minister harish arao
-
బీజేపీ వాగ్దానం అంటేనే జుమ్లా మాటలు: మంత్రి హరీష్
సాక్షి, హైదరాబాద్: ‘ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో ఇస్తున్న పెన్షన్ రూ.750. బీజేపీ పాలిత కర్ణాటకలో రూ.650, మహారాష్ట్రలో రూ.1,000 ఇస్తున్నారు. ఇదే బీజేపీ నాయకులు మునుగోడులో గెలిస్తే రూ.3 వేల పెన్షన్ ఇస్తామని జుమ్లా హామీలు ఇస్తున్నారు. ఇంతకంటే మోసం, దగా మరొకటి ఉంటుందా..?’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రశ్నించారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పినప్పటి నుంచి ఇప్పటివరకు బీజేపీ వన్నీ జుమ్లా మాటలేనని ధ్వజమెత్తారు. ఆదివారం తెలంగాణ భవన్లో పార్టీ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జీవన్‌రెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వండి దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో రూ.3 వేల పింఛన్ ఇస్తామన్నారని, అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండికి బండి, గుండుకు గుండు అని ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని హరీశ్‌రావు నిలదీశారు. (ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల ఎన్నికల్లో బీజేపీ నేతలు ఇచ్చిన హామీలు, తర్వాత వాటిని ఉల్లంఘిస్తూ చెప్పిన మాటల వీడియోలను ప్రదర్శించారు) చిత్తశుద్ధి ఉంటే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ.3 వేల పెన్షన్లు ఇవ్వాలని సూచించారు. దేశవ్యాప్తంగా రూ.3 వేలు పెన్షన్ ఇస్తామని ప్రధాని మోదీతో అధికారికంగా చెప్పించాలన్నారు. లేని పక్షంలో జుమ్లా హామీలు ఇచ్చినందుకు బహిరంగంగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకిచ్చిన హామీలు ఏడాదైనా నెరవేర్చలేదు నల్లచట్టాలు తెచ్చి 750 మంది రైతులను పొట్టనపెట్టుకన్న మోదీ.. చివరికి రైతులకు క్షమాపణలు చెప్పి, ఏడాదైనా వారికిచ్చిన హామీలను నెరవేర్చలేదని మంత్రి విమర్శించారు. తెలంగాణ ఏర్పాటునే తప్పుపట్టిన మోదీ ఇప్పటికీ తన ధోరణి మార్చుకోలేదన్నారు. కృష్ణా నీటి వాటా తేల్చకపోవడం వంటి ఎన్నో అంశాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీజేపీకి మునుగోడులో ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. రాజగోపాల్ రెడ్డి ఆత్మగౌరవం కోసం రాజీనామా చేయలేదని, ఆస్తులు పెంచుకోవడానికి చేశారని చెప్పారు. రూ. 2,016 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రూ.200గా ఉన్న పెన్షన్‌ను తెలంగాణ రాష్ట్రంలో రూ.1,000కి పెంచామని, 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రస్తుతం రూ.2,016 ఇస్తున్నట్లు హరీశ్ తెలిపారు. డయాలసిస్ రోగులకు, బీడీ, గీత, నేత కార్మికులకు పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దేశంలో దివ్యాంగులకు రూ. 3,016 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణాయే అని పేర్కొన్నారు. ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం మిషన్ భగీరథ పథకం ద్వారా సీఎం కేసీఆర్ మునుగోడుతో పాటు ఉమ్మడి నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారని మంత్రి చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పిందని, అయితే కేంద్రం ఇప్పటివరకు 24 పైసలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. మునుగోడు ప్రజలపై సీఎం కేసీఆర్‌కు ఉన్న ప్రేమ మోదీకి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. 10 రెట్లు అధికంగా ధాన్యం దిగుబడి యాదాద్రిలో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారని, నల్లగొండ జిల్లా రైతాంగానికి సాగునీరు పారించి, గతంలో కన్నా 10 రెట్ల అధిక ధాన్యం దిగుబడికి సీఎం కారణమయ్యారని హరీశ్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల భూమికి భారమయ్యేలా పంటలు పండుతున్నాయని గుర్తు చేశారు. ఎస్సారెస్పీ నుంచి తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట జిల్లాల చిట్టచివరి భూముల వరకు సాగునీళ్లు ఇస్తున్నామని చెప్పారు. ఇదీ చదవండి: మును'గోడదూకుడు'.. కొద్దిరోజుల్లోనే మూడు పార్టీలు మారి... -
పనుల్లో వేగం పెంచండి
సాక్షి, హైదరాబాద్: సాగు నీటి శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు ఏఐబీపీ, డ్రిప్, భూగర్భజలాలు, ట్రిపుల్ఆర్ పథకాలపై మంత్రి హరీశ్‌రావు జలసౌధలో సమీక్ష నిర్వహించారు. ట్రిపుల్ఆర్ పనుల నిమిత్తం కేంద్రం నుంచి వచ్చే నిధులపై ఆరా తీశారు. ఇప్పటివరకు పూర్తయిన పనులకు యుటిలైజేషన్ పత్రాలు కేంద్రానికి సమర్పించి రావాల్సిన నిధులు పొందాలని సూచించారు. ఇక డామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (డ్రిప్) కింద వరల్డ్ బ్యాంకు నిధులతో చేపట్టే పథకంలో భాగంగా రాష్ట్రం నుంచి 33 ప్రాజెక్టు డామ్‌ల ఆధునీకరణ, మరమ్మతులకు రూ.665 కోట్ల కోసం ప్రతిపాదనలు పంపామని అధికారులు మంత్రికి తెలిపారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలు ఎంత పెరిగాయన్న వివరాలను హరీశ్ భూగర్భ జలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద వచ్చే రూ.70 కోట్ల నిధులతో గ్రౌండ్ డేటా సిస్టంను బలోపేతం చేస్తున్నట్లు అధికారులు వివరించారు. భూగర్భ జలాల సమాచారాన్ని డిజిటల్ పద్ధతిలో సేకరించడం, భూగర్భ జలశాఖ కార్యకలాపాలు, ప్రణాళికను మరింత ఆధునీకరించడం వంటి పనులు చేపట్టాల్సి ఉందని ఈ ఏడాది రూ.16 కోట్లతో కొన్ని పనులు చేపడుతున్నట్లు మంత్రికి తెలిపారు. ఈ పనులు త్వరగా పూర్తి చేసి కేంద్రం నుంచి మరిన్ని నిధుల విడుదలకు చర్యలు చేపట్టాలని హరీశ్ సూచించారు. భూగర్భ జలాల సమాచార సేకరణకు 800 కొత్త పీజో మీటర్లు, 900 వాటర్ లెవల్ రికార్డర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమీక్షలో జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ ప్రకాశ్, ఈఎన్సీ మురళీధర్, కాడా కమిషనర్ మల్సూర్, ఇరిగేషన్ ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు. -
5,703 చెరువుల పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: నాలుగో విడత మిషన్ కాకతీయ కింద 5,703 చెరువుల పునరుద్ధరణ చేపట్టనున్నట్టు నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. చెరువుల పునరుద్ధరణ పనులకు గాను ఈ నెలాఖరులోగా పరిపాలనాపరమైన అనుమతి పొందాలని.. జనవరి నుంచి పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. మంగళవారం సెక్రటేరియట్లో హరీశ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలుగో విడత పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మిషన్ కాకతీయ కింద చేపట్టనున్న పనులలో సంబంధిత సాగునీటి వనరుల ఆయకట్టు స్థిరీకరణ, అదనపు ఆయకట్టుకు మాత్రమే ప్రాధాన్యమివ్వాలని హరీశ్ ఆదేశించారు. పాలనా అనుమతులు లభించిన పనులకు సాంకేతిక అనుమతులిచ్చి టెండర్లు పిలిచి పనులు చేపట్టాలన్నారు. మిషన్ కాకతీయ నాలుగోదశ టైం లైన్లను విధిగా పాటించాలని స్పష్టంచేశారు. ఈ నెల 15కల్లా పాలనాపరమైన అనుమతి కోసం అంచనాలు పంపి.. నెలాఖరు వరకు అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. మిషన్ కాకతీయ రెండు, మూడు దశలలో ప్రారంభించి పూర్తికాకుండా మిగిలిపోయిన చెరువులను కూడా పూర్తిచేసి తుది బిల్లులు చెల్లించాలని ఇంజనీర్లకు సూచించారు. పనుల నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీపడొద్దని హెచ్చరించారు. పునరుద్ధరించే చెరువుల జాబితాను ముందుగానే వ్యవసాయ అధికారులకు అందిస్తున్నందున పూడిక మట్టిని రైతులు వాడుకునే ముందు తప్పనిసరిగా పరీక్షించాలన్నారు. పూడికతీత మట్టిపై అవగాహన కల్పించాలి గతంలో రాష్ట్రంలో కేవలం భూసార పరీక్ష కేంద్రాలు 9 మాత్రమే ఉండేవని, ప్రస్తుతం ప్రతి మూడు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక సాయిల్ టెస్ట్ ల్యాబ్ ఉందని హరీశ్ అన్నారు. పూడికతీత మట్టిలో ఉండే పోషకాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామపంచాయతీల ఎదుట పోస్టర్లు, బ్యానర్లతో ప్రచారం చేయాలని కోరారు. వ్యవసాయ, ఇరిగేషన్శాఖల కింది స్థాయి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మిషన్ కాకతీయ నాలుగోదశ పునరుద్ధరణ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను సహకారం తీసుకోవాలని సూచించారు. ట్రిపుల్ ఆర్ కింద 147 చెరువుల పనులు చేపట్టేందుకు కేంద్రప్రభుత్వం మంగళవారం రూ.162 కోట్లు మంజూరు చేసిందని.. ఈ పనులను సైతం వెంటనే ప్రారంభించాలని హరీశ్ ఆదేశించారు. దేశానికే ఆదర్శంగా పంచాయతీరాజ్ చట్టం-మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: దేశానికే ఆదర్శంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ఉం డాలని, ఆ దిశగా పకడ్బందీగా చట్టానికి రూపకల్పన జరపాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నూతన పంచాయతీరాజ్ చట్ట రూపకల్పనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కసరత్తు తుది దశకు చేరిన సందర్భంగా మంగళ వారం జూపల్లి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు చట్టంలో పొందుపర్చేందుకు సిద్ధం చేసిన పలు అంశాలపై కూలంకశంగా చర్చించి పలు సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనా విధానాలకు అనుగుణంగా, తెలంగాణలో స్థానిక సంస్థలను బలోపేతం చేసేలా చట్టం ఉండాలన్నారు. -
కాళేశ్వరం నిర్మాణంలోని ప్రాజెక్టే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఊరటనిచ్చింది. ఇన్నాళ్లూ దీనిని కొత్త ప్రాజెక్టుగా పేర్కొన్న కేంద్రం.. రాష్ట్రం ఇచ్చిన వివరణలతో సంతృప్తి చెంది, కాళేశ్వరాన్ని నిర్మాణంలోని ప్రాజెక్టుగా పరిగణించేందుకు ఓకే చెప్పింది. ఈ మేరకు కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్సింగ్ గురువారం రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీకి లేఖ రాశారు. ఈ నెల 24న సాగునీటి శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, జోషీలతో జరిపిన చర్చల అంశాన్ని ప్రస్తావిస్తూ...‘‘మన చర్చల అనంతరం నిర్ణయించిన మేరకు.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుగానే పరిగణిస్తాం. రీ ఇంజనీరింగ్‌లో భాగంగా ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును విభజించి చేపట్టినదానిగానే కాళేశ్వరాన్ని పరిగణిస్తాం..’’ అని అందులో పేర్కొన్నారు. మొర ఫలించినట్లే..! ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు తొలి డిజైన్ మేరకు తగిన నీటి లభ్యత లేని దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం రీ డిజైనింగ్ చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రాజెక్టును రెండుగా విభజించి అదనంగా కాళేశ్వరం ఎత్తిపోతలను చేపట్టింది. కానీ దీనిపై అనేక వివాదాలు తలెత్తాయి. పొరుగు రాష్ట్రం కాళేశ్వరం పూర్తిగా అక్రమ ప్రాజెక్టు అంటూ కేంద్ర జల వనరుల శాఖ, కేంద్ర జల సంఘం, గోదావరి బోర్డులకు ఫిర్యాదులు చేసింది. దీంతో కేంద్రం, సీడబ్ల్యూసీ, బోర్డులు వివరణ కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు వివరాలు వెల్లడించింది. 160 టీఎంసీల వినియోగం లక్ష్యంగా ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టి, 2010లో కేంద్ర జల సంఘానికి డీపీఆర్ సమర్పించామని.. కేంద్రం పరిధిలోని వివిధ డైరెక్టరేట్ల నుంచి అనుమతులు కూడా పొందామని వివరించింది. అంతేగాకుండా ప్రాణహిత వద్ద నీటి లభ్యత, ప్రాజెక్టులోని రిజర్వాయర్ల సామర్థ్యం అనుకున్న మేర లేదంటూ సీడబ్ల్యూసీ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలనూ అందజేసింది. మహారాష్ట్ర ముంపునకు సంబంధించి అభ్యంతరాలు లేవనెత్తిందని తెలిపింది. వీటన్నింటి దృష్ట్యా ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రెండుగా రీడిజైన్ చేశామని.. కాళేశ్వరం వద్ద అదనంగా ఎత్తిపోతలు చేపట్టామని స్పష్టం చేసింది. మొత్తంగా ఇది నిర్మాణంలోని ప్రాజెక్టే తప్ప కొత్త ప్రాజెక్టు కాదని వివరించింది. దీనిపై ఇటీవలి వరకూ సంప్రదింపులు జరుగుతూనే ఉండగా.. తాజాగా ఈ నెల 21న గోదావరి బోర్డు చైర్మన్ హెచ్‌కే సాహూ సాగునీటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జోషీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కూడా జోషీ కాళేశ్వరం పాత ప్రాజెక్టే అనడానికి గల అన్ని రుజువులను సమర్పించారు. అనంతరం ఈ నెల 24న ఢిల్లీ వెళ్లిన మంత్రి హరీశ్‌రావు, జోషీలు కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్సింగ్తో భేటీ అయి ప్రాజెక్టుపై వివరణ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందిన కేంద్రం కాళేశ్వరాన్ని నిర్మాణంలోని పాత ప్రాజెక్టుగానే పరిగణించేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు కేంద్రం నుంచి దక్కాల్సిన సాంకేతిక, ఆర్థిక అనుమతులు సులభతరం కానున్నాయి. ఈ నివేదికలు ఇవ్వాల్సిందే.. కాళేశ్వరాన్ని పాత ప్రాజెక్టుగా పరిగణిస్తామన్న అమర్జిత్.. నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ లేవనెత్తిన సందేహాలపై తెలంగాణ ప్రభుత్వం వివరణలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించి భూగర్భ జలాలు, వ్యవసాయం, భూభౌగోళిక అధ్యయన అంశాలు, భూమి, రాతి పరీక్షల అంశాలపై కోరిన సమాచారాన్ని అందించాలన్నారు. ఈ మేరకు సీడబ్ల్యూసీ కోరిన అంశాల ప్రతిని లేఖకు జత చేశారు. ప్రాణహితలోని తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతను, మేడిగడ్డ వద్ద నీటి లభ్యతను విడివిడిగా అంచనా వేశారని.. మొత్తంగా కలిపి నీటి లభ్యతను, వినియోగం పోను మిగిలే జలాలను లెక్కగట్టి తెలపాలని అందులో సీడబ్ల్యూసీ కోరింది. ప్రతి పది రోజులకు ఒకమారు ఎంత నీటి లభ్యత ఉందో చెప్పాలని... ఎల్లంపల్లికి సంబంధించిన అనుమతుల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. -
‘ఏడాదిలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేయండి’
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై అధికారులతో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. ఏడాదిలో ప్రాజెక్టు పూర్తిచేసి రికార్డు సృష్టించాలన్నారు. 2017 డిసెంబర్ లో పంట పొలాలకు నీళ్లివ్వాలని అధికారులకు సూచించారు. కాగా మల్లన్నసాగర్ పై ఈ నెల 10 వ తేదీన ప్రత్యేకంగా సమావేశం అవనున్నట్టు హరీశ్ పేర్కొన్నారు. మల్లన్న రిజర్వాయర్ పనులకు ఈ నెలలోనే టెండర్లు ఉంటాయన్నారు.