ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరికరాలెన్ని?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రు ల్లో ఉన్న వైద్య పరికరాల సంఖ్య తెలుసుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) నుంచి గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి పెద్దాసుపత్రుల వరకు సర్వే చేయించి నిర్ణయించింది. కత్తెరలు, ఎంఆర్‌ఐ, సీటీ స్కానర్లు, ఎక్స్‌రే యంత్రాల వంటివే కాకుండా లేబొరేటరీల్లోని పరికరాలపై ఆరా తీయాలని నిర్ణయానికొచ్చింది. ఈ వివరాలు సేకరించేందుకు హిం దూస్తాన్ లాటెక్స్ లిమిటెడ్ (హెచ్‌ఎల్‌ఎల్)తో ఒప్పం దం కుదుర్చుకుంది. ఒక్కో జిల్లాలో సర్వే కోసం రూ.2 లక్షలు కేటాయించిన ప్రభుత్వం 3 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని హెచ్‌ఎల్‌ఎల్‌కు సూచించింది.
పరికరాలపై కొరవడిన సమాచారం..
రాష్ట్రంలో 740 పీహెచ్‌సీలు, 115 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 42 ప్రాంతీయ, 18 బోధన, 10 జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి. వాటిల్లో అవసరానికి తగ్గట్లు పరి కరాలను దశాబ్దాలుగా కొనుగోలు చేస్తున్నారు. అయి తే ప్రస్తుతం ఎన్ని పరికరాలున్నాయి, అందులో ఎన్ని పనిచేస్తున్నాయనే దానిపై స్పష్టత లేదు. దీంతో వాటి పై సమగ్ర సమాచారం తెలుసుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమాచా రం ఆధారంగా భవిష్యత్‌లో ఏ ఆసుపత్రికి ఎన్ని వైద్య పరికరాలు కొనుగోలు చేయాలో స్పష్టమైన అంచనా వేయొచ్చని అధికారులు చెబుతున్నారు. అవసరమైన మేరకే టెండర్లు పిలిచి కొనుగోలు చేయొచ్చని పేర్కొంటున్నారు.