సమయం వచ్చినప్పుడు దళిత వర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటాడని రాష్ర్ట హోం శాఖ మంత్రి కె.జె.జార్‌జ అన్నారు.
రాష్ట్ర హోం శాఖ మంత్రి జార్జ్
బెంగళూరు(బనశంకరి) : సమయం వచ్చినప్పుడు దళిత వర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటాడని రాష్ర్ట హోం శాఖ మంత్రి కె.జె.జార్‌జ అన్నారు. బుధవారం ధార్వాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళిత సీఎం నినాదం ముగిసిపోయిన అంశమని, పదేపదే ఈ విషయాన్ని ప్రస్తావించడం మంచిది కాదని హితవు పలికారు. రాష్ర్ట పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉందని ఇందుకు గత బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ప్రస్తుతం 8800 ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ చివరి దశలో ఉందని అన్నారు. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖలో 22 వేల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రానున్న మూడేళ్లలో 750 ఎస్‌ఐ పోస్టులు భర్తీ చేయన్నునట్లు చెప్పారు.
త్వరలో ఏడు వేల మందిని హోంగార్డులుగా నియమించనున్నట్లు తెలిపారు. ఈ నియామకాల్లో మహిళలకు గతంలో ఉన్న 10 శాతం కేటాయింపును 20 శాతానికి పెంచినట్లు గుర్తు చేశారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రసాదఅబ్బయ్య, వినయకులకర్ణి తదితరులు పాల్గొన్నారు.