Mining authorities
-
సుప్రీం కోర్టు తీర్పు.. రూ.2 లక్షల కోట్లు నష్టం
ఖనిజాలు, గనులు కలిగిన భూమిపై పన్నులు విధించే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఫలితంగా మైనింగ్ కంపెనీలపై రూ.1.8 లక్షల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్ల వరకు భారం పడవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు వల్ల మైనింగ్, ఉక్కు, విద్యుత్, బొగ్గు రంగాల్లోని సంస్థలు గణనీయంగా ప్రభావితం అవుతాయని అంచనా.భారత అత్యున్నత న్యాయస్థానం ఇటీవల మైనింగ్ రాయల్టీ కేసును విచారించి తీర్పును వెలువరించింది. ఖనిజాలు, గనులు కలిగి ఉన్న భూమిపై పన్నులు విధించే అధికారం రాష్ట్రాలకు ఉందని కోర్టు తీర్పునిచ్చింది. దాంతో భారతీయ ఖనిజ పరిశ్రమల సమాఖ్య (ఫిమి) సుప్రీం తీర్పుపై ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయ మైనింగ్ రంగం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పన్ను రేట్లను ఎదుర్కొంటుందని ఫిమి పేర్కొంది.ఈ సందర్భంగా ఫిమి అడిషనల్ సెక్రటరీ జనరల్ బీకే భాటియా మాట్లాడుతూ..‘మైనింగ్ కంపెనీలు ఏప్రిల్ 1, 2005 నుంచి పొందిన రాయల్టీలను తిరిగి చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దాంతోపాటు మైనింగ్ భూమిపై పన్ను విధించే హక్కు రాష్ట్రాలకు ఉందని చెప్పింది. దాంతో కంపెనీలకు నష్టం వాటిల్లుతుంది. ఒడిశా, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లోని గనులు తీవ్రంగా దెబ్బతింటాయి. ఇప్పటికే అంతర్జాతీయంగా మైనింగ్ కంపెనీలు భారీగా పన్నులు చెల్లిస్తున్నాయి. సుప్రీం తీర్పు వల్ల అంతిమ ఉత్పత్తులపై ప్రభావం పడుతుంది. దాంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. పన్నుల విధానాన్ని స్థిరీకరించేందుకు, మైనింగ్ రంగం వృద్ధికి కేంద్ర ప్రభుత్వం శాసనపరమైన చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.ఇదీ చదవండి: వాట్సప్ స్టేటస్లు కాదు..వీరి గురించి తెలుసా..ఇదిలాఉండగా, ఖనిజాలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కంపెనీలు గత 12 ఏళ్ల నుంచి రాయల్డీ బకాయిలు చెల్లించడం భారం అవుతుంది. ఇప్పటికే చాలా ఉత్పత్తుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అధికమవుతుంది. దీనికితోడు సుప్రీంకోర్టు తీర్పుతో అంతిమ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని అంచనా. ఖనిజాలను ముడిసరుకుగా ఉపయోగించుకుని తయారయ్యే ప్రతి వస్తువుపై దీని ప్రభావం ఉంటుంది. కోర్టు తీర్పు పాటించాలంటే కంపెనీలు తన జేబులో నుంచి డబ్బులు వెచ్చించవు. తిరిగి వినియోగదారులపైనే ఆ భారాన్ని మోపుతాయి. దానివల్ల సామాన్యుడికే నష్టమని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. -
అనధికారిక మైనింగ్‌పై ఉక్కుపాదం మోపండి: మంత్రి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంకు మైనింగ్ ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్థి, మైనింగ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మైనింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి రామ్ గోపాల్‌తో పాటు పలువురు మైనింగ్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనింగ్ లీజులు, సీనరేజీ ద్వారా ప్రభుత్వానికి వస్తున్న రెవెన్యూపై సమీక్షించారు. మైనింగ్ కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, అవసరమైన అనుమతులు ఇవ్వాలని సూచించారు. అలాగే పోలవరం కుడి, ఎడమ కాలువల గట్లపై వున్న గ్రావెల్, మెటల్ నిల్వలను బ్లాక్‌లుగా వర్గీకరించి టెండర్లు పిలవాలని ఆదేశించారు. ఇప్పటికే ఇరిగేషన్, మైనింగ్ అధికారుల సంయుక్త తనిఖీలో సుమారు ఆరు కోట్ల క్యూబిక్ మీటర్ల గ్రావెల్, మెటల్ నిల్వలను గుర్తించారని, వాటికి ప్రతి అయిదు కిలోమీటర్లకు ఒక ప్యాకేజీగా టెండర్లు పిలవాలని సూచించారు. ఏపీఎండీసీ ద్వారా ఈ టెండర్ల ప్రక్రియను వారం రోజుల్లో ప్రారంభించాలని అన్నారు. మొత్తం 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రావెల్‌ను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చాలని అన్నారు. మేజర్, మైనర్ మినరల్స్‌కు సంబంధించిన మైనింగ్‌ను కూడా ఫస్ట్ కం ఫస్ట్ విధానంకు బదులుగా ఆక్షన్ విధానంను అమలు చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని అన్నారు. దీనికి సంబంధించిన నిబంధనలను సమీక్షించాలని మైనింగ్ అధికారులకు సూచించారు. రెవెన్యూ బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలి రాష్ట్రంలో మైనింగ్ శాఖ ద్వారా రావాల్సిన రెవెన్యూ బకాయిలు అవసరమైతే వన్ టైం సెటిల్ మెంట్ ద్వారా క్లియర్ చేయాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న మైనింగ్ దరఖాస్తులను నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఓఎన్జీసీ నుంచి మైనింగ్ శాఖకు రావాల్సిన రూ. 237 కోట్లను కూడా వసూలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో మైనింగ్ శాఖ ఇచ్చిన అనుమతులకు మించి అక్రమంగా మైనింగ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్న క్వారీలపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే విజిలెన్స్ విచారణలో అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న సంస్థల అనుమతులను శాశ్వతంగా రద్దు చేయడంతో పాటు అక్రమ మైనింగ్‌పై పెనాల్టీలను కూడా విధించాలని అన్నారు. మహాచెక్ పేరుతో గతంలో జరిగిన తనిఖీల్లో అనధికారికంగా జరిగిన మైనింగ్‌కు పెనాల్టీలను వసూలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో కొత్త మైనింగ్ ప్రాంతాలను గుర్తించేందుకు నిర్ధేశించిన 'మెరిట్' సంస్థ పనితీరు పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అపారమైన ఖనిజ నిల్వలు ఉన్నాయని, వాటిని గుర్తించడం, మైనింగ్ కోసం ఔత్సాహిక సంస్థలకు సమాచారంను అందించడం వంటి కార్యక్రమాల్లో మెరిట్ మరింత చొరవ తీసుకోవాలని సూచించారు. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రయోగాత్మకంగా మైనింగ్ లీజుల వసూళ్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే నిర్ణయంలో భాగంగా అమలుకు సంబంధించిన విధివిధానాలపై చర్చించారు. ప్రతి క్వారీ నుంచి లీజులు వసూలు చేసేందుకు రూపొందించిన ఆన్ లైన్ పోర్టల్స్‌ను పరిశీలించారు. -
అక్రమార్కులకు ‘తెల్ల’బంగారం
సైదాపురం, న్యూస్‌లైన్: అక్రమార్కులకు క్వార్ట్జ్, పల్స్‌ఫర్, వర్ముఖ్లైట్ ఖనిజం ‘తెల్లరాయి’ బంగారంగా మారింది. ఈ ఖనిజానికి దేశంతో పాటు విదేశాల్లో కూడా మంచి గిరాకీ ఉంది. దీంతో అక్రమార్కులు అడ్డూఅదుపు లేకుండా నిరాటంకంగా అక్రమ తవ్వకాలు చేపట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అనుమతులు ఒకచోట తీసుకుని మరొక చోట తవ్వకాలు చేపట్టి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. అక్రమ మార్గంలో సేకరించిన క్వార్ట్జ్, పల్స్‌ఫర్, వర్ముఖ్లైట్ ఖనిజాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారు. ఇటీవల కాలంలో ఖనిజాన్ని లారీల్లో రూటు మార్చి తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీకి గండిపడుతోంది. మైనింగ్ అధికారులు తమకేమీ పట్టనట్టు నిద్రమత్తులో ఉన్నారు. సైదాపురం పరిసర ప్రాంతాల్లో క్వార్ట్జ్ తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ భూముల్లో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు నిరాటంకంగా సాగుతున్నాయి. నిత్యం వందలాది టన్నుల క్వార్ట్జ్, పల్స్‌ఫర్, వర్ముఖ్లైట్ ఖనిజాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. సంబంధిత అధికారులకు ముడుపులు అందుతుండడంతో వారు మౌనం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పెరుమాళ్లపాడు, ఊటుకూరు, తిప్పిరెడ్డిపల్లి, చాగ ణం, తలుపూరు గ్రామాల్లో క్వార్ట్జ్, పల్స్‌ఫర్, వర్ముఖ్లైట్ ఖనిజం కోసం యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. ఎక్కడా ప్రభుత్వ అనుమతి ఉన్న దాఖలాలు లేవు. క్వార్ట్జ్ ఖనిజం తవ్వకాలకు వెళ్లే పేదల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. పనులకు వెళ్లే పేదలకు ప్రమాదం జరిగితే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో జరుగుతున్న అక్రమ క్వార్ట్జ్, పల్స్‌ఫర్, వర్ముఖ్లైట్ అక్రమ తవ్వకాలను నిరోధించాలని, రూటు మార్చి తరలిస్తున్న రవాణాదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం అక్రమ క్వార్ట్జ్, పల్స్‌ఫర్, వర్ముఖ్లైట్ ఖనిజాన్ని ఇతర ప్రాంతాలకు తరలించే వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. అక్రమ తవ్వకాలు రవాణాపై పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా క్వార్ట్జ్ ఖనిజం అక్రమ రవాణా జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటాం. పెంచలయ్య, తహశీల్దార్ -
ఇసుక మాఫియా
=వరాహ, తాండవ నదుల్లో తవ్వకాలు =రోజూ వందలాది ట్రాక్టర్లతో తరలింపు =పట్టించుకోని రెవెన్యూ, పోలీసు యంత్రాంగం =సముద్రపు ఇసుకనూ వదలని వైనం నక్కపల్లి, న్యూస్‌లైన్: ఎస్.రాయవరం,నక్కపల్లి,పాయకరావుపేట, కోటవురట్ల మండలాల్లో ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. రోజూ వందలాది ట్రాక్టర్లతో ఇసుక తరలించుకుపోతున్నారు. అయినా రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక తవ్వకాలకు వరాహనదిలో పొక్లెయినర్లు ఉపయోగిస్తున్నారంటే తరలింపు ఏ స్థాయిలో జరుగుతున్నదో ఊహించుకోవచ్చు. వందలాది ఎకరాలకు సాగునీరు అందించే గ్రోయిన్లు మూలకు చేరే దుస్థితి దాపురించింది. ఎస్‌రాయవరం మండలంలో దార్లపూడి, పెనుగొల్లు,వమ్మవరం,పెద ఉప్పలం,దార్లపూడి,లింగరాజుపాలెం, బసవపాడు, కోటవురట్లమండలం పందూరు, రామచంద్రపురం, పాయకరావుపేట మం డలం కొత్తూ రు, సత్యవరం బ్రిడ్జి, కేశవరం,పాయకరావుపేట,ప్రాంతాల్లో రోజూ వేలాది క్యూబిక్ మీటర్ల లో ఇసుక తవ్వుతున్నారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా ట్రాక్ట ర్లు, లారీలపై తరలించుకుపోతున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ. 3వేల వరకు అమ్ముడుపోవడంతో మాఫియాకు కాసులు కురుస్తున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో వారు రెచ్చిపోతున్నారు. ఇందులో రెవెన్యూ, పోలీసు అధికారుల ప్రమేయం ఉంటోందన్న వాదన ఉం ది. ఇక తీరప్రాంతాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. రాజయ్యపేట, అమలాపురం, పాటిమీద, మూలపర, డిఎల్‌పురం,బోయపాడు, చందనాడ బంగారయ్యపేట, రేవుపోలవరం, బంగారమ్మపాలెం తదితర గ్రామాల్లో తీరప్రాం తం వెంబడి సముద్రపు ఇసుకను కూడా మాఫియా వదలడం లేదు. దీని తరలింపునకు వీఆర్వోలే సహకారిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇసుక తరలించుకుపోవడంతో తుఫాన్లప్పుడు సముద్రం ముందు కు చొచ్చుకు వస్తోంది. ముంపు బారిన పడే ప్రమాదం ఉందని గంగపుత్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.