అసెంబ్లీలో అవాస్తవాలు దురదృష్టకరం
ఇల్లంతకుంట: సీపీఎస్ విధానం రద్దుకై అసెంబ్లీలో విపక్ష ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడిన మాటలు సీపీఎస్ ఉద్యోగులను విస్మయపరిచాయని రాజన్న సిరిసిల్ల సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు యాదవ రవి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పాత పెన్షన్ విధానంలో కంటే కొత్త పెన్షన్ విధానంలోనే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని మంత్రి మాట్లాడడం సరికాదన్నారు. పదేళ్లు ఉద్యోగం చేసి రిటైర్ అయిన దైవాధీనం అనే ఉపాధ్యాయుడికి రూ.14 వందల పెన్షన్ వస్తుందన్నారు. ఆర్థిక మంత్రి అవగాహన లేకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.