సాక్షి, హైదరాబాద్: ఇకపై ప్రభుత్వాసుపత్రుల్లో రూ.10 లక్షల లోపు పనులు జరిగితే ఆ పనులకు నాణ్యత చూడాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్యశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిర్ణయంపై ప్రభుత్వ వర్గాల్లోనే కాకుండా అటు ఆస్పత్రుల వర్గాల నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పనులు పూర్తయిన తర్వాత నాణ్యత పరిశీలించి, ఇంజనీర్లు అనుమతి ఇచ్చిన తర్వాతనే బిల్లులు మంజూరు చేయాలి. కానీ వైద్యవిధాన పరిషత్ పరిధిలో ఉన్న 220 ఆస్పత్రుల్లో ఇకపై రూ.10 లక్షల లోపు పనులకు నాణ్యత అవసరం లేదని, రూ.10 లక్షలు పనులు దాటితే రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల సంస్థలోని ఇంజనీర్లు పరిశీలిస్తారని వైద్యవిధాన పరిషత్ కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. వైద్యవిధాన పరిషత్‌లో ప్రతి పని కూడా రూ.10 లక్షల లోపే ఉంటుంది. ఇటీవలే ఏపీవీవీపీలో వివిధ పనుల కింద సుమారు రూ.15 కోట్లు మంజూరయ్యాయి.
ఈ పనులను తమకిష్టమొచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చి, బిల్లులు మంజూరు చేసే చర్యల్లో భాగంగానే వైద్యవిధాన పరిషత్‌లోని కొంతమంది ఈ ఉత్తర్వులు ఇప్పించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఉత్తర్వులు వెలువడిన వెంటనే క్వాలిటీ కంట్రోల్‌లో పనిచేస్తున్న ఇంజనీర్లను తమకు అడ్డురాకుండా బదిలీ చేశారు. ఇవన్నీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి దృష్టికి వెళ్లకుండానే చేయడం ఆశ్చర్యం. దీనిపై వైద్యవిధాన పరిషత్ కమిషనర్‌ను వివరణ కోరగా కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ అడిగామని, కమిషనర్ నాణ్యతా పరీక్షలు అవసరం లేదని చెప్పిన తర్వాతే ఈ ఉత్తర్వులిచ్చినట్టు తెలిపారు.
ఇకపై నేరుగా బిల్లుల చెల్లింపు!
Published Fri, Sep 13 2013 1:45 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement