Minister of State for Railways
-
రైల్వే సహాయమంత్రి సురేశ్ కన్నుమూత
న్యూఢిల్లీ: కర్ణాటక బీజేపీ ఎంపీ, రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి (65) బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు కొద్దిరోజుల క్రితం కరోనా సోకింది. మూడు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలోని ట్రామా సెంటర్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కరోనా వల్ల చనిపోయిన తొలి కేంద్ర మంత్రి ఈయనే. సురేశ్ కర్ణాటకలోని బెళగావి లోక్‌సభ స్థానం నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలుపొందారు. తిరుగులేని నేత: 1955 జూన్ 1న చెన్న బసప్ప, సోమవ్వ దంపతులకు కర్ణాటకలోని బెళగావి తాలూకా కేకే కొప్ప గ్రామంలో జన్మించారు. బెళగావిలోని ఎస్ఎస్ఎస్ కాలేజీలో కామర్స్‌లో పట్టా పొందారు. అనంతరం న్యాయ విద్య అభ్యసించారు. సురేశ్ అంగడి 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా లోక్‌సభకు ఎన్నికవుతూ వచ్చారు. సురేశ్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఏపీ గవర్నర్ సంతాపం: సాక్షి, అమరావతి: కేంద్ర మంత్రి సురేశ్ అంగడి మృతిపట్ల ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. సురేశ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఏపీ సీఎం జగన్ సంతాపం: రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి ఆకస్మిక మృతిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల అనంతపురం నుంచి కిసాన్ రైలును జెండా ఊపి ప్రారంభించిన సందర్భంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సురేశ్‌తోపాటు పాల్గొన్న సందర్భాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. -
కరోనాతో కేంద్ర మంత్రి కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి కన్నుమూశారు. ఆయన వయసు 65 ఏళ్లు. కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈనెల 11న కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారు. కర్ణాటకలోని బెల్గాం లోక్‌సభ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004 నుంచి నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. సురేశ్ అంగడి 2000-2004 మధ్య కాలంలో బెల్గాం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. బెల్గాం జిల్లాలోని కేకే కొప్పా ఆయన స్వస్థలం. సురేశ్ తల్లిదండ్రులు సోమవ్వ, చెన్నబసప్ప. సురేశ్ భార్య పేరు మంగల్. ఆయనకు ఇద్దరు కుమార్తెలు స్ఫూర్తి, శారద ఉన్నారు. కర్ణాటకలో కరోనా బారిన పడి మరణించిన బీజేపీ రెండో ఎంపీ సురేష్ అంగడి. రాజ్యసభ సభ్యుడు, కర్ణాటక బీజేపీ నాయకుడు అశోక్ గస్తీ(55) ఈ నెల 17న బెంగళూరులో కన్నుమూశారు. స్వల్ప వ్యవధిలో ఇద్దరు నాయకులు ప్రాణాలు కోల్పోవడం బీజేపీ శ్రేణులను తీవ్ర వేదనకు గురిచేసింది. సురేష్ అంగడి హఠాన్మరణం పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా, కేంద్ర మంత్రులు సంతాపం తెలిపారు. (కరోనా: బీజేపీ ఎంపీ కన్నుమూత) సురేశ్ మరణం బాధాకరం: ప్రధాని సురేశ్ అంగడి మరణంతో నిబద్ధత కలిగిన కార్యకర్తను పార్టీ కోల్పోయిందని ప్రధాని నరేంద్ర మోదీ సంతాప సందేశంలో పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేయడానికి ఆయన చాలా కృషి చేశారని తెలిపారు. ఎంపీగా, మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు. సురేశ్ అంగడి మరణం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం జగన్ తీవ్ర సంతాపం కేంద్ర మంత్రి సురేశ్ అంగడి ఆకస్మిక మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనంతపురం-ఢిల్లీ కిసాన్ రైలును ఆయన ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సురేశ్ అంగడి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రికి గాయాలు
-
రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రికి గాయాలు
న్యూఢిల్లీ: రైల్వేశాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఓ కార్యక్రమంలో పాల్గొనడంలో భాగంగా శుక్రవారం రాత్రి బరాబంకీ నుంచి గోరఖ్‌పూర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మంత్రి మనోజ్ సిన్హా గాయాలతో పడగా ఆయన ఎడమ చేతి ఫ్రాక్చర్ అయింది. గాయపడ్డ వెంటనే లలిత్ నారాయణ్ మిశ్రా రైల్వే నిలయం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం గోరఖ్‌పూర్ లోని అపోలో ఆస్పత్రికి ఆయనను తరలించినట్లు సమాచారం. ఈశాన్య రైల్వే లో సీనియర్ అధికారి సంజయ్ యాదవ్ ఎడమ భుజం, మోచేతి మధ్య భాగంలో ఫ్రాక్చర్ అయిందని, శనివారం సర్జరీ కోసం ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. కుశినగర్‌లో ఈవెంట్లో పాల్గొనేందుకు ఒకరోజు ముందుగానే గోరఖ్‌పూర్ రైల్వే వీవీఐపీ గెస్ట్ హౌస్‌కు వచ్చి రాత్రి ఆయన ఇక్కడ విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు. అయితే మార్గమధ్యలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని తప్పించే క్రమంలో మంత్రి వస్తున్న ఎస్కార్ట్ వాహనం సడన్ బ్రేక్ వేయగా, వెనక నుంచి వస్తున్న మరో వాహనం ఢీకొనగా ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, రామ్ విలాస్ పాశ్వాన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. మనోజ్ సిన్హా ప్రమాదానికి గురయ్యారని తెలియగానే షాక్ తిన్నామని పేర్కొన్న మంత్రులు.. ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్లో ఆకాంక్షించారు. -
శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి
తిరుమల : తిరుమలలోని శ్రీవెంకటేశ్వరస్వామిని కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు ఆలయం వద్ద టీటీడీ అధికారులు మంత్రి మనోజ్ సిన్హాకు స్వాగతం పలికారు.శ్రీ వారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను మనోజ్ సిన్హాకు అందజేశారు. -
రైల్వేకు 46,333 హెక్టార్ల ఖాళీ స్థలం
న్యూఢిల్లీ: రైల్వే శాఖ అధీనంలో 46,333 హెక్టార్ల ఖాళీ స్థలం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రైల్వే శాఖకు మొత్తం 4,61,487 హెక్టార్ల భూమి ఉందని రైల్వేశాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. ఇందులో 4,14,240 హెక్టార్లు తమశాఖ కార్యకలాపాలకు వినియోగిస్తున్నామని, మిగతా స్థలం ఖాళీగా ఉందని రాజ్యసభలో చెప్పారు. ఖాళీగా ఉన్న స్థలం ఎక్కువ శాతం రైల్వే పట్టాల వెంట నిలువుగా ఉందని తెలిపారు. సర్వీసింగ్, ట్రాక్ నిర్వహణకు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఈ ఖాళీ స్థలం అవసరమవుతుందన్నారు. అవసరానికి అనుగుణంగా దీన్ని వినియోగిస్తామని చెప్పారు. రైల్వే భూముల రికార్డుల డిజిటలైజేషన్ దాదాపు పూర్తైందని మంత్రి తెలిపారు. -
పట్టాలెక్కని కోట్ల రైలు
* రైల్వే సహాయ మంత్రిగా కోట్ల ఉన్నా ఒరిగింది అంతంతే * ఊరించి తుస్సుమన్న వర్క్‌షాపు ఏర్పాటు * పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల్లేవు.. కొత్తవాటి ఊసేలేదు * మంత్రాలయం లైను మరిచిన మంత్రి కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: జిల్లాకు చెందిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నా జిల్లాకు ఒరిగింది అంతంతమాత్రమే. చిరస్థాయిగా నిలిచిపోయే ప్రాజెక్టులు జిల్లాకు తెప్పించడంలో విఫలం అయ్యారు. వర్క్‌షాపు ఏర్పాటు ఊరించి తుస్సు మంది. కర్నూలు పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోట్ల జయ సూర్య ప్రకాష్‌రెడ్డి 2012 అక్టోబర్ 28వ తేదీన రైల్వే శాఖ సహాయం మంత్రి ప్రమాణం చేశారు. 2013లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో జిల్లాకు ఆయన మార్కుల పెద్దగా లేదు. ఒక ఎక్స్‌ప్రెస్‌తోపాటు ఒక ప్యాసింజరు రైలుతోనే సరిపెట్టారు. ఏళ్లతరబడి ఉన్న డిమాండ్లకు పరిష్కారం చూపలేదు. 2014 బడ్జెట్ కూడా ప్రయాణికులు, నిరుద్యోగులకు నిరాశ పర్చింది. కొత్త ప్రాజెక్టుల అసలు ఊసే లేదు. ఆయన ఎంతో ప్రతిష్టా త్మకంగా ప్రకటించిన వర్క్‌షాపు నిర్మాణానికి మార్గం పడలేదు. దశాబ్దాల నాటి డిమాండ్ ఉన్నా మంత్రాలయం రైలు మార్గానికి పట్టిన గ్రహణం తొలగించలేదు. జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు రూ.2వేల కోట్లు కావాల్సి ఉండగా అరకొరే విదిల్చారు. 44 ఏళ్ల ప్రతిపాదనకు గ్రహణం అధ్యాత్రిక కేంద్రం మంత్రాలయం నుంచి కర్నూలు వరకు నిర్మించాల్సిన రైల్వేలైనుకు పట్టిన గ్రహణం వీడ లేదు. సహాయ మంత్రిగా కర్నూలు ఎంపీ ఉన్నప్పటికీ గ్రీన్‌సిగ్నల్ దొరకలేదు. 44 ఏళ్ల క్రితం ప్రతిపాదించిన ఈలైనుకు ఇప్పటికీ మోక్షం లభించకపోవడం గమనార్హం. 2004లో రైల్వే మంత్రి నితీష్‌కుమార్ అప్పటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.165 కోట్లతో రైల్వే లైను నిర్మించేందుకు అంగీకరించారు. సర్వే పనుల కోసం రూ.9.43 లక్షలు కేటాయించడంతో సర్వే పూర్తి చేసి నివేదికలిచ్చారు. 2010 ఫిబ్రవరి 24న అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ బడ్జెట్లో కొత్త లైను ఏర్పాటునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించారు. 2011 ఫిబ్రవరి 23న సర్వే పనుల కోసం రూ.6 కోట్లతో టెండర్లు పిలిచారు. గతంలో రూపొందించిన మార్గంలోనే రైలు మార్గం నిర్మించుకోవచ్చని సర్వే కాంట్రాక్టర్ నివేదిక అందజేశారు. తాజాగా ఇప్పుడు నిర్మాణ వ్యయం కిలో మీటరుకు రూ.10కోట్లు చొప్పున 110 కిలో మీటర్లుకు రూ.1100కోట్లకు చేరుతుందని అంచనా. మంత్రి కోట్ల కనీసం చిల్లిగవ్వ కూడా మంజూరు చేయించలేకపోయారు. దీంతో రెండు సార్లు సర్వే చేసిన నిధులు దుర్వినియోగమయ్యాయి. నీరుగారిన మరిన్ని హామీలు: * కర్నూలులో రైల్వే వర్క్‌షాపును ఏర్పాటు చేసేందుకు గత ఏడాది బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ లభించింది. కాని ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. * దూపాడు వద్ద ట్రైన్ మెయింటెన్స్ (నిర్వాహణ) షెడ్ ఏర్పాటు చేస్తామని మంత్రి కోట్ల చెప్పారు. దీనికి రూ.2కోట్లు కావాల్సి ఉన్నా ఎలాంటి కేటాయింపుల్లేవు. * సిటీగా మారిన కర్నూలు స్టేషన్ ఆధునీకరణ, మల్టీప్లెక్స్ భవన నిర్మాణం, రెండో ప్లాట్ ఫాంపై పూర్తి స్థాయి షెడ్ నిర్మాణానికి, ఆదోని స్టేషన్‌ను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు నిధుల్లేవు. * హోస్పెట్ - మంత్రాలయం - కర్నూలు - శ్రీశైలం మీదుగా గుంటూరు రైల్వే లైన్‌ను కలుపుతూ కొత్త రైలు, డోన్ నుంచి కర్నూలు, గద్వాల, రాయచూరు మీదుగా ముంబైకి రైలు నడుపుతామని కోట్ల హామీ ఇచ్చినామోక్షం లభించలేదు. * ఎర్రగుంట్ల - నంద్యాల లైను పెండింగ్ పనులకు, గుంటూరు - గుంతకల్లు మధ్య 400 కిలో మీటర్ల వరకు సర్వే పనులు పూర్తయినా నిధులు విదిల్చలేదు. * కాచిగూడ - బెంగళూరు వరకు గరీబ్థ్‌క్రు, విజయవాడ నుంచి నంద్యాల, ద్రోణాచలం, కర్నూలు హైదరాబాద్ మీదుగా రాజ్‌కోట్ వరకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ లేదు. జగనన్న మాట: రైల్వే బడ్జెట్లో ప్రతిసారి రాష్ట్రానికి అన్యాయమే జరుగుతోందని, ఎన్నికల్లో అధికమంది ఎంపీలను గెలుచుకొని మన రాష్ట్రానికి రైల్వే మంత్రి పదవి దక్కించుకోవాలని పదేపదే ప్రకటించారు. రైల్వే మంత్రి వస్తే జగనన్న ఇచ్చిన హామీ మేరకు జిల్లాతోపాటు రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పూర్తితోపాటు కొత్త ప్రాజెక్టులు వస్తాయని ప్రజలు నమ్ముతున్నారు. ఇచ్చే ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో నడిచే ఎంపీలు, ఎమ్మెల్యేలనే గెలిపిస్తామని తేల్చి చెబుతున్నారు.