Minister Yanamala Ramakrsnudu
-
కేసీఆర్ పథకాలు భేష్
సాక్షి, యాదాద్రి: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కితాబిచ్చారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి, అమ్మవారిని ఆదివారం ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. కేసీఆర్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ఈ విషయమై ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన వస్తున్నట్లు తనకు తెలిసిందని చెప్పారు. యాదాద్రిని ప్రభుత్వం మరో తిరుమల తిరుపతిగా తీర్చిదిద్దడం అభినందనీయమని చెప్పారు. ఈ పుణ్యక్షేత్రం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు యనమల పేర్కొన్నారు. అనంతరం ప్రధానాలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈఓ గీతారెడ్డి పనుల గురించి మంత్రికి వివరించారు. -
359 మండలాల్లో కరువు: మంత్రి యనమల
రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెల కొన్నాయని.. ఈ కారణంగా రాష్ట్రంలో 359 మండలాలను... కరువు మండలాలుగా ప్రకటించామని అంద్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం వల్లూరులో మంగళవారం ఇంకుడుగుంత శంకుస్థాపనకు వచ్చిన ఆయన గ్రామస్తులనుద్దేశించి మాట్లాడారు. మే నెలలో మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకానున్నాయన్నారు. గత పదేళ్లలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. స్వయం సహాయక సంఘాలను ఆదుకునేందుకు మొదటి విడతలో రూ.మూడు వేల కోట్లు అందించామని, ఇప్పుడు మరో రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఈ ఏడాది రెండు లక్షల ఇళ్లు నిర్మిస్తామన్నారు. అన్ని గ్రామాలనూ స్మార్ట్ విలేజ్‌లుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. -
యనమల రాజీనామా చేయాలి
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు.. హైదరాబాద్: శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడుకి ఏ మాత్రం సిగ్గు, శరం ఉన్నా తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా యనమల తీసుకున్న చర్యలను కోర్టులే తప్పుబట్టాయని, యనమలకి ఒక్క క్షణం కూడా సభలో కూర్చునే అర్హత లేదన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, ఉప్పులేటి కల్పన, నారాయణస్వామి, కొరముట్ల శ్రీనివాసులు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సునీల్ కుమార్, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అమ్జాద్‌బాషా షేక్ బీపారి, సుజయ్ కృష్ణరంగారావు, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు మాట్లాడారు. ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం కుట్రపూరితంగా ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేసిందన్నారు.హైకోర్టు ఇచ్చిన తీర్పు అధికారపక్షానికి చెంప పెట్టులాంటిదన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కౌరవ సభలా తయారైందని.. లేనిపోని ఆరోపణలతో రోజాను సస్పెండ్ చేశారని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. తనకు తాను రాజ్యాంగ నిపుణుడిగా ఊహించుకునే యనమల అహంకార వైఖరితో హైకోర్టు అక్షితలు వేసే పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పుతోనైనా ఇకపై కుట్రపూరిత చర్యలు మానుకోవాలని ఎమ్మెల్యే నారాయణస్వామి చంద్రబాబుకు హితవు పలికారు. మహిళలందరికీ రోజా స్ఫూర్తి.. మహిళలందరికీ రోజా స్పూర్తిగా నిలుస్తుందని ఎమ్మెల్యే అమ్జాద్ బాషా షేక్ బీపారి అన్నారు. రోజా సస్పెన్షన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుని ప్రజా విజయంగా ఆయన అభివర్ణించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాస్తోందని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పువ్వులిచ్చి స్వాగతించాలి రోజాను సభలోకి రానీయకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేయడం సరికాదని.. ఆమెకు పువ్వులిచ్చి స్వాగతం పలకాలని మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హితవు పలికారు. చట్టాలను గౌరవిస్తామని చెప్పే చంద్రబాబు స్వయంగా గేటువద్దకు వెళ్లి పూలబోకేతో ఆమెని ఆహ్వానించాలన్నారు. -
అరకొర విదిలింపు
ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఈ సారీ మొండిచేయే తాండవకు రూ.3.05 కోట్లు రైవాడకు రూ.6.10 లక్షలు కోనాంకు రూ.5.60 లక్షలు సాగునీటి ప్రాజెక్టులపై రాష్ర్ట ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో ఈ బడ్జెట్ కేటాయింపులు అద్దం పడుతున్నాయి. ఆధునికీకరణ కాదు..కనీసం హెడ్‌వర్క్స్ మెయింటినెన్స్‌కు కూడా ఈ నిధులు ఏమూలకూ సరిపోవని సాగునీటి రంగాల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం: జిల్లా సాగునీటి ప్రాజెక్టులు నాలుగేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఏటా రివైజ్డ్ ఎస్టిమేట్స్‌తో ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపడం.. బడ్జెట్లో అరకొర కేటాయింపులు జరపడం అనవాయితీగా మారిపోయింది. ఏటా మాదిరి గానే ఈ ఏడాది కూడా బడ్జెట్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జిల్లాకు విదిల్చిన నిధులు చూసి రైతులు బిత్తరపోతున్నారు. తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టు ఆధునికీకరణకు సంబంధించి మిగిలిన 28 కిలోమీటర్ల పనుల కోసం రూ.9 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తే 2015-16 బడ్జెట్లో రూ.1.50 కోట్లు కేటాయించారు. మళ్లీ ఈఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్ రూ.8 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తే 2016-17 బడ్జెట్‌లోరూ.3.05కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే కేటాయింపులు పెంచినప్పటికీ ఆధునికీకరణ పనులకు ఏమూలకు సరిపోవని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కేవలం డ్యామ్, హెడ్‌వర్క్స్ మెయింటినెన్స్‌కు మాత్రమే ఈ నిధులు సరిపోతాయని చెబుతున్నారు. మరో పక్క ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరికైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు కేవలం రూ.2 కోట్లు విదిల్చారు. రూ.7,200 కోట్ల అంచనా వ్యయం కాగల ఈ ప్రాజెక్టు ఇంకా బతికే ఉందన్నట్టు బడ్జెట్లో రూ.2 కోట్లు విదిల్చడం విడ్డూరంగా ఉందని నిపుణులంటున్నారు. ఈ నిధులు కనీసం సర్వే కూడా సరిపోవని చెబుతున్నారు. రైవాడ రిజర్వాయర్ ఆధునికీకరణ కోసం రూ. 60 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తే 2015-16 బడ్జెట్లో రూ.52.50 లక్షలు కేటాయించారు. ఈ ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్ రూ.67 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తే 2016-17 బడ్జెట్లో కేవలం రూ.6.10 లక్షలు విదిల్చారు. గతేడాదే అరకొరనిధులు కేటాయించగా ఈ ఏడాది కనీసం పాతిక కోట్లయినా కేటాయిస్తారని ఆశించినా కంటితుడుపుగా కేవలం రూ. 6లక్షలకు సరిపెట్టడం ఎంతవరకు సమంజసమని రైవాడ ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. పెద్దేరు జలాశయం ఆధునికీకరణ కోసం ఐదేళ్లుగా మిగిలి ఉన్న 25 శాతం పనుల కోసం ప్రభుత్వం రూ.8 కోట్లతో ప్రతిపాదనలు పంపగా. 2015-16లో కేవలం రూ.11 లక్షలు కేటాయించారు. దీంతో ఈ ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్ మళ్లీ రూ.8.50 కోట్లకు పంపగా 5 లక్షలు మాత్రమే కేటాయించారు. గతేడాది కేటాయించి నిధులు డ్యామ్ నిర్వహణకు కూడా సరిపోలేదు. ఈ ఏడాది మరీ ఘోరంగా రూ.5 లక్షలు ఇచ్చారు. కోనాం రిజర్వాయర్ ఆధునికీకరణలో భాగంగా మిగిలి ఉన్న మూడు కిలో మీటర్ల పనులు పూర్తి చేసేందుకు రూ.2 కోట్లు ఇస్తే సరిపోతాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.11 లక్షలు విదిల్చిన సర్కార్ ఈ ఏడాది మరీ ఘోరంగా రూ.5.60 లక్షలు కేటాయిం చింది. ఈ నిధులు డామ్ నిర్వహణకు కూడా సరిపోవు. సర్వేకు కూడా సరిపోవు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కోసం రూ.2 కోట్లు కేటాయించడ మే నిదర్శనం. ఈ ప్రాజెక్టు సర్వేకు కూడా ఈ నిధులు సరిపోవు. మిగిలిన ప్రాజెక్టులకు జరిపిన కేటాయింపులు మరీ తక్కువగా ఉన్నాయి. ఇవి ఆయా ప్రాజెక్టుల మెయింటినెన్స్‌కు కూడా సరిపోవు -ఎస్.సత్యనారాయణ, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, ఇరిగేషన్ శాఖ -
బడ్జెట్లో మనకు దక్కేదెంత!?
నిధుల కోసం ఎదురుచూస్తున్న ప్రాజెక్టులు గన్నవరం, బందరు పోర్టులకు నిధుల కొరత కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులపై దృష్టి పెడతారా? పర్యాటక రంగానికి సపోర్టు ఎంత.. గత బడ్జెట్లో పెట్టిన అంశాలు కార్యరూపం దాల్చని వైనం విజయవాడ: కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేడు అసెంబ్లీకి సమర్పించనున్నారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతమైన కృష్ణాజిల్లాకు ఎంత మేరకు నిధులు కేటాయిస్తారనే అంశంపై జిల్లాలో వాడిగా వేడిగా చర్చ సాగుతోంది. గత ఏడాది బడ్జెట్లో మన జిల్లాకు ఆశించినంతగా నిధులు కేటాయించలేదు. ఈసారి బడ్జెట్లోనైనా అవకాశాలు దక్కుతాయని ప్రజాసంఘాలు భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో రాజధాని ప్రాంతానికి న్యాయం జరగలేదు. రాష్ట్ర బడ్జెట్లోనైనా నిధులు కేటాయిస్తారని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో పెండింగ్‌లోని ప్రాజెక్టులు వాటికి కావాల్సిన నిధులను పరిశీలిస్తే.. గన్నవరం విమానాశ్రయ విస్తరణకు.. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి పెంచాలంటే 698 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉంది. దీనిలో 438 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 180 ఎకరాలు ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. మిగిలిన వారు ముందుకు రాలేదు. రెండో విడత 260 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. విమానాశ్రయ విస్తరణకు భూసేకరణ చేయాలంటే సుమారు రూ.360 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ నిధులు బడ్జెట్లో కేటాయించాలని కోరుతున్నారు. మచిలీపట్నం పోర్టు విస్తరణకు.. మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి గాను 5,324 ఎకరాల భూమిని రైతుల వద్ద నుంచి సేకరించాల్సి ఉంటుంది. దీనికి గాను సుమారు రూ.550 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు వేశారు. ఎప్పటికప్పుడు భూముల్ని సేకరిస్తామని హడావుడి చేయడమే తప్ప తగినంత నిధులు కేటాయించలేదు. ఆ నిధులకు కొత్త బడ్జెట్లో స్థానం దక్కుతుందేమో చూడాలి. మచిలీపట్నం పోర్టుతో పాటు క్రోకరీ, రిఫైరనరీ యూనిట్లు ఏర్పాటు చేస్తామని గతంలో సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. వీటికి కావాల్సిన నిధులు కేటాయించాల్సి ఉంది. భవానీ ద్వీపం విస్తరణకు.. ఎన్నికలకు ముందు భవానీ ద్వీప విస్తరణ బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పిన సీఎం ఆ తరువాత మాటమార్చారు. ఇప్పుడు దాన్ని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే భవానీద్వీపంలో వాటర్‌గేమ్స్‌ను చాంపియన్ యాచ్ క్లబ్‌కు అప్పగించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనికి రూ.100 కోట్లు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. గత బడ్జెట్లోనే భవానీద్వీపాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కావాల్సిన నిధులు గత ఏడాది కాలంలో ఖర్చు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పర్యాటక రంగానికి నిధులిస్తారా.. రాష్ట్రాన్ని పర్యాటక రంగానికి కేంద్రంగా మార్చుతామని సీఎం చంద్రబాబునాయుడు చెబుతున్నారే తప్ప వాస్తవంగా నిధులు కేటాయించడం లేదు. రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన దేవాలయాలను కలుపుతూ టెంపుల్ సర్కిల్‌ను ఏర్పాటు చేసి బడ్జెట్లో నిధులు కేటాయించవచ్చు. కొండపల్లి, ఉండవల్లి కొండల అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించాలి. గత బడ్జెట్లో హామీలు ఇచ్చి.. గత ఏడాది మార్చి 12న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో బందరులో మెరైన్ అకాడమి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. హస్తకళల అభివృద్ధి కోసం జిల్లాలో శిల్పారామం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ కాగితాలకే పరిమితం చేశారు.విజయవాడను స్మార్ట్ సిటీగా మార్చాలని గత బడ్జెట్లో చేసిన ప్రతిపాదన అటకెక్కింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన స్మార్ట్ సిటీల జాబితాలో విజయవాడ లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచనను పూర్తిగా పక్కన పెట్టేసింది. కృష్ణాడెల్టా ఆధునికీకరణకు గత బడ్జెట్లో రూ.111 కోట్లు కేటాయించినా అరకొరగానే పనులు జరిగాయి. ఆ పనుల తాలుకా బిల్లులు ఇవ్వకపోవడంలో కొత్తగా పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఇక పులిచింతల, పట్టిసీమ పనులు సాగుతూనే ఉన్నాయి. ఆగిరిపల్లిలో ఆయుర్వేద యూనివర్శిటీ ఏర్పాటుచేస్తామన్న ప్రతిపాదన ముందుకు సాగలేదు. కృష్ణాజిల్లాలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఊసే నేతలు ఎత్తడం లేదు. -
రూ.2 వేల కోట్ల విలువైన ఇసుక స్వాహా
విజయవాడ: పదహారు నెలల కాలంలో రూ. 2000 కోట్ల విలువైన ఇసుకను మాఫియా స్వాహా చేసిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. గురువారం స్థానిక స్టేట్ గెస్ట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఇసుక క్వారీల వేలం నిర్వహణ, తీసుకుంటున్న చర్యలపై వివరించారు. ఆయనతోపాటు మంత్రులు పీతల సుజాత, దేవినేని ఉమామహేశ్వరావు ఉన్నారు. యనమల మాట్లాడుతూ డ్వాక్రా మహిళల ద్వారా ఇసుక అమ్మిస్తే ఆదాయం బాగా వస్తుందని అనుకున్నామని, అయితే 16 నెలల కాలంలో మాఫియా చేతుల్లోకి రూ.2వేల కోట్ల విలువైన ఇసుక వెళ్లినట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు తమ ప్రభుత్వం నిర్వహించిన సర్వేల్లో ఇది స్పష్టమైందన్నారు. అందుకే ఇసుక పాలసీని మార్చాలని నిర్ణయించినట్లు చెప్పారు. క్వారీలు వేలం వేయాలని నిర్ణయించామన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కొత్త ఇసుక పాలసీ విధానం అమలులోకి వస్తుందన్నారు. ప్రభుత్వానికి ఇసుక ద్వారా వచ్చే ఆదాయం నుంచి డ్వాక్రా సంఘాలకు 20 శాతం, రైతులకు 25 శాతం ఇస్తామన్నారు. 375 ఇసుక క్వారీల నుంచి 1.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. ఇంకా అనుమతులు ఇవ్వాల్సి వస్తే రెండోసారి నిర్వహించే వేలంలో మరికొన్ని క్వారీలకు వేలం వేస్తామన్నారు. క్యూబిక్ మీటరు ఇసుక ధరను రూ. 550గా నిర్ణయించినట్లు చెప్పారు. ఎవరైనా ఇంతకంటే ఎక్కువ ధర తీసుకుంటే వారి కాంట్రాక్ట్‌ను రద్దుచేస్తామన్నారు. ఇసుక ద్వారా ఈ సంవత్సరం ప్రభుత్వానికి రూ.850కోట్లు ఆదాయం వచ్చినట్లు చెప్పారు. ఇసుకపై మొదటిసారి సమావేశం జరిగిందని, పీఆర్, ఇరిగేషన్, మైనింగ్, ఆర్ అండ్ బీ కార్యదర్శులతో సమావేశం జరగాల్సి ఉందన్నారు. వాల్టా యాక్ట్‌ను పకడ్బందీగా అమలు చేయాల్సి ఉందని, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిందన్నారు. -
కార్మికుల పోరాటానికి వైఎస్సార్సీపీ మద్దతు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి కడప కార్పొరేషన్ : మున్సిపల్ కార్మికుల సమ్మెకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తెలిపారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న కార్మికులకు ఆయన మేయర్ సురేష్‌బాబు, కార్పొరేటర్లతో కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు, ప్రభుత్వానికి సంబంధం లేదని, 10వ వేతన సంఘం సిఫారసులు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వర్తించవని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పడం అన్యాయమన్నారు. కార్మికుల డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకూ వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. మేయర్ కె. సురేష్‌బాబు మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన ప్రభుత్వం కార్మికుల పట్ల వివక్ష చూపడం దారుణమన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలకు ఇబ్బంది కలగకుండా తాగునీటి సరఫరా, వీధిదీపాలకు సమ్మె నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు బి. నిత్యానందరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎంపీ సురేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సానపురెడ్డి శివకోటిరెడ్డి, జేసీబీ పీటర్స్, చినబాబు, చైతన్య, నాగమల్లిక, జమ్మిరెడ్డి, కె. బాబు, ఎంఎల్ఎన్ సురేష్, కో ఆప్షన్ సభ్యులు నాగమల్లారెడ్డి, టీపీ వెంకటసుబ్బమ్మ పాల్గొన్నారు. -
గంటా వర్గానికి ముకుతాడు
యనమలకు ఇన్చార్జి బాధ్యతలు మంత్రుల ఆదిపత్యానికి అడ్డుకట్ట యనమలతో అయ్యన్నకు సాన్నిహిత్యం గంటా వర్గానికి ప్రతికూల పరిణామం విశాఖపట్నం : గతేడాది అధికారుల బదిలీల సమయంలో జిల్లా మంత్రులపై వెల్లువెత్తున అవినీతి ఆరోపణలు రాష్ర్ట స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ ఏడాది ఆ పరిస్థితి తలెత్తకుండా బదిలీల్లో స్థానిక మంత్రుల పెత్తనానికి చెక్ పెట్టేందుకు జిల్లాకో ఇన్చార్జి మంత్రిని నియమించింది. మన జిల్లాకు రాష్ర్ట ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడ్ని నియమించడంతో జిల్లా మంత్రులకు చెక్ పడుతుందో లేక..ఆదిపత్యపోరు మరింత ఆజ్యం పోస్తుందోననే చర్చ పార్టీలో జరుగుతోంది. సాధారణంగా ఎమ్మెల్యేలకు కేటాయించే ఏసీడీపీ, ఎస్డీఎఫ్, సీడీపీ వంటి నిధులను ఖర్చు చేసే విషయంలో పెత్తనం జిల్లా ఇన్చార్జి సాక్షి, విశాఖపట్నం: విశాఖ మహానగరంతో పాటు జిల్లాలోని ఎనిమిది మండలాల్లో తీరం ఉంది. 134 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 62 మత్స్యకార గ్రామాలున్నాయి. సుమారు లక్షా 20 వేల మంది మత్స్యకారులున్నారు. వీరిలో సుమారు 35వేలమంది పూర్తిగా చేపలవేటే జీవనోపాధిగా జీవిస్తున్నారు. 650 మెక నైజ్డ్ బోట్లు, 1500కు పైగా ఇంజన్ బోట్లు ఉన్నాయి. వందలాదిగా తెప్పలు,నావలు ఉన్నాయి. వేట నిషేధ సమయంలో మెకనైజ్డ్, ఇంజన్ బోట్లు లంగరేయాల్సిందే. మెకనైజ్డ్ బోటుపై 8 నుంచి 10 మంది, ఇంజన్ బోటుపై ఆరు నుంచి ఎనిమిది మంది వరకు మత్స్యకారులు పని చేస్తుంటారు. ఇక పరోక్షంగా మరో 10వేల నుంచి 15వేల మంది వరకు జీవనోపాధి పొందుతుంటారు. ప్రతీ ఏటా ఏప్రిల్-15వ తేదీ నుంచి మే-31వ తేదీ వరకు వేట నిషేధం అమలులో ఉండేది. గతేడాది వరకు 47రోజులు పాటు ఉండే వేటనిషేధ సమయాన్ని ఈ ఏడాది నుంచి ఏకంగా 61రోజులకు పెంచారు. గతంలో నిషేధ సమయంలో కుటుంబానికి 31 కిలోల బియ్యంతో సరిపెట్టేవారు. ఏటా నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకారుల జాబితాలు మారుతుంటాయి. కొన్ని సార్లు పెరుగుతుంటాయి.. మరి కొన్ని సార్లు తగ్గుతుంటాయి. అలాంటిది గతేడాది మంజూరైన సాయం ఈ ఏడాది పంపించడం.. ఈ ఏడాది సాయం వచ్చే ఏడాది పంచిపెట్టడం పరిపాటిగా మారిపోయింది. గతేడాది నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు నేటికీ బియ్యం పంపిణీ జరగలేదు. ఇక ఈ ఏడాది నుంచి నిషేధసమయం పెంచడంతో బియ్యం స్థానంలో నగదు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబానికి రూ.2వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాలోనే జమచేయనున్నారు. నిషేధం అమలు లోకి వచ్చిసగం రోజులు గడిచినా అది ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. మెకనైజ్డ్, ఇంజన్ బోట్లపై ఆధారపడి జీవించే సుమారు ఐదువేల మంది మత్స్యకారులతో పాటు వీటిపై పరోక్షంగా ఆధారపడిజీవించే మరో 15వేల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూర్చే విధంగా రూ.4కోట్లతో జిల్లా మత్స్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆర్థిక లోటు కారణంగా ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. దీంతో సాపాటు లేక..సాయం లేక గంగపుత్రులు ఈ ఏడాది పస్తులతో అలమటించాల్సిన పరిస్థితి దాపురించింది. -
కోటి ఆశలు
నేటినుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు 12న బడ్జెట్ ప్రకటన నిధుల కేటాయింపుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న పాలకులు, ప్రజలు ఏలూరు : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ అన్నివర్గాల ప్రజలను నిరాశపర్చింది. ఈనెల 12న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో అయినా జిల్లాకు తగిన స్థాయిలో నిధుల కేటాయిస్తారా లేదా దానిపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర బడ్జెట్‌పై అయినా ఆశలు పెట్టుకోవచ్చా.. కేంద్రం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం సైతం ఊరించి చివరకు ఉసూరుమనిపిస్తుందా అనే అంశంపై ఎడతెగని చర్చలు సాగుతున్నాయి. శనివారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ అంచనాలపై చర్చల అనంతరం ఈనెల 12న బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రకటించనున్నారు. ఈ తరుణంలో అన్ని స్థానాలను టీడీపీకి కట్టబెట్టిన మన జిల్లాకు ఏ మేరకు న్యాయం జరుగుతుంది, పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామని, అభివృద్ధిని దౌడు తీయిస్తామని ఇచ్చిన హామీలకు ఏమైనా కేటాయింపులు ఉంటాయా అనే దానిపై ప్రజాప్రతినిధులు సైతం ఒకింత ఆందోళనతో ఉన్నారు. ఎట్టిపరిస్థితుల్లో రూ.లక్ష కోట్ల విలువైన బడ్జెట్ ప్రవేశపెడతామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఘనంగా ప్రకటిస్తున్నారు. ఇందులో మన జిల్లా వాటా ఎంతనేది వెల్లడి కావాల్సి ఉంది. పోలవరం, చింతలపూడి ప్రాజెక్టుల సంగతేంటో! చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆటంకాలను తొలగించి జాతీయ హోదా కల్పించింది. 2018 నాటికి కేంద్ర ప్రభుత్వ సహాయంతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని నమ్మబలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించగా, కేంద్రం ఇటీవల రూ.100 కోట్లతో సరిపెట్డడం విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్లో అయినా పోలవరం సహా జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్‌లకు తగిన స్థాయిలో నిధులు కేటాయిస్తారా లేక రైతులు వ్యతిరేకిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి రూ.1,300 కోట్లు కేటాయించి మిగిలిన ప్రాజెక్టులను గాలికొదిలేస్తారా అనేది తేలాల్సి ఉంది. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి అవసరమైన రూ.1,701 కోట్లను బడ్జెట్లో కేటాయిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా ఉంది. డెల్టా ఆధునికీకరణను పట్టాలెక్కిస్తారా జిల్లాలో ఇంకా రూ.600 కోట్ల విలువైన డెల్టా ఆధునికీరణ పనులను చేపట్టాల్సి ఉంది. కాలువలు కట్టేశాక ప్రస్తుతం ఉన్న రూ.50 కోట్లతో నిధులతో కాలువలు, డ్రెయిన్ల ఆదునికీకరణ చేయడానికి యంత్రాం గం సన్నద్ధమవుతోంది. మిగిలిన నిధులను బడ్జెట్లో కేటాయిస్తారా లేక మొండిచెయ్యి చూపిస్తారా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఇదిలావుండగా, జిల్లాలో నిట్‌కు బదులు ఐఐటీ ఏర్పాటు చేస్తామంటున్న సర్కారు బడ్జెట్లో ఏ మేరకు కేటాయింపులు చేస్తుంది, తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం, నర్సాపురంలో మినీ పోర్టు నిర్మాణంతోపాటు భీమవరంలో ఆక్వా హబ్ ఏర్పాటు వంటి అంశాలను బడ్జెట్లో ప్రస్తావిస్తారా లేదా అనేవి కూడా చర్చనీయాంశాలుగా ఉన్నాయి. డ్రెయినేజీ అభివృద్ధి సాగేనా ఏలూరు నగరం వన్‌టౌన్ పరిధిలో భూగర్భ డ్రెయినేజీ పనులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో నిధుల లేమితో మధ్యలో నిలిచిపోయిన ప్రాజెక్టును ఇంకా రద్దు చేయలేదు. దీనికితోడు రూ.150 కోట్లతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. టూటౌన్లో రూ.150 కోట్లతో భూగర్భ డ్రెయినేజీని ఆధునికీకరించాలన్న అంశంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. పార్కుల ఆధునికీకరణకు రూ.15కోట్లు, వెంకన్న చెరువు వద్ద ఆధునిక వసతులతో రూ.3 కోట్లతో శ్మశాన వాటికి అభివృద్ధి పెండింగ్‌లోనే ఉన్నాయి. 5వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అవసరమైన 150 ఎకరాల భూసేకరణ పెండింగ్‌లోనే ఉంది. వీటికి ప్రభుత్వం నిధులిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రూ.6 కోట్లతో గోదావరి నీటిని ఏలూరు మండలంలోని శివారు గ్రామాలకు పైప్లైన్ల ద్వారా తరలించే ప్రాజెక్టుకు ఇంకా మోక్షం కలగలేదు. మాస్టర్ ప్లాన్ కింద ఆరు రోడ్లు విస్తరణకు ఈ బడ్జెట్లోనైనా మోక్షం కలగాలని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. -
తెలుగు‘తమ్ముళ్ల’ బరి తెగింపు
అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలుగుతమ్ముళ్ల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. ఆ పార్టీ ముఖ్యనేతల ఏకపక్ష విధానాలతో విసుగెత్తి, తునిలో వారికి దూరమైన నేతలను లక్ష్యంగా చేసుకుని భౌతికదాడులకు తెగబడుతున్నారు. ముఖ్యనేతల కనుసన్నల్లో ద్వితీయ శ్రేణి బరి తెగిస్తున్నా పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు. బాధితులు తమకు జరిగిన అన్యాయాలను ఏకరవు పెట్టినా టీడీపీ నేతలపై ఫిర్యాదులు తీసుకోవడానికే జడిసిపోతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ :తెలుగుదేశం గద్దెనెక్కాక.. గత ఆరు నెల లలో జరిగిన వరుస ఘటనలను పరిశీలిస్తే తుని లో ఆ పార్టీ ఆగడం స్పష్టవుతుంది. వారి దాడు ల్లో బాధితులంతా ఒకప్పుడు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, అతనికి వరుసకు సోదరుడైన కృష్ణుడి ముఖ్య అనుచరులే కావడం గమనార్హం. సుమారు మూడు దశాబ్దాలు తుని నియోజకవర్గాన్ని రామకృష్ణుడు ఒంటిచేత్తో నడిపించారు. ఆ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఇటీవలనే ప్రకటించిన కృష్ణుడు అన్న కనుసన్నల్లో అన్నింటా తానై చక్రం తిప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక 2009లో రామకృష్ణుడిని, 2014లో కృష్ణుడిని ఓడించారు. జనం తీర్పును జీర్ణించుకోలేక.. ప్రజల తీర్పును జీర్ణించుకోలేని తెలుగు‘తమ్ముళ్లు’.. పార్టీని వీడి తమ ఓటమికి కారణమైన నేతలే లక్ష్యంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. గత ఆరునెలల్లో అనేక దాడులు జరగగా, తాజాగా ఆదివారం తొండంగి మండల వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర మత్స్యకార సంఘం డెరైక్టర్ కోడా వెంకటరమణపై టీడీపీ వర్గీయులు మారణాయుధాలతో దాడులకు తెగబడ్డ సంఘటన ఆ పార్టీ నాయకుల వైఖరిని స్పష్టం చేస్తోంది. పొలానికి వెళ్లి తిరిగి వస్తున్న వెంకటరమణపై జి.ముసలయ్యపేట, కొత్తముసలయ్యపేటల టీడీపీ నాయకులు తాటిపర్తి దండియ్య, నేమాల సత్తిబాబు, తాటిపర్తి బాబూరావు, తాటిపర్తి యతిమాని పట్టపగలు స్థానికులు వారించినా మారణాయుధాలతో దాడి చేశారు. ప్రాణభయంతో పరుగు తీసి స్పహతప్పిపడిపోయిన వెంకటరమణ అనంతరం ఒంటిమామిడి పోలీసు స్టేషన్లో ఉదయం ఫిర్యాదుచేశారు. అయితే ఉన్నత స్థాయి ఒత్తిళ్లతో సాయంత్రం వరకు కేసు నమో దు చేయకుండా పోలీసులు వెనుకాడారు. బాధితుడికి వైఎస్సార్ సీపీకి చెందిన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అండగా నిలవడంతో గత్యం తరం లేక పోలీ సులు కేసు నమోదు చేశారు. వెంకటరమణ గతంలోనే కృష్ణుడి నుంచి ప్రాణహాని ఉందంటూ జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఒకప్పుడు యనమలకు వెన్నంటి నిలిచిన మత్స్యకార వర్గంలో కొంతమంది మాత్రమే ఇప్పుడు వారి వెంట ఉన్నారు. తాజా ఘటన నేపథ్యంలో సోదరుల వెంట ఉన్న వారు కూడా బయటకు వచ్చేసి ఒంటిమామిడి పోలీసు స్టేషన్ వద్ద కృష్ణుడు, అతని అనుచరులపై కేసు నమోదు చేసే వరకు ఆందోళనకు దిగారు. ఆగడాలు ఎన్నో.. దానవాయిపేటలో తమ వసూళ్లకు సహకరించని ప్రియాంకా హేచరీస్ అధినేత చంద్రమౌళిపై దాడులకు తెగబడ్డ సంఘటన రాష్ట్రస్థాయిలో టీడీపీలోనే తీవ్ర సంచనలమైంది. ఆ ఘటనకు కృష్ణుడే కారకుడని హేచరీ అధినేత పోలీసులకు ఫిర్యాదుచేసినా కేసు నమోదులో తాత్సారంతో చివరికి వ్యవహారం పోలీసు ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది. తొండంగి మండలం శృంగవృక్షంలో మానం సోమేశ్వరరావుపై సర్పంచ్ ద్వారా ఎస్సీ, ఎస్టీ కేసు బనాయింపు. బూర పెత్తందారు, మానం తాతారావు, పులి ఏసు, పులుగు సుబ్బారావులపై ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించి వేధింపులు. తొండంగి మండలం కొమ్మనాపల్లిలో సెక్రటరీని దూషించినట్టు ఉప సర్పంచ్ భర్త కోన రాంబాబుపై ఎస్సీ, ఎస్టీ కేసు. బెయిల్‌కు అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డంకి తొండంగి మండలం యల్లయ్యపేటలో యజ్జల రాజు, అతని చెల్లిపై దాడి చేసి తిరిగి అక్రమ కేసు బనాయింపు. తుని మండలం కొలిమేరుకు చెందిన సాధు అప్పారావుపై దాడి.. కె.ఒ.మల్లవరంలో అన్నంరెడ్డి వీర్రాఘవులు, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్‌లపై అక్రమ కేసుల బనాయింపు. పొలం నుంచి ఫలసాయం తేనివ్వకుండ అధికారుల ద్వారా వేధింపులు. బిళ్లనందూరులో బి.రాంబాబు, వరహాలు, చిన్న, బోత్స సత్తిబాబులపై అక్రమ కేసులు ప్రజల తిరస్కరించారన్న అక్కసుతో రా జకీయ ప్రత్యర్థులపై ఇలా దాడులకు దిగిన వా రిని చరిత్ర క్షమించదని, ఫలితం అనుభవించక తప్పదని తెలుగుతమ్ముళ్లు గుర్తించాలి.