Minister George
-
మంత్రి రాజీనామాకు ఏబీవీపీ డిమాండ్
కేజీఎఫ్ : డీఎస్పీ గణపతి ఆత్మహత్యకు కారణమైన మంత్రి జార్జిని పదవినుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఉద్యమించింది. ఈమేరకు శుక్రవారం కార్యకర్తలు ర్యాలీగా రెవెన్యూ కార్యాలయం చేరుకొని ధర్నా చేశారు. జిల్లా సంచాలకుడు సునీల్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులను ఒత్తిళ్లకుగురి చేస్తూ వారి ఆత్మహత్యలకు కారణమవుతోందన్నారు. గణపతి ఆత్మహత్యకు మంత్రి జార్జ్ కారణమని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను పదవినుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలసుబ్రమణి, మంజునాథ్, ప్రీతి, జ్యోతి, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జార్జ్‌ను బలిపశువు చేస్తున్నారు
జీవవైవిధ్య ఉద్యానవనం ప్రారంభోత్సవంలో సీఎం బెంగళూరు(బనశంకరి) : డీవైఎస్పీ గణపతి ఆత్మహత్య వ్యవహారంలో మంత్రి జార్జ్‌కు ఎలాంటి సంబంధం లేదని, అయితే విపక్షాలు తమ స్వార్థం కోసం ఆయన్ను బలిపశువును చేస్తున్నాయని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. నాగవారలోని హెణ్ణూరు చెరువు వద్ద జీవ వైవిధ్య వనాన్ని సీఎం శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. 99 కేసుల్లో నిందితులు తప్పించుకున్న పర్వాలేదని, అయితే ఓ నిరపరాది శిక్షపడకూడదనే చట్టం ఆశయమని తెలిపారు. అయితే గణపతి ఆత్మహత్య విషయంలో ఎలాంటి సంబంధం లేని జార్జ్‌ని రాజీనామా చేయాలని కోరడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇప్పటికే విపక్షాలు సంధించిన ప్రశ్నలంటికీ సమాధానమిచ్చామని, విచారణ అనంతరం నిజానిజాలు వెలుగులోకి వస్తామన్నారు. ప్రారంభించిన ఉద్యానవనానికి బసవలింగప్ప ఉద్యానవనంగా పేరుపెట్టామన్నారు. గతంలో అటవీశాఖామంత్రిగా ఉన్న బసవలింగప్ప ఈ ప్రదేశాన్ని రక్షించారని గుర్తు చేశారు. బెంగళూరు నగరం సౌందర్యం పెంచడానికి చెరువులు, ఉద్యానవనాలను అభివృద్ధి చేస్తామన్నారు. కబ్జాకు గురైన చెరువులు, ప్రభుత్వ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంద ని తెలిపారు. హెణ్ణూరు చెరువు 34 ఎకరాల విస్తీర్ణం ఉందని దీనిని ఆదర్శ ఉద్యానవనంగా తీర్చిదిద్దుతామన్నారు. 21 శాతం ఉన్న అటవీ ప్రాంతాన్ని 33 శాతానికి పెంచే అవసరముందన్నారు. నగరాబివృద్ధి శాఖామంత్రి కేజే.జార్జ్ మాట్లాడుతూ.....గణపతి ఆత్మహత్య విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. అటవీశాఖమంత్రి రామనాథ రై, మేయర్ మంజునాథరెడ్డి, ఎమ్మెల్యే బీఏ.బసవరాజు, పరిసరాల మాలిన్య నియంత్రణ మండలి అద్యక్షుడు లక్ష్మణ్, ప్రభుత్వ కార్యదర్శి విజయభాస్కర్, బీబీఎంపీ సభ్యులు ఆనంద్, రాదమ్మవెంకటేశ్, ఎస్జీ.నాగరాజ్, కాంగ్రేస్ నేతలు సునీల్‌కుమార్, సొణప్ప, జగదీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమయం వచ్చినప్పడు దళితుడే సీఎం
రాష్ట్ర హోం శాఖ మంత్రి జార్జ్ బెంగళూరు(బనశంకరి) : సమయం వచ్చినప్పుడు దళిత వర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటాడని రాష్ర్ట హోం శాఖ మంత్రి కె.జె.జార్జ అన్నారు. బుధవారం ధార్వాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళిత సీఎం నినాదం ముగిసిపోయిన అంశమని, పదేపదే ఈ విషయాన్ని ప్రస్తావించడం మంచిది కాదని హితవు పలికారు. రాష్ర్ట పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉందని ఇందుకు గత బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ప్రస్తుతం 8800 ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ చివరి దశలో ఉందని అన్నారు. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖలో 22 వేల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రానున్న మూడేళ్లలో 750 ఎస్ఐ పోస్టులు భర్తీ చేయన్నునట్లు చెప్పారు. త్వరలో ఏడు వేల మందిని హోంగార్డులుగా నియమించనున్నట్లు తెలిపారు. ఈ నియామకాల్లో మహిళలకు గతంలో ఉన్న 10 శాతం కేటాయింపును 20 శాతానికి పెంచినట్లు గుర్తు చేశారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రసాదఅబ్బయ్య, వినయకులకర్ణి తదితరులు పాల్గొన్నారు.