ఇన్‌రిథమ్‌తో టీసర్కార్ ఎంవోయూ
మంత్రి కేటీఆర్ సమక్షంలో కుదిరిన అవగాహన
హైదరాబాద్: డేటా అనలిటిక్స్ రంగంలో ప్రఖ్యాతిగాంచిన ‘ఇన్‌రిథమ్’ సంస్థతో తెలంగాణ సర్కారు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా పర్యటనలో ఉన్న ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో.. శనివారం ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, ఇన్‌రిథమ్ సంస్థ చైర్మన్ వివ్ పెన్నింటి ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ గేమింగ్ టెక్నాలజీ, స్మార్ట్‌సిటీ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈ ఎంవోయూల వలన ఆయా రంగాల్లో పరిశోధనలు, వాణిజ్య,తదితర అవకాశాలు మెరుగవుతాయన్నారు.
కార్నేగిమెలన్ వర్సిటీ సందర్శన
టూర్‌లో భాగంగా పిట్స్‌బర్గ్‌లోని కార్నేగిమెలన్ యూనివర్సిటీని మంత్రి కేటీఆర్ సందర్శించారు. వర్సిటీ అధ్యక్షుడు సుబ్ర సురేష్, ప్రొఫెసర్ రాజిరెడ్డి ఇచ్చిన విందుకు హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, పారి శ్రామిక విధానాలను వివరించారు. రాబోయే కాలంలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రం గా తెలంగాణను తీర్చిదిద్దేందు కు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. పిట్స్‌బర్గ్‌లోని టెక్నాలజీ షాప్‌ను కూడా మంత్రి సందర్శించారు. టెక్‌షాప్ సందర్శన అనుభవం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న టి-హబ్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందన్నారు. ఆల్ఫా గేర్ ల్యాబ్‌ను కూడా సందర్శించి అక్కడ జరుగుతున ్న పరిశోధనలు, ప్రయోగాల గురించి తెలుసుకున్నారు.
పిట్స్‌బర్గ్ వెంకన్న సన్నిధిలో..
పర్యటనలో భాగంగా కేటీఆర్ పిట్స్‌బర్గ్‌లోని వెంకటేశ్వరస్వామి దేవాల యాన్ని సందర్శించి పలువురు ఎన్నారైలతో సమావేశమయ్యారు. ప్రస్తుత ం ప్రపంచమంతా భారత్ వైపు చూసో ్తందని, మున్ముందు తెలంగాణ వైపు చూసేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే.. ఎన్నారైలు ప్రభుత్వం తో కలిసి రావాలన్నారు. ప్రభుత్వం అనేక అంశా ల్లో స్పష్టమైన రోడ్‌మ్యాప్‌తో ముందుకెళుతోందన్నారు. ఎన్నారైలు తమ సొంతగ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తో కలిసి పనిచేయాలన్నారు.