విశాఖలో బాలికపై సామూహిక అత్యాచారం
హైదరాబాద్: విశాఖపట్నం నగరంలో దారుణం జరిగింది. దుండగులు ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితురాలు అప్పూనగర్ నుంచి సాగర్‌నగర్‌కు వెళ్లేందుకు ఆటో ఎక్కింది. కాగా ఆటోడ్రైవర్ దారి మళ్లించి ఆమెను వేరే చోటుకు తీసుకెళ్లాడు. ఆటో డ్రైవర్, అతని స్నేహితులు కలసి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆమెను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.