Minister K. tarakarama Rao
-
హైదరాబాద్ లో 162 సిల్ట్ కార్టింగ్ వాహనాలు అందజేత
-
మూడేళ్లలో ఇంటింటికీ నీళ్లు
శాసనసభలో మంత్రి కె.తారకరామారావు వెల్లడి మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్ల వరకు ఖర్చు ఇప్పటికే నాబార్డు, హడ్కోల నుంచి రూ. 20 వేల కోట్ల రుణం అవసరమైతే జైకా లాంటి అంతర్జాతీయ సంస్థల తలుపుతడతాం హైదరాబాద్: దేశంలో మరే రాష్ట్రంలో లేనట్లుగా ఇంటింటికీ రక్షిత తాగునీటిని అం దించే మిషన్ భగీరథ ప్రాజెక్టును 2018-19 చివరి నాటికి 99 శాతం గ్రామాలకు చేరుస్తామని ప్రభుత్వం శాసనసభలో స్పష్టం చేసింది. రాష్ట్రంలో 24,224 గ్రామాలకు నీరందించే లక్ష్యంతో అనుకున్న సమయంలో ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి 6,100 గ్రామాలు, 2017-18 చివరికల్లా 15,872 గ్రామాలు, 2018-19 నాటికి 22వేల పైచిలుకు గ్రామాల్లో ఇంటింటికీ రక్షిత తాగునీటిని అందిస్తామని, మిగతా గ్రామాలకూ అప్పటికల్లా నీటిని అందించే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేసింది. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మిషన్ భగీరథపై సభ్యులు పుట్ట మధు, గాదరి కిశోర్ కుమార్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అజ్మీరా రేఖ, సున్నం రాజయ్య, డాక్టర్ కె.లక్ష్మణ్‌లు అడిగిన ప్రశ్నలకు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె. తారక రామారావు ఈ మేరకు బదులిచ్చారు. మొదటి దశ పనులు పురోగతిలో ఉన్నాయని, రెండో దశ పనులను కూడా ప్రారంభించామన్నారు. జలమండలి ఆధ్వర్యంలో గోదావరి పైపులైను ద్వారా నికరమైన నీటి సరఫరాపై ఆధారపడి రూపొందించిన నాలుగు ప్యాకేజీలలో పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. మొదటి దశలో మేడ్చల్, కుత్బుల్లాపూర్‌లోని కొంత భాగం, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట, భువనగిరి, ఆలేరు, నకిరేకల్‌లోని కొంత భాగం, తుంగతుర్తిలోని కొంత భాగం, జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తిల్లోని కొన్ని భాగాలకు నీటి కనెక్షన్లను సమకూర్చాలని ప్రతిపాదించినట్లు మంత్రి చెప్పారు. ప్రాజెక్టు నిర్వహణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ భాగస్వామ్యం ఉందని, వారి నియోజకవర్గాల్లో ప్రాజెక్టు తీరును వివరించే బుక్లెట్లను ఈ సమావేశాల్లోనే అందజేస్తామని కేటీఆర్ చెప్పారు. స్థానికంగా సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పనులు సకాలంలో జరిగేలా చూడాలని సూచించారు. పథకాన్ని కేంద్రం మెచ్చుకున్నా.. నిధుల సమీకరణ, తదుపరి నిర్వహణ ఖర్చుల ప్రణాళికపై బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ ప్రశ్నలకు కేటీఆర్ విపులంగా జవాబిచ్చారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బీరేంద్రసింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రాజెక్టును సమీక్షించారని, పథకాన్ని పలువురు కేంద్ర మంత్రులు అభినందించటమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ దీన్ని అమలు చేస్తే బాగుంటుందన్నారని కేటీఆర్ చెప్పారు. ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలన్న తన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించినా ఇప్పటివరకు ఎలాంటి సహకారం అందలేదన్నారు. ఈ పథకానికి రూ. 36,976.54 కోట్లు అవసరమని, అది రూ. 40 వేల కోట్లకు కూడా చేరుకునే అవకాశం ఉందని, ఇప్పటికే నాబార్డు, హడ్కోల నుంచి రూ. 20 వేల కోట్ల రుణం కోసం కమిట్మెంట్ వచ్చిందని కేటీఆర్ సభకు చెప్పారు. ఈ నిధులతో 70 శాతం పనులు పూర్తి చేస్తామన్నారు. ఎస్బీఐ లాంటి ప్రభుత్వరంగ బ్యాంకులతోనూ రుణ చర్చలు సాగుతున్నాయన్నారు. జైకా లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణం తెచ్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. పన్నులతోనే ప్రాజెక్టు నిర్వహణ మంచినీటి కోసం గ్రామ పంచాయతీలు పన్నులు చెల్లిస్తున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావిస్తూ ఈ పన్నులను పక్కాగా వసూలు చేసి ఆ మొత్తంతోనే నీటి సరఫరా ఖర్చును భరిస్తామన్నారు. మెరుగైన సేవలందిస్తే పన్నులు పక్కాగా చెల్లించేందుకు ప్రజలు ముందుకొస్తారని, గుజరాత్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నీటి కమిటీలు ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేస్తున్న తరహాలో రాష్ట్రంలోనూ నీటి సంఘాలు ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. పథకాన్ని నిర్వహించేందుకు గ్రామ పంచాయతీల్లో రూ. 875 కోట్లు, పట్టణాల్లో రూ. 900 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. -
నేటి నుంచి ‘పల్లెప్రగతి’
కౌడిపల్లిలో పైలాన్‌ను ఆవిష్కరించనున్న కేటీఆర్ కార్యక్రమం అమలుకు 150 మండలాల ఎంపిక పేదల జీవనోపాధి కోసం రూ. 642 కోట్లు హైదరాబాద్: రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెదక్ జిల్లా కౌడిపల్లిలో ఏర్పాటు చేసిన ‘పల్లె ప్రగతి’ పైలాన్‌ను పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె. తారకరామారావు శనివారం ఆవిష్కరించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఐదేళ్లపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు రూ. 450 కోట్ల ఆర్థిక సాయం అందించనుండగా రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 192 కోట్లు (మొత్తంగా రూ. 642 కోట్లు) వెచ్చించనున్నారు. తొలి విడ తగా రాష్ట్రంలో వెనుకబడిన 150 మండలాలను ఎంపిక చేసిన అధికారులు ఆయా ప్రాంతాల్లో పేద వర్గాలకు జీవనోపాధి కల్పించడం, వారిని మానవ వనరుల అభివృద్ధికి చేరువ చేయడం, సామాజిక హక్కులు కల్పించడం వంటి కార్యక్రమాలను చేపడతారు. ఎంపిక చేసిన మండలాల్లో చిన్న, మధ్యతరగతి వ్యవసాయ కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో వాల్యూ చైన్ డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్, డిజిటల్ లోకల్ గవర్నమెంట్, ఐసీటీ-టీఏ భాగస్వామ్యం, ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ సపోర్టు కార్యక్రమాలను నిర్వహించనుంది. ప్రాజెక్టును అమలు చేసేందుకు ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ, అమలు, సమీక్ష, పథకం నిర్వహణ కమిటీ లు సెర్ప్ అధికారుల పర్యవేక్షణలో పనిచేస్తాయి. లక్ష్యాలు ఇవీ.. ఎంపిక చేసిన మండలాల్లో 2.5 లక్షల మంది పేద వ్యవసాయదారుల జీవనోపాధి, ఆదాయాన్ని పెంపొందించడం 2.5 లక్షల కుటుంబాలకు సరైన ఆరోగ్యం, పౌష్టికాహారం, పరిశుభ్రత వంటి అంశాల్లో మానవ వనరుల అభివృద్ధి ఐదు లక్షల కుటుంబాలకు ప్రభుత్వ వ్యవస్థ ద్వారా మెరుగైన అవకాశాలు కల్పించడం ఆసరా, ఉపాధి హామీ వంటి పథకాల్లో లబ్ధిదారుల నమోదు, నగదు చెల్లింపుల ద్వారా సామాజిక భద్రత హక్కు కల్పించడం -
ఇన్‌రిథమ్‌తో టీసర్కార్ ఎంవోయూ
మంత్రి కేటీఆర్ సమక్షంలో కుదిరిన అవగాహన హైదరాబాద్: డేటా అనలిటిక్స్ రంగంలో ప్రఖ్యాతిగాంచిన ‘ఇన్‌రిథమ్’ సంస్థతో తెలంగాణ సర్కారు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా పర్యటనలో ఉన్న ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో.. శనివారం ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, ఇన్‌రిథమ్ సంస్థ చైర్మన్ వివ్ పెన్నింటి ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ గేమింగ్ టెక్నాలజీ, స్మార్ట్‌సిటీ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈ ఎంవోయూల వలన ఆయా రంగాల్లో పరిశోధనలు, వాణిజ్య,తదితర అవకాశాలు మెరుగవుతాయన్నారు. కార్నేగిమెలన్ వర్సిటీ సందర్శన టూర్లో భాగంగా పిట్స్‌బర్గ్‌లోని కార్నేగిమెలన్ యూనివర్సిటీని మంత్రి కేటీఆర్ సందర్శించారు. వర్సిటీ అధ్యక్షుడు సుబ్ర సురేష్, ప్రొఫెసర్ రాజిరెడ్డి ఇచ్చిన విందుకు హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, పారి శ్రామిక విధానాలను వివరించారు. రాబోయే కాలంలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రం గా తెలంగాణను తీర్చిదిద్దేందు కు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. పిట్స్‌బర్గ్‌లోని టెక్నాలజీ షాప్‌ను కూడా మంత్రి సందర్శించారు. టెక్‌షాప్ సందర్శన అనుభవం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న టి-హబ్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందన్నారు. ఆల్ఫా గేర్ ల్యాబ్‌ను కూడా సందర్శించి అక్కడ జరుగుతున ్న పరిశోధనలు, ప్రయోగాల గురించి తెలుసుకున్నారు. పిట్స్బర్గ్ వెంకన్న సన్నిధిలో.. పర్యటనలో భాగంగా కేటీఆర్ పిట్స్‌బర్గ్‌లోని వెంకటేశ్వరస్వామి దేవాల యాన్ని సందర్శించి పలువురు ఎన్నారైలతో సమావేశమయ్యారు. ప్రస్తుత ం ప్రపంచమంతా భారత్ వైపు చూసో ్తందని, మున్ముందు తెలంగాణ వైపు చూసేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే.. ఎన్నారైలు ప్రభుత్వం తో కలిసి రావాలన్నారు. ప్రభుత్వం అనేక అంశా ల్లో స్పష్టమైన రోడ్‌మ్యాప్‌తో ముందుకెళుతోందన్నారు. ఎన్నారైలు తమ సొంతగ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తో కలిసి పనిచేయాలన్నారు.