minister review
-
శ్రీరామ నవమి ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష
హైదరాబాద్: భద్రాదిలో శ్రీరామనవమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు ఐకేరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సోమవారం సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 15న శ్రీరామ నవమి వేడుకులను జరుపుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లపై వారు దృష్టిసారించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు సీతారాములవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. -
ఆ కాంట్రాక్టర్లను తొలగించండి
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ తొలి విడతలో మంజూరైన పనులను ప్రారంభించని కాంట్రాక్టర్లను తొలగించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే కాంట్రాక్టర్లను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ పథకం తొలి, రెండో దశ పనులపై గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా వివిధ జిల్లాల నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మిషన్ కాకతీయలో భాగంగా తొలి విడతలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, రెండో దశలో అనుమతి లభించిన పనులకు తక్షణమే టెండర్లు పిలవాలని ఆదేశించారు. రెండో దశలో చేపడుతున్న పనుల అంచనాల తయారీలో ఆయకట్టు పరిధిలోని రైతుల సూచనలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ట్రిపుల్ ఆర్ పథకం, ప్రపంచ బ్యాంకు, నాబార్డు, జైకా ఆర్థిక సాయంతో చేపట్టిన పనుల పురోగతిపైనా మంత్రి సమీక్ష జరిపారు. నిజామాబాద్ జిల్లా గట్టుపొడిచిన వాగు పనుల పురోగతిపై ఆరా తీశారు. మిషన్ కాకతీయ పథకం కింద చేపట్టిన పనుల చెల్లింపుల్లో ఎక్కడా జాప్యం జరగడం లేదని హరీశ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎస్కే జోషి, సీఈలు విజయ్‌ప్రకాశ్, నాగేందర్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సలహాదారుతో భేటీ సాగునీటి రంగ కేంద్ర ప్రభుత్వ సలహాదారు, కృష్ణా నది మేనేజ్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తాతో మంత్రి హరీశ్ గురువారం సచివాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు.. మిషన్ కాకతీయ పథకం ద్వారా సాధించిన ఫలితాలను ఆయనకు వివరిం చారు. రాష్ట్రంలోని కొత్త, పాత సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. -
కేజీ టు పీజీలో మూడంచెల వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం కసరత్తు - ప్రాథమికస్థాయిలో తెలుగు మాధ్యమం - 5-12వ తరగతి వరకు నివాస వసతితో ఆంగ్లమాధ్యమం - మంత్రి సమీక్ష.. వచ్చే సమావేశంలో తుది నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీలో మూడంచెల విద్యా వ్యవస్థ ఉంటే బాగుంటుందన్న అవగాహనకు తెలంగాణ ప్రభుత్వం వస్తోంది. కిండర్ గార్టెన్(కేజీ) నుంచి 4వ తరగతి వరకు, 5 నుంచి 12వ తరగతి వరకు, డిగ్రీ నుంచి పీజీ వరకు మూడు ప్రధాన వ్యవస్థలుగా కొనసాగించాలని ఆలోచి స్తోంది. మంగళవారం ఉపముఖ్యమంత్రి కడి యం శ్రీహరి సమక్షంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో విద్యావేత్తలు, ఉన్నతాధికారులు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయాన్ని తీసుకొని అవసరమైన మార్పులతో కాన్సెప్ట్ పేపర్‌ను ప్రకటిస్తారు. దీని పై చివరగా విద్యావేత్తలకు, ఉపాధ్యాయ సంఘాలకు, తల్లిదండ్రులకు అందుబాటులోకి తీసుకెళ్లి కేజీ టు పీజీకి తుది రూపును తీసుకురానున్నారు. సెమీ రెసిడెన్షియల్‌తో ప్రాథమిక విద్య: ప్రాథమిక స్థాయిలో తెలుగు మీడియంతోపాటు ఆంగ్లాన్ని కొనసాగించాలంటూ వ్యక్తమైన భిన్నాభిప్రాయాలపై ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. అయితే ప్రాథమిక స్థాయిలో మాతృభాషను కచ్చితంగా కొనసాగించాలన్న అభిప్రాయం మంగళవారం జరిగిన సమావేశంలో వ్యక్తమైంది. మరోవైపు ప్రాథమికస్థాయి విద్యార్థులకు పూర్తి నివాస సదుపాయం సాధ్యంకాదని, దానికి బదులు సెమీ రెసిడెన్షియల్ వ్యవ స్థను కొనసాగించాలని భావిస్తోం ది. ఇందులో భాగంగా ఉదయం 9గంటలకు పాఠశాలకు వచ్చే ప్రాథమిక స్థాయి (కేజీ టు 4వ తరగతి వరకు) విద్యార్థులకు ఉదయం టిఫిన్, పాలు, మధ్యాహ్నం, సాయంత్రం టిఫిన్, పాలు వంటి సదుపాయాలు కల్పించాలని భావిస్తోంది. రాత్రి మాత్రమే ఇంట్లో భోజనం చేసేలా దీనికి రూపకల్పన చేయాలని భావిస్తోంది. ఇక 5 నుంచి 12వ తరగతి వరకు నివాసవసతితో (రెసిడెన్షియల్) కూడిన ఆంగ్ల మాధ్యమం విద్యను అందించాలని ప్రాథమికంగా అవగాహనకు వచ్చింది. డిగ్రీ నుంచి పీజీ వరకు ఉన్న విద్యావ్యవస్థను యథాతధంగా కొనసాగించే అవకాశం ఉంది. డిగ్రీ, పీజీ స్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ విధానం కొనసాగించాలని భావిస్తోంది. కేజీ టు పీజీ క్యాంపస్‌లలోనూ పీజీ వరకు విద్యా వ్యవస్థ ఉండాలన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. పైగా డిగ్రీ, పీజీలో రెసిడెన్షియల్ వ్యవస్థ ఉండాలా? నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో కొనసాగించాలా? అన్న అంశాలపై చర్చిస్తోంది. వీటిపై సీఎం వద్ద జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.