ఆ వ్యక్తిని ఎప్పటికీ దూరం చేసుకోకండి..! | Mira Rajput Shares Adorable Pic With Her Husband Shahid Kapoor | Sakshi
Sakshi News home page

ఆ వ్యక్తిని ఎప్పటికీ దూరం చేసుకోకండి..!

Published Mon, Jul 30 2018 7:54 PM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM

Mira Rajput Shares Adorable Pic With Her Husband Shahid Kapoor - Sakshi

మీరా రాజ్‌పుత్‌ షేర్‌ చేసిన ఫొటో

‘మనస్ఫూర్తిగా హత్తుకోవాలనిపించే, ప్రేమగా ముద్దాడాలనిపించే, ఆ ప్రేమ మరీ ఎక్కువైతే కాస్త గట్టిగానే ఓ కిక్‌ ఇవ్వాలనిపించే వ్యక్తిని కనుగొనండి. మీకెంతో ప్రియమైన ఆ వ్యక్తిని మీ జీవితం నుంచి ఎప్పటికీ వెళ్లనీయకండి’  అంటూ మీరా రాజ్‌పుత్‌ తన భర్త షాహిద్‌ కపూర్‌ను హత్తుకుని ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. త్వరలోనే రెండో బిడ్డకి జన్మనివ్వబోతున్న మీరాకు షాహిద్‌ ఇటీవలే సీమంతం చేసి సర్‌ప్రైజ్‌ చేశాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోను షేర్‌ చేసిన మీరా.. భర్తపై తనకున్న ప్రేమను తెలియజేస్తూ చేసిన పోస్ట్‌ అభిమానులను ఫిదా చేస్తోంది. ‘సో స్వీట్‌... నాకు ఆనంద భాష్పాలు ఆగటం లేదు.. ఈ భూమి మీద ఉన్న అందమైన జంట మీరేనని చెప్పటానికి ఈ ఒక్క ఫొటో చాలు’  అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బేబీ ప్రాడక్ట్‌ యాడ్‌లో..
2016లో మిషాకు జన్మనిచ్చిన షాహిద్‌- మీరా దంపతులు త్వరలోనే మరో బేబీని తమ జీవితాల్లోకి ఆహ్వానించబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ బేబీ ప్రాడక్ట్‌ కంపెనీ మీరాతో యాడ్‌ రూపొందించిందని వార్తలు వినిపిస్తున్నాయి. నటిగా ఏమాత్రం అనుభవం లేనప్పటికీ మీరా సింగిల్‌ టేక్‌లోనే షాట్‌ ఓకే చేశారని ఓ వెబ్‌సైట్‌ పేర్కొంది. త్వరలోనే ఆ యాడ్‌ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపింది. ఇక షాహిద్‌ విషయానికొస్తే.. శ్రీ నారాయణ్‌ సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భట్టీ గుల్‌ మీటర్‌ చాలు’ , అర్జున్‌ రెడ్డి రీమేక్‌లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement