Mining Engineering
-
Akanksha Kumari: తాను.. రొటీన్ ఐటీ కాదు.. మైనింగ్ మేటి!
‘ద్వారాలు మూసే ఉన్నాయి’ అని వెనక్కి తిరిగేవారు కొందరు. ఆ ద్వారాలను తెరిచి ముందుకు వెళ్లేవారు కొందరు. ఆకాంక్ష కుమారి రెండో కోవకు చెందిన మహిళ. తొలి భారతీయ మహిళా మైనింగ్ ఇంజినీర్‌గా చరిత్ర సృష్టించింది. ఉద్యోగంలో చేరిన రోజు ఎంత ఉత్సాహం, వృత్తి నిబద్ధతతో ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ‘నో రిగ్రెట్స్.. ఫీల్ గ్రేట్’ అంటుంది. మైనింగ్ ఫీల్డ్‌లోకి రావాలనుకునే మహిళలకు ధైర్యాన్ని ఇస్తోంది.ఝార్ఖండ్‌లోని మైనింగ్ప్రాంతంలో పెరిగిన ఆకాంక్ష కుమారి బొగ్గు గనుల్లో ‘పై కప్పు కూలిపోవడం’ అనే మాటను ఎన్నోసార్లు విని ఉన్నది. మైనింగ్ ఇంజినీర్‌గా ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టిన తరువాత ‘పై కప్పు కూలిపోవడం’ అనే మాటను వినడం కాదు ప్రత్యక్షంగా చూసింది. ‘ఇది పురుషులు మాత్రమే చేసే కఠినమైన ఉద్యోగం అనుకునే వృత్తిని ఎంచుకోవడానికి కారణం ఏమిటి?’ అనే ప్రశ్నకు ఆమె స్పందన ఇది...‘బొగ్గు తవ్వకాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో పుట్టి పెరిగాను. ఇక్కడి ప్రజలు ఏ మైనింగ్ కంపెనీలో పని చేయకపోయినా వాళ్లకు మైనింగ్ గురించి చాలా విషయాలు తెలుసు. స్కూల్ హాస్టల్లో నా స్నేహితులు పై కప్పు కూలిపోవడం గురించి మాట్లాడడం నేను ఎన్నోసార్లు విన్నాను. అదెలా? ఎందుకు?’ అనేది నాకు ఆశ్చర్యంగా అనిపించేది. మైనింగ్‌కు సంబంధించి రకరకాల విషయాలు వినడం వల్ల నాకు తెలియకుండానే ఆ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే కలకు బీజం పడింది’ గతాన్ని గుర్తు చేసుకుంది ఆకాంక్ష.‘పదవ తరగతి పూర్తయిన తరువాత ఏం చేయాలి?’ అనుకున్నప్పుడు ఆటల గురించి ఆలోచించింది. తాను జాతీయస్థాయి అథ్లెట్లిక్స్‌లో కూడా పాల్గొంది. ఆటలపై దృష్టి పెట్టాలా, చదువు కొనసాగించాలా అనే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు తాను ఉన్న పరిస్థితిల్లో ఉద్యోగం అనివార్యం కావడంతో చదువుకే ్రపాధాన్యత ఇచ్చింది. ఇంటర్మీడియెట్ పూర్తి అయిన తరువాత ‘ఐటీ రంగంలో ఉద్యోగంపై దృష్టి పెట్టు’ అని కొందరు తనకు సలహా ఇచ్చారు. అయితే ‘ఐటీ’ అనేది ఆకాంక్షకు ఆసక్తికరమైన సబ్జెక్ట్ కాదు. ఆ సమయం లోనే తన మనసులో దాగిన కల బయటికి వచ్చింది. ‘కోల్ మైనింగ్ ఫీల్డ్‌లో ఉద్యోగం చేయాలి’ అని నిర్ణయించుకుంది. ఉపాధ్యాయుడైన తండ్రి, అంగన్వాడీ వర్కర్ అయిన తల్లిని ఒప్పించడం కష్టం కాలేదు.‘మా అమ్మాయి మైనింగ్ జాబ్ చేయాలనుకుంటుంది’ అని ఆకాంక్ష తండ్రి మైనింగ్ కంపెనీలో పనిచేసే తన స్నేహితుడిని సలహా అడిగితే...‘చాలా కష్టం. మధ్యతరగతికి చెందిన ఆడపిల్లలు ఈ రంగంలో పనిచేయలేరు. ఆ పనిభారం తట్టుకోవడం ఆడపిల్లలకు చాలా కష్టం’ అన్నాడు. స్నేహితుడు చెప్పిన విషయాలను కూతురితో పంచుకున్నాడు. అయినా సరే, ఆకాంక్ష వెనక్కి తగ్గలేదు. ఇంజినీరింగ్ కోర్స్ అడ్మిషన్ సమయంలో కౌన్సెలర్ ఆమెకు మైనింగ్ ఇంజినీరింగ్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. వాదోపవాదాల తరువాత ఆకాంక్ష కల నెరవేరింది. ఝార్ఖండ్, ధన్‌బాద్‌లోని బిర్సా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సింద్రీలో బీటెక్ పాసైంది. వొకేషనల్ ట్రైనింగ్‌లో భాగంగా అండర్‌గ్రౌండ్ మైన్‌లో కూడా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.‘ఇక్కడికి నిన్ను ఎవరు పంపించారు? ఎలా పంపిస్తారు? ఇక్కడ మహిళలకు సౌకర్యాలు, సదుపాయాలు లేవన్న విషయం మీ డిపార్ట్మెంట్ హెడ్‌కు తెలియదా?’ అని విసుక్కున్నాడు జనరల్ మేనేజర్. ఆ తరువాత మాత్రం గెస్ట్‌హౌజ్‌లో ఒక రూమ్ కేటాయించారు. అమ్మ, మేనత్తలతో కలిసి ఆ గదిలో ఉండేది ఆకాంక్ష. చదువు పూర్తయిన తరువాత హిందుస్థాన్ జింక్‌లో ఆకాంక్షకు ఉద్యోగం వచ్చింది. మూడు సంవత్సరాలు గనులలో పనిచేసింది. ఆ తరువాత సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్‌కు చెందిన బొగ్గు గనుల్లో పనిచేసింది. కనీస సౌకర్యాలు లేకపోయినప్పటికీ భూగర్భ గనుల్లో గరిష్ఠంగా ఆరు గంటలు పనిచేసింది.2021లో కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)లో ఆకాంక్ష చేరిన తరువాత ఇప్పటి వరకు మరో ముగ్గురు మహిళలు మాత్రమే పబ్లిక్ విభాగంలో చేరారు. అయినా సరే ఆకాంక్ష కుమారిలో ఆశాభావం తొలగిపోలేదు. మైనింగ్ ఫీల్డ్‌లో రావాలనుకుంటున్నవారికి సలహాలు ఇవ్వడం, దారి చూపడం మానడం లేదు. ‘సౌకర్యాలు లేకపోవచ్చు. శ్రమతో కూడిన ఉద్యోగం కావచ్చు. అయినా సరే చేస్తాను అనే పట్టుదల మీలో ఉంటే మైనింగ్ ఫీల్డ్‌లోకి తప్పకుండా రావచ్చు’ అంటుంది ఆకాంక్ష కుమారి. తొలి అడుగు వేసి మాత్రమే ఊరుకోలేదు. మరిన్ని అడుగుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూనే తన వంతు ప్రయత్నం చేస్తోంది ఆకాంక్ష.ఇవి చదవండి: ఈ ప్రాణం ఖరీదెంత? -
మైనింగ్ ఇంజనీరింగ్‌కు బాలికలు అర్హులే
- జేఈఈ రివైజ్డ్ షెడ్యూల్ జారీ - ఈసారి నాలుగు కొత్త ఐఐటీల్లోనూ ప్రవేశాలు - 29 నుంచి దరఖాస్తులు - వచ్చే నెల 22న అడ్వాన్స్డ్ పరీక్ష - మహబూబ్‌నగర్, తిరుపతిలోనూ పరీక్ష కేంద్రాలు సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ రివైజ్డ్ షెడ్యూల్‌ను ఐఐటీ గువాహటి జారీ చేసింది. ఈ నెల 29 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. 2016-17 విద్యా సంవత్సరం నుంచి మైనింగ్ ఇంజనీరింగ్, మైనింగ్ మిషనరీ ఇంజనీరింగ్ సంబంధిత కోర్సుల్లో బాలికలు కూడా అర్హులేనని ప్రకటించింది. ఈసారి పాత ఐఐటీలతోపాటు 4 కొత్త ఐఐటీల్లోనూ ప్రవేశాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఐఐటీ ఛత్తీస్‌గఢ్, ఐఐటీ గోవా, ఐఐటీ కర్ణాటక, ఐఐటీ జమ్మూల్లోనూ ప్రవేశాలు చేపట్టనున్నట్లు వివరించింది. అలాగే 22న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ, ఏపీలోని పాత కేంద్రాలతో పాటు మరో రెండు అదనంగా కొత్త పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలోని హైదరాబాద్ , వరంగల్‌లో పరీక్ష కేంద్రాలుండగా, మహబూబ్‌నగర్‌లో అదనంగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇక ఏపీలో విశాఖపట్నం, నెల్లూరు, విజయవాడలో కేంద్రాలు ఏర్పాటు చేస్తామని గతంలోనే ప్రకటించగా, ఇప్పుడు తిరుపతిలోనూ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 102 రకాల కోర్సుల్లో ప్రవేశాలు చేపడతామని వెల్లడించింది. జేఈఈ మెయిన్ ఫలితాల్లో అత్యధిక స్కోర్ సాధించిన టాప్ 2 లక్షల మందిలో ఏ కేటగిరీలో ఎందరిని తీసుకుంటారనే వివరాలను తెలిపింది. ఇక ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ), పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (పీఐవో) కార్డు కలిగిన వారు జనరల్, ఓపెన్ కేటగిరీ సీట్లకు కూడా అర్హులేనని ప్రకటించింది. రిజిస్ట్రేషన్ సమయంలోనే వారు సంబంధిత సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు టాప్ 2 లక్షల మందిని పరిగణనలోకి తీసుకుంటామని ఐఐటీ గువాహటి పేర్కొంది. ఇందులో ఓబీసీ-నాన్ క్రీమీలేయర్ (ఎన్సీఎల్) వారిని 27 శాతం, ఎస్సీలను 15 శాతం, ఎస్టీలను 7.5 శాతం, ఓపెన్ కేటగిరీలో 50.5 శాతం మందిని తీసుకుంటామని వెల్లడించింది. వీటి ప్రకారం ఓపెన్ కేటగిరీలో 1,01,000 మంది, ఓబీసీ నాన్ క్రీమీలేయర్‌లో 54 వేల మంది, ఎస్సీల్లో 30 వేల మంది, ఎస్టీల్లో 15 వేల మందిని ఎంపిక చేస్తారు. పరీక్ష ఫీజు కింద మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.1000, ఇతర అభ్యర్థులు రూ.2 వేలు, దుబాయిలో పరీక్ష కేంద్రం కావాలనుకునే వారు 220 అమెరికా డాలర్లు చెల్లించాలి. ఐఐటీల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్లో 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు అయితే 70 శాతం మార్కులు సాధించాలి. లేదా ఆ బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిలో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి. టాప్-20 పర్సంటైల్ నిర్ధారణకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఒక భాష, మరొక సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులను తీసుకొని లెక్కిస్తారు. -
ఊరించి.. ఉసూరుమనిపించి!
కొత్తగూడెం: ‘పరీక్షలు రాయించారు... అర్హత సాధించాం.. తీరా నియామకం ముందు వయసు సరిపోలేదని తిరస్కరిస్తున్నారు. ఆరు నెలల నుంచి ఊరించి ఇప్పుడు మొండిచేయి చూపుతున్నారు. వయసు సరిపోనప్పడు పరీక్షకు ఎలా అనుమతించారు.’ అంటూ సింగరేణి జేఎం ఈటీ పరీక్షల్లో అర్హత సాధించని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం జూనియర్ మైనింగ్ ఇంజినీరింగ్ ట్రైనీ(జేఎంఈటీ) పోస్టులకు పరీక్షలు నిర్వహించింది. దీనికి మైనింగ్ ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన వారితోపాటు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అవకాశం కల్పించింది. పరీక్ష రాసే అభ్యర్థులు ఫిబ్రవరి 1, 2015 నాటికి 30 ఏళ్ల లోపు వారై ఉండాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల వయసు సడలింపు ఉం టుందని నోటిఫికేషన్లో పేర్కొంది. నిబంధనల సడలింపుతో... ఈ ఏడాది మే 10న జేఎంఈటీ పరీక్షలు నిర్వహించగా 894 మంది అభ్యర్థులు హాజరయ్యా రు. వీరిలో 682 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణులైన వారిలో ఎక్కువమంది ఫైనలియర్ విద్యార్థులు ఉండటంతో వారి సర్టిఫికెట్లను అందించాలని యాజమాన్యం కోరింది. తాము ఫైనలియర్ చదువుతున్నామని, సర్టిఫికెట్లు వచ్చే వరకు నియామకాన్ని నిలిపివేయాలని అర్హత సాధించిన ఫైనలియర్ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో నియామక ప్రక్రియ 6 నెలలపాటు వాయిదాపడింది. అనంతరం యాజమాన్యం నిబంధనలను సడలిస్తూ జూలై 1, 2015 నాటికి అభ్యర్థులు 18 ఏళ్లు నిండి ఉండాలని సర్క్యులర్‌ను జారీ చేసింది. దీంతో ఫైనలియర్ చదువుతూ అర్హత సాధిం చిన అభ్యర్థులు అనర్హులుగా మారారు. 811 పోస్టులకు నిర్వహించిన ఈ పరీక్షలకు 682 మంది ఉత్తీర్ణత సాధించగా అందులో 33 మంది ఫైనల్ విద్యార్థులు వయసు సరిపడక తిరస్కరణకు గురయ్యారు. నోటిఫికేషన్లో కనిష్ట వయోపరిమితిని విధించని యాజమాన్యం అర్ధాం తరంగా సర్క్యూలర్ ను జారీ చేసిందని, దీనిపై కోర్టుకు వెళ్తామని పేర్కొంటున్నారు. అర్హత సాధించాం.. ఉద్యోగం ఇవ్వండి ఉద్యోగ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులయ్యాం.. ఫైనలియర్ పరీక్షలో సైతం మంచి మార్కులతో పాసయ్యాం. మాకు ఉద్యోగం ఇవ్వకుండా వయసు సరిపోలేదని మధ్యలో నిబంధన విధించడంతో కేవలం రెండు, మూడు నెలల వయసు తేడా మాత్రమే ఉంది. నిబంధనను సడలించి మాకు ఉద్యోగం ఇవ్వాలి. -వినీత్బాబు కట్ ఆఫ్ డేట్ పెంచాలి సింగరేణి యాజమాన్యం విడుదలచేసిన నోటిఫికేషన్లో మినిమమ్ ఏజ్ లిమిట్ నిబంధనను పెట్టకుండా ఫలితాలు వచ్చిన అనంతరం వయసు సరిపోలేదంటూ నిబంధనలు విధించడం సరికాదు. కటాఫ్‌డేట్‌ను పెంచి అర్హత సాధించిన ఫైనలియర్ పూర్తిచేసిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి. -సుశీల్ కుమార్