Dalit CM
-
దళిత సీఎం అంటూ కేసీఆర్ మోసం: కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడినే చేస్తానని హామీనిచ్చి, తానే గద్దెనెక్కి కూర్చుని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీజేపీ దళిత మోర్చా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని ఇస్తామని చెప్పిన సీఎం ఇప్పటిదాకా ఎన్ని కుటుంబాలకు భూమిని పంచారని ప్రశ్నించారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు దుష్యంత్‌కుమార్ గౌతమ్ మాట్లాడుతూ దళిత ఎంపీలు, ప్రజా ప్రతినిధులు బీజేపీలోనే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. కార్య క్రమానికి దళితమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాములు అధ్యక్షత వహించారు. -
సమయం వచ్చినప్పడు దళితుడే సీఎం
రాష్ట్ర హోం శాఖ మంత్రి జార్జ్ బెంగళూరు(బనశంకరి) : సమయం వచ్చినప్పుడు దళిత వర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటాడని రాష్ర్ట హోం శాఖ మంత్రి కె.జె.జార్జ అన్నారు. బుధవారం ధార్వాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళిత సీఎం నినాదం ముగిసిపోయిన అంశమని, పదేపదే ఈ విషయాన్ని ప్రస్తావించడం మంచిది కాదని హితవు పలికారు. రాష్ర్ట పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉందని ఇందుకు గత బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ప్రస్తుతం 8800 ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ చివరి దశలో ఉందని అన్నారు. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖలో 22 వేల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రానున్న మూడేళ్లలో 750 ఎస్ఐ పోస్టులు భర్తీ చేయన్నునట్లు చెప్పారు. త్వరలో ఏడు వేల మందిని హోంగార్డులుగా నియమించనున్నట్లు తెలిపారు. ఈ నియామకాల్లో మహిళలకు గతంలో ఉన్న 10 శాతం కేటాయింపును 20 శాతానికి పెంచినట్లు గుర్తు చేశారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రసాదఅబ్బయ్య, వినయకులకర్ణి తదితరులు పాల్గొన్నారు. -
రూ.1.75 లక్షల కోట్లతో బడ్జెట్ - సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు : మార్చిలో జ రగనున్న సమావేశాల్లో రూ. 1.75లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. అన్ని విభాగాలకు సమాన ప్రాధాన్యతను కల్పించడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చే కూర్చే విధంగా అత్యుత్తమ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నామని చె ప్పారు. బెళగావి పర్యటనలో భా గంగా శనివారం ఉదయం సాం బ్రా విమానాశ్రయానికి చేరుకు న్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్కడ తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ఇక ఇటీవల వినిపిస్తున్న ‘దళిత సీఎం’ డి మాండ్‌పై సిద్దరామయ్య స్పంది స్తూ...తమ పార్టీలో దళిత సీఎం, మరో వర్గపు సీఎం అంటూ విభేదాలు లేవని అన్నారు. అందువల్ల దళిత సీఎం అన్న డిమాండ్ పార్టీలో తలెత్తే అవకాశమే లేదని పేర్కొన్నారు. -
హోరెత్తిన దళిత సీఎం నినాదం
పీఠం నుంచి సిద్ధును దించే లక్ష్యం పావులు కదుపుతున్న దళిత నేతలు అధిష్టానంపై ఒత్తిడి తీసుకెళ్లేందుకు సిద్ధం బెంగళూరు : రాష్ర్ట కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వేడి రగులుకుంది. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించడమే లక్ష్యంగా కొందరు నేతలు తెర వెనుక నుంచి పావులను కదుపుతున్నారు. అందులో భాగంగా రాష్ట్రానికి దళితుడిని సీఎంగా నియమించాలన్న నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఇందులో భాగంగానే బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్లో దళిత వర్గానికి చెందిన ప్రముఖులు మంగళవారం ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలను కేపీసీసీ చీఫ్ డాక్టర్ జి.పరమేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తోంది. తొలుత నుంచి ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్ ఆశ అడియాసగానే ఉంది. ఇందుకు సీఎం సిద్ధరామయ్యనే ప్రధాన కారకుడిగా ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. దీంతో ‘పరమేశ్వర్ అండ్ కో’ వ్యూహం మార్చి ఏకంగా సిద్ధరామయ్యను సీఎం పీఠం నుంచి దించేచర్యలను ప్రారంభించింది. అందులో భాగంగా ఈ ఏడాది మొదట్లో రాష్ట్రంలో సీనియర్ నాయకులు, ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసే సత్తా ఉన్న నాయకులుగా పేరొందిన ఎస్.ఎం కృష్ణ, మల్లికార్జున ఖర్గేతో దళిత వర్గానికి చెందిన పరమేశ్వర్ ప్రత్యేకంగా భేటీ అయి రాష్ట్ర రాజకీయాల్లో తీసుకురావాల్సిన మార్పుల పై సుదీర్ఘంగా చర్చించారు. అప్పటి నుంచే ‘కర్ణాటకకు దళిత ముఖ్యమంత్రి’ నినాదం తెరపైకి వచ్చింది. అడపాదడపా ఎవరో ఒకరు దళిత ముఖ్యమంత్రి నినాదాన్ని వాడుతూ సిద్ధరామయ్యకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మంగళవారం ఇది తారాస్థాయికి చేరింది. రాష్ట్రంలోని 20 దళిత సంఘాలకు చెందిన దాదాపు100 మందికి పైగా నేతలు ఒకవేదిక పైకి వచ్చి దళిత ముఖ్యమంత్రి ఆవసరాన్ని, ఆవశ్యకత పై చర్చించి కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకు మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచింది దళిత వర్గానికి చెందిన ఓటర్లేనని సంఘం నేతలు అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇప్పటి వరకూ దళితులకు సరైన పదవులు లభించలేదని వారు వాపోయారు. అందువల్ల ఈసారి కచ్చితంగా దళిత వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గే, లేదా పరమేశ్వర్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలనే ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ విషయమై కాంగ్రెస్ హై కమాండ్‌పై ఒత్తిడి తీసుకురావడానికి మార్చి చివరి వారంలో బెంగళూరులో దళిత వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో బృహత్ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాలన్నింటినీ నివేదికగా తయారు చేసి సమావేశం అనంతరం పరమేశ్వర్‌కు అందజేశారు. ఇదిలా ఉండగా హైకమాండ్‌ను కలవడానికి నేడు (బుధవారం) పరమేశ్వర్ ఢిల్లీ వెళ్లనున్నారు. మొదట ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, అటు పై కాంగ్రెస్ పార్టీ కర్ణాటకశాఖ రాజకీయ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అయ్యి రాష్ట్ర రాజకీయాల పె చర్చించనున్నారు. దళిత వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తాం సమావేశం అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో దళిత నాయకుడు, మాజీ ఐఏఎస్ అధికారి కే.శివరాం మాట్లాడుతూ... సీఎం సిద్ధరామయ్యపై తమకు వ్యతిరేకత లేదని, అయితే దళితులు ముఖ్యమంత్రి పీఠం పై కూర్చొనే అవకాశం ఉంది కనుక ఈ అవకాశాన్ని సమర్థుడైన దళిత నాయకుడికి ఇవ్వాలని అన్నారు. ఇందుకు విరుద్ధంగా హై కమాండ్ ప్రవర్తిస్తే కాంగ్రెస్ పార్టీలోని దళిత వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయిస్తామని అన్నారు. -
కేసీఆర్.. దళిత సీఎం హామీ నిలబెట్టుకో
సాక్షి, హైదరాబాద్: దళితుడే తొలి సీఎం అన్న టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తన మాటకు కట్టుబడకపోతే తెలంగాణలో అంతర్యుద్ధం మొదలవుతుందని, ఆయన కుటుంబం హైదరాబాద్‌లో ఉండదని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. మాది గలు, మాల ల్లో ఎవరికి సీఎం పదవిచ్చినా అభ్యం తరం లేదన్నారు. ఒకవేళ దళితుల మీద నమ్మకం లేకపోతే బీసీలకైనా అవకాశమివ్వాలన్నారు. జర్నలిస్టు సంఘాలు టీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే శనివారం ఇక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మందకృష్ణతో మీట్ ది మీడియా కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. బీసీలకు కేసీఆర్ న్యాయం చేయలేదని విమర్శించారు. తెలంగాణలో దొరల ఆధిపత్యాన్ని, అహంకారాన్ని చెల్లనివ్వమన్నారు. ఆయన తెలంగాణ కోసం అమరణ దీక్ష చేసినప్పుడు తాను పక్కనే ఉన్నానని, నిమ్మరసం ఇచ్చేటప్పుడు నా చేయిని ముద్దాడి కనీటి పర్యంతమయ్యారని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ మాట మీద నిలిచే వ్యక్తి కాదని, తన కుటుంబం కోసమే పార్టీని స్థాపించారని ధ్వజమెత్తారు. దొరల బిడ్డ కాబట్టే కవిత జైలుకెళ్లకుండా అర్ధరాత్రి బెయిల్ తెచ్చుకున్నారని, అదే ఉద్యమకారిణి విమలక్క మూడు నెలలు జైలులో ఉన్నా కేసీఆర్ ఒక్కనాడూ మాట్లాడలేదని విమర్శించారు. ‘నేను నటుణ్ని కాదు. ఉద్యమం నుంచి వచ్చాను. నా దగ్గర వంద కోట్లు లేవు. ప్రజలకే సంపాదించి పెట్టానే తప్ప వారి నుంచి నేనేమీ పొందలేదు. వికలాంగుల సమక్షంలో పార్టీని ప్రకటించాను. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా ఏర్పడలేదు. కూటి కోసం రిక్షా తొక్కిన కుటుంబం నుంచి వచ్చాను. అలాంటి వ్యక్తి ఓ పార్టీని స్థాపంచే పరిస్థితి ఎందుకు వచ్చింది? పేదరికం, అంటరానితనాన్ని రూపుమాపేందుకు మా పార్టీ కృషి చేస్తుంది. మావోయిస్టులు, అంబేద్కర్ అజెండానే మా అజెండా’ అని మందకృష్ణ ఉద్వేగంగా మాట్లాడారు. అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణను కోరుకుంటున్నా అసెంబ్లీలో మాత్రం తీర్మానం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే చట్టసభల్లో తమ గళం వినిపించేందుకే పార్టీని పెట్టామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేసిందని మండిపడ్డారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తానంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు... 2009 ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు ఇస్తామని ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ఆయనకూడా మోసం చేశారని ఆరోపించారు. తాను పార్టీ పెడితే ఏమాత్రం ప్రాధాన్యమివ్వని మీడియా.. పవన్ కల్యాణ్ పార్టీ పెడితే మాత్రం పేజీలకు పేజీలకు రాశాయని పేర్కొన్నారు. తమ ఆలోచనా విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భవిష్యత్తులో మీడియాను పెట్టనున్నట్లు చెప్పారు. -
'కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొడతాం'
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ శుక్రవారం వరంగల్‌లో నిప్పులు చెరిగారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, ఆ రాష్ట్రానికి దళితుడ్నే ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్ మాటమార్చారని ఆయన ఆరోపించారు. మాటా మార్చడం కేసీఆర్ నైజమని ఆయన అభివర్ణించారు. కేసీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణ సీఎంగా ప్రకటించుకుంటే తాము చూస్తు ఉరుకోమన్నారు. కేసీఆర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులను హైదరాబాద్ నుంచి తరిమికొడతామని మందకృష్ణ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఓ విధంగా రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో మరో విధంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమేత్తారు. అసలు కేసీఆర్ ఎందుకు మాటమార్చారో సమాధానం చెప్పాలని మంద కృష్ణ డిమాండ్ చేశారు. -
టిఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు వ్యూహం