ministers portfolio
-
తెలంగాణ మంత్రుల శాఖల్లో మార్పులు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో మంత్రుల శాఖల మార్పుకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. మంత్రుల శాఖల మార్పులపై సోమవారం రాత్రి జీవో వెలువడింది. నాలుగు శాఖల మార్పుకు కేసీఆర్ పచ్చజెండా ఊపారు. ఇక పని భారం పెరిగినందున మైనింగ్ శాఖ నుంచి తనను తప్పించాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరినట్లు సమాచారం. కేటీఆర్కు-పరిశ్రమలు, మైనింగ్ శాఖలు జూపల్లి కృష్ణారావు- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పోచారం శ్రీనివాసరెడ్డి-సహకార శాఖ తలసాని శ్రీనివాస్ యాదవ్-బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, పశుసంవర్థక డెయిరీ డెవలప్మెంట్ శాఖలు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దే వాణిజ్య పన్నులు, గ్రామీణ నీటి సరఫరా (వాటర్ గ్రిడ్) శాఖలు తన వద్దే ఉంచుకున్నారు. -
తెలంగాణ మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు
హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గంలోని మంత్రుల శాఖల్లో మరోసారి స్వల్ప మార్పులు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్కు పరిశ్రమల శాఖ, జూపల్లి కృష్ణారావుకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖను అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేటీఆర్ ఇప్పటికే పంచాయితీరాజ్, ఐటీతో పాటు మున్సిపల్ శాఖలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా రెండు, మూడు రోజుల్లో శాఖల మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇక గతంలోనూ మంత్రుల శాఖల్లో మార్పులు జరిగిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరికి విద్యా శాఖ కేటాయించి, అప్పటి వరకు విద్యా శాఖ మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డికి విద్యుత్ శాఖను, మంత్రి లక్ష్మారెడ్డికి వైద్య, ఆరోగ్య శాఖను కేటాయించారు.