విజయవాడ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మెరుగైన వసతులను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు అన్నారు. మెడికల్ కళాశాలల్లో మేనేజమెంట్ కోటా సీట్ల కోసం ప్రభుత్వం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో భాగంగా విజయవాడ కేబీఎన్ కళాశాల కేంద్రాన్ని శనివారం సాయంత్రం ఆయన పరిశీలించారు.
ప్రతిభ కలిగినవారికే వైద్య విద్య
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిభ కలిగిన విద్యార్థులే వైద్య విద్యను అభ్యసించేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని మంత్రి కామినేని చెప్పారు. మేనేజమెంట్ కోటా సీట్ల భర్తీకి తప్పనిసరిగా ప్రవేశపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 29 కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుందని చెప్పారు. దీని అమలు తీరును ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దగ్గరుండి పరిశీలిస్తున్నారన్నారు.
కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా యునివర్సిటీనే నిర్వహిస్తుందన్నారు. సీట్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత ఉంటుందని చెప్పారు. అందులో భాగంగా ఫీజు చెల్లింపు మొత్తం చెక్కు ద్వారానే చెల్లించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విద్యుత్ సంబంధిత సమస్యలను నివారించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు చేపడుతున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అందులో భాగంగా వైర్లు, పరికరాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
అన్ని ఆస్పత్రుల్లోనూ మెరుగైన వసతులు : కామినేని
Published Sun, May 31 2015 3:01 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement