ministers comments
-
మోదీ ఎఫెక్ట్.. మాల్దీవులకు కోలుకోలేని ఎదురుదెబ్బ!
#Maldives.. మాలె/న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వాటిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రం కూడా వాటిపై తీవ్ర అభ్యంతరం వెలిబుచి్చంది. మంత్రుల వ్యాఖ్యలకు నిరసనగా వేలాది మంది భారత పర్యాటకులు మాల్దీవులకు ప్లాన్ చేసుకున్న హాలిడే ట్రిప్పులను రద్దు చేసుకుంటున్నారు. ఆ దేశ పర్యాటకానికి మన టూరిస్టులే ఆయువుపట్టు. పైగా భారత్‌తో వ్యూహత్మక బంధం మాల్దీవులకు అత్యంత కీలకం. దాంతో ఈ వివాదంపై ఆ దేశం హుటాహుటిన స్పందించింది. భారత ప్రభుత్వ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసినట్లు ఆదివారం ప్రకటించింది. వారి వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతమని, వాటితో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టతనిచ్చింది. ‘‘భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రజాస్వామ్యయుతంగా, బాధ్యతాయుతంగా ఉండాలే తప్ప, విద్వేషాన్ని, ప్రతికూల ప్రభావాన్ని కలిగించేలా ఉండొద్దు. అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలతో సంబంధాలను దెబ్బతీయొద్దు’’ అని పేర్కొంది. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేసింది. సస్పెండైన మంత్రులు మరియం షియునా, అబ్దుల్లా మజూం మజీద్, మల్షా షరీఫ్ అని తెలుస్తోంది. అసలేమైంది...? ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలు»ొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. పర్యాటకంలో మాల్దీవులతో లక్షద్వీప్ ఏ మాత్రమూ సరితూగదంటూ ఎద్దేవా చేశారు. ‘‘భారత్‌లో హోటల్ గదులు అసహ్యంగా ఉంటాయి. మా దేశంతో లక్షద్వీప్‌కు పోలికేమిటి?’’ అంటూ మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ కూడా నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్ కార్యాలయం అధికారులు నిరసన తెలిపారు. దుమారం నేపథ్యంలోవారి వ్యాఖ్యలను ‘ఎక్స్’ నుంచి తొలగించారు. మంత్రుల వ్యాఖ్యలను మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ తీవ్రంగా ఖండించారు. ‘‘భారత్ మనకు కీలక మిత్రదేశం. మాల్దీవుల భద్రత, అభివృద్ధిలో చాలా కీలకం. అలాంటి దేశాధినేతను ఉద్దేశించి నీచమైన భాష వాడటం తగదు’’ అన్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు హితవు పలికారు. ఇంతగా నిరసనలు వ్యక్తమవుతున్నా మరియం మాత్రం ఆన్లైన్ వేదికలపై అక్కసు వెళ్లగక్కడం ఆపలేదు. దాతో పలువురు భారత నెటిజన్లు ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ అంటూ పిలుపునిస్తున్నారు! సెలబ్రిటీల ఖండన మాల్దీవుల మంత్రుల నోటి దురుసును క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, శ్రద్ధా కపూర్ తదితరులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. వారి విద్వేష వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని అక్షయ్ అన్నారు. ‘‘మాల్దీవులకు ఏటా భారీగా పర్యాటకులను పంపే భారత్‌పై అలా మాట్లాడటం దారుణం. పొరుగువారితో స్నేహంగా మెలగాలనే అనుకుంటాం కానీ ఇలాంటి ద్వేషాన్ని మనమెందుకు సహించాలి? నేనెన్నోసార్లు మాల్దీవుల్లో పర్యటించా. ప్రతిసారీ ఆ దేశాన్ని ప్రశంసించా. కానీ మన ఆత్మగౌరవమే ఫస్ట్. ఇకపై మన దీవుల్లో పర్యటిస్తూ మన పర్యాటకానికి దన్నుగా నిలుద్దాం’’ అని పిలుపునిచ్చారు. లక్షద్వీప్‌లో అందమైన, పరిశుభ్రమైన బీచుల్లో ప్రధాని మోదీని చూడటం ఎంతో బాగుంది. మన దేశంలోనే ఇంత అద్భుతమైన బీచ్లుండటం గర్వకారణం’’ అని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. ‘‘అతిథి దేవోభవ సందేశంతో భారత్ ఇచ్చే అద్భుతమైన ఆతిథ్యం, విస్తారమైన మన సముద్ర తీరాలను చూడాలే తప్ప వరి్ణంచలేం. ఇందుకోసం లక్షద్వీప్‌కు వెళ్లాల్సిందే’’ అంటూ జాన్ అబ్రహం బీచ్ ఫొటోలను షేర్ చేశారు. సుందరమైన లక్షద్వీప్ బీచ్‌ల అందాలను చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు నటి శ్రద్ధా కపూర్ తెలిపారు. సచిన్ కూడా ఇటీవలి లక్షద్వీప్ పర్యటన సందర్భంగా అక్కడ తాను క్రికెట్ ఆడిన వీడియో, బీచ్ ఫొటోలను షేర్ చేశారు. -
మన మంత్రుల వల్లే.. పాక్ ఉగ్రదాడులు: మాజీ సీఎం
జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందు ఆయన తండ్రి ఫరూక్ అబ్దుల్లా పాక్ ఆక్రమిత కశ్మీర్ ఏమనా భారత్ 'బాబుగాడి జాగీరా' అంటూ వ్యాఖ్యానించి తీవ్ర వివాదం రేకెత్తించగా.. ఇప్పుడు ఒమర్ కూడా తండ్రి బాటలోనే మాట్లాడారు. కేంద్ర మంత్రులు పాకిస్థాన్‌ను రెచ్చగొట్టడం వల్లే వాళ్లు నగ్రోటా పట్టణంలో ఉగ్రదాడులు చేసి, ఏడుగురు సైనికులను చంపేశారని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని పలువురు మంత్రులు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల వల్లే నగ్రోటా ఉగ్రదాడి జరిగిందని ఆయన మీడియాతో అన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో పార్టీ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. (కశ్మీర్‌పై విషం చిమ్మిన మాజీ ముఖ్యమంత్రి) పెద్దనోట్లను రద్దు చేయడం వల్ల ఉగ్రవాదం అంతమవుతుందని ప్రధానమంత్రి మోదీ చేసిన వ్యాఖ్యల వల్ల కూడా జమ్ము కశ్మీర్లో ఉగ్రవాద దాడులు పెరుగుతున్నాయని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. భారతదేశం వైపు చెడు దృష్టితో చూసేవాళ్ల కళ్లు పీకేస్తామంటూ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్లు చెప్పారు. రక్షణ మంత్రులే అలాంటి ప్రకటనలు చేస్తే.. నగ్రోటా లాంటి ఉగ్రదాడులు జరగక తప్పదని, దీన్ని మనం ఊహించవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ''మనం యుద్ధం కావాలని అనుకోం. కానీ మన దేశంవైపు ఎవరైనా చెడు దృష్టితో చూస్తే మాత్రం, వాళ్ల కాళ్లు పెరికేసి, వాళ్ల చేతుల్లో పెడతాం. మనకు అంత శక్తి ఉంది'' అని పారికర్ ఇంతకుముందు అన్నారు. -
దీక్షపై హేళనగా మాట్లాడతారా?
ముద్రగడ పద్మనాభం నిరాహారదీక్షపైన, కాపుల రిజర్వేషన్ల అంశంపైన ఏపీ రాష్ట్ర మంత్రులు హేళనగా మాట్లాడటం సరికాదని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు అన్నారు. ముద్రగడ కుటుంబంపై జరిగిన దాడిని యావత్ జాతిపై జరిగిన దాడిగా చూడాలని ఆయన చెప్పారు. శుక్రవారం సాయంత్రం కాపు ప్రముఖుల సమావేశం ఉన్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముద్రగడ దీక్ష పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాత్రమే తాము అడుగుతున్నామని, తమ డిమాండులో న్యాయం ఉందని అయన తెలిపారు. -
తెలంగాణ అభివృద్ధిపై వెనక్కి తగ్గను : కోదండరాం
ఆదిలాబాద్: తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్‌పై పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం మంగళవారం స్పందించారు. ఆయన ఏంమన్నారంటే 'ఇప్పటికే ముప్పావు జీవితం గడిచిపోయింది. పావలా జీవితమే మిగిలి ఉంది. దాన్నీ తెలంగాణకే అంకితం చేస్తాను. ఎవరో ప్రేరేపిస్తే....ప్రేరేపించబడే వాడిని నేను కాను. తెలంగాణ ప్రాంత అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గేది లేదు' అని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో రెండేళ్ల తెలంగాణ-ప్రజల ఆకాంక్షలు-ప్రభుత్వ పనితీరుపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న కోదండరాం విలేకరులకు అడిగిన ప్రశ్నలకు పై విధంగా సమాధానమిచ్చారు. రేపు జరగబోయే జేఏసీ సమావేశంలో చర్చించుకుని ప్రభుత్వం తనపై చేస్తున్న విమర్శలకు సమాధానం చెబుతానన్నారు. 30 సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధి, ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక కూడా ప్రజల సమస్యలు తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ సాధించామో ఆ లక్ష్యం నెరవేరే దాక ప్రజల పక్షాన పోరాడుతామని కోదండరాం చెప్పారు. -
'వైఎస్ జగన్ దీక్షపై చంద్రబాబు కుట్ర'
-
బ్లడ్ శాంపిల్స్ తీసుకొస్తూ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు
-
'వైఎస్ జగన్ దీక్షపై చంద్రబాబు కుట్ర'
గుంటూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరాహార దీక్షను ఉద్దేశించి ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, పత్తిపాటి పుల్లారావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ దీక్షపై సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వారు అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్ ఆరోగ్య పరిస్థితిపై మంత్రులు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మూడు బృందాలుగా వైద్యులు వచ్చి గత ఐదు రోజులుగా జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, అయినా ఇప్పటివరకు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్) వైద్యులు ఎందుకు హెల్త్ బులిటెన్ విడుదల చేయలేదని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు. తమకు కూడా అందని వైద్య పరీక్షల సమాచారం మంత్రులకు ఎవరు ఇచ్చారని వారు ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఆరోగ్యంపై మంత్రులు హేళన చేసేలా మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. తక్షణమే దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము నిత్యం వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు జరుపుతున్నామని, అయినా మంత్రులు ఎందుకు ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇది చంద్రబాబు కుట్ర అని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అవినీతి జరగనిది ఎక్కడ: యనమల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమవేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పలువురు మంత్రులు సభ దృష్టికి వచ్చిన సమస్యలకు సమాధానమిచ్చారు. మంత్రులు ఏమన్నారో వారి మాటల్లోనే.. తాగునీటి ఎద్దడి నివారణకు గ్రామీణ ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా చేస్తున్న నీటి సరఫరాలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకోవడం వల్ల ఇటు అధికారులు అటు కాంట్రాక్టర్లు లబ్ది పొందుతున్నారు తప్ప ప్రజలకు ప్రయోజనం కల్గడం లేదని వీటిపై చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. అన్ని చోట్లా అవినీతి ఉన్నట్లే తాగునీటి సరఫరాలో కూడా అవినీతి జరుగుతోంది. తాగునీటి కోసం 13వ ఆర్థిక సంఘం కాలంలో పంచాయతీరాజ్ సంస్థలు రూ. 214 కోట్లు ఖర్చు చేశాం. 14వ ఆర్థిక సంఘం నిధులు ఇక నుంచి నేరుగా పంచాయతీలకే వెళ్తాయి. అయితే గతంలో మాదిరి మండల పరిషత్, జడ్పీలకు కూడా నిధులు విడుదల చేసే విషయాన్ని కేంద్ర దృష్టికి తీసుకెళ్తాం. - ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. పెండింగులో ఉన్న వేతనాలు చెల్లిస్తాం పెండింగ్‌లో ఉన్న అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల వేతనాలను రెండు వారాల్లోగా మంజూరు చేస్తాం. రాష్ట్రంలో 6230 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్లుగా పని చేస్తున్నారు. వారికి ఇప్పటి వరకు రూ. 6.33 కోట్లు మంజూరు చేశాం. మిగిలిన రూ 14.82 కోట్లు విడుదల చేయాలని ఫైల్‌ను ఆర్థిక శాఖకు పంపాం. - సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి. విద్య, ఆరోగ్యం కోసం టీటీడీ నిధులు ఖర్చు చేస్తాం తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) నిధులను విద్య, ఆరోగ్యం కోసం కూడా ఖర్చు చేస్తాం. వెల్లడించారు. అందరి కోరిక మేరకు టీటీడీ పాలక మండలిని ఇక నుంచి ధర్మ టీటీడీ ధర్మకర్తల మండలిగా పిలిచే విధంగా చర్యలు తీసుకుంటాం. కొండపైన షాపుల కేటాయింపుల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. భక్తులు కోరితే టీటీడీ తరఫున రాష్ట్రంలో ఎక్కడైనా దేవాలయాలు నిర్మించి అందులో స్థానికులనే అర్చకులుగా నియమించే విషయాన్ని కూడా పరిశీలిస్తాం. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో మరింత మెరుగైన విద్యను అందించేందుకు తగు చర్యలు తీసుకుంటాం. - దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు. 541 డాక్టర్ పోస్టులు త్వరలో భర్తీ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 541 డాక్టర్ పోస్టులను త్వరలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో 149 పీహెచ్‌సీల నిర్మాణానికి 13వ ఆర్థిక సంఘం నుంచి రూ. 129.76 కోట్లు ఖర్చు చేసి ఇప్పటి వరకు 89 పీహెచ్‌సీల నిర్మాణం పూర్తి చేశాం. మరో 6 పీహెచ్‌సీలు వివిధ దశల్లో ఉన్నాయి. నిర్మాణాలు పూర్తయిన వెంటనే అవసరమైన సిబ్బందిని నియమిస్తాం. - వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్.