Misha
-
ఆ వ్యక్తిని ఎప్పటికీ దూరం చేసుకోకండి..!
‘మనస్ఫూర్తిగా హత్తుకోవాలనిపించే, ప్రేమగా ముద్దాడాలనిపించే, ఆ ప్రేమ మరీ ఎక్కువైతే కాస్త గట్టిగానే ఓ కిక్ ఇవ్వాలనిపించే వ్యక్తిని కనుగొనండి. మీకెంతో ప్రియమైన ఆ వ్యక్తిని మీ జీవితం నుంచి ఎప్పటికీ వెళ్లనీయకండి’ అంటూ మీరా రాజ్‌పుత్ తన భర్త షాహిద్ కపూర్‌ను హత్తుకుని ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. త్వరలోనే రెండో బిడ్డకి జన్మనివ్వబోతున్న మీరాకు షాహిద్ ఇటీవలే సీమంతం చేసి సర్ప్రైజ్ చేశాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన మీరా.. భర్తపై తనకున్న ప్రేమను తెలియజేస్తూ చేసిన పోస్ట్ అభిమానులను ఫిదా చేస్తోంది. ‘సో స్వీట్... నాకు ఆనంద భాష్పాలు ఆగటం లేదు.. ఈ భూమి మీద ఉన్న అందమైన జంట మీరేనని చెప్పటానికి ఈ ఒక్క ఫొటో చాలు’ అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బేబీ ప్రాడక్ట్ యాడ్‌లో.. 2016లో మిషాకు జన్మనిచ్చిన షాహిద్- మీరా దంపతులు త్వరలోనే మరో బేబీని తమ జీవితాల్లోకి ఆహ్వానించబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ బేబీ ప్రాడక్ట్ కంపెనీ మీరాతో యాడ్ రూపొందించిందని వార్తలు వినిపిస్తున్నాయి. నటిగా ఏమాత్రం అనుభవం లేనప్పటికీ మీరా సింగిల్ టేక్‌లోనే షాట్ ఓకే చేశారని ఓ వెబ్సైట్ పేర్కొంది. త్వరలోనే ఆ యాడ్ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపింది. ఇక షాహిద్ విషయానికొస్తే.. శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భట్టీ గుల్ మీటర్ చాలు’ , అర్జున్ రెడ్డి రీమేక్‌లో నటిస్తున్నారు. Find someone you can hug, kiss and kick. And then don’t ever let them go 💋 A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on Jul 29, 2018 at 9:30pm PDT -
కూతురి క్యూట్ వీడియోను పోస్ట్ చేసిన హీరో!
-
కూతురి క్యూట్ వీడియోను పోస్ట్ చేసిన హీరో!
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ గారాలపట్టి మిషా మరో టాలెంట్‌ను బయటపెట్టింది. ఇప్పటికే పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ పాటకు బుజ్జీబుజ్జీ స్టెప్పులు వేసిన ఈ బుజ్జాయి ఇప్పుడు ‘చప్పట్లు ఎలా కొట్టాలో నేర్చేసుకుందట’ . ఈ విషయాన్ని ప్రౌడ్ ఫాదర్ షాహిద్ మిషా చప్పట్లు కొడుతున్న వీడియోను పోస్టు చేసి టాంటాం చేశారు. గత ఏడాది ఆగస్టులో పుట్టిన మిషా తండ్రి షాహిద్‌కు బెస్ట్ ఫ్రెండ్‌గా మారిపోయింది. వరల్డ్ డ్యాన్స్ డే సందర్భంగా అప్పట్లో ఈ తండ్రీకూతుళ్లు వేసిన స్టెప్పులు వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను అలరించింది. ఇప్పుడు తాజాగా మిషా చప్పట్టు కొడుతున్న వీడియోను కూడా నెటిజన్లు తెగ చూసేస్తున్నారు. -
తొలిసారిగా కూతురి ఫోటో షేర్ చేసిన హీరో
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తొలిసారిగా తన కూతురు మిషా ఫోటోను చేశాడు. గత ఏడాది ఆగస్టులో జన్మించిన మిషా ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేసిన షాహిద్ హలో వరల్డ్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు, తల్లి మీరా రాజ్ పుత్ చిన్నారి మిషాను ముద్దాడుతున్నట్టుగా ఉన్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పెళ్లికి ముందు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న షాహిద్, పెళ్లి తరువాత మాత్రం మంచి భర్తగా పేరు తెచ్చుకుంటున్నాడు. Hello world. 🌼 A photo posted by Shahid Kapoor (@shahidkapoor) on Feb 8, 2017 at 12:37am PST