Minister son
-
పెళ్లి చేసుకోవాలని అడగడంతో మంత్రి కుమారుడి నిజ స్వరూపం బట్టబయలు
ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేసి చివరికి తప్పించుకు తిరుగుతున్నాడు ఓ మంత్రి కుమారుడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రాజస్తాన్ మంత్రి మహేష్ జోషి కుమారుడు రోహిత్ జోషి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఫిర్యాదులో బాధిత యువతి తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది ఫేస్బుక్లో రాజస్తాన్ మంత్రి మహేష్ జోషి కుమారుడు రోహిత్ జోషితో యువతికి స్నేహం ఏర్పడింది. దాన్ని ఆసరాగా చేసుకుని గత ఏడాది జనవరి 8 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 17 మధ్య కాలంలో మంత్రి కుమారుడు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, తనను పెళ్లి చేసుకుంటానని కూడా వాగ్దానం కూడా చేసినట్లు తెలిపింది. అయితే ఇటీవల పెళ్లి ప్రస్తావన తేవడంతో అతని నిజ స్వరూపం బయటపడిందని వాపోయింకది. పెళ్లి అన్నప్పటి నుంచి తనతో తరచూ గొడవ పడేవాడని, చివరికి తన నుంచి తప్పించుకుంటూ వస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో తెలిపింది. దీంతో ఢిల్లీలోని మంత్రికి చెందిన రెండు నివాసాలలో పోలీసులు తనిఖీ చేసినప్పటికీ అక్కడ నిందితుడు లేడు. పరారీలో ఉన్న జోషిని పట్టుకోవడానికి అధికారుల బృందం అతని తండ్రి ఉంటున్న జైపూర్‌కు చేరుకుందని పోలీసులు తెలిపారు. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై మంత్రి మహేష్ జోషి స్పందిస్తూ, "ఈ కేసులో ఊహాగానాలు, పుకార్లు మీడియాతో సంబంధం లేకుండా పోలీసులు చట్ట ప్రకారం వారి పని చేయాలన్నారు. నిజాలు అవే బయటపడతాయని తెలిపారు. చదవండి: మహిళా ఉద్యోగితో అనుచిత ప్రవర్తన.. జాబ్ రెన్యూవల్ కావాలంటే.. -
ఘనంగా మంత్రి కుమారుడి వివాహం
తుమకూరు (కర్ణాటక): తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా జే.సి.పురంలో గురువారం రాష్ట్ర మంత్రి జే.సి.మాదుస్వామి కుమారుడు డాక్టర్. జే.ఎం. అభిజ్ఞ, డాక్టర్. ఎస్.ఎం. అశ్వినిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వేడుకకు మఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, హోం మంత్రి జ్ఞానేంద్ర, మాజీ సీఎం సిద్దరామయ్య, మాజీ ప్రధాని దేవెగౌడ, ఒక్కలిగ మఠాధ్యక్షుడు నిర్మలానందనాథ స్వామిజీ తదితర ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. -
అశ్లీల వీడియోల పేరుతో బ్లాక్మెయిల్ కేసు: వెలుగులోకి కొత్తపేరు
సాక్షి, బనశంకరి (కర్ణాటక): మంత్రి సోమశేఖర్ కుమారుడు నిశాంత్‌ని అశ్లీల వీడియోల పేరుతో బ్లాక్మెయిల్ చేసిన కేసులో రాహుల్భట్తో పాటు సోమవారం మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సూత్రధారి ఎవరు అనేదానిపై సీసీబీ పోలీసులు విచారణ చేప ట్టారు. ఇండి ఎమ్మెల్యే యశవంతరాయగౌడ పాటిల్ కుమార్తె పేరుతో ఉన్న సిమ్‌కార్డు నుంచి నిశాంత్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయని తేలింది. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఈ కేసుకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ కుమార్తె ఉన్నత విద్య కోసం గత 10 నెలలుగా విదేశాల్లో ఉందని, ఆమె సిమ్‌కార్డును రాకేశ్ అణ్ణప్ప అనే స్నేహితునికి ఇచ్చిందని, అతడు దానిని దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. -
నీ అశ్లీల వీడియో లీక్ చేస్తా.. మంత్రి కొడుక్కి బెదిరింపులు!
సాక్షి, బనశంకరి(కర్ణాటక): నీ అశ్లీల వీడియో నా వద్ద ఉంది, డబ్బులు ఇవ్వకపోతే లీక్ చేస్తానని మంత్రి కుమారున్ని బెదిరించాడన్న కేసులో ప్రముఖ జ్యోతిష్యుని కొడుకుని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి ఎస్టీ సోమశేఖర్ కుమారుడు నిశాంత్‌ను ఆర్టీ నగరలో ఉండే రాహుల్‌భట్ బెదిరించాడని, ఆదివారం అతన్ని అరెస్ట్ చేశామని జాయింట్ పోలీస్ కమిషనర్ రమణ్‌గుప్తా తెలిపారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అశ్లీల వీడియోను సృష్టించి మంత్రి పీఏలు శ్రీనివాసగౌడ, బానుప్రకాష్ల మొబైళ్లకు పంపి డబ్బుకు డిమాండ్ పెట్టారు. లేదంటే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బ్లాక్‌బెయిల్ చేశారని నిశాంత్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. రాహుల్‌భట్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఐఏసీ విక్రాంత్ మూడోదఫా జలపరీక్షలు ఆరంభం -
మంత్రి కొడుకు కారు అడ్డగింపు.. మహిళా పోలీస్‌ను
గాంధీనగర్ : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి కర్ఫ్యూ సమయంలో ప్రయాణిస్తున్న మంత్రి కొడుకు కారును అడ్డగించినందుకు మహిళా పోలీసు అధికారిని బదిలీ చేశారు. ఈ ఉదంతం గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో సూరత్‌లో కర్ఫ్యూ అమలులో ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి కుమార్ కనాని కొడుకు ప్రకాశ్ కనాని స్నేహితులు బుధవారం లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి కారుతో రోడ్డుపైకెక్కారు. మాస్క్ ధరించకుండా కర్ఫ్యూ సమయంలో బయటకు వచ్చినందుకు వారి కారును మహిళా కానిస్టేబుల్ సునీతా యాదవ్ అడ్డుకుది. దీంతో వారు ఎమ్మెల్యే కొడుకు ప్రకాశ్‌ను రప్పించారు. (టీచర్ నిర్వాకంపై తీవ్ర విమర్శలు) అనంతరం మరో కారులో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే కొడుకు, అతని స్నేహితులతో కలిసి మహిళా కానిస్టేబుల్‌తో గొడవకు దిగారు. కానిస్టేబుల్‌ను అనుచిత వ్యాఖ్యలతో దూషించి, తమతో పెట్టుకుంటే ఆమెను 365 రోజులు అదే రోడ్డుపై నిలబెట్టేలా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై స్పందించిన కానిస్టేబుల్ ఆమె తమకు బానిసను కాదని బదులిచ్చారు. కాగా రాజకీయ ప్రోద్భలంతో అధికారులు మహిళా కానిస్టేబుల్‌ను మరో చోటుకు బదిలీ చేశారు. కాగా ఈ సంభాషణకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవ్వడంతో ఈ సంఘటనపై సూరత్ పోలీస్ కమిషనర్ విచారణకు ఆదేశించారు. అంతేగాక ప్రకాశ్ కనాని, అతని ఇద్దరు స్నేహితులను పోలీసులు ఆదివారం అరెస్టు చేయగా.. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. (ఫోటోగ్రఫీ ‘పిచ్చి’ : చివరికి కొడుకులకు) -
మంత్రి కుమారుని కిడ్నాప్ దందా
అనంతపురం: మంత్రి కుమారుని దందాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ధర్మవరంలో భూమి ‘పంచాయితీ’ విషయమై ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఉదంతం మరువక ముందే.. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తిని కిడ్నాప్ చేయడం జిల్లాలో కలకలం రేపుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలివీ.. బెంగళూరుకు చెందిన సలీం అనే వ్యక్తిని ఓ మంత్రి కుమారుని అనుచరులు మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేశారు. గతంలో ఈ ముఠా సభ్యులు బెంగళూరుకు వెళ్లి తమ వద్ద బంగారం ఉందని, తక్కువ రేటుకే ఇస్తామని నమ్మబలికారు. వీరి మాయమాటలు నమ్మిన బాధితుడు అడ్వాన్స్ కింద రూ.70 లక్షలు ఇచ్చాడు. ఇటీవల బంగారం తీసుకెళ్లాలని ముఠా సభ్యులు సలీంకు ఫోన్ చేయడంతో మూడురోజుల క్రితం జిల్లాకు చేరుకున్నాడు. రాప్తాడు సమీపంలో ఓ ప్రదేశానికి రమ్మని చెప్పిన ముఠాసభ్యులు అటునుంచి అటే మంత్రి స్వగ్రామానికి తీసికెళ్లినట్లు తెలిసింది. రెండు రోజుల పాటు అదుపులో ఉంచుకొని బాధితున్ని చితకబాదినట్లు సమాచారం. చంపుతామని బెదిరించి బాధితుని అకౌంట్ నుంచి రూ.49 లక్షలు తమ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లు చర్చ జరుగుతోంది. అంతటితో ఆగకుండా మరో రూ.4కోట్లు చెల్లించేలా అగ్రిమెంట్ బాండ్లు రాయించుకుని వదిలేశారు. ఘటనపై బాధితుడు బెంగళూరు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న కర్ణాటక పోలీసులు విచారణ నిమిత్తం మూడు రోజుల క్రితం నగరానికి చేరుకున్నారు. ఆ సందర్భంగా నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. వీరిచ్చిన సమాచారం మేరకు.. కిడ్నాప్ ముఠాలోని మొత్తం ఆరుగురికి పైగా సభ్యులను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. పేరు మోసిన కిడ్నాప్ ముఠా కిడ్నాప్ ముఠా వరుస భూ దందాలకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మంత్రి కుమారుని అండతో సెటిల్మెంట్లు, భూ దందాలు, కిడ్నాప్‌లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇటీవల ధర్మవరంలో ఇలాంటి భూ పంచాయితీలో తలదూర్చి ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయడం తీవ్ర దుమారం రేపింది. ధర్మవరం, రాప్తాడు ప్రజాప్రతినిధుల మధ్య అగ్గి రాజేసింది. ఈ ఘటనపై కూడా ఈ నెల 6న ‘ల్యాండ్‌మైన్’ శీర్షికన ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. ఆ ఘటన మరువక ముందే అదే ముఠాలోని కొందరు సభ్యులు తాజాగా బెంగళూరు వాసిని కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. ఈ ముఠాకు మంత్రి కుమారుడు నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై పోలీసులను ‘సాక్షి’ వివరణ కోరగా కిడ్నాప్‌లో పాల్గొన్న నిందితులను విచారిస్తున్నామని, త్వరలో కేసు వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. -
మంత్రి కుమారుని వీరంగం
చెన్నై, సాక్షి ప్రతినిధి : మంత్రి కొడుకు మద్యం తాగి అతి వేగంగా కారు నడిపి వీరంగం సృష్టించిన సంఘటన చెన్నైలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. ఈ సంఘటనలో 17 ద్విచక్ర వాహనాలు ధ్వంసం కాగా వృద్ధురాలు తృటిలో ప్రాణాలు దక్కించుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై నగరం శూలైమేడు గురుకలాన్ వీధిలోకి అర్ధరాత్రి 12 గంటల సమయంలో అత్యంత వేగంగా ఒక లగ్జరీ కారు దూసుకొచ్చింది. అదే వేగంతో రోడ్డుకు ఇరువైపులా పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేస్తూ ముందుకు సాగింది. ఈ శబ్దానికి శారద (65) ఇంటి నుంచి వెలుపలికి వచ్చింది. అదుపుతప్పిన ఆ కారు ఆమె వైపు రావడంతో ఒక్క ఉదుటున ఇంటిలోపలికి దూకేసింది. ఈ కేకలు విన్న పరిసరాల్లో ప్రజలు రోడ్లపైకి చేరారు. కారులోనే యువకుడు పరారయ్యేందుకు ప్రయత్నించగా ఆ వాహనం కింద రెండు బైకులు ఇరుక్కుపోవడంతో కొద్ది దూరంలో నిలిచిపోయింది. ప్రజలు పరుగున వెళ్లి యువకుని బయటకు లాగి దేహశుద్ధి చేసేందుకు ప్రయత్నించగా రెండుచేతులూ జోడించి ‘‘నేను మంత్రి కుమారుడిని, మీకందరికీ నష్టపరిహారంగా ఎంత డబ్బు కావాలంటే అంత ఇప్పిస్తాను, నన్ను కొట్టకుండా వదిలేయండి’’ అంటూ బతిమాలాడు. దీంతో ప్రజలు నిగ్రహం పాటించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. జీపులో ఆ యువకుడిని తరలించిన పోలీసులు కారును కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు వారందరినీ బెదిరించి తెల్లవారుజామున 5 గంటలకు కారును తీసుకెళ్లారు. వేగంగా నా వైపుకు దూసుకొచ్చిన కారునుండి తృటిలో తప్పించుకున్నానని వృద్దురాలు శారద తెలిపింది. కారు ప్రమాదంలో తమ బైకులు బాగా దెబ్బతిన్నాయని చెబితే, వారేదో డబ్బులు ఇస్తారు, తీసుకుని మిన్నకుండమని పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారని స్థానికులు వాపోయూరు. సహజంగా తాము రోడ్డుపక్కనే పడుకుంటాము, రాత్రి వర్షం పడటంతో లోపలే ఉన్నాం. లేకుంటే తమ ప్రాణాలు పోయేవని మరో గృహిణి తెలిపింది. కేసు దర్యాప్తు చేస్తున్న పాండీబజార్ పోలీసులు మాట్లాడుతూ, కేకే నగర్‌కు చెందిన ఒక యువకుడు కారు నడిపాడని, అతను ఎవరనే సంగతి తెలియదని చెప్పారు. కేసును మాఫీ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.