంది. ఇది లోపిస్తే పశువు గర్భంలోనే దూడలు చనిపోతాయి. చూడి పశువు ఈసుకుపోతుంది. పుట్టిన దూడలు కూడా బలహీనంగా ఉంటాయి. మగ పశువుల్లో సంపర్క సామర్థ్యం తగ్గిపోతుంది. ఖనిజాలను పశువు శరీరం ఉత్పత్తి చేయదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో... అంటే అధిక పాల దిగుబడికి, పునరుత్పత్తి సామర్థ్యం పెరగడానికి, ఎదుగుదలకు, జీర్ణ ప్రక్రియ సజావుగా సాగడానికి, వేసవిలో ఒత్తిడి లేకుండా ఉండడానికి విధిగా మేతలో ఖనిజ లవణాలను అందించాల్సి ఉంటుంది. డాక్టర్ ఎం.వి.ఎ.ఎన్.సూర్యనారాయణ సీనియర్ శాస్త్రవేత్త-అధిపతి పశు పరిశోధనా స్థానం, గరివిడి విజయనగరం జిల్లా ఒత్తిడిలో ఎంతో అవసరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు పశువులు ఒత్తిడికి గురవుతాయి. మేత తినడం తగ్గిపోతుంది. ఫలితంగా పశువులకు ఖనిజాల లభ్యత కూడా తగ్గుతుంది. పశువు తన శరీరంలోని వేడిని చెమట ద్వారా బయటికి పంపుతుంది. అంటే పొటాషియం, సోడియం, మెగ్నీషియం ఖనిజాలను ఎక్కువగా కోల్పోతుందన్న మాట. కాబట్టి వీటిని... ముఖ్యంగా పొటాషియంను మేత ద్వారా అందించాల్సి ఉంటుంది. ఈ ఖనిజం పాలలో 0.15% వరకు ఉంటుంది. అధిక పాల దిగుబడిని అందించే పశువులకు, వేసవిలో ఒత్తిడికి లోనయ్యే పశువులకు ఈ ఖనిజాన్ని తప్పనిసరిగా అందించాలి. ఎండలో పశువు రొప్పుతున్నప్పుడు లాలాజలం ఎక్కువగా బయటికి పోతుంది. దీనితోపాటు శరీరంలోని సోడియం బైకార్బొనేట్ కూడా పోతుంది. దీనిని మేత ద్వారా అందిస్తే పశువు ఆహార అవసరాలు తీరతాయి.