ministar narayana
-
కుట్ర రాజకీయం
కుట్ర రాజకీయాలకు అధికార పార్టీ తెరతీసింది. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార దర్పంతో పల్లెల్లో విషసంస్కృతికి బీజం వేస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకొని పోలీసు బలప్రయోగంతో అణిచివేసే కార్యక్రమాలకు పూనుకుంది. ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తోంది. మంగళవారం ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండలంలోనూ, ఇటీవల కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలో కూడా ఇదే తరహా తతంగం నడిపారు. దీనికి స్పందించి కనీసం మాట్లాడాల్సిన ఉన్నతాధికారులు కూడా మంత్రుల ఒత్తిడితో ముఖం చాటేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలంలోని మాముడూరు, నడిగడ్డ అగ్రహారంలో స్థానిక ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి మంగళవారం పర్యటన షెడ్యూల్‌ను సిద్ధం చేసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా సర్పంచ్ల పదవీ కాలం చివరిరోజు కావడంతో పూర్తయిన పనులు అన్ని ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేతో ప్రారంభింపజేసేందుకు అంతా సిద్ధం చేశారు. పంచాయతీరాజ్ అధికారులు కూడా ఎమ్మెల్యేను ఆహ్వానించడంతోపాటు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు.అయితే ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి పాల్గొనే కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఆదివారం సాయంత్రం అధికారపార్టీ నేతలు వ్యూహం రచించినట్టు తెలిసింది. పంచాయతీరాజ్ ఏఈ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఉన్నతాధికారుల అనుమతిలేదని, ఎమ్మెల్యే కార్యక్రమాలను అడ్డుకోవాలని పోలీసులకు లేఖ ఇచ్చి అదృశ్యమయ్యాడు. ఇదేమని అడిగేందుకు యత్నించినా ఫోనుకు సైతం అందుబాటులోకి లేకుండా పోయాడు. పోలీస్ బలగాలతో అడ్డగింత ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గ్రామాలకు వెళ్లే క్రమంలో డీఎస్పీ రామాంజనేయులురెడ్డి భారీగా పోలీసు బలగాలతో వచ్చి అడ్డుకోవడానికి యత్నించారు. ప్రారంభోత్సవాలు చేయడానికి ఉన్నతాధికారుల నుంచి అనుమతి లేదని చెప్పి వెళ్లిపోవాలని ఎమ్మెల్యేను కోరారు. అయితే తాను పర్యటించటానికి కూడా ఆంక్షలు విధించడం సరికాదంటూ ఎమ్మెల్యే గట్టిగా చెప్పి గ్రామంలో పర్యటించారు. కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గ్రామం కావడం, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కావడంతోనే అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అడ్డుకునే యత్నం చేశారు. వాస్తవానికి 14వ ఆర్థిక సంఘం నిధులు, ఎంపీ నిధులు, గ్రామ పంచాయతీ నిధులు, ఇతర ప్రభుత్వ నిధులతో జరిగే ప్రారంభోత్సవాలకు ప్రజాప్రతినిధిని పోట్రోకాల్ ప్రకారం ఆహ్వానించాల్సిఉంది. అయితే అంతా చేసి అనుమతి లేదని అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. నిబంధనల ప్రకారం 14వ ఆర్థిక సంఘం నిధులతో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు స్థానిక సర్పంచ్‌లే చేయాలనే నిబంధన ఉంది. అలాగే తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నిధులు రూ.14 లక్షలతో నిర్మించిన 11 కేవీ సబ్‌స్టేషన్‌ను, రూ.5 లక్షల పంచాయతీ నిధులతో నిర్మించిన వాటర్ ప్లాంట్‌ను కూడా ఎమ్మెల్యే ప్రారంభించకుండా ముందే అడ్డుకోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యే అనే రాజకీయ కుట్ర గడిచిన నాలుగేళ్లలో ఆత్మకూరు నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు చోటుచేసుకోలేదు. అయితే తాజాగా అధికార పార్టీ ఆత్మకూరులో గందరగోళంగా ఉండటంతో మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య, కన్నబాబు ఇలా అందరూ నియోజకవర్గంలో హడావుడి చేస్తున్న క్రమంలో ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డికి పేరు రాకుండా అడ్డుకునే కుట్రకు తెరతీశారు. మంత్రి నారాయణ నుంచి ఉన్నతాధికారులకు ఫోన్లు రావడం, కార్యక్రమం సిద్ధం చేసిన అధికారులతోనే ఫిర్యాదు ఇప్పించి హక్కుల్ని కాలరాశారు. సర్పంచ్ల పదవీ కాలం మంగళవారంతో ముగిసిన క్రమంలో తమ హయాంలో చేసిన పనులు కూడా తాము చేశామని చెప్పుకోవటానికి వీలు లేకుండా ఇన్చార్జ్ మంత్రులు, మంత్రి నారాయణ ప్రారంభించాలనే నెపంతో ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య సొంత గ్రామం కావడంతోనే ఈ తతంగం అంతా నడిచిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని కూడా అల్లూరు మండలంలోని ఇస్కపల్లి గ్రామంలో పర్యటించకుండా గత నెల రోజులుగా పోలీసుల బలప్రయోగంతో వేధిస్తున్నారు. అధికార పార్టీ నేతలు బీద సోదరుల స్వగ్రామం కావడంతో అక్కడ పర్యటించకుండా పోలీసులతో అడ్డుకుంటున్నారు. వీటిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపోరాటానికి సన్నద్ధమవుతోంది. -
ఆత్మకూరు టీడీపీలో హైడ్రామా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వారం రోజులుగా సాగుతున్న ఆత్మకూరు పంచాయితీకి సోమవారం తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇరుపక్షాలు కొంత సర్దుబాటు ధోరణితో వ్యవహరించడం, జిల్లా పరిణామాలపై సీఎం చంద్రబాబు సీరియస్ కావడంతో ఈ వ్యవహారాన్ని తాత్కాలికంగా సద్దుమణిగించారు. పార్టీ నేత కన్నబాబు దీక్ష విరమించడం, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి ఆత్మకూరులో పార్టీ సమావేశం నిర్వహించడం రెండూ జరిగిపోయాయి. ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా సాగిన ఆత్మకూరు హైడ్రామా ఎపిసోడ్ చివరకు జిల్లా మంత్రుల మెడకు చుట్టుకుంది. జిల్లాలో ఇంత జరుగుతున్నా కనీసం మంత్రులు ఎందుకు జోక్యం చేసుకోలేదని పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు కన్నబాబుకు మొదటి నుంచి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మద్దతు ఇస్తుండగా, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డికి మరో మంత్రి పి.నారాయణ సహకరిస్తుండడంతో ఇద్దరు మంత్రుల తీరు పార్టీలో తీవ్ర చర్చనీయాశంగా మారింది. ఆదివారం రాత్రి కన్నబాబుతో మొదలైన మంతనాలు సోమవారం ఉదయం వరకు కొనసాగాయి. సామాజిక సమీకరణల నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రతోపాటు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఇరువర్గాల మధ్య రాజీ చర్చలు సాగించారు. ఉదయం మంత్రి నారాయణ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి నివాసంలో భేటీ అయి మంతనాలు జరిపారు. ఈక్రమంలో పార్టీ ముఖ్యులు కన్నబాబును కూడా కలుపుకొని ముందుకెళదామని ప్రతిపాదించడం, దానికి ఆదాల అంగీకరించడంతో ఆ తర్వాత బీద రవిచంద్ర, రామకృష్ణ కన్నబాబుతో మాట్లాడి అంగీకరింపజేశారు. చివరకు మంత్రి నారాయణ వచ్చి కన్నబాబుతో ఆపిల్ తినిపించి దీక్ష విరమింపజేశారు. అక్కడి నుంచి మంత్రి నారాయణ, ఆదాల ప్రభాకరరెడ్డి, బీద రవిచంద్ర, కన్నబాబు అందరూ కలిసి వెళ్లి ఆత్మకూరులో సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ కూడా కన్నబాబు సభాధ్యక్షత వహించి నేతలందరినీ ఆదాల ప్రభాకరరెడ్డికి పరి చయం చేశారు. దీంతో వివాదాన్ని తాత్కాలికంగా ముగించారు. అయితే తెర వెనుక భారీ మంతనాలు మాత్రం కొనసాగడంతో వర్గపోరులో ఆధిపత్యం కోసం మంత్రి సోమిరెడ్డి వర్గం, మాజీ మంత్రి ఆదాల వర్గం తీవ్రంగా కసరత్తు చేశాయి. ఆదాల డౌన్ డౌన్ అంటూనే.. కన్నబాబు ఆమరణ దీక్ష పూర్తి సారాంశం పార్టీలో తనకి ప్రాధాన్యం ఇవ్వాలని, అందరినీ కలుపుకొని పోవాలనే అజెండాతో దీక్ష చేశారు. అయితే దీక్ష ప్రారంభం నుంచి ముగింపు వరకు పూర్తిగా ఆదాల నాయకత్వాన్ని వ్యతిరేకించడమే అజెండాగా కనిపించింది. సేవ్ టీడీపీ, ఆదాల డౌన్‌డౌన్ అంటూ నినాదాలు ఇచ్చారు. కానీ చివరికి ఆదాలతో కలిసి ఆత్మకూరు వెళ్లటం గమనార్హం. పార్టీ ముఖ్యలపై అధిష్టానం సీరియస్ పార్టీ కార్యాలయంలో ఆమరణ దీక్ష నిర్వహించడాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకుని కన్నబాబు తీరుపై మండిపడినట్లు సమాచారం. జిల్లాలో ఇదంతా జరుగుతున్నా సమన్వయం చేయాల్సిన మంత్రులు ఇలా చెరో గ్రూప్‌లో ఉంటూ రాజకీయం చేస్తున్నారా అని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు ఈ వ్యవçహారం జరగుతున్న క్రమంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈక్రమంలో ఆదాల ప్రభాకరరెడ్డి జిల్లాలో పార్టీ ముఖ్యనేత ఇదంతా చేస్తున్నాడని మళ్లీ పరోక్షంగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు మంత్రి నారాయణ ఆదివారం నుంచి నెల్లూరు నగరంలోనే ఉన్నప్పటికీ జరుగుతున్న పరిణామాలపై నష్టనివారణ చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తమయినట్లు సమాచారం. -
ఇదేం విచిత్రమో నాయనా...
–ఆనప పంట అంటే ఎలా ఉంటుంది –వేరుశనగలో ఎండిన కాయలెలా బలుస్తాయి –పట్టుపురుగులను ఎలా గూళ్ళుకడతాయి –బోరువేయాలంటే ఎంత ఖర్చువుతుంది –పొట్టేళ్ళను కట్టేసి సంరక్షిస్తారా –వేరుశెనగ పంటపరిశీలనలో ఉపముఖ్యమంత్రి అనుమానాలు పలమనేరు: దీన్నేమంటారు.. అది ఆనపపంటసార్.. ఆనపకాయలెలా ఉంటాయి, ఆపక్కన ఏందదీ సాలుపంట జొన్నసార్ ..అదెందుకు మధ్యలో వేశారు.. అదెలా పండుతుంది ఇలాంటి ప్రశ్నలతో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి చినరాజప్ప సోమవారం తన అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. దీన్ని చూసిన సాధారణ జనం ముక్కునవేలేసుకున్నారు. ఉపముఖ్యమంత్రి చినరాజప్ప చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని పెంగరగుంట వద్ద రైతు జానకీరామ్ పొలం వద్ద తనకొచ్చిన అనుమానాలు తీర్చుకున్నారు. ఇప్పటికే ఎండిన వేరుశెనగ కాయలు తిరిగి మామూలుగా ఎలా తయారవుతాయని అడిగారు. దీనికి వ్యవసాయసాఖ ఆధికారులు విపులంగా తెలియజెప్పారు.బోరువేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఎలాంటి మోటార్ అవసరం, ఎంత లోతులో నీళ్ళున్నాయి ఇలాంటి అనుమానాలతో ఆయన ప్రశ్నం వర్షం కురిపించారు. అనతరం నూనేవారిపల్లె వద్ద మల్బరీ తోటను చూసి ఇదేం పంటఅని అక్కడి సర్పంచ్ విజయ్ను అడిగారు. తాను పట్టుపురుగులు ఎలా ఉంటాయో చూడాలనడంతో పక్కనే ఉన్న చంద్రప్పగౌడు మల్బరీ షెడ్డుకు తీసుకెళ్ళారు. పట్టుపురుగులను గమనించిన ఆయన అశ్చర్యానికి గురైయ్యారు. అనంతరం పట్టుగూళ్ళను పరిశీలించి పురుగు గూళ్ళలోకి ఎలా వెళ్ళిందని అనుమానం వ్యక్తం చేయడంతో అక్కడున్నవారు వివరించారు. షెడ్డు ముందు బక్రీద్కోసం పెంచుతున్న పొట్టేళ్ళను చూసి ఇలా కట్టిపెడితే వీటికెళా మేత అందుతుందని ప్రశ్నించారు. అక్కడే మేత పెడతామని రైతు వివరించాడు. మొత్తం మీద వ్యవసాయం గురించి ఏమాత్రం అవగాహణలేని ఉపముఖ్యమంత్రిని చూసిన రైతులు బిక్కమొఖం వేయాల్సివచ్చింది. ఇలాంటి వారిని పంటపరిశీలన పంపితే రైతుల కష్టాలు ఏం తెలుస్తాయని రైతులు చెవులు కొరుక్కున్నారు. మొత్తం మీద ఆయన పర్యటన రైతులకెంతో మేలు చెసిందీగానీ ఇన్నాళ్ళకు సేధ్యం గురించి కొంత అవగాహణ పెంపొందించుకున్నారు.