minister kamineni srinivasrao
-
శిశువు మరణం ప్రభుత్వ అసమర్థతే..
వైఎస్సార్సీపీ నేతల ధ్వజం పట్నంబజారు (గుంటూరు) : ప్రభుత్వాసుపత్రిలో పసికందు మృతి రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నా, నైతిక బాధ్యత వహించాల్సిన మంత్రులు పరామర్శలకు రావడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీజీహెచ్‌లో పసికందు మృతిపై వైఎస్సార్ సీపీ నేతలు భగ్గుమన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు రాజీనామా చేయాలని, జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను తక్షణమే సస్పెన్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రిలో బైఠాయించారు. మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ నెలకు రెండుసార్లు గుంటూరులో పర్యటిస్తున్న ఆరోగ్య మంత్రి చేస్తోంది ఏమిటని ప్రశ్నించారు. కామినేని అసమర్థ్ధత వలనే ఇటువంటి దుస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు. ఎస్సీసెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులకు దాసోహమై ప్రభుత్వ వైద్యశాలలను నిర్వీర్యం చేస్తున్నారని, ఇదీ కేవలం గుంటూరులో జరుగుతున్న తంతు కాదని మండిపడ్డారు. 20 సార్లు జిల్లాకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒక్కసారైనా జీజీహెచ్‌ను పరిశీలించకపోవటం దారుణమని, తక్షణమే విచారణ జరిపించి బాధ్యలపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. నగరాధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ సిబ్బందిని సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్‌ముస్తఫా మాట్లాడుతూ ఆసుపత్రిలో పారిశుధ్ధ్యం సరిగా లేకపోవటంతో నెలరోజులపాటు తన సొంత డబ్బులతో కార్మికులును పెట్టి పనులు చేయించటం జరిగిందన్నారు. శిశువు తల్లితండ్రులు చావలి నాగ, లక్ష్మీలను విజయవాడ నుంచి తన వెంట తీసుకుని వచ్చిన పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ ఆసుపత్రిలో మంత్రుల బృందాన్ని నిలదీశారు. పసికందు తల్లితండ్రులకు పూర్తి న్యాయం చేయాలని ఉద్వేగభరితంగా తన వాదననూ వారికి వినిపించించారు. రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, ఎంపీ గల్లా జయదేవ్‌లు బాధిత కుంటుంబాన్ని పరామర్శించి తిరిగి వెళుతున్న క్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు వారిని అడ్డుకున్నారు. మంత్రి కామినేని రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు నేతల మధ్య తోపులాట జరగటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ నసీర్‌అహ్మద్, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, పలు విభాగాల నేతలు కావటి మనోహర్‌నాయుడు, మొగిలి మధు, కోవూరి సునీల్‌కుమార్, కొత్తా చిన్నపరెడ్డి, బండారు సాయిబాబు, అంగడి శ్రీనివాసరావు, షేక్ గులాంరసూల్, ఏలికా శ్రీకాంత్‌యాదవ్, గనిక ఝాన్సీరాణి, పల్లపు రాఘవ, శిఖా బెనర్జీ, కొట్టె కవిత, కొలకలూరి కోటేశ్వరరావు, కాశీవిశ్వనాధం తదితరులు పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర సంబరం
పార్టీ కార్యాలయాల్లో... స్వాతంత్య్ర దిన వేడుకలను ప్రజలంతా శనివారం ఆనందోత్సాలతో జరుపుకున్నారు. జాతీయపతాకాన్ని ఆవిష్కరించి అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. పలు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆయా పార్టీ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. డాబాగార్డెన్స్ : స్వాతంత్య్ర దిన వేడుకలు శనివారం ఆయా పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మువ్వెన్నల జెండాను ఎగురవేశారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త తైనాల విజయకుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు, పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు కోలా గురువులు, మళ్ల విజయప్రసాద్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, వంశీకృష్ణ శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, నగర మైనార్టీ విభాగ కన్వీనర్ మహ్మద్ షరీఫ్, ప్రచార కార్యదర్శి భర్కత్ ఆలీ, సత్తి రామకృష్ణారెడ్డి, పీతల మూర్తి యాదవ్, రొంగలి జగన్నాథం, పీతల వాసు, పక్కి దివాకర్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్,సీపీఐ కార్యాలయాల్లో.. అల్లిపురం: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాసరావు జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు, సేవాదళ్ చైర్మన్ పెంటపల్లి సత్యనారాయణ, బమ్మిడి గంగాధర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి, గుంటూరు భారతి, వేగి దివాకర్ పాల్గొన్నారు. సీపీఐ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి ఏజె స్టాలిన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బీజేపీ కార్యాలయంలో ఎంవీపీకాలనీ: ఎంవీపీ కాలనీలోని తన కార్యాలయంలో ఎంపీ హరిబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రి కామినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, సీనియర్ నాయకుడు పి.వి.చలపతిరావు, నగర అధ్యక్షుడు పి.వి.నారాయణరావు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో... మహారాణిపేట : అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్య్ర దిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో కలెక్టర్ ఎన్.యువరాజ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో జేసీ జనార్దన్ నివాస్, జేసీ-2 డి.వెంకటరెడ్డి, డీఎస్ఓ జె.శాంతకుమారి, ఆర్డీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో జెడ్పీ చైర్పర్సన్ లాలం భవాని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఆర్.జయప్రకాశ్నారాయణన్, పీఆర్, మినిస్టీరియల్, ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో డీపీఓ టి.వెంకటేశ్వర్రావు, జిల్లా సమాచార కార్యాలయంలో సమాచారశాఖ అడిషనల్ డెరైక్టర్ డి.శ్రీనివాస్, కేజీహెచ్‌లో సూపరింటెండెంట్ మధుసూదన్‌బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కోర్టులో... విశాఖ లీగల్ :జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.జయసూర్య పతాకాన్ని ఆవిష్కరించారు. విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.ఎస్.సురేష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి చీమలపాటి శేఖర్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. వెల్ఫేర్ గ్రూప్ కార్యాలయంలో... ఆశీల్‌మెట్ట దరి వెల్ఫేర్ గ్రూప్ కార్యాలయంలో మేనేజింగ్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజక వర్గ సమన్వయకర్త మళ్ల విజయ్‌ప్రసాద్ జాతీయ పతాకాన్ని కుటుంబసమేతంగా ఎగురవేశారు. -
గౌరవమైన వృత్తికి కళంకం తేకండి
ఉన్నవారే పనిచేయకపోతే.. కొత్త వారెందుకు? రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని నెల్లూరు(అగ్రికల్చర్) : వైద్య వృత్తి చాలా గౌరవ ప్రదమైంది.. మీ ప్రవర్తనతో ఆ వృత్తికి కళంకం రాకుండా చూడాలని ప్రభుత్వ వైద్యులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు సూచించారు. నెల్లూరులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రభుత్వ వైద్యులతో ఆయన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉన్న వారే సక్రమంగా పని చేయకపోతే.. కొత్తవారిని ఎందుకు మీరే చెప్పాలన్నారు. వైద్యులు రోజువారి విధుల్లో ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లతో వైద్యశాలను కార్పొరేటుకు దీటుగా తీర్చిదిద్దుతుందన్నారు. ప్రొఫెసర్లు సకాలంలో క్లాసులకు హాజరు కాకపోతే వైద్య విద్యార్థుల భవిష్యత్ ఏమిటని ప్రశ్నించారు. శాశ్వత ప్రిన్సిపల్‌ను నియమిస్తామన్నారు. 20 శాతం సిబ్బంది కూడా విధులకు హాజరు కాకపోతే ఆసుపత్రిని ఎలా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ వైద్యశాల మరమ్మతులకు రూ.65 లక్షలు కేటాయించామన్నారు. ఇప్పటికి తాను మూడుసార్లు ఆసుపత్రిని పరిశీలించానని, ఎన్నిసార్లు హెచ్చరించినా సిబ్బంది పనితీరు మారకపోవడం బాధాకరమన్నారు. లీవు పెట్టకుండా విధులకు గైర్హాజరుకావడం దురదృష్టకరన్నారు. పూర్తిస్థాయిలో విచారించి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యశాల అభివృద్ధికి త్వరలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1,412 వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో సక్రమంగా వైద్యసేవలు అందటం లేదని ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. డిపార్ట్మెంట్ హెడ్స్ విధులు సక్రమంగా రాకపోతే కింద స్థాయి సిబ్బంది సక్రమంగా ఎలా పని చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా డాక్టర్లు తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విధులను విస్మరించేవారిని ఉపేక్షించే సమస్యే లేదని హెచ్చరించారు. బీజేపీ నేత సన్నపరెడ్డి సురేష్‌రెడ్డి వైద్యశాల పనితీరు బాగలేదని మంత్రికి ఫిర్యాదు చేశారు. వసతులు మెరుగు పరచాలని విన్నవించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ భారతిరెడ్డి, వైద్యశాల ఆర్‌ఎంఓలు రంగారావు, విజయగౌరి, వైద్యశాల ప్రొఫెసర్లు, వైద్యులు పాల్గొన్నారు. -
హైడ్రామా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నెల్లూరులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మంగళవారం హైడ్రామా నడిచింది. ప్రిన్సిపల్కో న్యాయం.. ప్రొఫెసర్కిఇంకో న్యాయం జరిగింది. మెడికల్ కళాశాల ప్రొఫెసర్ టీడీపీ నగర నేత బంధువు కావటంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తలొగ్గారు. వేళకు రాలేదని ఉదయం ప్రొఫెసర్ని సస్పెండ్ చేసిన మంత్రి ఆవేశం సాయంత్రానికి చల్లారింది. ప్రొఫెసర్ సస్పెన్షన్ ఎత్తేసినట్లు మంత్రి కామినేని ప్రకటించటం గమనార్హం. నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాల, మెడికల్ కళాశాలలను మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఉదయం 9.30కు ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేశారు. 10 గంటలకు మెడికల్ కళాశాలను తనిఖీ చేశారు. మంత్రి తనిఖీ చేసిన సమయంలో ప్రిన్సిపల్ ప్రభాకర్‌రావు అందుబాటులో లేరు. దీంతో ఆగ్రహించిన మంత్రి శ్రీనివాస్ ఆయనను వెంటనే రిలీవ్ చేయమని ఆశాఖ డీఎంకు ఆదేశాలిచ్చారు. అదేవిధంగా ప్రొఫెసర్ శశికాంత్ వేళకు రాలేదని గమనించిన మంత్రి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు మంత్రి కామినేని ఉదయం 10 గంటలకు మెడికల్ కళాశాలకు వచ్చిన సమయంలో ప్రొఫెసర్ శశికాంత్ అక్కడ లేరు. మంత్రి కళాశాలకు వచ్చిన వెంటనే హాజరుపట్టీని తీసుకుని చెక్‌చేశారు. అందులో విధుల్లో ఉండి సంతకం చేయని వారి పేర్లు పక్కన మంత్రి నోట్ పెట్టారు. మంత్రి తనిఖీకి వచ్చారని తెలుసుకున్న ప్రొఫెసర్ శశికాంత్ 10.15కు అక్కడికి చేరుకున్నారు. మంత్రి కామినేని సిబ్బంది, అధికారులతో మాట్లాడుతుండగా.. ప్రొఫెసర్ రిజిస్టర్ తీసుకుని పక్కకు వెళ్లి సంతకం చేశారు. గమనించిన మంత్రి సెక్యూరిటీ విషయాన్ని కామినేనికి తెలిపారు. ఆగ్రహించిన మంత్రి ప్రొఫెసర్ శశికాంత్‌ని పిలిచి ‘ఇంతలా బరితెగిస్తారా? దొంగల్లా వ్యవహరిస్తున్నారే’ అంటూ మండిపడ్డారు. తాను పొస్టుమార్టానికి వెళ్లానని, అందుకే ఆలస్యమైందని ప్రొఫెసర్ సమాధానం చెప్పారు. వెంటనే మంత్రి తన పీఏని అక్కడికెళ్లి విచారించుకుని రమ్మని ఆదేశించారు. వెంటనే ప్రొఫెసర్ అక్కడికి వెళ్లలేదని, పొరపాటైందని ప్రాధేయపడ్డారు. మంత్రికి మరింత ఆగ్రహానికి గురై ‘నిన్ను వెంటనే సస్పెండ్ చేస్తున్నా’ అంటూ వెళ్లిపోయారు. టీడీపీ నేతల నుంచి ఒత్తిళ్లు.. మంత్రి రాజీ ప్రొఫెసర్ శశికాంత్ నగర టీడీపీ నేతకు స్వయాన సోదరుడు. అతను ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు. సోదరుని ద్వారా ప్రొఫెసర్ రాజీయత్నాలు ప్రారంభించారు. సోమిరెడ్డి, బీజేపీ నాయకుల నుంచి ఒత్తిడి చేయించినట్లు సమాచారం. సాయంత్రానికి మంత్రి చల్లబడ్డారు. ప్రొఫెసర్ శశికాంత్ సస్పెండ్ని ఎత్తివేసినట్లు స్వయంగా మంత్రి కామినేని సాక్షి విలేకరికి ఫోన్లో వెల్లడించారు. తాను విజిట్‌కి వచ్చిన సమయంలో ప్రొఫెసర్ శశికాంత్ పోస్టుమార్టానికి వెళ్లినట్లు సీఐ చెప్పారని తెలిపారు. అందుకే అతని సస్పెన్షన్ ఎత్తేసినట్లు చెప్పారు. ప్రిన్సిపల్‌ని మాత్రం రిలీవ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే మంత్రి పీఏని విచారించి రమ్మని చెప్పిన సమయంలో ప్రొఫెసర్ ‘సారీ సార్ పొరబాటైంది క్షమించండి’ అని అబద్ధం చెప్పినట్టు ఒప్పుకున్న ప్రొఫెసర్.. సాయంత్రానికి అది ఎలా నిజమైందని కళాశాలలో పనిచేసే సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. బంధువులకో న్యాయం.. ఇతరులకో న్యాయమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అన్ని ఆస్పత్రుల్లోనూ మెరుగైన వసతులు : కామినేని
విజయవాడ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మెరుగైన వసతులను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు అన్నారు. మెడికల్ కళాశాలల్లో మేనేజమెంట్ కోటా సీట్ల కోసం ప్రభుత్వం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో భాగంగా విజయవాడ కేబీఎన్ కళాశాల కేంద్రాన్ని శనివారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ప్రతిభ కలిగినవారికే వైద్య విద్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిభ కలిగిన విద్యార్థులే వైద్య విద్యను అభ్యసించేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని మంత్రి కామినేని చెప్పారు. మేనేజమెంట్ కోటా సీట్ల భర్తీకి తప్పనిసరిగా ప్రవేశపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 29 కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుందని చెప్పారు. దీని అమలు తీరును ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దగ్గరుండి పరిశీలిస్తున్నారన్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా యునివర్సిటీనే నిర్వహిస్తుందన్నారు. సీట్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత ఉంటుందని చెప్పారు. అందులో భాగంగా ఫీజు చెల్లింపు మొత్తం చెక్కు ద్వారానే చెల్లించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విద్యుత్ సంబంధిత సమస్యలను నివారించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు చేపడుతున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అందులో భాగంగా వైర్లు, పరికరాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. -
వైద్యం అందుబాటులోకి తెస్తాం
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు మద్దిపాడు : రాష్ట్రంలో ప్రతిపేదవానికి వైద్యం అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. మద్దిపాడు రిమ్స్ రూరల్ హెల్త్ సెంటర్‌ను రిమ్స్ గ్రామీణ వైద్య శిక్షణ కేంద్రంగా మార్చేందుకు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సహకారంతో తాము వైద్యశాఖకు రూ.340 కోట్లు నాబార్డ్ ద్వారా సాధించగలిగామని ఆయన తెలిపారు. అందులో నుంచి రూ.32 కోట్లు ప్రకాశం జిల్లాకే కేటాయించామన్నారు. రాష్ట్రంలో 1400 మంది వైద్యులను ఉద్యోగాలలో తీసుకోవాలని ప్రభుత్వం సంకల్పించిందని, ప్రతి ఉద్యోగం మెరిట్ ద్వారా పారదర్శకంగా భర్తీ చేస్తామన్నారు. వైద్యశాలల పరంగా చూస్తే ప్రస్తుతం రాష్ట్రం చాలా తక్కువ స్థానంలో ఉందని అంతా ప్రక్షాళన చేయటానికి కంకణం కట్టుకున్నామని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ మద్దిపాడు హెల్త్‌సెంటర్‌కు 4 కోట్ల 40 లక్షల రూపాయలు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ నియోజకవర్గంలోని చీమకుర్తి పీహెచ్‌సీని సీహెచ్‌సీగా మార్చారు కానీ స్పెషలిస్టు వైద్యులు లేరని స్పెషలిస్టులను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. చీమకుర్తి హాస్పటల్లో ఎక్స్‌రే మిషన్ కావాల్సిఉందన్నారు. నాగులుప్పలపాడు మండలం పోతవరంలో పీహెచ్సీ బిల్డింగ్ మంజూరైనా ఇంతవరకూ దానిని ప్రారంభించలేదన్నారు. మద్దిపాడు మండలంలో మొత్తం 9 సబ్‌సెంటర్లు ఉండగా రెండుమాత్రమే భవనాలు ఉన్నట్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అన్ని భవనాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గత ఏడాది ఒంగోలు పరిసర ప్రాంతప్రజలు డెంగీతో బాధలు అనుభవించారని, వారందరూ ప్లేట్లెట్లు పడిపోవటంతో గుంటూరు, విజయవాడ, హైదరాబాదులకు పరుగులు తీశారని అన్నారు. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో ప్లేట్లెట్ మిషన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను మంత్రికి వివరించారు. అదేవిధంగా వైద్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్నవారిని క్రమబద్ధీకరించాలని ఆయన మంత్రిని కోరారు. వైద్యశాఖలో 2001 నుంచి దశలవారీగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబధ్ధీకరించాలని రాష్ట్ర పారామెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ రత్నాకర్ మంత్రి కామినేనికి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో రోడ్డు రవాణా శాఖా మంత్రి శిద్దా రాఘవరావు, మద్దిపాడు ఎంపీపీ నారా విజయలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు మొనపాటి చినవీరాంజమ్మ, మద్దిపాడు ఎంపీటీసీ సభ్యుడు పాటిబండ్ల చినరామయ్య, మద్దిపాడు సర్పంచ్ ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు కరణం బలరాం, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, రిమ్స్ డైరక్టర్ అంజయ్య, డీయంహెచ్ఓ యాస్మిన్, మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల ప్రజలు పాల్గొన్నారు.